Confidential
-
దావాలకు దొరక్కుండా.. ఉద్యోగులకు గూగుల్ సీక్రెట్ మెమో!
ప్రపంచ సమాచారాన్నంతా నిల్వ చేసే ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్.. తమ అంతర్గత కమ్యూనికేషన్లపై మాత్రం చాలా ఏళ్లుగా జాగ్రత్త పడుతూ వస్తోంది. పోటీ చట్టాల దావాలకు ఏమాత్రం అవకాశం లేకుండా తమ మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన మెసేజ్‌లన్నీ ఉద్యోగులచేత తుడిచేయించేదని ఓ నివేదిక పేర్కొంది.న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. 2008లో అప్పటి ప్రత్యర్థి యాహూతో ప్రకటనల ఒప్పందంపై విచారణ ఎదుర్కొన్నప్పటి నుండి గూగుల్ అటువంటి రహస్య వ్యూహాలను అమలు చేస్తోంది. ఈ మేరకు అప్పట్లో ఉద్యోగులకు రహస్య మెమోను పంపింది."ఉద్యోగులు ఊహాగానాలు, వ్యంగ్యానికి దూరంగా ఉండాలి. హాట్ టాపిక్ల గురించి మెసేజ్‌లు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి" అని గూగుల్ ఉద్యోగులకు సూచించినట్లు నివేదిక పేర్కొంది.ఇదీ చదవండి: ‘మానవా.. చచ్చిపో’.. కోపంతో రెచ్చిపోయిన ఏఐ చాట్బాట్ఇందుకోసం గూగుల్ టెక్నాలజీని కూడా సర్దుబాటు చేసుకున్నట్లు టైమ్స్ రిపోర్ట్ తెలిపింది. కంపెనీ ఇన్స్టంట్ మెసేజింగ్ సాధనంలో సెట్టింగ్‌ను "ఆఫ్ ది రికార్డ్‌కి మార్చింది. దీంతో ఆ మెసేజ్‌లు మరుసటి రోజుకంతా వాటంతట అవే తుడిచిపెట్టుకుపోతాయి. గతేడాది గూగుల్ ఎదుర్కొన్న మూడు పోటీ చట్టాల ఉల్లంఘన విచారణల్లో లభ్యమైన వందలాది పత్రాలు, సాక్షుల వాంగ్మూలను పరిశీలిస్తే గూగుల్ అవలంభించిన తీరు తెలుస్తుందని నివేదిక పేర్కొంది. -
ఆ ఖాతాల వివరాలు ఇవ్వలేం..చాలా గోప్యం
సాక్షి, న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న భారతీయుల ఖాతాల వివరాలు వెల్లడి చేయలేనమని కేంద్ర ఆర్థికశాఖ తేల్చి చెప్పింది. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆర్థికమంత్రిత్వ శాఖ ఇలా స్పష్టం చేసింది. భారత్, స్విట్జర్లాండ్ మధ్య ఉన్న ఒప్పందాల మేరకు ఈ వివరాలను అందించలేమని తెలిపింది. అలాగే ఇతర విదేశీ దేశాలనుంచి వచ్చిన నల్లధనం వివరాలను వెల్లడించడానికి కూడా మంత్రిత్వ శాఖ నిరాకరించింది. గోప్యతా నిబంధనలపై స్విట్జర్లాండుతో కుదిరిన ఒప్పందం నేపథ్యంలో ఈ వివరాలు ఇవ్వలేమని చెప్పింది. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సంబంధిత సమాచారం గోప్యంగా ఉంచాల్సి ఉందని తెలిపింది. పన్ను సంబంధిత సమాచారం, విదేశీ ప్రభుత్వాల నుండి కోరిన / పొందిన సమాచారాన్ని బహిర్గతం చేయలేమంది. స్విట్జర్లాండ్ బ్యాంకుల్లోని భారతీయుల ఖాతాలకు సంబంధించిన నుంచి వచ్చిన సమాచార వివరాలను అందించాలని పీటీఐకి జర్నలిస్టు మంత్రిత్వ శాఖను కోరారు. ఈ వివరాలతో సహా నల్లధనంపై విదేశాల నుండి వచ్చిన సమాచారం వివరాలను అందించాలని కూడా ఆర్టీఐ ద్వారా కోరారు. దీనికి ప్రతిస్పందనగా ఈ విషయాన్ని ఆర్థిక శాఖ వెల్లడించింది. -
రహస్యంగా యువీ నిశ్చితార్థం!
హాజల్ కీచ్‌తో బాలిలో జరిగినట్లు కథనాలు ఖండించిన క్రికెటర్ న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ నిశ్చితార్థం రహస్యంగా జరిగినట్లు కథనాలు వస్తున్నాయి. గత కొంతకాలంగా నటి, మోడల్ హాజల్ కీచ్‌తో యువీ ప్రేమాయణం సాగిస్తున్నాడని, వీరిద్దరి నిశ్చితార్థం ఇండోనేసియాలోని బాలిలో జరిగిందని కొన్ని టీవీ చానెల్స్ కథనాలను ప్రసారం చేశాయి. అయితే వీటిని యువరాజ్ ఖండించాడు. సోషల్ మీడియాలో ఈ ఇద్దరి నిశ్చితార్థం అంటూ రకరకాల ఫొటోలు కనిపిస్తున్నాయి. ఇటీవల హర్భజన్ పెళ్లికి ఈ ఇద్దరూ కలిసి వెళ్లడం, తాజాగా హాజల్ ఓ ఉంగరంతో కనిపిస్తుండటంతో ఈ కథనాల గురించి చర్చ విసృ్తతంగా జరుగుతోంది. 28 ఏళ్ల హాజల్ హిందీ సినిమాల్లో నటిస్తోంది. ఈమె ప్రముఖ మోడల్ కూడా. ఈ ఇద్దరి పెళ్లి చండీగఢ్‌లో ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉంది.