ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతుందంటూ ఆధారాలతో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వాషింస్టన్ డీసీ కోర్టుకు హాజరయ్యారు. అమెరికా న్యాయశాఖకు, ఆల్ఫాబెట్ అనుబంధ సంస్థ గూగుల్‌కు మధ్య జరుగుతున్న న్యాయపోరాటంలో సత్యనాదెళ్ల అత్యంత కీలకమైన ఆధారాల్ని ఇవ్వడంతో పాటు, కోర్టుకు సాక్ష్యం కూడా చెప్పారు.
ఇటీవల కాలంలో గూగుల్ గత కొన్నేళ్లుగా యాంటీట్రస్ట్ ట్రయల్స్ విచారణ ఎదుర్కొంటుంది. ఇతర సంస్థలు ఎదగనీయకుండా గూగుల్ నియంత్రిస్తుందంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో అమెరికా న్యాయ శాఖ గూగుల్‌పై చేసిన ఫిర్యాదులపై విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా గూగుల్‌ను తీరును తప్పుబడుతూ వ్యక్తులు, లేదంటే సంస్థలు చేసిన ఫిర్యాదుల నుంచి ఆధారాలు సేకరిస్తుంది. కంపెనీల జాబితాలో మైక్రోసాఫ్ట్ సైతం ఉంది. ఈ క్రమంలో వాషింస్టన్ డీసీ కోర్టు ఆ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల నుంచి పలు సాక్ష్యాలు ఆధారాల్ని సేకరించింది.
పక్కా ఆధారాలున్నాయ్
అంతేకాదు, గూగుల్ తన ప్రత్యర్ధి సంస్థల భవిష్యత్‌ను అగాధంలోకి నెట్టేలా వ్యవహరిస్తుందని, తాను చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా సత్యనాదెళ్ల ఆధారాల్ని కోర్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా సెర్చ్ ఇంజిన్ ఇండస్ట్రీలో గూగుల్‌కు సామర్ధ్యంపై కోర్టు పలు ప్రశ్నలకు సత్యనాదెళ్ల సమాధానం ఇచ్చారు. గూగుల్ - యాపిల్ మధ్య జరిగిన మల్టీ బిలియన్ డాలర్ల ఒప్పందం కారణంగా మైక్రోసాఫ్ట్ ఫ్లాట్‌ఫామ్‌కు చెందిన సెర్చ్ ఇంజిన్‌లైన ఎడ్జ్, బింగ్‌లు మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలకు తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందంటూ మండిపడ్డారు.
కోర్టులో నిస్పృహను వ్యక్తం చేస్తూ.. గూగుల్‌పై
ఎనిమిది నెలల క్రితం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఓపెన్ ఏఐతో తన భాగస్వామ్యంతో గూగుల్‌కు చెక్ పెట్టే శక్తి సామర్ధ్యాలు తమకు ఉన్నాయంటూ ఎంతో ఉత్సాహంతో చెప్పారు. వాషింగ్టన్ డీసీ కోర్టు విచారణలో ఓపెన్‌ఏఐను నిలువరించేందుకు గూగుల్ పెత్తనం చెలాయిస్తుందంటూ తన నిస్పృహను కోర్టులో వ్యక్తం చేశారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఓపెన్ ఏఐ డీల్, చాట్‌జీపీటీ, బింగ్ శక్తి సామర్ధ్యాలతో సెర్చ్ ఇంజిన్‌లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తుందని భావించారు. కానీ, గూగుల్ వల్ల సెర్చ్ ఇంజిన్ డొమైన్‌లలో ఓ సంస్థగానే కొనసాగుతుందని అన్నారు.
ప్రభుత్వం జోక్యం అవసరం
గూగుల్ తీరుపై రెగ్యులేటరీ జోక్యం చేసుకోవడం ద్వారా.. ఏఐలో మైక్రోసాఫ్ట్ ఎదుర్కొంటున్న పరిమితుల నుంచి బయటపడడంతో పాటు కృత్రిమ మేధలో భారీగా పెట్టుబడులు పెట్టే అనేక స్టార్టప్ లు, వెంచర్ క్యాపిటల్ సంస్థలకు సకాలంలో గూగుల్ నుంచి ఎదురవ్వుతున్న ఇబ్బందుల నుంచి ముందే తెలుసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మార్కెట్‌ను దెబ్బతీసే శక్తి సామర్ధ్యాలు ఏఐకి ఉన్నాయని అంగీకరిస్తూనే.. ఇది గూగుల్ ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
చదవండి👉 సాక్ష్యం చెప్పేందుకే.. కోర్టు మెట్లెక్కిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల
Comments
Please login to add a commentAdd a comment