గతంలో ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు ఆ సంస్థ మాజీ ఉద్యోగులు వరుసగా లేఖలు రాసిన విషయం తెలిసిందే. కఠిన సమయాల్లో విధుల నుంచి తొలగించడంపై తమ ఆవేదనని సీఈవోకి వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం..కంపెనీ ముందే ఇచ్చిన లీవ్‌లను అలాగే ఉంచి తమకు ఊరట కల్పించాలని కోరారు.
అయినప్పటికీ, గూగుల్ ఉద్యోగుల తొలగింపులను కొనసాగిస్తుంది. ఇటీవల ఓ మహిళా ఉద్యోగి బిడ్డకు జన్మనిచ్చిన 10 వారాల తర్వాత ఉద్యోగాన్ని కోల్పోయింది. అయితే గూగుల్ నిర్ణయంతో ‘గుండె పగిలినంతపనైంది’అని లింక్డిన్ పోస్ట్ తెలిపారు.
మెటర్నీట్‌లీవ్‌లో ఉద్యోగి.. ఫైర్ చేసిన గూగుల్
ఉద్యోగం పోవడంపై ఆ మహిళ లింక్డిన్ పోస్ట్‌లో ఇలా రాశారు. ‘గూగుల్‌లో 12.5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత, గత వారం జరిగిన సంస్థ రిక్రూటింగ్ లేఆప్స్‌లో నేను ప్రభావితం అయ్యాను. దురదృష్టవశాత్తూ మెటర్నిటీ లీవ్‌లో ఉన్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఉద్యోగం పోయినప్పటికీ సంస్థపై తనకున్న మమకారాన్ని చాటి చెప్పింది. గూగుల్‌లో పనిచేసే సమయంలో నా స్నేహితులకు, మరీ ముఖ్యంగా నా కుటుంబ సభ్యులుగా భావించే అద్భుతమైన కొలీగ్స్‌తో పనిచేసే అదృష్టం దక్కింది. వారికి నా కృతజ్ఞతలు’ అని అన్నారు.
జాబ్ ఉంటే చెప్పరూ చేసుకుంటా
కొత్త జాబ్ ఎక్కడ ఉంది. దానికి ఎలా గుర్తించాలి? ఇంటర్వ్యూలకు ఎలా హాజరవ్వాలో తెలుసుకోవడం ప్రస్తుతం కష్టమే. అయితే, పాజిటివ్ మైండ్‌సెట్‌ను కొనసాగిస్తూ, తర్వాత ఏం జరుగుతుందో చూసేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు పోస్ట్‌లో రాశారు. మీకు తెలిసి ఏదైనా కంపెనీలో స్టాఫింగ్ మేనేజర్ లేదా ప్రోగ్రామ్ మేనేజర్ జాబ్స్ ఉంటే నన్ను గుర్తుంచుకోండి. అలాగే ఎవరైనా ఐసీ రిక్రూటర్‌ల కోసం చూస్తున్నట్లైతే చెప్పండి. నా కొలీగ్స్ ఎంతో మంది ఉద్యోగం కోల్పోయారు. వారికి సహాయం చేసిన వారవుతారు అని లింక్డిన్ పోస్ట్‌లో నెటిజన్లను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment