అసలే ఆర్ధిక మాంద్యం భయాలు. పైగా లేఆఫ్స్. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో దిగ్గజ కంపెనీ నుంచి ఉద్యోగం తొలగిస్తే. ఊహించుకోవడమే కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితే ఈ మేనేజర్‌కి ఎదురైంది. కానీ ఆమె మాత్రం ఉద్యోగం పోయిందన్న విషయం పక్కన పెట్టి ఆనందంలో తేలిపోయింది. తనను తానే పొగడ్తల్లో ముంచెత్తుకుంది. పింక్ స‍్లిప్‌తో ఎగిరి గంతేసినంత పనిచేసింది.
కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో సింగపూర్‌కి చెందిన హౌ జుయోనీ హెర్మియోన్‌కు మెటాలో ఉద్యోగం సంపాదించింది. వైరస్ సోకుతుందేమోనన్న భయంలోనూ ఉద్యోగం దొరికిందన్న ఆనందం రెట్టింపైంది. అందులోనే ప్రాజెక్ట్ సోర్సింగ్ మేనేజర్‌గా కొనసాగుతూ వచ్చారు. ఈ క్రమంలో మెటా వర్క్ ఫోర్స్‌ని తగ్గిస్తూ తొలగిస్తూ ప్రకటించింది. వారిలో హెర్మియోన్ కూడా ఉన్నారు. ఉద్యోగాన్ని పోగొట్టుకున్నందుకు విచారం వ్యక్తం చేయక పోగా.. లేఆఫ్స్‌కు గురైనందుకు సంతోషం వ్యక్తం చేసింది. అందుకు కారణం.. ఆమెకు తన డ్రీమ్ కంపెనీలో ఉద్యోగం దక్కించుకోవడమేనని తెలుస్తోంది.
నా డ్రీమ్ కంపెనీలో జాబ్ దొరికింది
మెటాలో చేరి మూడో వార్షికోత్సవానికి దగ్గర ఉన్న సమయంలో తన ఉద్యోగం పోయిందంటూ నెటిజన్లతో తన అనుభవాల్ని పంచుకున్నారు. మెటాలో లేఆఫ్స్ గురైనందుకు సంతోషంగా ఉంది. గూగుల్ నా డ్రీమ్ కంపెనీ. మెటా కాదు. మెటాలో ఉద్యోగం పోయిన వెంటనే గూగుల్‌లో జాబ్ కోసం ట్రై చేశా. సరిగ్గా 5 నెలల తర్వాత తాను కోరుకున్న సంస్థలో ఉన్నత ఉద్యోగం సంపాదించుకున్నట్లు తెలిపారు.
సరదాగా మాట్లాడుతున్నానని
‘మీలో కొందరు నేను సరదాగా మాట్లాడుతున్నానని అనుకోవచ్చు. గూగుల్‌లో ఉద్యోగం చేయడం నాకు చాలా ఇష్టం. గూగుల్ ఆఫీస్‌కు చేరుకోవడానికి 15 నిమిషాలే పడుతుంది. విమాన ప్రయాణం చేస్తే 16 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. కానీ, మీ కల నెరవేతుందంటూ హెర్మియోన్ లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో
ఆమె ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో ఉన్న గూగుల్ యూరప్ విభాగ రీజనల్ కమోడిటీ మేనేజర్‌గా చేరనుంది. ఇక, హెర్మియోన్ తీరుపై పలువురు నెటిజన్లు ఇదేమి చోద్యం అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం కొని సార్లు చెడులో కూడా మంచి జరుగుతుందంటూ ఆమె నిర్ణయాన్ని సమర్దిస్తున్నారు.
చదవండి👉 బై..బై అమెరికా, స్వదేశానికి తిరిగి వస్తున్న భారతీయులు
Comments
Please login to add a commentAdd a comment