Anti trust
-
దావాలకు దొరక్కుండా.. ఉద్యోగులకు గూగుల్ సీక్రెట్ మెమో!
ప్రపంచ సమాచారాన్నంతా నిల్వ చేసే ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్.. తమ అంతర్గత కమ్యూనికేషన్లపై మాత్రం చాలా ఏళ్లుగా జాగ్రత్త పడుతూ వస్తోంది. పోటీ చట్టాల దావాలకు ఏమాత్రం అవకాశం లేకుండా తమ మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన మెసేజ్‌లన్నీ ఉద్యోగులచేత తుడిచేయించేదని ఓ నివేదిక పేర్కొంది.న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. 2008లో అప్పటి ప్రత్యర్థి యాహూతో ప్రకటనల ఒప్పందంపై విచారణ ఎదుర్కొన్నప్పటి నుండి గూగుల్ అటువంటి రహస్య వ్యూహాలను అమలు చేస్తోంది. ఈ మేరకు అప్పట్లో ఉద్యోగులకు రహస్య మెమోను పంపింది."ఉద్యోగులు ఊహాగానాలు, వ్యంగ్యానికి దూరంగా ఉండాలి. హాట్ టాపిక్ల గురించి మెసేజ్‌లు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి" అని గూగుల్ ఉద్యోగులకు సూచించినట్లు నివేదిక పేర్కొంది.ఇదీ చదవండి: ‘మానవా.. చచ్చిపో’.. కోపంతో రెచ్చిపోయిన ఏఐ చాట్బాట్ఇందుకోసం గూగుల్ టెక్నాలజీని కూడా సర్దుబాటు చేసుకున్నట్లు టైమ్స్ రిపోర్ట్ తెలిపింది. కంపెనీ ఇన్స్టంట్ మెసేజింగ్ సాధనంలో సెట్టింగ్‌ను "ఆఫ్ ది రికార్డ్‌కి మార్చింది. దీంతో ఆ మెసేజ్‌లు మరుసటి రోజుకంతా వాటంతట అవే తుడిచిపెట్టుకుపోతాయి. గతేడాది గూగుల్ ఎదుర్కొన్న మూడు పోటీ చట్టాల ఉల్లంఘన విచారణల్లో లభ్యమైన వందలాది పత్రాలు, సాక్షుల వాంగ్మూలను పరిశీలిస్తే గూగుల్ అవలంభించిన తీరు తెలుస్తుందని నివేదిక పేర్కొంది. -
గూగుల్ గుత్తాధిపత్యం..డీఫాల్ట్ సెర్చింజన్ కోసం 28 బిలియన్ డాలర్లు ఖర్చు
సెర్చింజన్ మార్కెట్లో గూగుల్ ఆధిపత్యంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇదే విషయంపై యూఎస్ ప్రభుత్వం, గూగుల్ మధ్య యాంటీట్రస్ట్ కేసు కొనసాగుతోంది. తాజాగా జరిగిన ఈ కేసు విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ సందర్భంగా మొబైల్స్, వెబ్బ్రౌజర్లలో గూగుల్‌ను డీఫాల్ట్ సెర్చింజన్‌గా ఉంచేందుకు 2021లో ఆ సంస్థ పలు కంపెనీలకు 26.30 బిలియన్ డాలర్లు చెల్లించినట్లు తెలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం..డీఫాల్ట్ సెర్చింజన్ స్టేటస్ కోసం గూగుల్ చెల్లింపులు 2014 నుంచి ముడింతలు పెరిగాయని గూగుల్ సెర్చ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ విభాగంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా ప్రభాకర్ రాఘవన్ ఇదే విషయాన్ని తెలిపారు. సెర్చ్ యాడ్స్ ద్వారా గూగుల్‌కి 2021లో 146.4బిలియన్ డాలర్లు రెవెన్యూ వచ్చిందని..అందులో ఎక్కువ మొత్తం డీఫాల్ట్ సెట్టింగ్ కోసమే ఖర్చవుతున్నట్లు చెప్పారంటూ నివేదించింది. అయితే, ఈ విచారణ సందర్భంగా.. ఆదాయ వాటా, ఒప్పందాలు, చట్టబద్ధమైనవని గూగుల్ తెలిపింది. సెర్చింగ్, అడ్వటైజింగ్ విభాగంలో పెరిగిపోతున్న పోటీని తట్టుకునేలా పెట్టుబడి పెట్టినట్లు వాదించింది. ప్రజలు డిఫాల్ట్ సెర్చింజిన్ పట్ల అసంతృప్తిగా ఉంటే, వారు మరొక సెర్చ్ ప్రొవైడర్ మార్చుకోవచ్చు విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో ఇలా చెల్లింపులకు సంబంధించిన వివరాలు బహిర్గతం చేయడం వల్ల భవిష్యత్తులో తాము కుదుర్చుకునే కాంట్రాక్టులపై ప్రభావం చూపుతుందని గూగుల్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. కోర్టు మాత్రం ఆ వివరాలు వెల్లడించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ కేసు విచారణ ఇంకా కొనసాగుతంది. -
కోర్టు హాలులో గూగుల్‌పై విరుచుకుపడ్డ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతుందంటూ ఆధారాలతో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వాషింస్టన్ డీసీ కోర్టుకు హాజరయ్యారు. అమెరికా న్యాయశాఖకు, ఆల్ఫాబెట్ అనుబంధ సంస్థ గూగుల్‌కు మధ్య జరుగుతున్న న్యాయపోరాటంలో సత్యనాదెళ్ల అత్యంత కీలకమైన ఆధారాల్ని ఇవ్వడంతో పాటు, కోర్టుకు సాక్ష్యం కూడా చెప్పారు. ఇటీవల కాలంలో గూగుల్ గత కొన్నేళ్లుగా యాంటీట్రస్ట్ ట్రయల్స్ విచారణ ఎదుర్కొంటుంది. ఇతర సంస్థలు ఎదగనీయకుండా గూగుల్ నియంత్రిస్తుందంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో అమెరికా న్యాయ శాఖ గూగుల్‌పై చేసిన ఫిర్యాదులపై విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా గూగుల్‌ను తీరును తప్పుబడుతూ వ్యక్తులు, లేదంటే సంస్థలు చేసిన ఫిర్యాదుల నుంచి ఆధారాలు సేకరిస్తుంది. కంపెనీల జాబితాలో మైక్రోసాఫ్ట్ సైతం ఉంది. ఈ క్రమంలో వాషింస్టన్ డీసీ కోర్టు ఆ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల నుంచి పలు సాక్ష్యాలు ఆధారాల్ని సేకరించింది. పక్కా ఆధారాలున్నాయ్ అంతేకాదు, గూగుల్ తన ప్రత్యర్ధి సంస్థల భవిష్యత్‌ను అగాధంలోకి నెట్టేలా వ్యవహరిస్తుందని, తాను చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా సత్యనాదెళ్ల ఆధారాల్ని కోర్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా సెర్చ్ ఇంజిన్ ఇండస్ట్రీలో గూగుల్‌కు సామర్ధ్యంపై కోర్టు పలు ప్రశ్నలకు సత్యనాదెళ్ల సమాధానం ఇచ్చారు. గూగుల్ - యాపిల్ మధ్య జరిగిన మల్టీ బిలియన్ డాలర్ల ఒప్పందం కారణంగా మైక్రోసాఫ్ట్ ఫ్లాట్‌ఫామ్‌కు చెందిన సెర్చ్ ఇంజిన్లైన ఎడ్జ్, బింగ్‌లు మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలకు తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందంటూ మండిపడ్డారు. కోర్టులో నిస్పృహను వ్యక్తం చేస్తూ.. గూగుల్‌పై ఎనిమిది నెలల క్రితం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఓపెన్ ఏఐతో తన భాగస్వామ్యంతో గూగుల్‌కు చెక్ పెట్టే శక్తి సామర్ధ్యాలు తమకు ఉన్నాయంటూ ఎంతో ఉత్సాహంతో చెప్పారు. వాషింగ్టన్ డీసీ కోర్టు విచారణలో ఓపెన్‌ఏఐను నిలువరించేందుకు గూగుల్ పెత్తనం చెలాయిస్తుందంటూ తన నిస్పృహను కోర్టులో వ్యక్తం చేశారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఓపెన్ ఏఐ డీల్, చాట్‌జీపీటీ, బింగ్ శక్తి సామర్ధ్యాలతో సెర్చ్ ఇంజిన్‌లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తుందని భావించారు. కానీ, గూగుల్ వల్ల సెర్చ్ ఇంజిన్ డొమైన్లలో ఓ సంస్థగానే కొనసాగుతుందని అన్నారు. ప్రభుత్వం జోక్యం అవసరం గూగుల్ తీరుపై రెగ్యులేటరీ జోక్యం చేసుకోవడం ద్వారా.. ఏఐలో మైక్రోసాఫ్ట్ ఎదుర్కొంటున్న పరిమితుల నుంచి బయటపడడంతో పాటు కృత్రిమ మేధలో భారీగా పెట్టుబడులు పెట్టే అనేక స్టార్టప్ లు, వెంచర్ క్యాపిటల్ సంస్థలకు సకాలంలో గూగుల్ నుంచి ఎదురవ్వుతున్న ఇబ్బందుల నుంచి ముందే తెలుసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మార్కెట్‌ను దెబ్బతీసే శక్తి సామర్ధ్యాలు ఏఐకి ఉన్నాయని అంగీకరిస్తూనే.. ఇది గూగుల్ ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. చదవండి👉 సాక్ష్యం చెప్పేందుకే.. కోర్టు మెట్లెక్కిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల -
టెక్ దిగ్గజం గూగుల్‌కు భారీ షాక్: కేంద్ర ఐటీ మంత్రి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్‌కు భారత్ భారీ షాక్ ఇవ్వనుందా? అంటే అవుననే సంకేతాలు తాజాగా వెలు వడ్డాయి. యాంటిట్రస్ట్ ఉల్లంఘనపై గూగుల్‌పై భారత్ చర్య తీసుకుంటుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్లో కంపెనీ తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేస్తోందన్న రెండు కేసుల్లో గూగుల్‌కి ఇటీవల 275 మిలియన్ డాలర్ల పెనాల్టీ నేపథ్యంతో తాజా వ్యాఖ్యాలు చేశారు. (Jr. NTR Net Worth: ఖరీదైన కార్లు, లగ్జరీ వాచెస్, ఫ్యాన్స్ ఖుషీ!) గూగుల్‌పై ప్రభుత్వం చర్య తీసుకోవాలి తన మార్కెట్ స్థానాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా పోటీ వ్యతిరేక పద్ధతులకు పాల్పడుతున్న ఆల్ఫాబెట్‌కు చెందిన గూగుల్‌పై ప్రభుత్వం చర్య తీసుకోవాలని యోచిస్తున్నట్లు మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించారు. గూగుల్‌పై ఇటీవలి జరిమానా తీవ్రమైందని, ఇది మరింత ఆందోళన కలిగిస్తోందని మంత్రి రాయిటర్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే గూగుల్‌పై ప్రభుత్వం ఎలాంటి నియంత్రణ చర్య తీసుకోబోతోందో వెల్లడించేందుకు మంత్రి నిరాకరించారు. ఈ సమస్య మనకే కాదు, భారతదేశంలోని మొత్తం డిజిటల్ పర్యావరణ వ్యవస్థకు ఆందోళన కలిగిస్తోంద న్నారు. దీనిపై ఇప్పటివరకు గూగుల్‌తో ప్రభుత్వం చర్చించ లేదని, ఈ విషయంలో కోర్టులో ఉంది కనుక ఎలాంటి చర్చ అవసరం లేదని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. (రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా?) కాగా ప్రపంచంలో గూగుల్‌కి రెండో అతిపెద్ద మార్కెట్ భారత్‌లో అక్రమాలకు పాల్పడుతుందన్న ఆరోపణలు నిజమని గత ఏడాది యాంటీట్రస్ట్ వాచ్డాగ్ సీసీఐ తేల్చింది. కాంపిటీషన్ యాక్ట్, 2002ను అమలు చేయడానికి ఏర్పాటైన చట్టబద్ధమైన భారత ప్రభుత్వ సంస్థ. వ్యాపారంలో పోటీ కార్యకలాపాల్లో అవినీతి, అవకతవకలు నిర్ధారణ అయితే భారీ జరిమానాలు విధించే అధికారం సీసీఐకి ఉన్న సంగతి తెలిసిందే. -
గూగుల్‌కు భారత్‌లో భారీ ఝలక్!
టెక్ దిగ్గజం గూగుల్‌కు భారత్‌లో మరో ఝలక్ తగిలింది. చెల్లింపులు లేకుండా గూగుల్ సెర్చ్ ఫలితాల్లో వార్తలను ప్రచురించడంపై వార్తా సంస్థల అభ్యంతరాలను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు గూగుల్‌కి వ్యతిరేకంగా వార్త ప్రచురణ సంస్థలు చేస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఆండ్రాయిడ్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించడంతో పాటు థర్డ్ పార్టీగా ఉంటూ యాప్ డెవలపర్స్‌ను కమిషన్ పేరుతో ఇబ్బంది పెడుతోందన్న ఆరోపణలపై గూగుల్‌పై ఇదివరకే సీసీఐ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే యాంటీ ట్రస్ట్ చట్టాల్ని గూగుల్ ఉల్లంఘిస్తోందంటూ డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోషియేషన్(డీఎన్‌పీఏ) తాజాగా సీసీఐని ఆశ్రయించాయి. దేశంలో కొన్ని మీడియా కంపెనీలకు సంబంధించిన డిజిటల్ విభాగాల్లో ఒకటైన డీఎన్‌పీఏ.. తమ సభ్యులకు ప్రకటనల ఆదాయాన్ని పారదర్శకంగా చెల్లించేందుకు గూగుల్ విముఖత వ్యక్తం చేసిందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టింది సీసీఐ. దేశంలోని నిర్దిష్ట ఆన్లైన్ సెర్చ్ సేవలపై Google ఆధిపత్యం చెలాయిస్తోందని, వార్తా ప్రచురణకర్తలపై అన్యాయమైన షరతులు విధిస్తోందని పేర్కొంటూ దర్యాప్తునకు ఆదేశించింది సీసీఐ. ప్రజాస్వామ్యంలో కీలకంగా వ్యవహరిస్తున్న న్యూస్ మీడియాను అణగదొక్కడమే అవుతుందని కీలక వ్యాఖ్యలు చేస్తూ దర్యాప్తునకు ఆదేశించింది సీసీఐ. ఇదిలా ఉంటే Google వంటి ఆన్లైన్ అగ్రిగేటర్లకు ప్రకటనల ఆదాయాన్ని కోల్పోతున్నాయి వార్తా సంస్థలు. టెక్ కంపెనీలు తమ సెర్చ్ ఫలితాలలో కథనాలను, చెల్లింపు లేకుండా ఇతర ఫీచర్లను ఉపయోగిస్తాయంటూ కొన్నేళ్లుగా వార్త సంస్థలు గళం వినిపిస్తున్నా ఇన్నాళ్లూ ప్రయోజనం లేకుండా పోయింది. ఒక్క భారత్‌లోనే కాదు.. మరికొన్ని దేశాల్లో సైతం ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొంటుండగా.. భారీ భారీ జరిమానాలు విధిస్తున్నాయి ఆయా దేశాల విచారణ సంస్థలు. ఈ నేపథ్యంలో భారత్‌లో తాజాగా ఎదురైన పరిణామం గూగుల్‌ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టినట్లయ్యింది. సంబంధిత వార్త: గూగుల్‌న్యూస్.. గూగుల్‌కు ఫ్రాన్స్ రూ.4,415 కోట్ల ఫైన్ -
గూగుల్‌కు భారీ జరిమానా
ప్యారిస్: ఆన్లైన్ అడ్వర్టైజింగ్లో ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలపై టెక్ దిగ్గజం గూగుల్‌కు ఫ్రాన్స్ 220 మిలియన్ యూరోల (268 మిలియన్ల డాలర్లు) జరిమానా విధించింది. పోటీ సంస్థలను దెబ్బతీసే తరహా విధానాలను కంపెనీ పాటించిందని ఫ్రాన్స్ గుత్తాధిపత్య నియంత్రణ సంస్థ కాంపిటీషన్ అథారిటీ నిర్ధారించింది. జరిమానా విధించిన నేపథ్యంలో గూగుల్ తన విధానాలను మార్చుకుంటే పోటీదారులందరికీ సమాన అవకాశాలు లభించగలవని కాంపిటీషన్ అథారిటీ పేర్కొంది. ఈ వివాదాన్ని సెటిల్ చేసుకునేందుకు కంపెనీ మొగ్గు చూపిందని తెలిపింది. రూపర్ట్ మర్డోక్‌కి చెందిన న్యూస్ కార్ప్, ఫ్రాన్స్ పేపర్ గ్రూప్ లె ఫిగారో, బెల్జియంకి చెందిన రోసెల్ లా వాయిస్ తదితర సంస్థలు ఆరోపణలు చేసిన మీదట గూగుల్‌పై కాంపిటీషన్ అథారిటీ విచారణ జరిపింది. దీనిపై స్పందించిన గూగుల్ జరిమానా చెల్లించడానికి అంగీకరించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా దాని వ్యాపార విధానాన్ని మార్చేందుకు సమ్మతించింది. చదవండి : stockmarket: సెన్సెక్స్,నిఫ్టీ కన్సాలిడేషన్ నైకీ, హెచ్అండ్ఎం బ్రాండ్స్‌కు చైనా షాక్ బీపీవో ఉద్యోగాలు..ఏపీ నుంచే అత్యధికం -
అమెరికాలో అమెజాన్ బాస్‌కు చిక్కులు
వాష్టింగ్టన్ : టెక్ దిగ్గజం అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ అమెరికాలో మరోసారి చిక్కుల్లో పడ్డారు. తప్పుదోవ పట్టించే ప్రకటనల ఆరోపణలపై విచారణకు స్వచ్ఛందంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. స్వచ్ఛందంగా హాజరు కావడానికి అంగీకరించకపోతే దావాను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ అమెరికా అధికారులు ఆయన్ను హెచ్చరించారు. స్వయగా జెఫ్ బెజోస్ హాజరై తన సాక్ష్యమివ్వాలని ఆదేశించారు. ఈ మేరకు రెండు పార్టీలకు చెందిన హౌస్ జ్యుడిషియరీ కమిటీ నాయకులు బెజోస్‌కు శుక్రవారం రాసిన లేఖలో కోరారు. అమెజాన్ చేసిన ప్రకటనలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని నిరూపితమైతే మోసపూరిత, నేరపూరిత అపరాధంగా పరిగణిస్తామని కమిటీ ఛైర్మన్, రిపబ్లిక్ జెరోల్డ్ నాడ్లర్, ఇతరులుసంతకం చేసిన లేఖలో పేర్కొన్నారు. స్వచ్ఛంద ప్రాతిపదికన సాక్ష్యమిస్తారని ఆశిస్తున్నాం.. లేదంటే తప్పనిసరి ప్రక్రియను ఆశ్రయించే హక్కు తమకుందని స్పష్టం చేశారు. అయితే తాజా పరిణామంపై అమెజాన్ ప్రతినిధులు స్పందించాల్సి వుంది. అమెజాన్ తన మార్కెట్ ప్లేస్ లో అమ్మకందారుల గురించి, వారి ఉత్పత్తులు లావాదేవీల గురించి సున్నితమైన సమాచారాన్ని దాని సొంత పోటీ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి ఉపయోగించిందని ఇటీవలి వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. అయితే అమెజాన్ ఎగ్జిక్యూటివ్ గత జూలైలో జరిగిన కమిటీ విచారణలో దీన్ని ఖండించారు. అమెరికాలోని జస్టిస్ డిపార్ట్ మెంట్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ప్రధానంగా నాలుగు టెక్ దిగ్గజాలపై గత కొంతకాలంగా యాంటీట్రస్ట్ విచారణను కొనసాగిస్తున్నాయి. డేవిడ్ సిసిలిన్ నేతృత్వంలోని యాంటీట్రస్ట్ ఉపసంఘం గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, ఆపిల్ లాంటి టెక్ దిగ్గజాలపై దృష్టి సారించింది. వినియోగదారులపై వాటి ప్రభావంపై సమగ్ర దర్యాప్తు జరుపుతోంది. ముఖ్యంగా జెఫ్ బెజోస్ వాషింగ్టన్ పోస్ట్ పత్రికను అడ్డం పెట్టుకుని తప్పుడు పద్ధతులను అవలంబిస్తున్నారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అమెజాన్ కంపెనీ భారీ ఇక్కట్లను ఎదుర్కొంటున్నసంగతి తెలిసిందే. (హెచ్ -1బీ వీసాదారులకు భారీ ఊరట) -
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లపై సీసీఐ దర్యాప్తు
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) సోమవారం దర్యాప్తునకు ఆదేశించింది. భారీ డిస్కౌంట్లు, ఒక వస్తువు కొంటే మరొకటి పొందేలా ఆఫర్లు, ఎంపిక చేసిన అమ్మకందారులు మాత్రమే ప్లాట్‌ఫామ్‌లలో విక్రయాలు జరపడం వంటి అంశాల్లో ఈ సంస్థలు దుర్వినియోగానికి పాల్పడ్డ ఆరోపణలు వచ్చినట్లు సీసీఐ వెల్లడించింది. ఢిల్లీ వ్యాపార్ మహాసంఘ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపింది. ఈ అంశంపై స్పందించిన అమెజాన్.. తాము ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, దర్యాప్తును స్వాగతిస్తున్నామని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం సీసీఐ ఆర్డర్‌ను సమీక్షిస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. -
దేశీ ఫార్మా దిగ్గజాలకు భారీ షాక్
న్యూఢిల్లీ/ వాషింగ్టన్: భారతీయ దిగ్గజ ఫార్మా కంపెనీలకు భారీ షాక్ తగిలింది. అనుచితంగా ధరల పెంపునకు కుట్ర పన్నారంటూసన్ పార్మా, డా. రెడ్డీస్ తదితర ఏడు భారతీయ కంపెనీలతో పాటు 20 ఫార్మా కంపెనీలపై అమెరికాలో ఆరోపణలు చెలరేగాయి. అమెరికాలోని 40 రాష్ట్రాలతో పాటు, యాంటీ ట్రస్ట్ విభాగం కేసులను ఫైల్ చేశాయి. అంతేకాదు ఈ ఫార్మా సంస్థలకు చెందిన అయిదుగురు కీలక ఉద్యోగులను కూడా ఈ కేసులో చేర్చింది. 20 ఔషధ సంస్థలు వేర్వేరు మందుల ధరల్లో దాదాపు 400 శాతానికి పైగా పెంపునకు కుట్ర పన్నాయని ఆరోపించింది. అందరికీ అవసరమైన మందుల ధరలకు కంపెనీలు ఉద్దేశపూర్వకంగా పెంచుతున్నాయంటూ అమెరికాలోని 40కి పైగా రాష్ట్రాలు ఔషధ కంపెనీలపై మే 10వ తేదీన తేదీన కేసులు వేశాయి. డయాబెటిస్, క్యాన్సర్, హెచ్ఐవీ, మూర్ఛ వ్యాధి మందులు సహా సుమారు వెయ్యి రకాల ఔషధాల ధరలను నిర్ణయించడంలో 20 ఫార్మా కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, కుట్రపూరితంగా ధరలను పెంచుతున్నాయనంటూ అభియోగాలు నమోదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థల్లో దేశీయంగా అరబిందో, గ్లెన్‌మార్క్, లుపిన్, వర్క్‌హాడ్, జైడస్ ఫార్మతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద జనరిక్ మందుల తయారీ కంపెనీ టెవా ఫార్మాస్యూటికల్స్ కూడా ఉండటం గమనార్హం. అమెరికన్ల జీవితాలతో ఆటలాడుతూ జనరిక్ మందుల తయారీ రంగంలోని కొందరు వందల కోట్ల డాలర్ల కుంభకోణానికి తెరతీశారనడానికి తమ వద్ద బలమైన ఆధారాలున్నాయని కనెక్టికట్ అటార్నీ జనరల్ విలియమ్ టోంగ్ టోంగ్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ ధరల దందాకు సంబంధించిన ఈమెయిల్స్, టెక్స్ట్ మెసేజ్‌లు, వాయిస్ రికార్డుల సాక్ష్యాలు తమ వద్ద ఆధారాలున్నాయని ఆయన వివరించారు. 2013 జులై, 2015 జనవరి మధ్య పదుల సంఖ్యలో మందుల ధరలను అమాంతంగా పెంచేందుకు కంపెనీలు కుట్రకు పాల్పడ్డాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధానంగా 2013, 2014 జులై మధ్య కాలంలో 1200 జనరిక్ మందుల విలువ 448 శాతం పెరిగిందన్నారు. హెల్త్ కేర్ రంగంలో అమెరికాలో ఇది భారీ కుంభకోణమని ఆరోపించారు. అమెరికాలో వైద్య ఖర్చులు, మందుల ధరలు ఎందుకింత ఎక్కువగా ఉన్నాయన్న అంశంపై జరిగిన పరిశోధనలో ఈ స్కాం బయటపడిందన్నారు. కాగా తాజా ఆరోపణలపై స్పందించిన టెవా ఈ ఆరోపణలను ఖండించింది. అలాగే ఇవి నిరాధారమైన ఆరోపణలన్నీ, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని సన్ ఫార్మా ప్రకటించింది. దీంతో మంగళవారం నాటి మార్కెట్లో హెల్త్ కేర్ సెక్టార్ 4 శాతం కుప్పకూలింది. సోమవారం సన్‌ఫార్మ ఏకంగా 21 శాతం పతనమైంది. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా కంపెనీలు ఇంకా దీనిపై స్పందించలేదు. -
గూగుల్‌కు భారీ జరిమానా
ఆన్లైన్ సెర్చి ఇంజీన్ దిగ్గజం గూగుల్‌కు మరో భారీ షాక్ తగిలింది. యూరొపియన్ యూనియన్‌కి చెందిన కాంపిటిషన్ కమిషన్ గూగుల్‌కు భారీ జరిమానా విధించింది. నిబంధనలకు విరుద్ధంగా ఓ సంస్థకు ప్రకటనల రూపంలో మేలు చేసినందుకుగాను యురొపియన్ యూనియన్‌లోని కాంపిటిషన్ కమిషన్ 1.49 బిలియన్ యూరోల పెనాల్టీ విధించింది. గూగుల్ తన విధులను మర్చిపోయి నమ్మకాన్ని కోల్పోయిందంటూ.. యూరోపియన్ యూనియన్ యాంటీ ట్రస్ట్ రెగ్యులేటరీ గూగుల్‌పై భారీ మొత్తంలో జరిమానా విధించింది. ఈ మేరకు కాంపిటిషన్ కమిషనర్ మార్గరెట్ వెస్టగర్ బుధవారం ఆదేశాలు జారీచేశారు. గూగుల్ తన అధికారాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోంది.. దాని వల్ల కొన్ని కంపెనీలు లాభాలు గడిస్తున్నాయన్నారు. వినియోగదారులు మోసపోతున్నారని వెస్టాగర్ వెల్లడించారు. కాగా గత రెండేళ్లలో ఇంత పెద్ద మొత్తంలో పెనాల్టీ విధించడం ఇది మూడవసారి అని తెలుస్తోంది. -
గూగుల్ కు భారీ షాక్ తప్పదా?
లండన్: ప్రపంచ సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ కు త్వరలోనే భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం సంస్థకు కోర్టు త్వరలోనే వేల కోట్ల రూపాయల జరిమానా విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెర్చ్ ఇంజన్లో తనకు నచ్చిన కంపెనీలకే ముందు స్థానం ఇస్తూ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందంటూ దాఖలైన కేసులో గూగుల్ కు ఎదురు దెబ్బ తగలనుంది. 2010లో వేసిన ఓ కేసులో గూగుల్ కు వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని రాయిటర్స్ తెలిపింది. సుమారు 23 వేల కోట్ల (మూడు బిలియన్ యూరోల) భారీ జరిమానా పడనుందని పేర్కొంది. గత ఆరేళ్లుగా గూగుల్ యూరోపియన్ యూనియన్(ఈయూ) తో పోటీ పడి పలుదఫాలు విఫలం చెందిందనీ, ఇక ఈయూ పక్కకు తప్పుకుంటే తప్ప గూగుల్ జరిమాన నుంచి తప్పించుకోలేదని రాయిటర్స్ పేర్కొంది. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న జరిమానా నిర్ణయం జూన్ మొదటి వారంలో అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారుల చెబుతున్నారు. అంతేకాకుండా తనకు నచ్చిన కంపనీ సెర్చ్ రిజల్ట్స్ ఇచ్చే హక్కును కూడా గూగుల్ కోల్పోయే అవకాశం కూడా ఉందని అభిప్రాయపడుతున్నారు. సెర్చ్ లో మొదటి స్థానం సంపాదించిన కంపెనీలకూ 10 శాతం మేర జరిమాన విధించే అవకాశం ఉంది.