ఖమ్మంమయూరి సెంటర్: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎఫ్‌ఆర్‌ఓ చలమల శ్రీనివాసరావు భార్య భాగ్యలక్క్ష్మికి ప్రభుత్వం డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) గా ఉద్యోగం ఇచ్చింది. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన హరితోత్సవం సందర్భంగా ఆమెకు సీఎం కేసీఆర్ నియామక ఉత్తర్వులు అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎఫ్‌ఆర్‌ఓగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసరావును చండ్రుగొండు రేంజ్‌లో గుత్తికోయలు హత్య చేసిన విషయం విదితమే.
దీంతో ప్రభుత్వం ఆయన కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేíషియాతో పాటు ఖమ్మంలో 500 గజాల స్థలాన్ని కేటాయించింది. ఇప్పుడు శ్రీనివాసరావు భార్య భాగ్యలక్ష్మికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇచ్చింది. ఈ సందర్భంగా ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ – తెలంగాణ చాప్టర్, అటవీ జూనియర్ ఫారెస్ట్ అధికారుల సంఘం, అటవీ క్షేత్రాధికారుల సంఘం, రాష్ట్ర అటవీ అధికారుల సంఘం, భారత అటవీ అధికారుల సంఘం ప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఎఫ్‌ఆర్‌ఓ చలమల శ్రీనివాసరావు కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు ఆయన భార్యకు డీటీగా ఉద్యోగం ఇవ్వడంపై మంత్రి పువ్వాడ అజయ్ హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment