atrocity case
-
దాసరి అరుణ్ పైఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్
-
ఇల్లు ఖాళీ చేయమన్నందుకు... అసభ్యంగా ప్రవర్తించాడంటూ..
సాక్షి, వరంగల్: న్యాయం చేయాల్సిన పోలీసులే అన్యాయంగా అట్రాసిటీ కేసు నమోదు చేశారని బాధిత కుటుంబసభ్యులు సోమవారం ఆరోపించారు. బాధితుల కథనం ప్రకారం.. కాశిబుగ్గ తిలక్‌రోడ్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న మహిళ ఏడు నెలల క్రితం తమ ఇంట్లో అద్దెకు తీసుకుందని, సదరు మహిళకు తమకు బేదాభిప్రాయాలు రావడంతో ఇళ్లు ఖాళీ చేయాలని చెప్పారు. ఖాళీ చేయక తమను దూషిందని, దీంతో పాటు సదరు మహిళ స్థానిక నేతల సహకారంతో పోలీస్‌స్టేషన్‌లో ఇంటి యజమాని కుమారుడు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు మహిళ ఆరోపించిన విషయంలో వాస్తవం లేదని గుర్తించి సదరు మహిళను మందలించి వదిలేశారు. ఇదిలా ఉండగా మరుసటి రోజు సీఐ బదిలీపై వెళ్లడంతో విషయం మళ్లీ మొదటికి వచ్చింది.‘ఓసిటీ మైదానంలో పంచాయితీ నిర్వహిస్తున్నాం.. హాజరు కావాలి’ అంటూ సమాచారం పంపడంతో ఖంగుతి న్న బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. మా మాటలు లెక్కచేయకుండా పీఎస్‌కు పోతావా? అంటూ ఏకంగా పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే దాడికి దిగినట్లు తెలిసింది. సదరు మహిళకు మద్దతుగా వ్యవహరిస్తున్న అధికార పార్టీకి చెందిన ఓ నేత ఎస్సై ఆధ్వర్యంలో కొత్తగా బాధ్యతలు తీసుకున్న సీఐని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి మళ్లీ కేసు విషయంలో మంతనాలు జరిపినట్లు సమాచారం. గత సీఐ జరిపిన విచారణను పరిగణలోకి తీసుకోకుండానే కుటుంబంలోని ఆరుగురిపై అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో బాధిత కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని పలువురు కోరుకుంటున్నారు. ఈ విషయంపై ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ మల్లేష్‌ను వివరణ కోరగా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసు ప్రస్తుతం ఏసీపీ విచారణలో ఉన్నట్లు తెలిసింది. -
దారుణం: మహిళను జుట్టుపట్టుకొని లాగి.. అడ్డొచ్చిన వ్యక్తిని!
సాక్షి, నల్లబెల్లి( జయశంకర్ భూపాలపల్లి) : దళిత మహిళ ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై బండారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నాగరాజుపల్లి శివారు పంతులుపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల నాగరాజు అదే గ్రామానికి చెందిన ఓ దళిత మహిళ జుట్టుపట్టి లాగి కొడుతూ అవమానించాడు. ఈ సంఘటనను చూసి అడ్డుకునేందుకు ప్రయత్నించిన చుక్క సాంబయ్యపై కర్రతో దాడి చేశాడు. దీంతో సాంబయ్య తలకు తీవ్రగాయమైంది. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
అట్రాసిటీ ఫిర్యాదుపై డీఎస్పీ విచారణ
కంగ్టి(నారాయణఖేడ్) : కులం పేరుతో దూషించారని వచ్చిన ఫిర్యాదుపై డీఎస్పీ నల్లమల రవి ఆధ్వర్యంలో మంగళవారం కంగ్టి ఎంపీపీ కార్యాలయంలో అధికారులను విచారించారు. గత నెల 30న కంగ్టి మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ రామారావు జాదవ్, ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. తాము చేసిన సీసీ రోడ్డు పనుల బిల్లులు రాకుండా ఎమ్మెల్యే అడ్డుకొంటున్నారంటూ పురుగుల మందు తాగుతానని చూపిన సమయంలోనే తనను కొందరు కులం పేరుతో దూషించారంటూ ఈ నెల 1న ఎంపీపీ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే సర్వసభ్య సమావేశంలో అసలు సభ్యులకు బదులుగా కూర్చున్న డమ్మీ వ్యక్తులైన సిద్దు, వెంకట్‌రెడ్డి, బస్వరాజ్, సంతోష్పాటిల్పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ మేరకు సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మండల స్థాయి అధికారులు తహసీల్దార్ రాజయ్య, ఎంఈఓ మల్లేశం, ఎంపీడీఓ రత్నమాల, పీఆర్ ఏఈ మాధవనాయుడు, సర్పంచ్ విఠల్ జాదవ్‌తో పాటు పలువురిని మంగళవారం డీఎస్పీ విచారించారు. పంచాయతీ తీర్మానం లేకుండా బిల్లులు చెల్లించడం ఎలా సాధ్యం అని ఈ సందర్భంగా సర్పంచ్ పేర్కొన్నారు. ఎంపీపీని కులం పేరుతో దూషణ, చంపుతానంటూ బెదిరింపులు, ఎమ్మెల్యే నా ఇష్టం వచ్చినట్లు చేస్తా...పో అంటూ అన్నాడనే ఫిర్యాదులపై విచారించారు. విచారణ నివేదికను పై అధికారులకు సమర్పించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సీఐ తిరుపతి యాదవ్, సీనియర్ అసిస్టెంట్ రమేష్, ధన్‌రాజ్, పంచాయతీ సెక్రెటరీలు విజయలక్ష్మి, కిష్టయ్య పాల్గొన్నారు. -
ఎఫ్ఆర్వోపై చర్యలు తీసుకోవాలి
ఇందల్వాయి: మండలంలోని నల్లవెల్లి గ్రామ పరిధి స్టేషన్ తంగాలో గత శనివారం మేకలు మేపుకోవడానికి అడవిలోకి వెళ్తున్న గిరిజనుడిపై అడవులకు నిప్పు పెడుతున్నావని దాడి చేసి కొట్టిన ఇందల్వాయి రేంజ్ అధికారి సుభాష్ చంద్ర యాదవ్‌ను విధుల నుంచి తొలగించి అతనిపై ఎస్టీ ఎ స్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సోమ వారం గిరిజన నాయకులు అటవీశాఖ కార్యాల యం ఎదుట ఆందోళన చేశారు. ఉన్నత అధికా రి స్థాయిలో ఉండి విచక్షణ కోల్పోయి ప్రవర్తించడం అన్యాయమని, అతనిపై జిల్లాస్థాయి అ ధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు. న్యాయం జరగకపోతే ఆందోళనలు ఉ ధ్రుతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎఫ్ఆర్వోపై చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్‌కు, సీపీ కార్తికేయకు పిటిషన్ అందించారు. ఆందోళనలో ఆలిండియా బంజారా సేవా సం ఘం జిల్లా అధ్యక్షుడు శ్రీహరి నాయక్, దళిత సంఘాల అధ్యక్షుడు సాయిలు, బంజారా సేవా సంఘం మండలాధ్యక్షుడు మోహన్ నాయక్,రమేష్ నాయక్ పాల్గొన్నారు. -
తిరుపతి అర్బన్ తహశీల్దార్‌పై అట్రాసిటీ కేసు
తిరుపతి అర్బన్ తహశీల్దార్‌పై ఆదివారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అలిపిరి ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి ఆటోనగర్‌లో నివాసం ఉంటున్న శ్రీరాములు ఈ సంవత్సరం మార్చి 18వ తేదీన అర్బన్ తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎస్సీ, ఎస్టీలకు ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వ భూములను కేటాయించాలని ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో అక్కడున్న అర్బన్ తహశీల్దార్ వెంకటేశ్వర్లు మరో 11మంది వీఆర్వోలు, ఆర్ఐలు చూస్తుండగా ఆందోళన చేస్తున్న తనను కులం పేరుతో దూషించారని శ్రీరాములు డీజీపీ జేవీ రాముడుకు ఫిర్యాదు చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు అర్బన్ తహశీల్దార్‌పై ఆదివారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే ఈ సంఘటన జరిగింది ముత్యాలరెడ్డిపల్లె పోలీస్‌స్టేషన్ పరిధిలో కావడంతో ఈ కేసును ఎమ్మార్‌పల్లి స్టేషన్‌కు బదిలీ చేస్తామని ఎస్సై తెలిపారు.