ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తొలగింపులపై ఉద్యోగులు రోడ్డెక్కారు. లండన్ గూగుల్ కార్యాలయంలో ఉద్యోగులు ఏప్రిల్ 4న నుంచి ఆందోళన ప‍్రారంభించారు. ఆ ఆందోళనలు కొనసాగుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ నిర్ణయంతో 15ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఉద్యోగులు తమ ఉద్యోగాల్ని కోల్పోవాల్సి వచ్చింది.
ఈ తరుణంలో లండన్‌లో ట్రేడ్ యూనియన్ యునైట్‌లో సభ్యులుగా ఉన్న గూగుల్ ఉద్యోగులు లేఆఫ్స్ పై ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను పట్టించుకోకుండా సంస్థ నిర్ణయం తీసుకుందని గూగుల్ కార్యాలయం పాంక్రాస్ స్క్వేర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేస్తూ ప్లకార్డ్‌లను ప్రదర్శించారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ సందర్భంగా గూగుల్ సంస్థ తమ బాధల్ని పట్టించుకోవడం లేదని తెలుపుతూ ‘యూనిట్ ద యూనియన్’ సంస్థ ఓ నోట్‌ను విడుదల చేసింది. అందులో జనవరిలో గూగుల్ తన గ్లోబుల్ ఆపరేషన్‌లో దాదాపు 10,000 మందిని తొలగిస్తున్నట్లు తెలిపింది. యూకేలో వందలాది మంది గూగుల్ సిబ్బంది ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి. వారికి న్యాయం చేయాలని యూనియన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
గూగుల్ ఉద్యోగుల్లో ఒకరితో సంప్రదింపులు జరుపుతోందని, అయితే సమావేశాల సమయంలో యూనియన్ ప్రతినిధులను అనుమతించడం లేదని పేర్కొంది. వ్యక్తులు ప్రతిపాదించిన రిడెండెన్సీ ప్రక్రియ గురించి ఫిర్యాదులను వినడానికి కంపెనీ నిరాకరించినట్లు నివేదించింది. లేఆఫ్‌లకు సంబంధించి ఉద్యోగులు, మేనేజ్‌మెంట్ చాలా సార్లు చర్చలు జరిగాయి. కానీ అవి విఫలమయయ్యాయని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ ఉద్యోగి రాయిటర్స్‌కు తెలిపారు. మరోవైపు ఆర్ధిక అనిశ్చితి నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపులు అనివార‍్యమని గూగుల్ పేర్కొంది.
రిడెండెన్సీ అంటే?
రిడెండెన్సీ అనేది ఉద్యోగ పనితీరు కారణంగా యజమానులు ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియనే రిడెండెన్సీ అంటారు.
Comments
Please login to add a commentAdd a comment