ఎఫ్‌ఆర్వోపై చర్యలు తీసుకోవాలి | Take action against FRO | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఆర్వోపై చర్యలు తీసుకోవాలి

Published Tue, Mar 20 2018 9:29 AM | Last Updated on Wed, Oct 17 2018 6:10 PM

Take action against FRO - Sakshi

ఎఫ్‌ఆర్‌ఓకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న గిరిజనులు

ఇందల్‌వాయి: మండలంలోని నల్లవెల్లి గ్రామ పరిధి స్టేషన్‌ తంగాలో గత శనివారం మేకలు మేపుకోవడానికి అడవిలోకి వెళ్తున్న గిరిజనుడిపై అడవులకు నిప్పు పెడుతున్నావని దాడి చేసి కొట్టిన ఇందల్వాయి రేంజ్‌ అధికారి సుభాష్‌ చంద్ర యాదవ్‌ను విధుల నుంచి తొలగించి అతనిపై ఎస్టీ ఎ స్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సోమ వారం గిరిజన నాయకులు అటవీశాఖ కార్యాల యం ఎదుట ఆందోళన చేశారు. ఉన్నత అధికా రి స్థాయిలో ఉండి విచక్షణ కోల్పోయి ప్రవర్తించడం అన్యాయమని, అతనిపై జిల్లాస్థాయి అ ధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు.

న్యాయం జరగకపోతే ఆందోళనలు ఉ ధ్రుతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎఫ్‌ఆర్వోపై చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్‌కు, సీపీ కార్తికేయకు పిటిషన్‌ అందించారు. ఆందోళనలో ఆలిండియా బంజారా సేవా సం ఘం జిల్లా అధ్యక్షుడు శ్రీహరి నాయక్, దళిత సంఘాల అధ్యక్షుడు సాయిలు, బంజారా సేవా సంఘం మండలాధ్యక్షుడు మోహన్‌ నాయక్,రమేష్‌ నాయక్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement