ప్రపంచ వ్యాప్తంగా 70 కార్యాలయాలు. 2 లక్షల మంది ఉద్యోగులు. 200 లక్షల కోట్ల కంపెనీగా అవతరించేందుకు అడుగు దూరంలో ఉంది గూగుల్. అయినప్పటికీ మరో మారు భారీ మొత్తంలో ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపేందుకు సిద్ధమైంది. ఇబ్బడిముబ్బడిగా డబ్బులు సంపాదిస్తున్న టెక్ దిగ్గజం వర్క్ ఫోర్స్ విషయంలో ఎందుకు ఇలా వ్యవహరిస్తోంది.
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఉద్యోగుల నెత్తిన మరో పిడుగు పడనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా వేలాది మంది ఉద్యోగుల మెడకు గూగుల్ కత్తి వేలాడదీస్తోంది. అందుకు ఏఐ టెక్నాలజీయే కారణం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్న అద్భుతాలతో ఆహా.. ఓహో అని తెగ సంబరపడిపోతున్నాం. అయితే, ఆ టెక్నాలజీ వినియోగం పెరిగిపోతున్న కొద్ది మనుషుల ఉద్యోగాల మనుగడ కష్టమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎలాన్ మస్క్‌లాంటి మహా మేధావులు.
ఈ తరుణంలో గూగుల్ తన యాడ్స్ సేల్స్ యూనిట్ విభాగంలో ఏఐ ఆధారిత ఆటోమెటిక్ డిజైన్ టూల్‌ను వినియోగించేందుకు సిద్ధమైంది. ఫలితంగా మనుషులతో పనిలేకుండా ఆటోమెటిక్‌గా ఏఐ టూల్స్ సాయంతో యాడ్స్‌ను డిజైన్ చేసుకోవచ్చు.
దీంతో మిలియన్ల కొద్దీ డబ్బు ఆదా అవుతుంది. భారీ మొత్తంలో లాభాల్ని గడించవచ్చని గూగుల్ భావిస్తోంది. అందుకే డిపార్ట్‌మెంట్ వైడ్ గూగుల్ యాడ్స్ మీటింగ్‌లో యాడ్స్ విభాగంలో పనిచేసే ఉద్యోగుల స్థానాన్ని ఉద్యోగులతో భర్తీ చేయనున్నట్లు తేలింది. ఇప్పుడు ఆ విభాగంలో పని చేస్తున్న 30 వేల మంది ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment