సాక్షి, నిజామాబాద్ :
ఇందల్వాయి ఎఫ్‌ఆర్‌ఓ రొడ్డ గం గయ్య ఈ నెల 14వ తేదీన నల్లవెల్లి అటవీ ప్రాంతంలో హత్యకు గురైన విష యం తెలిసిందే. భూ ఆక్రమణదారులు పథకం ప్రకారం గొడ్డళ్లతో దాడి చేసి దారుణంగా చంపారు. అటవీ శాఖ ఉన్నతాధికారి హత్యకు గురికావడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. 36 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు 33మందిని అరెస్టు చేశారు. మొదట 11 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ మోహన్‌రావు ఈ నెల 23న ప్రకటించారు. ఆ త ర్వాత మరో 22 మందిని అరెస్టు చేసినట్లు కేసు విచారణాధికారి, నిజామాబాద్ డీఎస్‌పీ అనిల్‌కుమార్ 25న డిచ్‌పల్లిలో ప్రకటించారు. అయితే, ఈ ఘటనతో ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీపీఎం నేతలిద్దరిని మాత్రం ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
గంగయ్య హత్యకు దారితీసేలా సీపీఎం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, ఆ పార్టీ మహిళా నేత జమున స్థానికులను పురిగొల్పారని పోలీసులు నిర్ధారించారు. వీరు ఘటనలో ప్రత్యక్షంగా కూడా పాల్గొన్నట్లు తమ దర్యాప్తు లో తేలిందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. పెద్ది వెంకట్రాములు, జమునలకు హత్య కేసుతో ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఎస్‌పీ మోహన్‌రావు సైతం ప్రకటించారు. అయితే హత్య జరిగి 15 రోజులు గడిచినా వీరి ని అరెస్టు చేయలేదు. వీరితో పాటుగా అటవీ భూమి ఆక్రమణకు సహకరించిన ట్రాక్టర్ యజ మానిని కూడా అరెస్టు చేయాల్సి ఉంది. వీరిని అరెస్టు చేయకపోవడంతో హత్య కేసు దర్యాప్తులో జిల్లా పొలీసులు ప్రారంభంలో చూపిన దూకుడు ఇప్పుడు తగ్గించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
పరారీలో ఉన్నారు
-అనిల్‌కుమార్, నిజామాబాద్ డీఎస్‌పీ
ఎఫ్‌ఆర్‌ఓ హత్య కేసులో ఇప్పటి వరకు 33 మందిని అరెస్టు చేశాం. నిందితులుగా ఉన్న సీపీఎం నేతలిద్దరు దొరకడం లేదు. ప్రత్యేక బృందాలు వారికోసం గాలిస్తున్నాయి. కేసు దర్యాప్తులో రాజకీయ ఒత్తిళ్లేమీ లేవు
ఎఫ్‌ఆర్‌ఓ హత్య కేసులో దూకుడు తగ్గించిన పోలీసులు
Published Tue, Oct 1 2013 2:21 AM | Last Updated on Wed, Sep 26 2018 5:59 PM
Advertisement