FRO
-
ఎఫ్ఆర్ఓ హత్యకేసులో ఇద్దరికి జీవితఖైదు
కొత్తగూడెంటౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం సృష్టించిన అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ఓ) శ్రీనివాసరావు హత్య కేసులో నిందితులు మడకం తుల, పొడియం నాగకు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ గురువారం తీర్పు చెప్పారు. జీవితఖైదుతో పాటు రూ.1000 చొప్పున జరిమానా విధించారు. ఏడు నెలల్లోపే ఈ విచారణ పూర్తి చేసి శిక్ష విధించడం గమనార్హం. ఏం జరిగిందంటే... జిల్లాలోని చండ్రుగొండ మండలం బెండాలపాడు పంచాయతీ పరిధి ఎర్రబోడులో ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన గొత్తికోయలు అటవీ భూముల్లో పోడు సాగు చేసుకుంటున్నారు. దీంతో ఆ భూములను అటవీ అధికారులు స్వా«దీనం చేసుకుని ప్లాంటేషన్ చేశారు. ఈ క్రమంలో గతేడాది నవంబర్ 22న గొత్తికోయలు ఆ భూముల్లో పశువులు మేపుతుండగా ప్లాంటేషన్ వాచర్ భూక్యా రాములు, బేస్ వాచర్ ప్రసాద్ అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది. ఈ విషయాన్ని వారు ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు దృష్టికి తేగా ఆయన రావికంపాడు సెక్షన్ అధికారి తేజావత్ రామారావుతో అక్కడికి వెళ్లారు. ఈ భూముల్లో పశువులు మేపొద్దని చెబుతూ.. వీడియో తీస్తుండగా గొత్తికోయలు మళ్లీ గొడవ పడ్డారు. ఈ క్రమంలో మడకం తుల, పొడియం నాగ వేట కొడవళ్లతో ఎఫ్ఆర్ఓ మెడపై నరికారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావును ఖమ్మం తరలిస్తుండగానే మృతిచెందారు. ఈ ఘటనపై నాటి చండ్రుగొండ ఎస్ఐ విజయలక్ష్మి, సీఐ వసంత్‌కుమార్ కేసు నమోదు చేయగా, 24 మంది సాక్షులను విచారించిన జడ్జి.. నేరం రుజువు కావడంతో నిందితులకు జీవితఖైదు విధిస్తూ తీర్పుచెప్పారు. కోర్టు తీర్పు నేపథ్యంలో శ్రీనివాసరావు కుటుంబసభ్యులు, అటవీ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
హత్యకు గురైన ఎఫ్ఆర్ఓ భార్యకు డీటీగా ఉద్యోగం
ఖమ్మంమయూరి సెంటర్: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎఫ్ఆర్ఓ చలమల శ్రీనివాసరావు భార్య భాగ్యలక్క్ష్మికి ప్రభుత్వం డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) గా ఉద్యోగం ఇచ్చింది. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన హరితోత్సవం సందర్భంగా ఆమెకు సీఎం కేసీఆర్ నియామక ఉత్తర్వులు అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎఫ్‌ఆర్‌ఓగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసరావును చండ్రుగొండు రేంజ్లో గుత్తికోయలు హత్య చేసిన విషయం విదితమే. దీంతో ప్రభుత్వం ఆయన కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేíషియాతో పాటు ఖమ్మంలో 500 గజాల స్థలాన్ని కేటాయించింది. ఇప్పుడు శ్రీనివాసరావు భార్య భాగ్యలక్ష్మికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇచ్చింది. ఈ సందర్భంగా ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ – తెలంగాణ చాప్టర్, అటవీ జూనియర్ ఫారెస్ట్ అధికారుల సంఘం, అటవీ క్షేత్రాధికారుల సంఘం, రాష్ట్ర అటవీ అధికారుల సంఘం, భారత అటవీ అధికారుల సంఘం ప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఎఫ్ఆర్ఓ చలమల శ్రీనివాసరావు కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు ఆయన భార్యకు డీటీగా ఉద్యోగం ఇవ్వడంపై మంత్రి పువ్వాడ అజయ్ హర్షం వ్యక్తం చేశారు. -
ఎఫ్ఆర్వో కుటుంబానికి పరిహారం అందజేత
రఘునాథపాలెం/సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రబోడులో ఇటీవల గొత్తి కోయల చేతిలో హత్యకు గురైన ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.50 లక్షల పరిహారం చెక్కును ఆయన భార్య భాగ్యలక్ష్మి, కూతురు, కుమారుడికి ఖమ్మం జిల్లా ఈర్ల పూడిలో అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు సోమవారం అందజే శారు. ఈ సందర్భంగా అటవీ శాఖ చీఫ్ కన్జర్వే టర్ (సీసీఎఫ్) భీమా నాయక్, ఖమ్మం, భద్రా ద్రి జిల్లాల డీఎఫ్ఓలు సిద్దార్థ విక్రమ్ సింగ్, రంజిత్ నాయక్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం మాట్లాడుతూ.. మంత్రి పువ్వా డ అజయ్‌కుమార్, శ్రీనివాసరావు కుటుంబానికి ఆర్థిక సహాయం వెంటనే అందేలా చొర వ తీసుకున్నారని చెప్పారు. శ్రీనివాసరావు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదు కుంటుందని భరోసా ఇచ్చారు. ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూ డా త్వరగా వచ్చేలా చర్యలు చేపడతామని హా మీ ఇచ్చారు. అనంతరం ఎఫ్ఆర్వో చిత్రపటా నికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఎంపీపీ గౌరి, తహసీల్దార్ నర్సింహారావు, ఎఫ్ఆర్ఓ రాధిక తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ సూచనలకు అనుగుణంగా తమ రోజువారి విధుల్లో నిమగ్నమైనట్టు తెలంగాణ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ జూనియర్ అటవీ అధికారుల సంఘం ఒక ప్రకటనలో వెల్లడించాయి. శ్రీనివాసరావు హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షిస్తామని భరోసా ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు సంఘాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాయి. అలాగే విధి నిర్వహణలో ఉన్న అటవీ ఉద్యోగుల రక్షణకు ముందుకు వచ్చి, క్షేత్ర స్థాయిలో సహకరిస్తున్న పోలీస్ శాఖకు, డీజీపీకి కూడా ధన్యవాదాలు తెలిపాయి. గొత్తికోయల చేతిలో హత్యకు గురైన ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కుటుంబానికి ప్రకటించిన మిగతా హామీలను కూడా సకాలంలో నెరవేర్చి ఆ కుటుంబానికి ఊరట కలిగించాలని విజ్ఞప్తి చేశాయి. ఎఫ్ఆర్వో భార్యకు డిప్యూటీ తహసీల్దార్ హోదా ఉద్యోగంతో పాటు, ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇంటి స్థలం ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని కోరాయి. శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెక్కును అందించిన స్థానిక ప్రజా ప్రతినిధులు, అటవీ అధికారులు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాయి. -
FRO పై దాడి చేసిన గొత్తికోయల గ్రామ బహిష్కరణ
-
పోడు సర్వేకు బ్రేక్.. విధులు బహిష్కరించిన అటవీ సిబ్బంది
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పోడు సర్వేకు బ్రేక్ పడింది. ఎఫ్ఆర్ఓ చలమల శ్రీనివాసరావు హత్యను నిరసి స్తూ అటవీశాఖ ఉద్యోగులు విధులను బహిష్కరించడంతో గ్రామసభలు నిలిచిపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శాఖ సిబ్బంది గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మంలో నల్లబ్యాడ్జీలు ధరించి ప్రదర్శన చేయడంతో పాటు డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. అలాగే గాందీచౌక్‌లోని గాంధీ విగ్రహానికి కూడా వినతిపత్రం ఇచ్చారు. ఇక శుక్రవారం నుంచి డివిజన్, జిల్లా స్థాయిలో ఆందోళనలకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా ఉద్యమం చేపట్టనున్నట్లు ఫారెస్ట్ రేంజర్స్ అసోసియేషన్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. అడవుల్లో విధులు నిర్వహించే తమ కు ఆయుధాలు ఇవ్వాలని, ప్రత్యేకంగా ఫారెస్ట్ స్టేష న్లు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిబ్బందిని పెంచడంతో పాటు ఎనిమిది గంటల పనివిధానం అమలు చేయాలని నినదించారు. అలాగే ఆర్ఓఎఫ్ఆర్ యాక్ట్‌ను బహిర్గతం చేయాల న్నారు. ఇక ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు హత్యకు సంబంధించిన దర్యాప్తును పారదర్శకంగా చేయా లని డిమాండ్ చేశారు. నిందితులను తామే పట్టు కుని పోలీసులకు అప్పగించినట్లు ఉద్యోగులు తెలిపారు. దరఖాస్తులపై గందరగోళం.. పోడు దరఖాస్తులపై గందరగోళం నెలకొంది. దర ఖాస్తుల స్వీకరణ గడువు తేదీని బహిర్గతం చేయకపోవడంతో ఇంకా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయని అటవీశాఖ యంత్రాంగం తెలిపింది. ప్రస్తుతం పోడు కొడుతూ దరఖాస్తులు చేసుకుంటున్నారని, దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పోడు సర్వే చివరి దశకు చేరిందని ప్రకటిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అటవీశాఖ సిబ్బంది చెబుతున్న సమస్యలను అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఇంతలోనే ఎఫ్ఆర్ఓ హత్య జరగడంతో వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది ఆందోళనలు పోడు సర్వేపై ప్రభావం చూపిస్తున్నాయి. పోడు సర్వేలో అటవీ సిబ్బంది కీలకం కాగా.. వీరు లేకుండా రెవెన్యూ, గ్రామ పంచాయతీ సిబ్బంది సర్వేకు వెళ్లే అవకాశాలు లేవు. ఇదీ చదవండి: Recession: ముందు నుయ్యి... వెనుక గొయ్యి -
కాళ్లమీద పడినా కర్కశంగా.. గొత్తికోయల దారుణ కృత్యం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చంద్రుగొండ: బెండాలపాడు అటవీ ప్రాంతంలో తమ ఆఫీసర్‌పై దాడి చేయొద్దని సహచర సిబ్బంది కాళ్లపై పడి మొక్కినా గొత్తి కోయలు కనికరించలేదు. వేటకొడవళ్లతో దాడి చేయడంతో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు మెడపై తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో కింద పడి ఉన్న ఎఫ్ఆర్ఓపై తులా వేటకొడవలితో దాడి చేస్తుండగా.. ‘మీ కాళ్లు మొక్కుతా, మా సార్‌ను ఏం చేయొద్దు.. మేము ఇక్కడి నుండి వెళ్లిపోతాం’అంటూ రామారావు వేడుకున్నారు. అయినా పట్టించుకోకుండా చేతిలోని పదునైన ఆయుధంతో శ్రీనివాసరావు మెడ, తల, గొంతుపై అదే పనిగా దాడి చేశాడు. మంగును వాచర్ రాములు నిలువరించే ప్రయత్నం చేశాడు. అయితే ఆవేశంగా ఉన్న వారిద్దరినీ నిలువరించడం సాధ్యం కాక శ్రీనివాసరావును అక్కడే వదిలి రామారావు, రాములు తదితరులు ప్లాంటేషన్ నుంచి బయటకు పరుగులు తీశారు. పోలీసులు, అటవీ సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకునే వరకు సుమారు గంట పాటు ఎఫ్ఆర్ఓ రక్తపుమడుగులోనే ఉన్నారు. ఆ తర్వాత కారులో మధ్యాహ్నం 1:56 గంటల ప్రాంతంలో చంద్రుగొండ ప్రాథమిక ఆస్పత్రికి, ఆ తర్వాత ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. జీపులో వెళ్లుంటే..: ఫారెస్ట్ ఆఫీసర్‌గా కేటాయించిన జీపులోనే శ్రీనివాసరావు ఎక్కువగా ఫీల్డ్ విజిట్‌కు వెళ్తుంటారు. కొత్తగూడెం నుంచి చంద్రుగొండకు తన కారులో వచ్చి అక్కడి నుంచి ఫారెస్ట్ జీపులో అడవిలోకి వెళ్లడం ఆయనకు అలవాటు. జీపులో తనతో పాటు సిబ్బందిని తీసుకెళ్లేవారు. కానీ, మంగళవారం ఆయన బైక్ మీద ఫీల్డ్ విజిట్‌కు వెళ్లడం, ఆయన వెంట ఒక్కరే సిబ్బంది ఉండడంతో ఆయనపై పగ పెంచుకుని అదను కోసం చూస్తున్న గొత్తికోయలు తేలికగా దాడి చేయగలిగారని అటవీ సిబ్బంది చెబుతున్నారు. పచ్చదనమే ప్రాణంగా బతికారు పచ్చదనమే ప్రాణంగా బతికిన సిన్సియర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాసరావు చివరకు ఆ పచ్చని చెట్ల మధ్యే ప్రాణాలు వదిలారు. అడవుల రక్షణే ఊపిరిగా జీవించిన ఆయన చివరకు విధి నిర్వహణలో తుదిశ్వాస విడిచారు. శ్రీనివాసరావు సహజంగానే అడవులంటే ప్రేమ కలిగిన ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఎక్కడ పని చేసినా పోడు వ్యవసాయాన్ని అరికట్టడంతో పాటు అడవులు పెంచడంపై శ్రద్ధ చూపించేవారు. ఈ క్రమంలో అటవీ శాఖ నుంచి గోల్డ్ మెడల్ సైతం అందుకున్నారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండే ఆయన వ్యక్తిగతంగా మాత్రం చాలా సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన రేంజ్లో ఎవరూ ఒక పుల్లను కూడా అడవిని నుంచి బయటకు తీసుకువెళ్లలేరనే విధంగా పేరు సంపాదించారని, అలాంటి ఆయన ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమని తోటి అధికారులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: ఎఫ్ఆర్వో మృతి.. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన.. దోషులను కఠినంగా శిక్షిస్తామన్న సీఎం కేసీఆర్ -
వేట.. పేలుతున్న తూటా
రుద్రవరం: అధికారుల కన్నుకప్పి కొందరు నల్లమల అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల వేట సాగిస్తున్నారు. వన్యప్రాణుల మాంసానికి, చర్మానికి మంచి డిమాండు ఉండటంతో రహస్యంగా వేట కొనసాగిస్తున్నారు. కొందరు నాటు తుపాకులతో వేటాడుతుండగా, ఇంకొందరు ఉచ్చులు బిగించి వాటిలో చిక్కిన వన్యప్రాణులను హతమార్చి.. వాటి మాంసాన్ని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కర్నూలు జిల్లాలోని రుద్రవరం, చెలిమ రేంజి పరిధిల్లో ఈ తతంగం సాగుతోంది. నేల రాలుతున్న జింకలు నంద్యాల డివిజన్లో రుద్రవరం, చెలిమ రేంజిలలో వేలాది హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఆళ్లగడ్డ, రుద్రవరం, శిరివెళ్ల, చాగలమర్రి మండలాల్లోని పలు గ్రామాలు అటవీ ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్నాయి. ఆయా గ్రామాల వారంతా అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆత్మరక్షణ నిమిత్తం కొందరు నాటు తుపాకులు, వేట కొడవళ్లు కలిగి ఉన్నారు. కాలక్రమేణా వాటిని జంతువులను వేటాడేందుకు వినియోగిస్తున్నారు. వీరు ఆయుధాలతో రహస్యంగా అడివిలోకి వెళ్లి వన్య ప్రాణులను ప్రధానంగా జింకలను హతమార్చుతున్నారు. మాంసాన్ని బయటకు తరలించి కిలో రూ.500 ప్రకారం విక్రయిస్తున్నా రని సమాచారం. నామమాత్రపు దాడులు వేటగాళ్ల చేతుల్లో జింకలు మృత్యువాత పడుతున్నా అటవీ అధికారులు మాత్రం తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎవరైనా సమాచారం అందిస్తే నామమాత్రపు దాడులు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రుద్రవరం మండలం హరినగరం వద్ద బహిరంగంగా వన్యప్రాణి మాంసాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడిచేసి నిందితులను వదిలిపెట్టి కేవలం మాంసాన్ని స్వాధీనం చేసుకొని ఆపై అగ్నిలో కాల్చివేశారు. అదే గ్రామంలో ఓ నాటు తుపాకీ కూడా లభించింది. అయినప్పటికీ నిందితుడికి సరైన శిక్ష వేయించలేక పోయారు. అటవీ ప్రాంతంలో మరో నాటు తుపాకీ దొరికినట్లు చూపించారు. అలాగే ఇటీవలే గోస్పాడు మండలం దీబగుంట్ల వద్ద ఇరువురు నిందితులు జింక మాంసంతో పట్టుబడ్డారు. వారిని విచారించగా ఆళ్లగడ్డ మండలం పెద్దకందుకూరు మెట్ట ఆల్ఫా కళాశాల సమీపంలో జింకను వేటాడినట్లు చెప్పారు. కొరవడిన సంరక్షణ వన్య ప్రాణులు అటవీ ప్రాంతంలో జీవించలేక బయటకు వచ్చి మృత్యువాత పడుతున్నాయి. ప్రధానంగా రుద్రవరం మండలంలోని ఆర్.నాగులవరం, చందలూరు, తువ్వపల్లె, టీ.లింగందిన్నె, పేరూరు, శ్రీరంగాపురం, పెద్దకంబలూరు, అప్పనపల్లె, ఆళ్లగడ్డ మండలం ఓబులంపల్లె, నల్లగట్ల, కందుకూరు, చింతకొమ్మదిన్నె, మిట్టపల్లె, చాగలమర్రి మండలం ముత్యాలపాడు, బోదనం తదితర ప్రాంతాలలో జింకల సంచారం అధికంగా ఉంటోంది. అటువంటి ప్రదేశాల్లో అధికారుల నిఘా కొరవడటంతో వేట యథేచ్ఛగా సాగుతోంది. మిట్టపల్లె సమీపంలోని ఎర్రచెరువు వద్ద తెలుగు గంగ 28వ బ్లాక్ ఉప ప్రధాన కాల్వలో ఒకే ప్రదేశంలో వరుసగా రెండు పెద్ద పులులు మృతి చెందాయి. వాటి మృతికి కారణాలు ఇంత వరకు కనుగొన లేకపోయారు. మిట్టపల్లె, నల్లగట్ల ప్రాంతాల్లో జింకల కళేబరాలు లభించాయి. ఇలా విచ్చలవిడిగా వేట సాగుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వన్య ప్రాణులు, అడవి జంతువుల సంరక్షణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అందుబాటులో ఉండని సిబ్బంది నల్లమల అటవీ ప్రాంతాన్ని సంరక్షిస్తామని బాధ్యతలు చేపట్టిన అటవీ అధికారులు అడవికి 20, 40 కిలోమీటర్ల దూరంలోని ఆళ్లగడ్డ, నంద్యాల వంటి పట్టణాల్లో నివాసాలు ఉంటున్నారు. పగటిపూట మాత్రం కార్యాలయాలు, ఠాణాల వద్ద అటుఇటు కలియతిరిగి వెళ్తున్నారు. రాత్రి సమయాల్లో అటవీ సంరక్షణ గాలికి వదిలేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వన్యప్రాణులను వేటాడితే జైలే వేట కారణంగా నేలకొరుగుతున్న వన్య ప్రాణులపై రుద్రవరం రేంజి అధికారి శ్రీపతి నాయుడును వివరణ కోరగా వన్య ప్రాణులను వేటాడితే జైలుశిక్ష ఖాయమని హెచ్చరించారు. ఇటీవల జరిగిన పలు సంఘటనలతో అటవీ శాఖ అప్రమత్త మయ్యిందన్నారు. ఇందులో భాగంగానే నల్లమల అటవీ ప్రాంతంలో రహస్యంగా ట్రాప్ కెమెరాలు అమర్చామన్నారు. అలాగే వేట సాగే పలు ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. అలాగే గ్రామాల్లో వన్య ప్రాణులను వేటాడితే కేసులు, పడే శిక్షలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఫారెస్టు గదులు సక్రమంగా లేకçపోవడం వల్లే సమీప పట్టణాల్లో సిబ్బంది నివాసముంటున్నారని తెలిపారు. -శ్రీపతి నాయుడు, రుద్రవరం రేంజి అధికారి -
కాగజ్‌నగర్ ఎఫ్ఆర్వోకు గోల్డ్‌మెడల్
సాక్షి, కాగజ్‌నగర్ : మురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ఫారెస్ట్ రేంజి అధికారి ఛోలె అనిత కేవీఎస్ బాబు మెమోరియల్ గోల్డ్‌మెడల్ అవార్డుకు ఎంపికైనట్లు కాగజ్‌నగర్ ఎఫ్డీఓ రాజరమణారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఫారెస్ట్ ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆర్.శోభ పంపించిన ఉత్తర్వుల ప్రకారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని దూలపల్లి అటవీ శిక్షణ అకాడమీ ప్రాంగణంలో ఈ అవార్డు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. అవార్డుతో పాటు రూ.15వేల నగదు, ప్రశంసపత్రం అందిస్తారన్నారు. 2018 జూన్ 30 నుంచి ఈ ఏడాది జూన్ 30 వరకు కాగజ్‌నగర్ రేంజిలో అనేక సవాళ్లను ఎదుర్కొందన్నారు. చింతగూడలో అక్రమ కలప వ్యాపారాన్ని అరికట్టడంలో ఆమె ధైర్య సాహసాలు ప్రదర్శించిందని, గార్లపేట రిజర్వు ఫారెస్ట్‌లో 2013 నుంచి పోడు భూమిలో వ్యవసాయం చేసుకుం టున్న 16 మంది గిరిజ న గోండు గ్రామస్తులను తొలగించడంలో ప్రము ఖ పాత్ర పోషించిందన్నారు. ఆమె ధైర్య సాహసాలను పరిగణలోకి తీసుకొని ఫారెస్ట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేసిన సిఫార్సులను దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారులు ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు చెప్పారు. -
అనితను పరామర్శించిన మంత్రి
సాక్షి, బోథ్: పోడు భూముల సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, త్వరలోనే సీఎం కేసీఆర్ ఈ సమస్యను పరిష్కరిస్తారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. బోథ్ మండలం కోర్టా(కే) గ్రామంలో, గాయపడిన కాగజ్ నగర్ అటవీ రేంజ్ ఆఫీసర్ అనితను మంత్రి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని.. అధైర్యపడవద్దని అనితను, ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. ధైర్యంగా నిలబడి దాడిని ఎదుర్కొని, అనిత తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించిందని కొనియాడారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని, దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అడవుల నరికివేత, ఆక్రమణల వల్ల పర్యావరణం దెబ్బతింటోందని... అడవులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తించాలన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవన్న, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, ఎంపీపీ తుల శ్రీనివాస్, టీఆర్ఎస్ నేతలు అనిల్ జాదవ్, మల్లికార్జున్ రెడ్డి, జివి రమణ, పాకాల రాంచందర్, అటవీ శాఖ అధికారులు ఉన్నారు. -
ఎఫ్ఆర్వోపై చర్యలు తీసుకోవాలి
ఇందల్వాయి: మండలంలోని నల్లవెల్లి గ్రామ పరిధి స్టేషన్ తంగాలో గత శనివారం మేకలు మేపుకోవడానికి అడవిలోకి వెళ్తున్న గిరిజనుడిపై అడవులకు నిప్పు పెడుతున్నావని దాడి చేసి కొట్టిన ఇందల్వాయి రేంజ్ అధికారి సుభాష్ చంద్ర యాదవ్‌ను విధుల నుంచి తొలగించి అతనిపై ఎస్టీ ఎ స్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సోమ వారం గిరిజన నాయకులు అటవీశాఖ కార్యాల యం ఎదుట ఆందోళన చేశారు. ఉన్నత అధికా రి స్థాయిలో ఉండి విచక్షణ కోల్పోయి ప్రవర్తించడం అన్యాయమని, అతనిపై జిల్లాస్థాయి అ ధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు. న్యాయం జరగకపోతే ఆందోళనలు ఉ ధ్రుతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎఫ్ఆర్వోపై చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్‌కు, సీపీ కార్తికేయకు పిటిషన్ అందించారు. ఆందోళనలో ఆలిండియా బంజారా సేవా సం ఘం జిల్లా అధ్యక్షుడు శ్రీహరి నాయక్, దళిత సంఘాల అధ్యక్షుడు సాయిలు, బంజారా సేవా సంఘం మండలాధ్యక్షుడు మోహన్ నాయక్,రమేష్ నాయక్ పాల్గొన్నారు. -
ఎఫ్ఆర్ఓ హత్య కేసులో దూకుడు తగ్గించిన పోలీసులు
సాక్షి, నిజామాబాద్ : ఇందల్వాయి ఎఫ్ఆర్ఓ రొడ్డ గం గయ్య ఈ నెల 14వ తేదీన నల్లవెల్లి అటవీ ప్రాంతంలో హత్యకు గురైన విష యం తెలిసిందే. భూ ఆక్రమణదారులు పథకం ప్రకారం గొడ్డళ్లతో దాడి చేసి దారుణంగా చంపారు. అటవీ శాఖ ఉన్నతాధికారి హత్యకు గురికావడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. 36 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు 33మందిని అరెస్టు చేశారు. మొదట 11 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ మోహన్‌రావు ఈ నెల 23న ప్రకటించారు. ఆ త ర్వాత మరో 22 మందిని అరెస్టు చేసినట్లు కేసు విచారణాధికారి, నిజామాబాద్ డీఎస్పీ అనిల్‌కుమార్ 25న డిచ్‌పల్లిలో ప్రకటించారు. అయితే, ఈ ఘటనతో ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీపీఎం నేతలిద్దరిని మాత్రం ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. గంగయ్య హత్యకు దారితీసేలా సీపీఎం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, ఆ పార్టీ మహిళా నేత జమున స్థానికులను పురిగొల్పారని పోలీసులు నిర్ధారించారు. వీరు ఘటనలో ప్రత్యక్షంగా కూడా పాల్గొన్నట్లు తమ దర్యాప్తు లో తేలిందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. పెద్ది వెంకట్రాములు, జమునలకు హత్య కేసుతో ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఎస్పీ మోహన్‌రావు సైతం ప్రకటించారు. అయితే హత్య జరిగి 15 రోజులు గడిచినా వీరి ని అరెస్టు చేయలేదు. వీరితో పాటుగా అటవీ భూమి ఆక్రమణకు సహకరించిన ట్రాక్టర్ యజ మానిని కూడా అరెస్టు చేయాల్సి ఉంది. వీరిని అరెస్టు చేయకపోవడంతో హత్య కేసు దర్యాప్తులో జిల్లా పొలీసులు ప్రారంభంలో చూపిన దూకుడు ఇప్పుడు తగ్గించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. పరారీలో ఉన్నారు -అనిల్‌కుమార్, నిజామాబాద్ డీఎస్పీ ఎఫ్ఆర్ఓ హత్య కేసులో ఇప్పటి వరకు 33 మందిని అరెస్టు చేశాం. నిందితులుగా ఉన్న సీపీఎం నేతలిద్దరు దొరకడం లేదు. ప్రత్యేక బృందాలు వారికోసం గాలిస్తున్నాయి. కేసు దర్యాప్తులో రాజకీయ ఒత్తిళ్లేమీ లేవు -
ఎఫ్ఆర్ఓ హత్య కేసులో దూకుడు తగ్గించిన పోలీసులు
సంచలనం సృష్టించిన ఎఫ్ఆర్ఓ రొడ్డ గంగయ్య హత్య కేసులో పురోగతి కరువైంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన సీపీఎం నాయకులు ఇద్దరిని ఇప్పటివరకు అరెస్టు చేయలేదు. దీంతో పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి దూకుడు తగ్గించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షి, నిజామాబాద్ : ఇందల్వాయి ఎఫ్ఆర్ఓ రొడ్డ గం గయ్య ఈ నెల 14వ తేదీన నల్లవెల్లి అటవీ ప్రాంతంలో హత్యకు గురైన విష యం తెలిసిందే. భూ ఆక్రమణదారులు పథకం ప్రకారం గొడ్డళ్లతో దాడి చేసి దారుణంగా చంపారు. అటవీ శాఖ ఉన్నతాధికారి హత్యకు గురికావడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. 36 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు 33మందిని అరెస్టు చేశారు. మొదట 11 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ మోహన్‌రావు ఈ నెల 23న ప్రకటించారు. ఆ త ర్వాత మరో 22 మందిని అరెస్టు చేసినట్లు కేసు విచారణాధికారి, నిజామాబాద్ డీఎస్పీ అనిల్‌కుమార్ 25న డిచ్‌పల్లిలో ప్రకటించారు. అయితే, ఈ ఘటనతో ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీపీఎం నేతలిద్దరిని మాత్రం ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. గంగయ్య హత్యకు దారితీసేలా సీపీఎం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, ఆ పార్టీ మహిళా నేత జమున స్థానికులను పురిగొల్పారని పోలీసులు నిర్ధారించారు. వీరు ఘటనలో ప్రత్యక్షంగా కూడా పాల్గొన్నట్లు తమ దర్యాప్తు లో తేలిందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. పెద్ది వెంకట్రాములు, జమునలకు హత్య కేసుతో ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఎస్పీ మోహన్‌రావు సైతం ప్రకటించారు. అయితే హత్య జరిగి 15 రోజులు గడిచినా వీరి ని అరెస్టు చేయలేదు. వీరితో పాటుగా అటవీ భూమి ఆక్రమణకు సహకరించిన ట్రాక్టర్ యజ మానిని కూడా అరెస్టు చేయాల్సి ఉంది. వీరిని అరెస్టు చేయకపోవడంతో హత్య కేసు దర్యాప్తులో జిల్లా పొలీసులు ప్రారంభంలో చూపిన దూకుడు ఇప్పుడు తగ్గించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. పరారీలో ఉన్నారు -అనిల్‌కుమార్, నిజామాబాద్ డీఎస్పీ ఎఫ్ఆర్ఓ హత్య కేసులో ఇప్పటి వరకు 33 మందిని అరెస్టు చేశాం. నిందితులుగా ఉన్న సీపీఎం నేతలిద్దరు దొరకడం లేదు. ప్రత్యేక బృందాలు వారికోసం గాలిస్తున్నాయి. కేసు దర్యాప్తులో రాజకీయ ఒత్తిళ్లేమీ లేవు.