సాక్షి, నిజామాబాద్ : ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ గంగయ్య దారుణ హత్య తో అటవీశాఖ సిబ్బం దిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. భూఆ క్రమణదారులు, కలప స్మగ్లర్లు దారుణాలకు ఒడిగడుతుండటంతో ధైర్యం సడలిపోతున్నారు. ఎఫ్‌ఆర్‌ఓ స్థాయి ఉన్నతాధికారినే హతమార్చితే తమ పరిస్థితి ఏంటని ఆశాఖ క్షేత్ర స్థా యి సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. వీరిలో ఆత్మస్థైర్యం నిం పేందుకు ఆశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారిం చారు. ఈ మేరకు ఇందల్‌వాయి రేంజ్ కార్యాలయం లో ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కామారెడ్డి డీఎఫ్‌ఓ నాగేశ్వర్‌రావు వంటి ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
మరోవైపు గం గయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎక్స్‌గ్రేషియాతో పాటు, గంగయ్య సర్వీసు ఉన్నంతకాలం పూర్తి వేతనాన్ని ఆయన కుటుంబానికి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వేతన చెల్లింపుతోపాటు, గంగయ్య కుమారునికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనే ప్రతిపాద న ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందని జూనియర్ ఫారెస్టు ఆఫీసర్స్ అసోసియోషన్ డివిజన్ అధ్యక్షులు బాబు పేర్కొన్నారు. త్వరలోనే ప్రభుత్వం ఈ నిర్ణ యం తీసుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నా రు. 1967 నాటి అటవీచట్టాలను మార్చి కఠినతరం చేయాలని, 1972 వన్యప్రాణుల చట్టాన్ని కూడా సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాలపై ఇప్పటికే ముఖ్యమంత్రి, ఆశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ స్థాయిల్లో సమావేశాలు జరిగాయన్నారు.తొందరలో నే తుది నిర్ణయం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
స్మారక స్థూపం నిర్మాణం..
నల్లవెల్లి ఘటన నేపథ్యంలో అటవీశాఖ అమరవీరుల స్థూపాన్ని నిర్మించాలని ఆశాఖ ఉద్యోగులు భావిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో ఉద్యోగులు తమ సొంత ఖర్చులతో ఈ స్థూపం నిర్మా ణం చేపట్టనున్నారు. స్థూపంపై గంగయ్యతో పాటు మరో ఇద్దరు విధి నిర్వహణలో అసువులు బాసిన వారి పేర్లు పెట్టాలని నిర్ణయించారు. నిజామాబాద్ సర్కిల్ పరిధిలో మరో ఇద్దరు అటవీ అధికారులు విధి నిర్వహణలో అసువులు బాసారు. 1984లో కామారెడ్డి రేంజ్ (సదాశివనగర్ మండలం రామారెడ్డి గ్రామ శివారు) పరిధిలో అక్బర్ అలీ అనే సెక్షన్ ఆఫీసర్ విధి నిర్వహణలో మృత్యువాతపడ్డారు. నక్సల్స్ తూటాలకు ఆయన నేలకొరిగారు. సుమారు ఎని మిది నెలల క్రితం నిజామాబాద్ సర్కిల్ పరిధిలోకి వచ్చే మెదక్ జిల్లా కల్హేర్ మండలంలో అక్కడి బీట్ ఆఫీసర్ ధరావత్‌పూల్‌సింగ్‌ను స్మగ్లర్లు సజీవదహనం చేశారు. నిర్మించబోయే ఈ స్థూపంపై ఈ ముగ్గురు పేర్లను పెట్టాలనుకుంటున్నారు.
ఎఫ్‌ఆర్‌ఓ గంగయ్య హత్యపై అటవీశాఖలో సర్వత్రా ఆందోళన
Published Sun, Sep 22 2013 5:11 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM
Advertisement
Advertisement