![Google Has Laid Off Its Director Of News, Madhav Chinnappa - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/23/Google12.jpg.webp?itok=gyY7-LrV)
Google News Director Madhav Chinnappa laid off : ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ భారీ షాకిచ్చింది. ‘గూగుల్ న్యూస్’ డైరెక్టర్ మాధవ్ చిన్నప్పను విధుల నుంచి తొలగించింది. ఆర్ధిక మాంద్యం భయాల కారణంగా 13 ఏళ్ల పాటు గూగుల్‌లో పనిచేసిన మాధవ్‌ను తొలగిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ, సుధీర్ఘ కాలం పాటు గూగుల్‌లో పని చేయడం గర్వంగా ఉందని అన్నారు.
ఈ సందర్భంగా..యూకే నుండి గూగుల్ న్యూస్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించిన మాధవ్ చిన్నప్ప తన ఉద్యోగం కోల్పవడంతో మరో కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్లు లింక్డిన్ పోస్ట్‌లో పేర్కొన్నారు. కొత్త అవకాశాలను అన్వేషించేందుకు నెల రోజుల ముందు నుంచే సంస్థను విడిచిపెడుతున్నాను. భారత్‌కి వెళ్లి అమ్మను చూడాలి. సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 2 వరకు మిగిలిన పనుల్ని పూర్తి చేసుకుంటానని అన్నారు.
12వేల మంది తొలగింపు
ఈ ఏడాది జనవరిలో గూగుల్ 12,000 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గత నెలలో మళ్లీ కంపెనీ తన మ్యాపింగ్ యాప్ వేజ్‌లో ఉద్యోగ కోతలను ప్రకటించింది. అప్పటి నుండి, తొలగింపుల వల్ల ప్రభావితమైన ఉద్యోగుల కథనాలు సోషల్ మీడియాలో పుట్టుకొస్తున్నాయి.
కొంతమంది ఉద్యోగులు ప్రసూతి సెలవుల్లో ఉన్నప్పుడు ఉద్యోగం కోల్పోయారు. మరికొందరు సెలవులో ఉన్నప్పుడు పింక్ స్లిప్ అందుకున్నారు. ముఖ్యంగా, కంపెనీ మెంటల్ హెల్త్ హెడ్‌తో సహా కొంతమంది గూగుల్‌లో పలు విభాగాల్లో ముఖ్య పాత్రపోషిస్తున్న డైరక్టర్ స్థాయి ఉన్నత ఉద్యోగులు ఇలా ఉద్యోగాలు కోల్పోయిన వారి జాబితాలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment