ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీల్లో లేఆఫ్స్, జీతాల కోతలు కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని టెక్ కంపెనీల్లోనూ ఇదే ధోరణి. ప్రముఖ సెర్చ్‌ఇంజిన్ గూగుల్ వేలాదిగా ఉద్యోగులను తొలగించడమే కాకుండా ఉన్న ఉద్యోగులకు కూడా జీతాలు తగ్గించింది. ఈ క్రమంలో జీతాల కోతను వ్యతిరేకించడంతో పాటు తొలగించిన తోటి ఉద్యోగులకు మద్దతుగా అమెరికాలో గూగుల్ ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టారు.
బుధవారం కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయం వద్ద, గురువారం న్యూయార్క్ నగరంలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయం వద్ద ఉద్యోగులు రోడ్ల మీదకు వచ్చి నిరసన ర్యాలీలు నిర్వహించారు. కాగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గూగుల్ ఒకే సారి 12వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇదే బాటలో అమెజాన్, మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్ సంస్థలు కూడా లేఆఫ్స్ ప్రకటించాయి.
న్యూయార్క్‌లోని గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ త్రైమాసిక ఫలితాలు వెల్లడి ముగిసిన నిమిషాల వ్యవధిలో గూగుల్ ఉద్యోగులు సుమారు 50 మంది కార్యాలయం వెలుపలికి వచ్చి నిరసన ర్యాలీ చేపట్టారు. కాగా సంస్థ నాలుగో త్రైమాసికంలో 13.6 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించింది.
Comments
Please login to add a commentAdd a comment