రహస్యంగా యువీ నిశ్చితార్థం! | Yuvraj is secretly engaged! | Sakshi
Sakshi News home page

రహస్యంగా యువీ నిశ్చితార్థం!

Published Thu, Nov 12 2015 11:59 PM | Last Updated on Sun, Sep 3 2017 12:23 PM

రహస్యంగా యువీ నిశ్చితార్థం!

రహస్యంగా యువీ నిశ్చితార్థం!

హాజల్ కీచ్‌తో బాలిలో జరిగినట్లు కథనాలు
ఖండించిన క్రికెటర్

 
న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ నిశ్చితార్థం రహస్యంగా జరిగినట్లు కథనాలు వస్తున్నాయి. గత కొంతకాలంగా నటి, మోడల్ హాజల్ కీచ్‌తో యువీ ప్రేమాయణం సాగిస్తున్నాడని, వీరిద్దరి నిశ్చితార్థం ఇండోనేసియాలోని బాలిలో జరిగిందని కొన్ని టీవీ చానెల్స్ కథనాలను ప్రసారం చేశాయి. అయితే వీటిని యువరాజ్ ఖండించాడు. సోషల్ మీడియాలో ఈ ఇద్దరి నిశ్చితార్థం అంటూ రకరకాల ఫొటోలు కనిపిస్తున్నాయి.

ఇటీవల హర్భజన్ పెళ్లికి ఈ ఇద్దరూ కలిసి వెళ్లడం, తాజాగా హాజల్ ఓ ఉంగరంతో కనిపిస్తుండటంతో ఈ కథనాల గురించి చర్చ విసృ్తతంగా జరుగుతోంది. 28 ఏళ్ల హాజల్ హిందీ సినిమాల్లో నటిస్తోంది. ఈమె ప్రముఖ మోడల్ కూడా. ఈ ఇద్దరి పెళ్లి చండీగఢ్‌లో ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉంది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement