Google employees
-
దావాలకు దొరక్కుండా.. ఉద్యోగులకు గూగుల్ సీక్రెట్ మెమో!
ప్రపంచ సమాచారాన్నంతా నిల్వ చేసే ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్.. తమ అంతర్గత కమ్యూనికేషన్లపై మాత్రం చాలా ఏళ్లుగా జాగ్రత్త పడుతూ వస్తోంది. పోటీ చట్టాల దావాలకు ఏమాత్రం అవకాశం లేకుండా తమ మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన మెసేజ్‌లన్నీ ఉద్యోగులచేత తుడిచేయించేదని ఓ నివేదిక పేర్కొంది.న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. 2008లో అప్పటి ప్రత్యర్థి యాహూతో ప్రకటనల ఒప్పందంపై విచారణ ఎదుర్కొన్నప్పటి నుండి గూగుల్ అటువంటి రహస్య వ్యూహాలను అమలు చేస్తోంది. ఈ మేరకు అప్పట్లో ఉద్యోగులకు రహస్య మెమోను పంపింది."ఉద్యోగులు ఊహాగానాలు, వ్యంగ్యానికి దూరంగా ఉండాలి. హాట్ టాపిక్ల గురించి మెసేజ్‌లు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి" అని గూగుల్ ఉద్యోగులకు సూచించినట్లు నివేదిక పేర్కొంది.ఇదీ చదవండి: ‘మానవా.. చచ్చిపో’.. కోపంతో రెచ్చిపోయిన ఏఐ చాట్బాట్ఇందుకోసం గూగుల్ టెక్నాలజీని కూడా సర్దుబాటు చేసుకున్నట్లు టైమ్స్ రిపోర్ట్ తెలిపింది. కంపెనీ ఇన్స్టంట్ మెసేజింగ్ సాధనంలో సెట్టింగ్‌ను "ఆఫ్ ది రికార్డ్‌కి మార్చింది. దీంతో ఆ మెసేజ్‌లు మరుసటి రోజుకంతా వాటంతట అవే తుడిచిపెట్టుకుపోతాయి. గతేడాది గూగుల్ ఎదుర్కొన్న మూడు పోటీ చట్టాల ఉల్లంఘన విచారణల్లో లభ్యమైన వందలాది పత్రాలు, సాక్షుల వాంగ్మూలను పరిశీలిస్తే గూగుల్ అవలంభించిన తీరు తెలుస్తుందని నివేదిక పేర్కొంది. -
ప్రముఖ టెక్ కంపెనీలో తొలగింపులు, బదిలీలు
Google LayOff: ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని గూగుల్ ఉద్యోగుల తొలగింపులు, బదిలీలు చేపట్టింది. ఈ విషయాన్నికంపెనీ ప్రతినిధి తెలిపారు. తొలగింపులు కంపెనీ అంతటా ఉండవని, ప్రభావితమైన ఉద్యోగులు ఇతర అంతర్గత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే ప్రభావితమైన ఉద్యోగుల సంఖ్యను వెల్లడించలేదు. ప్రభావితమైన ఉద్యోగులలో కొంత మందిని భారత్, చికాగో, అట్లాంటా, డబ్లిన్ వంటి కంపెనీ పెట్టుబడులు పెడుతున్న కేంద్రాలకు బదిలీ చేయనున్నారు. గూగుల్ తొలగింపులతో ఈ సంవత్సరం టెక్, మీడియా పరిశ్రమలో మరిన్ని తొలగింపులు కొనసాగవచ్చనే భయాలు నెలకొన్నాయి. 2023 ద్వితీయార్థం నుంచి 2024 వరకు తమ అనేక బృందాలు మరింత సమర్థవంతంగా, మెరుగ్గా పని చేయడానికి, ఉత్పత్తి ప్రాధాన్యతలకు అనుగుణంగా మార్పులు చేసినట్లు గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం.. లేఆఫ్‌లతో గూగుల్ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ విభాగాలలోని అనేక మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు. ప్రభావితమైన ఫైనాన్స్ టీమ్‌లలో గూగుల్ ట్రెజరీ, వ్యాపార సేవలు, ఆదాయ నగదు కార్యకలాపాలు ఉన్నాయి. పునర్నిర్మాణంలో భాగంగా బెంగళూరు, మెక్సికో సిటీ, డబ్లిన్లకు వృద్ధిని విస్తరింపజేస్తామని గూగుల్ ఫైనాన్స్ చీఫ్, రూత్ పోరాట్ సిబ్బందికి ఈ-మెయిల్ పంపారు. -
Google: ఉద్యోగులను వదిలించుకునేందుకు ఇన్ని వేల కోట్లా?
సాధారణంగా ఖర్చును తగ్గించుకునేందుకు కంపెనీలు లేఆఫ్‌ల పేరుతో ఉద్యోగులను తొలిగిస్తున్నాయి. అయితే ఉద్యోగులను వదిలించుకోవడానికి కంపెనీలు వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నాయని చేస్తున్నాయని మీకు తెలుసా? అవును నిజమే.. లేఆఫ్‌ల కోసం టెక్ దిగ్గజం గూగుల్ చేసిన ఖర్చు వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ఇవి చూస్తే అవాక్కవుతారు..! రూ.17 వేల కోట్లు గూగుల్ యాజమాన్య సంస్థ ఆల్భాబెట్ వెల్లడించిన తాజా త్రైమాసిక ఫలితాల ప్రకారం.. తొలగించిన ఉద్యోగులకు సీవెరన్స్ (తొలగింపు పరిహారం), సంబంధిత ఇతర చెల్లింపుల కింద గూగుల్ చెల్లించిన మొత్తం 2.1 బిలియన్ డాలర్లు ( దాదాపు రూ.17 వేల కోట్లు) . ఇది కేవలం 2023 ఒక్క ఏడాదిలో చేపట్టిన లేఆఫ్‌లకు అయిన ఖర్చు మాత్రమే. గూగుల్ 2023 జనవరిలో ప్రకటించిన మొదటి రౌండ్ లేఆఫ్‌లలో దాదాపు 12 వేల మందిని అంటే తమ వర్క్‌ఫోర్స్‌లో సుమారు 6 శాతం మందిని తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి భయాలను ఈ తొలగింపులు తెలియజేయడమే కాకుండా టెక్ పరిశ్రమను ఒక్కసారిగా కలవరపాటుకు గురిచేశాయి. తొలగించిన ఉద్యోగులకు చెల్లించేందుకు గూగుల్ 2.1 బిలియన్ డాలర్లు.. దాని నికర ఆదాయంలో 7 శాతం వరకూ ఖర్చు చేసినట్లు తాజా వెల్లడి ద్వారా తెలుస్తోంది. ఉద్యోగుల తొలగింపులకే ఈ స్థాయిలో ఖర్చయితే ఆ ఉద్యోగులను కొనసాగిస్తే ఎంత ఖర్చయ్యేదో అంచనా వేయొచ్చు. 2024లోనూ.. గూగుల్ 2024లోనూ ఇప్పటికే 1000 ఉద్యోగాల తొలగింపును ప్రకటించింది. దీని కోసం 700 మిలియన్ డాలర్లు (రూ.5,800 కోట్లు ) ఖర్చు చేసింది. ఈ ఏడాదిలో లేఆఫ్‌లు ఇంకా కొనసాగుతాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇదివరకే సూచనలు ఇచ్చారు. అయితే గతేడాదిలో ఉన్నంత తొలగింపులయితే ఈ ఏడాదిలో ఉండకపోవచ్చు. -
ఆగ్రహంతో రగిలిపోతున్న గూగుల్ ఉద్యోగులు.. కంపెనీకి చుక్కలు!
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌పై ఆ కంపెనీ ఉద్యోగులు అసంతృప్తి, ఆగ్రహాలతో రగిలిపోతున్నారు. ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని గూగుల్ ఇటీవల ప్రకటించిన లేఆఫ్‌ల్లో సుమారు 15,000 మందిని తొలగించింది. ఈ తొలగింపులను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ జనవరి 18న యునైటెడ్ స్టేట్స్‌లోని ఐదు గూగుల్ క్యాంపస్‌లలో నిరసన ప్రదర్శనలను నిర్వహించింది. తొలగింపులను సమర్థించుకోవడానికి కంపెనీ చెబుతున్న కారణాలను బోగస్‌గా పేర్కొంటూ వాటిని సవాలు చేయడం ఈ నిరసనల లక్ష్యం అని బిజినెస్ ఇన్సైడర్ నివేదించింది. అసంతృప్త ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్.. గత సంవత్సరంలో తొలగింపుల వల్ల దాదాపు 15,000 మంది ఉద్యోగులపై ప్రభావం పడినట్లు వెల్లడించింది. ఇదే జనవరి 18న యూఎస్ అంతటా ఐదు గూగుల్ క్యాంపస్‌లలో నిరసనలు చేపట్టేందుకు యూనియన్ను ప్రేరేపించింది. లేఆఫ్‌ల కారణంగా కొంతమంది జాబ్స్ పోవడమే కాకుండా ఉన్న ఉద్యోగులపై ప్రభావం గురించి సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ కమ్యూనికేషన్‌కు నాయకత్వం వహించే స్టీఫెన్ మెక్ముర్ట్రీ ఆందోళన వ్యక్తం చేశారు. లేఆఫ్‌లు ఉద్యోగులపై పనిభారాన్ని పెంచడమే కాకుండా విస్తృతమైన ఆందోళనను కలిగిస్తున్నాయన్నారు. పెరుగుతున్న విమర్శలకు గూగుల్ ప్రతిస్పందిస్తూ తమ చర్యలు "కంపెనీ అతిపెద్ద ప్రాధాన్యతలు, రాబోయే ముఖ్యమైన అవకాశాలలో బాధ్యతాయుతంగా పెట్టుబడి పెట్టడం"లో భాగమని పేర్కొంది. సంస్థాగత మార్పులలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని తొలగింపులు ఉన్నట్లు చెబుతోంది. కంపెనీ లోపల, వెలుపల కొత్త ఉద్యోగాలు పొందడంలో బాధిత ఉద్యోగులకు సహాయం చేయడానికి నిబద్ధతతో ఉన్నట్లు గూగుల్ పేర్కొంటోంది. -
గూగుల్ ఉద్యోగులకు బంపరాఫర్.. ఆఫీస్‌కు రప్పించడానికి కొత్త ఎత్తుగడ!
మండే వేసవిలో లగ్జరీ ఏసీ హోటల్లో విశ్రాంతి తీసుకోవడానికి ఎవరు ఇష్టపడకుండా ఉంటారు? ఆఫీస్‌కి వెళ్లేందుకు చెమటలు కక్కుతూ ప్రయాణించాల్సిన పనిలేదు. ఆఫీస్ క్యాంపస్‌లోని హోటల్లోనే మకాం. అయితే ఈ ఆఫర్ గూగుల్ ఉద్యోగులకు మాత్రమే. వర్క్ ఫ్రం హోమ్‌కి అలవాటు పడిన ఉద్యోగులను ఆఫీస్‌కు రప్పించడానికి గూగుల్ వేసిన కొత్త ఎత్తుగడ ఇది. గూగుల్ ఫుల్‌టైమ్ ఉద్యోగులు క్యాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలోని క్యాంపస్ హోటల్లో ఒక రోజుకు 99 డాలర్లకే రూమ్ బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. సమ్మర్ స్పెషల్ ఆఫర్ అంటూ దీన్ని పేర్కొన్నట్లు ‘సీఎన్‌బీసీ’ నివేదించింది. గూగుల్ ఉద్యగులు హైబ్రిడ్ వర్క్‌ప్లేస్‌కి మారడాన్ని సులభతరం చేసేలా సెప్టెంబర్ 30 వరకు ఈ ఆఫర్ అమలు అవుతుంది. అయితే హోటల్లో బస చేసేందుకు అయ్యే మొత్తాన్ని తమ పర్సనల్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఉద్యోగులే భరించుకోవాలి. ఆ మొత్తాన్ని కంపెనీ రీయింబర్స్ చేయదు. ఎందుకంటే ఇది అన్‌అప్రూవ్డ్ బిజినెస్ ట్రావెల్ కిందకు వస్తుందని కంపెనీ పేర్కొంది. ఉదయం హడావుడిగా ఆఫీసుకు రావాల్సిన పని లేదు. ఓ గంట ఎక్కువగా నిద్ర పోవచ్చు. మధ్యలో రూమ్‌కి వెళ్లి బ్రేక్‌ఫాస్ట్ లేదా వర్కవుట్ చేసుకోవచ్చు. ఆఫీస్ వర్క్ పూర్తయ్యాక హోటల్ టాప్ డెక్కి వెళ్లి ఆహ్లాదకరమైన సాయంత్రాన్ని ఆస్వాదించవచ్చు అంటూ ఈ ఆఫర్‌కు సంబంధించిన ప్రకటన చెబుతోంది. గూగుల్ యాజమాన్యంలోని ఈ హోటల్ కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో గత సంవత్సరం ప్రారంభించిన కొత్త క్యాంపస్‌లో ఉంది. 42 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్ నాసా అమెస్ రీసెర్చ్ సెంటర్‌కు ఆనుకుని ఉంది. ప్రకటనల విభాగంలో పనిచేస్తున్న 4,000 మంది ఉద్యోగులకు ఇక్కడ వసతి కల్పించే సామర్థ్యం ఉందని దీని ప్రారంభం సందర్భంగా కంపెనీ పేర్కొంది. శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియా రియల్ ఎస్టేట్ ధరలు విపరీతంగా ఉంటాయి. చాలా టెక్ కంపెనీల కార్యాలయాలతో పాటు టెక్ పరిశ్రమ ఉద్యగులు ఇక్కడ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఇక్కడున్న కార్పొరేట్ కార్యాలయాలు చాలా గూగుల్ యాజమాన్యంలోనివో లేకుంటే లీజ్‌కు తీసుకున్నవో ఉంటాయి. కంపెనీకి చెందిన హోటళ్లలో ఉద్యోగులకు ఇలాంటి ఆఫర్లు తరచూ ఇస్తుంటామని గూగుల్ ప్రతినిధి తెలిపారు. Google Jobs Cut 2023: కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించిన గూగుల్.. వాళ్లు చేసిన పాపం ఏంటంటే.. -
సుందర్ పిచాయ్.. మాకు న్యాయం చేయండి
తమకు న్యాయం చేయాలని కోరుతూ గూగుల్ తొలగించిన ఉద్యోగులు ఏకంగా సీఈవో సుందర్ పిచాయ్కే బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖపై దాదాపు 1,400 మంది ఉద్యోగులు సంతకాలు చేయడం గమనార్హం. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ లేఆఫ్ ప్రక్రియలో భాగంగా 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ఎన్సీఎల్టీ ఆమోదం.. ఇక ఇదే మూడో అతిపెద్ద బ్యాంక్! పలు డిమాండ్లు: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు రాసిన ఈ బహిరంగ లేఖలో ఉద్యోగులు పలు డిమాండ్లు చేశారు. కొత్త నియామకాలను స్తంభింపజేయడం, నిర్బంధంగా తొలగించడం కాకుండా ఉద్యోగులు స్వచ్ఛందంగా తప్పుకునేలా కోరడం, కొత్త నియామకాల్లో తొలగించిన ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వడం, నిర్ణీత వ్యవధి వరకూ ఉద్యోగులను తొలగించకుండా కొనసాగించడం వంటి డిమాండ్లను సీఈవో ముందు ఉంచారు. సంక్షోభాలతో సతమతమవుతున్న ఉక్రెయిన్ వంటి దేశాలకు చెందిన ఉద్యోగులను ఉద్వాసన నుంచి మినహాయించాలని కోరారు. అలాగే ఉద్యోగ తొలగింపు వల్ల వీసా లింక్డ్ రెసిడెన్సీని కోల్పోయే ప్రమాదం ఉన్నవారిని ఆదుకోవాలని అభ్యర్థించారు. ఇదీ చదవండి: ఇంత తిన్నావేంటి గురూ.. పిజ్జాల కోసం డామినోస్ మాజీ సీఈవో ఖర్చు ఎంతో తెలుసా? అయితే ఈ బహిరంగ లేఖపై ఆల్ఫాబెట్ ప్రతినిధి స్పందించలేదు. గత జనవరిలో సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగాల కోతలను ప్రకటించినప్పుడు ముందెన్నడూ లేని కష్టతరమైన ఆర్థిక పరిస్థతిని ఎదుర్కొంటున్నామని, దీనికి తాను పూర్తి బాధ్యత తీసుకుంటున్నానని ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో పేర్కొన్నారు. లేఖ వెనుక యూనియన్లు: ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్, యునైటెడ్ టెక్ అండ్ అలైడ్ వర్కర్స్, యూఎన్ఐ గ్లోబల్‌తో సహా పలు యూనియన్లు ఈ బహిరంగ లేఖ వెనుక ఉన్నాయి. కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో పిచాయ్‌కి భౌతికంగా లేఖను అందించడానికి కొన్ని రోజుల ముందే ఈ లేఖను సర్క్యులేట్ చేయాలని ప్రణాళిక వేసుకున్నట్లు తెలిసింది. -
మరికొన్ని గంటలు అదనంగా పనిచేయండి.. ఉద్యోగులకు సుందర్ పిచాయ్ రిక్వెస్ట్!
గూగుల్ రూపొందించిన బార్డ్ ఏఐ చాట్బాట్లో లోపాలను సరిచేసేందుకు ఆ సంస్థ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా సరికొత్త ప్రణాళికను రచించింది. ఇందుకోసం వారంలో కొన్ని గంటలు అదనంగా పనిచేయాలని గూగుల్ ఉద్యోగులను సీఈవో సుందర్ పిచాయ్ కోరారు. ఈ మేరకు ఉద్యోగులకు అంతర్గత సందేశాలు పంపినట్లు తెలిసింది. బార్డ్ ఏఐ చాట్బాట్లో లోపాలను గుర్తించి సరిచేయడానికి వారానికి రెండు నుంచి నాలుగు గంటలు కేటాయించాలని కోరారు. బిజినెస్ ఇన్సైడర్ కథనం ప్రకారం.. వేలాది మంది గూగుల్ ఉద్యోగులు ఇప్పటికే బార్డ్ ఏఐ చాట్‌బాట్‌ను వినియోగిస్తూ పరీక్షిస్తున్నారని, ఇందులో సమస్యలన్నంటినీ పరిష్కరించడానికి ఒక కొత్త ప్లాన్‌ను రూపొందించినట్లు సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ఇందు కోసం వేలాదిమంది ఉద్యోగులు అదనపు గంటలు పనిచేయాల్సిన అవసరం ఉంది. వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాక ఎటాంటి లోపాలు ఉండకూడదన్నది గూగుల్ ఉద్దేశం. అయితే సుందర్ పిచాయ్ ప్రపంచవ్యాప్తంగా మొత్తం గూగుల్ ఉద్యోగులందరికీ ఈ సందేశాలను పంపించారా.. లేదా అన్నది స్పష్టత లేదు. గత వారంలో డెమో సమయంలో బార్డ్ బాట్ తప్పుడు సమాచారం ఇవ్వడంతో నెగిటివ్ ప్రచారం బాగా జరిగింది. గూగుల్ ఇటీవల తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 12 వేల ఉద్యోగాల కోత ప్రకటించిన విషయం తెలిసిందే. మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌తో సంబంధం లేకుండా గూగుల్‌కు ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా 1.70 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. సుందర్ పిచాయ్ పంపించిన సందేశాల్లో.. ఉద్యోగులందరూ బార్డ్ కోసం వారానికి రెండు నుంచి నాలుగు గంటలు అదనంగా, మరింత లోతుగా పనిచేసి లోపాలు సరిచేసేందుకు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బార్డ్‌ని పరీక్షించడానికి ఈ వారంలో గణనీయమైన సమయాన్ని కేటాయించాలని ఈ-మెయిల్స్‌లో పిచాయ్ అభ్యర్థించారు. (ఇదీ చదవండి: రిషి సునాక్, బిల్‌గేట్స్‌ను ఇంటర్వ్యూ చేసిన చాట్‌బాట్.. ఏయే ప్రశ్నలు అడిగిందో తెలుసా?) -
Google Layoffs: రోడ్డెక్కిన అమెరికాలోని గూగుల్ ఉద్యోగులు..
ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీల్లో లేఆఫ్స్, జీతాల కోతలు కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని టెక్ కంపెనీల్లోనూ ఇదే ధోరణి. ప్రముఖ సెర్చ్ఇంజిన్ గూగుల్ వేలాదిగా ఉద్యోగులను తొలగించడమే కాకుండా ఉన్న ఉద్యోగులకు కూడా జీతాలు తగ్గించింది. ఈ క్రమంలో జీతాల కోతను వ్యతిరేకించడంతో పాటు తొలగించిన తోటి ఉద్యోగులకు మద్దతుగా అమెరికాలో గూగుల్ ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టారు. బుధవారం కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయం వద్ద, గురువారం న్యూయార్క్ నగరంలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయం వద్ద ఉద్యోగులు రోడ్ల మీదకు వచ్చి నిరసన ర్యాలీలు నిర్వహించారు. కాగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గూగుల్ ఒకే సారి 12వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇదే బాటలో అమెజాన్, మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్ సంస్థలు కూడా లేఆఫ్స్ ప్రకటించాయి. న్యూయార్క్‌లోని గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ త్రైమాసిక ఫలితాలు వెల్లడి ముగిసిన నిమిషాల వ్యవధిలో గూగుల్ ఉద్యోగులు సుమారు 50 మంది కార్యాలయం వెలుపలికి వచ్చి నిరసన ర్యాలీ చేపట్టారు. కాగా సంస్థ నాలుగో త్రైమాసికంలో 13.6 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించింది. -
వర్క్ ఫ్రమ్ ‘ఆఫీస్’.. ఉద్యోగుల్లో ఆగ్రహం
కరోనా కారణంగా ఉద్యోగుల్లో చాలామంది వర్క్ ఫ్రమ్ హోంకే ఫిక్స్ అయిపోయారు. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ పుంజుకుంటున్న తరుణంలో తిరిగి ఆఫీస్ గేట్లు తెరవాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు ఇంటర్నెట్ దిగ్గజ కంపెనీలు యాపిల్, గూగుల్ ఎంప్లాయిస్ తమ ఉద్యోగులకు ఆఫీస్‌లకు సిద్ధం కావాలని మెయిల్స్ పెడుతుండగా.. ప్రతిగా ఉద్యోగులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నట్లు సమాచారం. తాము వర్క్ ఫ్రమ్ హోంలోనే కొనసాగుతామని, ఆఫీస్‌లకు రావాలని బలవంతపెడితే రాజీనామాలు చేస్తామని చాలామంది బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతున్నారు. యాపిల్‌కు లేఖలు జూన్ నెలలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ ప్రతిపాదన మేరకు ‘హైబ్రిడ్ మోడల్’ తెర మీదకు వచ్చింది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి వారంలో మూడు రోజులు ఆఫీస్‌కు రావాలని ఉద్యోగులకు సూచించారు. అయితే తాము ఆఫీస్‌లకు రాలేమని, వర్క్ ఫ్రమ్ హోం కొనసాగించాలని కొందరు ఎంప్లాయిస్ విజ్ఞప్తి చేశారు. ఈ తరుణంలో ఎక్కువ రిక్వెస్ట్‌లు వస్తుండడంతో యాపిల్ కుదరదని తేల్చి చెప్పింది. అయితే ఆఫీస్‌లకు రావాలని బలవంతం చేస్తే.. రిజైన్ చేస్తామని ఉద్యోగులు తాజాగా లేఖలు రాయడం మొదలుపెట్టారు. మరోవైపు కిందటి నెలలో యాపిల్ నిర్వహించిన ఓ సర్వేలో 90 శాతం ఉద్యోగులు తాము తమకు వీలున్న రీతిలోనే పనులు చేస్తామని వెల్లడించడం విశేషం. ఈ నేపథ్యంలో కొందరు మేనేజ్మెంట్కు మళ్లీ లేఖలు రాయాలని భావిస్తుండగా.. కోర్టుకు వెళ్లే ఉద్దేశంలో మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యాపిల్ పునరాలోచన చేస్తుందా? లేదా? అనేది చూడాలి. గూగుల్ కూడా.. ఆఫీస్ రిటర్న్ పాలసీపై గూగుల్ ఉద్యోగుల్లోనూ అసంతృప్తే నెలకొంది. మే నెలలో కంపెనీ సీఈవో సుందర్‌పిచాయ్ ‘హైబ్రిడ్ వర్క్ ఎన్విరాన్మెంట్’ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం.. సెప్టెంబర్ మొదటి వారం నుంచి 60 శాతం ఉద్యోగులు ఆఫీస్‌లకు రావాలని, మరో 20 శాతం మంది రిమోట్ వర్క్, ఇంకో 20 శాతం మంది రీ లోకేట్ కావాలని పిచాయ్ పిలుపు ఇచ్చాడు. ఇక లొకేషన్ టూల్ ఆధారంగా జీతాలు ఉంటాయని కూడా ప్రకటించాడు. ఈ దశలో గందరగోళానికి గురవుతున్న ఉద్యోగులు.. ఆఫీస్‌లకు రాలేమని చెప్తున్నారు. అంతేకాదు మెయిల్స్ ద్వారా తమ ఫ్రస్టేషన్‌ను వెల్లగక్కుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పరిణామాల నేపథ్యంలో గూగుల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. -
గూగుల్‌కు ఉద్యోగుల షాక్
సింగపూర్/న్యూఢిల్లీ: సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌లో పనిచేసే ఉద్యోగులు గురువారం ఆ సంస్థకు షాక్ ఇచ్చారు. మహిళా ఉద్యోగులపై లైంగికవేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతాధికారుల విషయంలో సంస్థ పక్షపాతంతో వ్యవహరించడాన్ని నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్ ఉద్యోగులు వాకౌట్ నిర్వహించారు. తొలుత జపాన్ రాజధాని టోక్యోలో ఉదయం 11.10 గంటలకు గూగుల ఉద్యోగులు అందరూ కంపెనీ నుంచి బయటకు వచ్చి తమ నిరసనను తెలియజేశారు. అనంతరం అమెరికా, భారత్, స్విట్జర్లాండ్, సింగపూర్, బ్రిటన్ సహా పలుదేశాల్లోని వేలాది మంది గూగుల్ ఉద్యోగులు ఉదయం 11.10కు(స్థానిక కాలమానం ప్రకారం) కార్యాలయాల నుంచి వాకౌట్ చేశారు. ఆండ్రాయిడ్ ఓఎస్ సృష్టికర్త ఆండీ రూబిన్, డైరెక్టర్ రిచర్డ్ డీవౌల్ సహా కొందరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారులు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అందిన ఫిర్యాదులపై గూగుల్ దశాబ్దకాలం పాటు మౌనం పాటించిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇటీవల సంచలన కథనాన్ని ప్రచురించింది. కాగా, వేధింపులపై కోర్టును ఆశ్రయించేలా నిబంధనల్లో సవరణ, స్త్రీ–పురుషులకు సమాన వేతనం, కంపెనీ బోర్డులో తగిన ప్రాధాన్యం కల్పించడం వంటి సంస్కరణలు చేపట్టాలని కోరుతూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. -
భూతల స్వర్గంగా గూగుల్ ఆఫీస్!
లండన్: ఉద్యోగం చేసే చోటునే శరీర వ్యాయామానికి కావాల్సిన జిమ్ము, స్మిమ్మింగ్ ఫూల్, ఆకలేస్తే రుచికరమైన భోజనం, అలసిపోయి నిద్రొస్తే కునుకుతీసేందుకు మెత్తటి పరుపు, లేవగానే ఒళ్లు బడలికగా ఉంటే వళ్లు పట్టేందుకు మసాజ్ సెంటర్లు, సాయంత్రం బోరు కొడితే ఉల్లాసానికి గోల్ఫ్, కావాల్సినప్పుడు రకరకాల కాఫీలు...లాంటి సౌకర్యాలుంటే మనం ఏమంటాం. ‘ఆహా! భూతల స్వర్గం. ఓ ఉద్యోగికి ఇంతకన్నా ఏం కావాలి?’ అంటాం. ఇలాంటి భూతల స్వర్గాన్ని ప్రపంచ ఐటి దిగ్గజ సంస్థ ‘గూగుల్’ తన ఉద్యోగుల కోసం త్వరలో సృష్టించబోతోంది. ఈ సౌకర్యాలన్నీ ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. పైగా మంచి జీతం కూడా చెల్లిస్తుంది. ఇలా ఉద్యోగుల ఉల్లాసానికి కావాల్సిన సకల సౌకర్యాలతో గూగుల్ సంస్థ లండన్‌లో 11 అంతస్తులతో 300 మీటర్ల పొడవైన భారీ భవనాన్ని నిర్మించనుంది. ఇప్పటికే ఈ భవనం డిజైన్ ఖరారైందని, వచ్చే ఏడాది నిర్మాణం పనులు ప్రారంభమవుతాయని యాజమాన్యం వెల్లడించింది. జిమ్‌లు, స్నూకర్ గేమ్‌లు, బాస్కెట్ బాల్ కోర్టులు లాంటి సౌకర్యాలను గూగుల్ సంస్థ ఇప్పటికే తమ ఉద్యోగులకు కల్పిస్తుండగా, వాటికి అదనంగా లండన్ ప్రధాన కార్యాలయంలో సౌండ్ ప్రూఫ్ స్లీప్ పాడ్స్, ఒలింపిక్స్ సైజులో మూడు లేన్ల స్మిమ్మింగ్పూల్ను, మేడ మీద గోల్ఫ్ కోర్టును, జుత్తు కత్తిరించే హేర్ సెలూన్లను, 24 గంటలు పనిచేసే మసాజ్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. భిన్న రుచుల రెస్టారెంట్ ఎలాగు ఉంటుంది. ఉద్యోగులకు ఇలా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు గూగుల్ సంస్థలో ఉద్యోగం దొరకడం కష్టమే, అందులో నుంచి బయటపడడమూ కష్టమేనని కొంత మంది ఉద్యోగులు వ్యాఖ్యానిస్తుండగా, ఉద్యోగులను బానిసల్లాగా 24 గంటపాటు ఆఫీసులోనే ఉంచుకునేందుకే కంపెనీ ఇలాంటి ఏర్పాట్లను చేస్తోందని మాజీ ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఇక యాజమాన్యం చెప్పినప్పుడు జుట్టు కత్తిరించుకోవాలని, కష్టపడి పనిచేసేందుకు కసరత్తు చేయాలని, ఎప్పుడు పడుకోవాలో, ఎన్ని గంటలు పడుకోవాలో కూడా ఇక యాజమాన్యమే చెబుతుందని వారంటున్నారు. ఇది ఓ ఉద్యోగికి వినోదం పేరిట ఎప్పుడూ ఒకే పాట వినిపించినట్లు ఉంటుందని కూడా వారంటున్నారు. వీరి మాటల్లోని వాస్తవ అవాస్తవాలను పక్కన పెడితే ఉద్యోగులకు ఉల్లాసం, ఉత్సాహం కలిగించే వాతావరణాన్ని ఏర్పాటు చేయడం వల్ల వారి ఉత్పత్తి కూడా గణనీయంగా పెరుగుతుందన్నది యాజమాన్యం ప్రాక్టికల్ నేర్చుకున్న పాఠం అనడంలో సందేహం లేదు. తొలిసారి ఉద్యోగంలో చేరిన వ్యక్తి ఆఫీసులోకి మేనేజర్ సాదరంగా ఆహ్వానిస్తే ఆ ఉద్యోగి ఉత్పత్తి 15 శాతం అభివద్ధి చెందుతుందన్నది గూగుల్ హెచ్ఆర్ విభాగం విశ్వాసం. అసలు ఈ విభాగాన్నే కంపెనీ ‘పీపుల్ ఆపరేషన్’గా వ్యవహరిస్తుంది. ఇందులో పనిచేసే వారిని ‘పీపుల్ అనలిస్ట్స్’ అంటారు. వీరు ఎప్పటికప్పుడు ఉద్యోగుల ఫిట్నెస్ను, మానసిక పరిస్థితి గురించి తెలుసుకుంటుంటారు. వివరాలను నమోదు చేసుకుంటారు. అభిరుచులను కూడా అంచనా వేస్తారు. ఇలా ఉద్యోగుల ఫిట్నెస్, అభిరుచుల గురించి తెలుసుకునేందుకు గూగుల్ హెచ్ఆర్ విభాగం 2012లో ‘అరిస్టాటిల్’ కోడ్ నేమ్‌తో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో వ్యక్తమైన అభిప్రాయాల మేరకు పనిచేసే పరిస్థితుల్లో మార్పులు తీసుకొచ్చింది. రొటీన్ రౌండ్ టేబుల్ సమావేశాలు కొంత కాలానికి బోర్ కొడతాయి. అలాంటి చోట్ల సంచార వాహనాల (కారవాన్స్)రూపంలో సమావేశం హాళ్లను ఏర్పాటు చేసింది. ఉద్యోగులు సేదతీరేందుకు హాట్ స్టీమ్ టబ్బులను ప్రవేశపెట్టింది. ఇప్పుడు లండన్‌లో నిర్మిస్తున్న ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు కునకుతీసేందుకు ఏకంగా 5,000 స్లీప్ ప్యాడ్స్‌ను ఏర్పాటు చేస్తోంది. ఉద్యోగులు త్వరగా ఉపశమనం పొందటానికి వీలుగా తలవైపు గ్రావిటీ తక్కువగా ఉండేందుకు కాళ్లవైపు ఎత్తుగాను, తలవైపు కిందకు ఉండేలా స్లీప్ ప్యాడ్స్‌ను రూపొందించింది. చివరకు నిద్ర కూడా ఉద్యోగుల ఇష్టానుసారం పోనివ్వరా అంటూ విమర్శిస్తున్నవారు ఉన్నారు. ఈ కొత్త ప్రధాన కార్యాలయంలో ఏడువేల మంది ఉద్యోగులు పనిచేస్తారని కంపెనీ వర్గాలు తెలిపాయి. -
గూగుల్ ఉద్యోగులకు మాడ్యులర్ ఇళ్లు
న్యూయార్క్: ఐటీ కంపెనీలకు నిలయమైన అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఇళ్ల కొరత తీవ్రంగా ఉండి, ఇంటి ధరలు ఆకాశాన్ని అందుకోవడంతో గూగుల్ కంపెనీ తమ ఉద్యోగుల సౌకర్యార్థం ఏకంగా 300 మాడ్యులర్ ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు గూగుల్ మాతృసంస్థ అయిన అల్ఫాబెట్ ఇన్కార్పొరేషన్ ఈ రంగంలోకి కొత్తగా అడుగుపెట్టిన ‘ఫ్యాక్టరీ ఓఎస్’తో మూడు కోట్ల డాలర్ల ఒప్పందం చేసుకుంది. నిర్దిష్ట వాతావరణంగల ఫ్యాక్టరీలో ఈ మూడు వందల మాడ్యులర్ ఇళ్లను నిర్మించి ఫ్యాక్టరీ ఓఎస్ కంపెనీ గూగుల్ చెప్పిన చోటుకు వాటిని తరలిస్తుంది. మియామి, డెట్రాయిడ్, న్యూయార్క్ రాష్ట్రాల్లో కూడా ఇళ్ల కొనగోళ్లు అతి భారంగా మారడంతో స్థానిక ప్రజలంతా ఇప్పుడు మాడ్యులర్ ఇళ్లనే ఆశ్రయిస్తున్నారు. తాము నిర్మించిన ఇళ్లలో అద్దెకు ఉండడం వల్ల నెలకు ఎవరైనా తమ అద్దెలో 700 డాలర్లు పొదుపు చేయవచ్చని ‘ఫ్యాక్టరీ ఓఎస్’ వ్యవస్థాపక సీఈవో రిక్ హోలీడే చెబుతున్నారు. అలమెడా, శాంతాక్లారా, శాన్‌మాటియో సహా సిలికాన్ వ్యాలీలో 2012లో ఇళ్ల ధరలు 535,614 డాలర్లు ఉండగా, అది 2016 నాటికి 888,444 డాలర్లకు చేరుకుందని ఆన్లైన్ రియల్ ఎస్టేట్ సంస్థ ‘ట్రూలియా’ తెలిపింది. ఇళ్ల రియల ఎస్టేట్ ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో టెక్ దిగ్గజ కంపెనీలన్నీ తమ ఉద్యోగుల కోసం మాడ్యులర్ ఇళ్లనే ఆశ్రయిస్తున్నాయి. ఫేస్బుక్ ఇన్కార్పొరేషన్ మెన్లోపార్క్లో తమ ఉద్యోగుల కోసం 1500 ఇళ్లను నిర్మించాలనుకుంటోంది. ఇక్ ఆపిల్ కంపెనీ కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో 28 లక్షల చదరపు అడుగుల్లో కొత్తగా నిర్మించిన సర్కులర్ భవనంలోకి తమ వేలాది మంది ఉద్యోగులను తరలించాలని నిర్ణయించింది. -
రోడ్డుపైకి వచ్చిన గూగుల్ ఉద్యోగులు
వలసవాదులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలను నిరసిస్తూ 2000 మందికి పైగా గూగుల్ ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చారు. ఏడు ముస్లిం దేశాలను అమెరికాలోకి రాకుండా ట్రంప్ జారీచేసిన ఇమ్మిగ్రేషన్ ఆర్డర్‌కు వ్యతిరేకంగా వారు ర్యాలీ నిర్వహించారు. ట్రంప్ ఆదేశాలకు చెంపచెట్టులా 4 మిలియన్ డాలర్ల సంక్షోభ నిధిని వలసదారుల సమస్యల కోసం సమీకరించిన గూగుల్, వెంటనే ఇలా ర్యాలీకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. గూగుల్ ఉద్యోగులందరూ ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాయి. ఉద్యోగులు చేస్తున్న ఈ ర్యాలీకి మద్దతుగా దేశవ్యాప్తంగా ఉన్న గూగుల్ క్యాంపస్‌లు మద్దతు పలుకుతున్నాయి. మద్దతిచ్చే వాటిలో మౌంటేన్ వ్యూ, న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో, సియాటిల్ క్యాంపస్‌లు ఉన్నాయి. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, సహ వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్ మౌంటేన్ వ్యూ క్యాంపస్‌లో నిర్వహించబోయే కంపెనీ ఉద్యోగుల ర్యాలీలో ప్రసంగించారు. పిచాయ్ కూడా వలసవాదుడు కావడం విశేషం. ట్రంప్ ఆర్డర్‌కు వ్యతిరేకంగా చేస్తున్న ర్యాలీలో పాల్గొన్న ఉద్యోగులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ యుద్ధాన్ని ఇలానే కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని తెలిపారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా శాన్ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో జరిగిన నిరసనలో పాల్గొన్న గూగుల్ సెర్జీ బిన్, తను కూడా ఒక వలసవాది, శరణార్థి అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తనకు ఆరేళ్లు ఉన్నప్పుడు సోవియట్ యూనియన్ నుంచి అమెరికాకు తన కుటుంబసభ్యులు తరలివచ్చారని పేర్కొన్నారు. ప్రాథమిక విలువలు, విధానాల రూపకల్పనలు వంటి వాటిపై డిబేట్ జరగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 187 మంది గూగుల్ ఉద్యోగులపై ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్లు ప్రభావం చూపనున్నాయి. వారికి సహాయం కోసం కంపెనీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి (అమెరికా దిక్కులు పిక్కటిల్లేలా..) (ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్) (ట్రంప్ ‘నిషేధం’: ఐసిస్ విజయోత్సవాలు) (ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం!) (అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి) (ట్రంపోనమిక్స్ మనకు నష్టమా? లాభమా?) (ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి!) (ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో!) (వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా)