గూగుల్‌ తొలగింపులు.. 19 ఏళ్లుగా చేస్తున్న ఉద్యోగం రాత్రి రాత్రే ఊడింది! | Google Employee Kevin Bourrillion Loses Job Of 19 Years Overnight | Sakshi
Sakshi News home page

గూగుల్‌ తొలగింపులు.. 19 ఏళ్లుగా చేస్తున్న ఉద్యోగం రాత్రి రాత్రే ఊడింది!

Published Sat, Jan 13 2024 11:46 AM | Last Updated on Sat, Jan 13 2024 12:12 PM

Google Employee Kevin Bourrillion Loses Job Of 19 Years Overnight - Sakshi

ప్రముఖ టెక్నాలజీ సంస్థ గూగుల్‌ వందల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించినట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదిక తెలిపింది. అయితే ఎంతమంది ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌ ఇచ్చిందనే విషయంపై స్పష్టత రానప్పటికి.. ఆ సంస్థలో పనిచేస్తున్న డిజిటల్‌ అసిస్టెంట్‌, హార్డ్‌వేర్‌, ఇంజినీరింగ్‌ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది ప్రభావితం అయినట్లు సమాచారం. 

వారిలో గూగుల్‌లో 19 ఏళ్ల పాటు పనిచేసిన కెవిన్ బౌర్డిల్లాన్ ఒకరు. ‘బుధవారం రాత్రి నన్ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు గూగుల్‌ చెప్పింది. ఏది ఏమైనప్పటికి గూగుల్‌లో ఉద్యోగం పోవడం సేద తీరేందుకు, కుటుంబ సభ్యులతో గడిపేందుకు సమయం దొరికింది’ అని ట్వీట్‌ చేశారు.   

 ‘ఈ తొలగింపుల గురించి నేను పెద్దగా ఆలోచించడం లేదు. నా ఉద్యోగం పోయినందుకు నేనేం బాధపడడం లేదు. ఒకందుకు సంతోషమే. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు రావడం అవసరం. ప్రస్తుతానికి జాబ్‌ చేయాలా? లేదంటే బిజినెస్‌ చేయాలా? ఇలా ఆలోచిండచం లేదు. నా ఇష్టాఇష్టాల గురించి ఆలోచిస్తున్నానని’ ట్వీట్‌లో పేర్కొన్నాడు.
 
కాగా, గూగుల్ బుధవారం వందలాది ఉద్యోగాల తొలగింపుల్ని ప్రకటించింది. గూగుల్‌తో పాటు ఇప్పటికే అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, పేటీఎంలు సైతం ఉద్యోగులకు పింక్‌ సిప్ల్‌లు జారీ చేసేందుకు సిద్ధమయ్యాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement