తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న కేవీపీఎస్ నాయకులు
గంగవరం:వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లం గ్రామంలో దళితులపై దాడికి పాల్పడిన అగ్రవర్ణాలపై చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఆ మేరకు తహశీల్దార్ కార్యాలయం ముందు గురువారం ధర్నా చేశారు. పచ్చికాపలం గ్రామంలో జరుగుతున్న మహాభారతం ఉత్సవాల్లో అగ్నిగుండ ప్రవేశం చేసిన దళితులపై అగ్రవర్ణాల చెందిన వారు చేయిచేసుకున్నారనీ, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కేవీపీఎస్ ఉపాధ్యక్షుడు మునిరత్నం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు ఈశ్వర్, బోయకొండ, సుబ్రమణ్యం మాట్లాడారు.