సాక్షి, నిజామాబాద్ : భీమ్‌గల్ మండలం చేంగల్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చేంగల్ గ్రామంలోకి ఎంజీ తండా, ధన తాండలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన గిరిజనులు భారీగా తరలివస్తున్నారు. దీంతో గ్రామంపై దాడికి యత్నిస్తారని భావించిన పోలీసులు వారిని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆగ్రహంతో ఉన్న గిరిజనులు గ్రామంలో ఆందోళన చేపట్టారు. పోలీసులతో వాగ్వావాదానికి దిగారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్పెషల్ పార్టీ పోలీసులను గ్రామంలో మొహరించారు. తమ వారిపై చేంగల్ గ్రామ ప్రజల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చేంగల్ గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ భయపడుతున్నారు. పిల్లలు, మహిళలు ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నఅసత్య వార్తల కారణంగా చేంగల్‌కు గ్రామస్తులు ఎంజీ తాండా, ధనబండ తాండాలకు చెందిన ఇద్దరు గిరిజనులను బీహార్‌కు చెందిన దొంగలుగా అనుమాన పడి కర్రలతో చితకబాదారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆర్మూరు, హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రులకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే నిమ్స్ లో చికిత్స పొందుతూ దేవ్యా అనే గిరిజనుడు మృతి చెందాడు. దీంతో ఆగ్రహంతో చేంగల్ గ్రామానికి తరలివచ్చి గిరిజనులు ఆందోళనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment