ప్రపంచ సమాచారాన్నంతా నిల్వ చేసే ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్.. తమ అంతర్గత కమ్యూనికేషన్‌లపై మాత్రం చాలా ఏళ్లుగా జాగ్రత్త పడుతూ వస్తోంది. పోటీ చట్టాల దావాలకు ఏమాత్రం అవకాశం లేకుండా తమ మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన మెసేజ్‌లన్నీ ఉద్యోగులచేత తుడిచేయించేదని ఓ నివేదిక పేర్కొంది.
న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. 2008లో అప్పటి ప్రత్యర్థి యాహూతో ప్రకటనల ఒప్పందంపై విచారణ ఎదుర్కొన్నప్పటి నుండి గూగుల్ అటువంటి రహస్య వ్యూహాలను అమలు చేస్తోంది. ఈ మేరకు అప్పట్లో ఉద్యోగులకు రహస్య మెమోను పంపింది.
"ఉద్యోగులు ఊహాగానాలు, వ్యంగ్యానికి దూరంగా ఉండాలి. హాట్ టాపిక్‌ల గురించి మెసేజ్‌లు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి" అని గూగుల్ ఉద్యోగులకు సూచించినట్లు నివేదిక పేర్కొంది.
ఇదీ చదవండి: ‘మానవా.. చచ్చిపో’.. కోపంతో రెచ్చిపోయిన ఏఐ చాట్‌బాట్
ఇందుకోసం గూగుల్ టెక్నాలజీని కూడా సర్దుబాటు చేసుకున్నట్లు టైమ్స్ రిపోర్ట్ తెలిపింది. కంపెనీ ఇన్‌స్టంట్ మెసేజింగ్ సాధనంలో సెట్టింగ్‌ను "ఆఫ్ ది రికార్డ్‌కి మార్చింది. దీంతో ఆ మెసేజ్‌లు మరుసటి రోజుకంతా వాటంతట అవే తుడిచిపెట్టుకుపోతాయి. గతేడాది గూగుల్ ఎదుర్కొన్న మూడు పోటీ చట్టాల ఉల్లంఘన విచారణల్లో లభ్యమైన వందలాది పత్రాలు, సాక్షుల వాంగ్మూలను పరిశీలిస్తే గూగుల్ అవలంభించిన తీరు తెలుస్తుందని నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment