న్యూఢిల్లీ: టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్‌కు భారత్ భారీ షాక్ ఇవ్వనుందా? అంటే అవుననే సంకేతాలు తాజాగా వెలు వడ్డాయి. యాంటిట్రస్ట్ ఉల్లంఘనపై గూగుల్‌పై భారత్ చర్య తీసుకుంటుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్‌లో కంపెనీ తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేస్తోందన్న రెండు కేసుల్లో గూగుల్‌కి ఇటీవల 275 మిలియన్ డాలర్ల పెనాల్టీ నేపథ్యంతో తాజా వ్యాఖ్యాలు చేశారు. (Jr. NTR Net Worth: ఖరీదైన కార్లు, లగ్జరీ వాచెస్, ఫ్యాన్స్ ఖుషీ!)
గూగుల్‌పై ప్రభుత్వం చర్య తీసుకోవాలి
తన మార్కెట్ స్థానాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా పోటీ వ్యతిరేక పద్ధతులకు పాల్పడుతున్న ఆల్ఫాబెట్‌కు చెందిన గూగుల్‌పై ప్రభుత్వం చర్య తీసుకోవాలని యోచిస్తున్నట్లు మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించారు. గూగుల్‌పై ఇటీవలి జరిమానా తీవ్రమైందని, ఇది మరింత ఆందోళన కలిగిస్తోందని మంత్రి రాయిటర్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే గూగుల్‌పై ప్రభుత్వం ఎలాంటి నియంత్రణ చర్య తీసుకోబోతోందో వెల్లడించేందుకు మంత్రి నిరాకరించారు. ఈ సమస్య మనకే కాదు, భారతదేశంలోని మొత్తం డిజిటల్ పర్యావరణ వ్యవస్థకు ఆందోళన కలిగిస్తోంద న్నారు. దీనిపై ఇప్పటివరకు గూగుల్‌తో ప్రభుత్వం చర్చించ లేదని, ఈ విషయంలో కోర్టులో ఉంది కనుక ఎలాంటి చర్చ అవసరం లేదని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. (రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా?)
కాగా ప్రపంచంలో గూగుల్‌కి రెండో అతిపెద్ద మార్కెట్ భారత్‌లో అక్రమాలకు పాల్పడుతుందన్న ఆరోపణలు నిజమని గత ఏడాది యాంటీట్రస్ట్ వాచ్‌డాగ్ సీసీఐ తేల్చింది. కాంపిటీషన్ యాక్ట్, 2002ను అమలు చేయడానికి ఏర్పాటైన చట్టబద్ధమైన భారత ప్రభుత్వ సంస్థ. వ్యాపారంలో పోటీ కార్యకలాపాల్లో అవినీతి, అవకతవకలు నిర్ధారణ అయితే భారీ జరిమానాలు విధించే అధికారం సీసీఐకి ఉన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment