take action
-
టెక్ దిగ్గజం గూగుల్‌కు భారీ షాక్: కేంద్ర ఐటీ మంత్రి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్‌కు భారత్ భారీ షాక్ ఇవ్వనుందా? అంటే అవుననే సంకేతాలు తాజాగా వెలు వడ్డాయి. యాంటిట్రస్ట్ ఉల్లంఘనపై గూగుల్‌పై భారత్ చర్య తీసుకుంటుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్లో కంపెనీ తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేస్తోందన్న రెండు కేసుల్లో గూగుల్‌కి ఇటీవల 275 మిలియన్ డాలర్ల పెనాల్టీ నేపథ్యంతో తాజా వ్యాఖ్యాలు చేశారు. (Jr. NTR Net Worth: ఖరీదైన కార్లు, లగ్జరీ వాచెస్, ఫ్యాన్స్ ఖుషీ!) గూగుల్‌పై ప్రభుత్వం చర్య తీసుకోవాలి తన మార్కెట్ స్థానాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా పోటీ వ్యతిరేక పద్ధతులకు పాల్పడుతున్న ఆల్ఫాబెట్‌కు చెందిన గూగుల్‌పై ప్రభుత్వం చర్య తీసుకోవాలని యోచిస్తున్నట్లు మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించారు. గూగుల్‌పై ఇటీవలి జరిమానా తీవ్రమైందని, ఇది మరింత ఆందోళన కలిగిస్తోందని మంత్రి రాయిటర్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే గూగుల్‌పై ప్రభుత్వం ఎలాంటి నియంత్రణ చర్య తీసుకోబోతోందో వెల్లడించేందుకు మంత్రి నిరాకరించారు. ఈ సమస్య మనకే కాదు, భారతదేశంలోని మొత్తం డిజిటల్ పర్యావరణ వ్యవస్థకు ఆందోళన కలిగిస్తోంద న్నారు. దీనిపై ఇప్పటివరకు గూగుల్‌తో ప్రభుత్వం చర్చించ లేదని, ఈ విషయంలో కోర్టులో ఉంది కనుక ఎలాంటి చర్చ అవసరం లేదని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. (రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా?) కాగా ప్రపంచంలో గూగుల్‌కి రెండో అతిపెద్ద మార్కెట్ భారత్‌లో అక్రమాలకు పాల్పడుతుందన్న ఆరోపణలు నిజమని గత ఏడాది యాంటీట్రస్ట్ వాచ్డాగ్ సీసీఐ తేల్చింది. కాంపిటీషన్ యాక్ట్, 2002ను అమలు చేయడానికి ఏర్పాటైన చట్టబద్ధమైన భారత ప్రభుత్వ సంస్థ. వ్యాపారంలో పోటీ కార్యకలాపాల్లో అవినీతి, అవకతవకలు నిర్ధారణ అయితే భారీ జరిమానాలు విధించే అధికారం సీసీఐకి ఉన్న సంగతి తెలిసిందే. -
‘ఆ ఎంపీలపై చర్యలు తీసుకోండి’
న్యూఢిల్లీ: ఏడుగురు కేంద్ర మంత్రుల బృందం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడును కలిసింది. ఆగస్టు 11న రాజ్యసభలో అనుచితంగా ప్రవర్తించిన ప్రతిపక్ష పార్టీల ఎంపీలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ బృందం కోరింది. వారి చర్యలను అనూహ్యమైనవిగా, హింసాయుతమైనవిగా బృందం వర్ణించింది. వెంకయ్యను కలిసిన బృందంలో పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, ముఖ్తర్ అబ్బాస్ నఖ్వి, ధర్మేంద్ర ప్రధాన్, భూపేందర్ యాదవ్, అర్జున్‌రామ్ మేఘ్వాల్, మురళీధరన్ ఉన్నారు. శనివారం ఆయన పార్లమెంటుకు వెళ్లి ఘటన ఫుటేజీలను పరిశీలించారు. అనుచితంగా ప్రవర్తించిన ఎంపీలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. -
ఎఫ్ఆర్వోపై చర్యలు తీసుకోవాలి
ఇందల్వాయి: మండలంలోని నల్లవెల్లి గ్రామ పరిధి స్టేషన్ తంగాలో గత శనివారం మేకలు మేపుకోవడానికి అడవిలోకి వెళ్తున్న గిరిజనుడిపై అడవులకు నిప్పు పెడుతున్నావని దాడి చేసి కొట్టిన ఇందల్వాయి రేంజ్ అధికారి సుభాష్ చంద్ర యాదవ్‌ను విధుల నుంచి తొలగించి అతనిపై ఎస్టీ ఎ స్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సోమ వారం గిరిజన నాయకులు అటవీశాఖ కార్యాల యం ఎదుట ఆందోళన చేశారు. ఉన్నత అధికా రి స్థాయిలో ఉండి విచక్షణ కోల్పోయి ప్రవర్తించడం అన్యాయమని, అతనిపై జిల్లాస్థాయి అ ధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు. న్యాయం జరగకపోతే ఆందోళనలు ఉ ధ్రుతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎఫ్ఆర్వోపై చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్‌కు, సీపీ కార్తికేయకు పిటిషన్ అందించారు. ఆందోళనలో ఆలిండియా బంజారా సేవా సం ఘం జిల్లా అధ్యక్షుడు శ్రీహరి నాయక్, దళిత సంఘాల అధ్యక్షుడు సాయిలు, బంజారా సేవా సంఘం మండలాధ్యక్షుడు మోహన్ నాయక్,రమేష్ నాయక్ పాల్గొన్నారు. -
అవినీతి వార్డెన్లపై చర్య తీసుకోవాలి
అచ్చంపేట : అచ్చంపేట నియోజకవర్గంలో సంక్షేమ వసతిగృహాల విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారని ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి కె.బాలగౌడు అన్నారు. ఆదివారం అచ్చంపేట ఆర్అండ్బీ అతిథిగహంలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ వార్డెన్లు అవినీతికి పాల్పడుతూ విద్యార్థుల పొట్టగొడుతున్నారని ఆరోపించారు. కొన్ని హాస్టల్ వార్డెన్లు విద్యార్థుల సంఖ్య అధికంగా రిజిస్టర్లలో నమోదు చేస్తూ వారిపేరుమీద డబ్బులు డ్రా చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడంలో జిల్లా అధికారులు చొరవ చూపడంలేదని, హాస్టల్స్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ మిషన్లు పనిచేయడంలేదని అన్నారు. మెనూప్రకారం భోజనం అందించడంలేదని, నాసిరకం ఆహారపదార్థాలను విద్యార్థులకు అందిస్తున్నారని తెలిపారు. ఈ సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా సంక్షేమాధికారులకు తెలియజేస్తామని, పరిష్కారం కోసం ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు రాజునాయక్, కుర్మయ్య, బిక్షపతి, శ్రీరామ్, రమేష్, నిరంజన్, శివ, మల్లేష్ పాల్గొన్నారు. -
దళితులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి
గంగవరం:వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లం గ్రామంలో దళితులపై దాడికి పాల్పడిన అగ్రవర్ణాలపై చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఆ మేరకు తహశీల్దార్ కార్యాలయం ముందు గురువారం ధర్నా చేశారు. పచ్చికాపలం గ్రామంలో జరుగుతున్న మహాభారతం ఉత్సవాల్లో అగ్నిగుండ ప్రవేశం చేసిన దళితులపై అగ్రవర్ణాల చెందిన వారు చేయిచేసుకున్నారనీ, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కేవీపీఎస్ ఉపాధ్యక్షుడు మునిరత్నం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు ఈశ్వర్, బోయకొండ, సుబ్రమణ్యం మాట్లాడారు. -
పశువులను తరలించే వారిపై చర్య తీసుకోవాలి
మిర్యాలగూడ : పరిమితికి మించి వాహనాల్లో గేదెలు, గోవులను కబేళాలకు తరలిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాని కోరుతూ బీజేవైఎం, బీజేపీ ఆద్వర్యంలో బుధవారం మిర్యాలగూడలో డీఏఓ ప్రమీలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు రేపాల పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ సామర్థ్యపు సర్టిఫికెట్ ప్రకారం పెద్దలారీలో ఆరు, చిన్నలారీలో నాలుగు మాత్రమే తరలించేలా చూడాలన్నారు. వినతిపత్రం అం దించిన వారిలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బంటు సైదులు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి చెరుపల్లి చంద్రమౌళి, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు బంటు గిరి, కమలాకర్‌రెడ్డి, చిలుకూరి శ్యామ్, నక్క రవి, నక్కశ్రీను, బాబు, మహేష్, ధనుంజయ్, సంపత్ ఉన్నారు. -
బీపీఎంపై చర్యలు తీసుకోవాలి
దౌల్తాబాద్: మండలంలోని ఇండాపూర్, కుదురుమళ్ళ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ప్రతి నెలా ఇచ్చే ఆసరా పింఛన్ల ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న తపాలా బీపీఎంపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సంతోష్‌కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రతి నెలా లబ్ధిదారులకు పింఛన్లు ఇవ్వకుండా రోజుల తరబడి తిప్పించుకుంటున్నారని ఈ నెల హస్నాబాద్‌కు వస్తేనే ఇస్తానని ఇప్పటి వరకు పింఛన్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్నారని బీపీఎంపై చర్యలు తీసుకోకపోతే కలెక్టరుకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. -
ఎట్టకేలకు ‘కల్వకుర్తి’పై కన్నెర్ర!
ఏడాదిగా పనులు నిలిపివేసిన గామన్‌ఇండియాపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం 60సీ కింద వేరే సంస్థకు పనులిచ్చే యోచన సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని మహత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథ కం పనుల్లో జరుగుతున్న తీవ్ర జాప్యంపై ఎట్టకేలకు కన్నెర్ర జేసింది. ఎన్నిమార్లు హెచ్చరిం చినా పనులు పూర్తి చేయని కాంట్రాక్టు సంస్థపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. పనుల నుంచి ప్రస్తుత కాంట్రాక్టు సంస్థ గామన్ ఇండియాను తప్పించి, మిగిలిన పనులను వేరే కాంట్రాక్టు సంస్థకు అప్పగించాలని భావిస్తోంది. ప్రాజెక్టు అధికారులతో సమీక్షించిన నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు ఈ మేరకు గామన్ ఇండియాపై చర్యలకు గట్టి ఆదేశాలిచ్చారు. దీంతో కాంట్రాక్టు సంస్థపై చర్యలకు సమాయత్తమవుతున్నారు. మారని సంస్థ తీరు : కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా సుమారు 3.40 లక్షల ఎకరాలకు నీరందించాలని నిర్ణయిం చగా, ప్రాజెక్టు మొత్తాన్ని మూడు దశలుగా విడగొట్టారు. ఇందులో కొల్లాపూర్ ఒకటో దశ కింద 13వేల ఎకరాలు, జొన్నల బొగడ రెండో దశ కింద 47 వేల ఎకరాలు, మూడో దశ గుడిపల్లెగట్టు కింద 2.80 లక్షల ఎకరాల ఆయకట్టును అభివృద్ధి చేయాలని సంకల్పించారు. మూడో దశ కింద 42.80 కిలోమీటర్ల మేర నీటిని తరలించేందుకు పంప్‌హౌస్, రిజర్వాయర్లను కట్టేందుకు 2005-06లో గామన్ ఇండియా సంస్థకు పనులు అప్పగించారు. 13 మెగావాట్ల కెపాసిటీ గల 5 పంపులు, 800 క్యూసెక్కుల నీటిని 117 మీటర్ల ఎత్తుకి పంప్ చేసేలా ప్రాజెక్టును రూపొందించారు. 2010 లోగా పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వంతో గామన్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే పనుల్లో జాప్యం దృష్ట్యా నాలుగేళ్ల కాలంలో రెండుమార్లు గడువు పెంపు అనుమతిని పొందింది. గత సెప్టెంబర్‌లో ప్రభుత్వం మరోమారు ఏడాది గడువు పొడిగించినా సంస్థ తీరు మారలేదు. రూ.630 కోట్లలో 85శాతం పనులను పూర్తి చేయగా, మరో రూ.100 కోట్ల పనులను పూర్తి చేయాలి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఖరీఫ్ నాటికి లక్ష్యంగా పె ట్టుకున్న 1.60 లక్షల ఆయకట్టు సాధ్యమయ్యేట్టు లేదు. చర్యలకు నిర్ణయం: పనుల్లో తీవ్ర జాప్యంపై ఇటీవల మంత్రి హరీశ్‌రావు ఆరా తీశారు. గత ఏడాది పూర్తిగా పను లు నిలిపివేసిన గామన్ ఇండియా, ఈ ఏడాది జనవరి నుంచి పనులను ఆరంభించిందని, అయితే ఆశించిన రీతిలో పనులు జరగడం లేదని అధికారులు చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టయిన జగన్నాధ్‌పూర్‌లోనూ గేటు అమర్చే పనులను గామన్ ఇండియా అల క్ష్యంగా వ్యవహరిస్తోందని మంత్రికి వివరించా రు. దీంతో కాంట్రాక్టు సంస్థను తప్పించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. చట్టంలోని 61 అధికరణ కింద పూర్తిగా పనుల నుం చి తప్పించడమా? లేక 60(సీ) కింద ఇతర సంస్థకు నామినేషన్‌పై పనులు అప్పగించడమా? అన్న దానిపై సమాలోచనలు జరుపుతున్నారు. గురువారం మరోమారు సమావేశమై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.