Gangaiah
-
దొంగ ఓట్లు వేసే ఛాన్సే లేదు..
-
విశాఖ ఎన్కౌంటర్: పెద్దపల్లి జిల్లాలో విషాదం
-
విశాఖ ఎన్కౌంటర్: పెద్దపల్లి జిల్లాలో విషాదం
సాక్షి, పెద్దపల్లి: విశాఖ ఏజెన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో పెద్దపల్లి జిల్లాలో విషాదం అలుముకుంది. ఈ కాల్పుల్లో ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన మావోయిస్టు కీలక నేత సందె గంగయ్య మృతి చెందారు.కాగా విశాఖపట్నం జిల్లాలోని కొయ్యూరు మండలం మంప పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలమెట్ట వద్ద గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. అందులో మావోయిస్టు పార్టీ డీసీఎంగా కొనసాగుతున్న అశోక్ అలియాస్ సందె గంగయ్య కూడా ఉన్నాడు. ఇతనికి తల్లి, నలుగురు సోదరులు ఉన్నారు. గంగయ్య సోదరుడు రాజయ్య సైతం 1996లో ఎన్కౌంటర్లో మరణించాడు. ఇక 1999లో నక్సల్ ఉద్యమంలో చేరిన గంగయ్య మావోయిస్ట్ డీసీఎం కమాండర్‌గా ఎదిగాడు. ఓదెల మండలంలోనే 7వ తరగతి వరకు చదువుకున్నాడు. తన కొడుకు గంగయ్య ఎన్కౌంటర్లో మృతిచెందాడన్న సమాచారం తల్లి అమృతమ్మకు తెలియడంతో ఆమె బోరున విలపించారు. ఇది వరకు రెండు మూడు సార్లు ఎన్కౌంటర్ అయినట్లు సమాచారం వచ్చినప్పటికీ నమ్మలేదని, ప్రస్తుతం పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఎన్కౌంటర్లో అమరుడైనట్లు భావిస్తున్నామని సోదరుడు తెలిపారు. మృతదేహాన్ని తీసుకురావడానికి వైజాగ్ వెళ్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: విశాఖలో భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి మృతులను గుర్తించిన పోలీసులు కాగా తీగలమెట్ట అటవీప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతులను పోలీసులు గుర్తించారు. వీరిలో ముగ్గురు మహిళా మావోయిస్టు కూడా ఉన్నారు. డిప్యూటీ కమాండర్ సందే గంగయ్య కూడా మృతుల్లో ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. మరో డీసీఎం రణ దేవ్, పైకే, లలితలను గుర్తించారు. మరో మహిళ మావోయిస్ట్‌ను గుర్తించాల్సి ఉంది. -
టాలీవుడ్లో మరో విషాదం.. నాగార్జున ‘సంకీర్తన’నిర్మాత మృతి
టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. కరోనా కారణంగా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు మృతి చెందగా, తాజాగా అనారోగ్యంతో నిర్మాత డాక్టర్ యం.గంగయ్య రాజమండ్రిలో కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో బుధవారం ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంభ సభ్యులు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించిన ‘సంకీర్తన’ మూవీకి గంగయ్య నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ద్వారా గీతాకృష్ణ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇళయరాజా స్వరాలు సమకూర్చిన 'సంకీర్తన' మ్యూజికల్ హిట్ గా నిలిచింది. -
భగ్గుమన్న ముఠా కక్షలు
► వైఎస్సార్ జిల్లాలో వ్యక్తి దారుణహత్య రామాపురం(వైఎస్ఆర్ జిల్లా): వైఎస్సార్ కడపజిల్లాలో మరో హత్య జరిగింది. పాతకక్షల నేపధ్యంలో జరిగిన దాడుల్లో రామాపురం మండలం చిట్లూరు గ్రామంలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన గంగయ్యను గుర్తుతెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో కిరాతకంగా నరికారు. దీంతో గంగయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు చిట్లూరు ఎంపీటీసీ లక్ష్మీదేవమ్మకు సమీప బంధువు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన గోలీలాట
తొట్టంబేడు : సరదా కోసం మొదలుపెట్టిన గోళీలాట ఓ బాలుడి నిండు ప్రాణాల్ని బలిగొంది. ఆటలో ఏర్పడ్డ వివాదం కాస్త పెద్ద కావడం..ఇద్దరు బాలురు పరస్పరం కొట్టుకోవడంతో గంగయ్య అనే బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుగంగ కాలనీలో చోటు చేసుకుంది. టూటౌన్ పోలీసుల కథనం మేరకు..శ్రీకాళహస్తి మండలం, అక్కుర్తి గ్రామానికి చెందిన రేణుక, తిరుపాల్ కుమారుడు గంగయ్య(16) శ్రీకాళహస్తి పట్టణంలోని తన తాత రాజులయ్య ఇంట్లో చాలా కాలంగా ఉంటున్నాడు. గురువారం కాలనీలోని తోటి స్నేహితులతో కలిసి మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో గోళీలాట ఆడేందుకు ఉపక్రమించారు. గోళీలాటలో గంగయ్యకు మరో యువకుడికి మధ్య వివాదం ఏర్పడింది. వివాదం పెద్దదికావడంతో ఇద్దరు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. ఈ సమయంలో గంగయ్య అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గంగయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. గంగయ్య మృతికి కారణమైన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఈశ్వరయ్య తెలిపారు. -
టీసీ అసభ్య ప్రవర్తన
ఒంగోలు: చెన్నై - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికురాలి పట్ల టికెట్ కలెక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఒంగోలు రైల్వే స్టేషన్ లో సోమవారం ఉదయం కేసు నమోదైంది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లున్న ఎక్స్ ప్రెస్‌లో టీసీ గంగయ్య తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఒంగోలు జిల్లాకు చెందిన ఓ మహిళ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం తెలుసుకున్న టీసీ పరారయ్యాడు. ఈ మేరకు ఒంగోలు పట్టణంలోని రైల్వే పోలీసులు టీసీ గంగయ్యను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. -
ఏసీబీకి చిక్కిన ల్యాండ్ సర్వే ఇన్స్పెక్టర్
నిజామాబాద్ క్రైం : భూమి కొలతలు తీసి ఇచ్చేందుకు రైతు నుంచి లంచం డబ్బులు తీసుకుంటూ ల్యాండ్ సర్వే ఇన్స్పెక్టర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కడం ఇక్కడ కలకలం సృష్టించింది. డిచ్పల్లి మండలం యానంపల్లి గ్రామానికి చెందిన రైతు మోత్కూరి తిరుమలేశ్గౌడ్ 2012లో 10 ఎకరాల పట్టా భూమి కొనుగోలు చేశాడు. ఇందులో తన పేరిట ఐదు ఎకరాలు, భార్య శైలజ పేరిట ఐదు ఎకరాల మూడు గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ భూములకు హద్దులు సక్రమంగా లేకపోవటంతో తిరుమలేశ్ గత జనవరి 30న జిల్లా కేంద్రంలోని లాండ్ సర్వే కార్యాలయం అధికారులను సంప్రదిం చాడు. అధికారుల సూచన మేరకు చాలన్ కూడ కట్టాడు. మూడు నెలల పాటు కార్యాలయం చుట్టూ తిరిగినా పని కాక పోవటంతో తిరుమలేశ్ చివరకు కార్యాలయంలోని ల్యాండ్ సర్వే ఇన్స్పెక్టర్ గంగయ్యను కలిశాడు. ఆయన ఎకరానికి రూ. 15 వేల చొప్పు న మొత్తం 10 ఎకరాలకు రూ. 1.50లక్షలు లంచంగా ఇస్తేనే భూమి కొలతలు తీసిస్తానని స్పష్టం చేశాడు. చివరకు ఇద్దరి మధ్య లక్ష రూపాయ లకు ఒప్పం దం కుదిరింది. ఒప్పందం మేరకు తిరుమలేశ్ గత మార్చిలో రూ. 50 వేలు నగరంలోని విజయ టాకీస్ వద్ద గంగయ్య కు ఇచ్చాడు. మరికొన్ని రోజుల తర్వాత విజయటాకీస్ వద్దే మరో రూ. 15 వేలు చెల్లించాడు. అనంతరం మరో రూ.15 వేలు ల్యాండ్ సర్వే కార్యాలయం సమీపంలోని గాయత్రి మెస్‌లో చెల్లించా డు. ఇలా మొత్తం రూ. 80 వేలు గంగయ్యకు రైతు ముట్టచెప్పాడు. వారం క్రితం ల్యాండ్ సర్వే కార్యాలయానికి వెళ్లి మిగిలిన రూ. 20 వేలు భూమి కొలతలు తీశాక ఇస్తానని రైతు చెప్పగా అందుకు గంగయ్య ఒప్పుకోలేదు. దీంతో తిరుమలేశ్ మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు కెమికల్ పూసిన రూ. 20 వేల నోట్లను ఇవ్వగా వాటిని తీసుకుని తిరుమలేశ్ గురువారం ల్యాండ్ సర్వే కార్యాలయానికి వెళ్లాడు. గంగయ్య వాటిని తీసుకోకుండా గాయత్రి మెస్ లో వేచి ఉండాలని చెప్పాడు. అనంతరం మెస్‌లో తిరుమలేశ్ నుంచి రూ.20 వేలు తీసుకుంటుండగా గంగయ్యను అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుడిని హైదబాద్‌లోని ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్లు డీఎస్పీ సంజీవ్‌కుమార్ తెలిపారు.ఈ దాడిలో సీఐలు వెంకటేశ్వర్లు, రఘునాథ్, చంద్రశేఖర్‌రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. లంచం తీసుకుంటూ పట్టు బడ్డ సర్వేలాండ్ ఇన్స్పెక్టర్ గంగయ్యకు మరిన్ని రోజుల్లో అసిస్టెంట్ డెరెక్టర్ ఆఫ్ సర్వేయర్‌గా పదోన్నతి లభించేదని కార్యాలయం సిబ్బం ది తెలిపారు. ఉలిక్కిపడ్డ కార్యాలయాలు నిజామాబాద్‌అర్బన్ : జిల్లా కేంద్రం లోని ల్యాండ్ అండ్ సర్వే కార్యాలయం లో గురువారం ఏసీబీ అధికారుల దాడి పక్కనే ఉన్న కార్యాలయాలను ఉలిక్కిపడేలా చేసింది. ఖలీల్వాడిలోని ఈ కార్యాలయం పక్కన ఎంఆర్వో, ఆర్డీఓ, జిల్లా విద్యాశాఖ కార్యాలయాలు ఉండడమే ప్రధాన కారణం. ఈ కార్యాలయాలు ఉన్న ప్రాంతంలో ఎప్పుడు ఉద్యోగులు, సంబంధిత పనుల కోసం వచ్చే వారితో సందడిగా ఉంటుంది. ముఖ్యంగా రెవెన్యూ కార్యాలయాలు ఉండడంతో విలువైన పనులు ఇక్కడే కొనసాగుతాయి. కార్యాలయాలంతంటికి ఒక హోటల్ ప్రధాన కేంద్రంగా కొనసాగుతోంది. ఏసీబీ దాడి పకడ్బందీగా జరిగింది. ఏసీబీ అధికారులు దాదాపుగా నెలరోజులకు ఒకసారి అవి నీతి అధికారులను దాడిచేసి పట్టుకుం టున్నారు. నెల రోజుల క్రితమే జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అసిస్టెంట్ డెరైక్టర్, జుక్కల్ ఎంఈవోను, ఆయన కారు డ్రైవర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన జరుగడంతో ఉద్యోగుల్లో తీవ్ర చర్చ నెలకొంది.అవినీతి అధికారుల గుండెలు గుబులు మంటున్నాయి. -
యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడి హత్య
గుంటూరు: జిల్లాలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడులో ఓ దారుణం చోటుచేసుకుంది. పోలానికి వెళ్లిన ఓ యువతిపై గంగయ్య అనే యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి అతని బారినుంచి తప్పించుకోని జరిగిన విషయాన్ని బంధువులకు చెప్పినట్టు తెలిసింది. దీంతో ఆగ్రహించిన యువతి బంధువులు నిందితుడు గంగయ్యను దారుణంగా కొట్టిచంపినట్టు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఉద్యోగాలు అమ్మబడును
సాక్షి ప్రతినిధి, కడప: దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే తలంపుతో అధికారపార్టీ నేతలున్నారు. అందుకు తగ్గట్టుగా సహకారం అందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రభుత్వ నిబంధనలు కాదని కాంట్రాక్టులు మొదలుకుని ఉద్యోగాల వరకు కోరుకున్న వారికి అప్పగిస్తూ స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు. పారదర్శకతతో చేపట్టాల్సిన నియామకాలలో అధికార పార్టీ నేతల సిఫార్సు, అనుకున్న మేరకు ధనం చేకూరితే నకిలీ సర్టిఫికెట్లకు సైతం ఉద్యోగాలు అప్పగిస్తున్నారు. జిల్లాలోని అధికారుల శైలి పాలకపక్ష పార్టీ నాయకులకు కల్పతరువుగా మారింది. తాజాగా ట్రాన్స్‌కో యంత్రాంగానికి ఆ జాబితాలో చోటు దక్కింది. రేయ్.. అబ్బీ ఎందాక చదువుకున్నావ్... పాపం ఎన్ని రోజులని ఈసేద్యపు పనులతో కష్టపడతావ్... మన ఊరిలో సబ్‌స్టేషన్ ఆపరేటర్‌గా వెళ్తావా! నేను మాట్లాడి ఉద్యోగం ఇప్పిస్తాను... సరేన్నా! నేను 10 మాత్రమే పాస్ అయ్యా... దానికి ఐటీఐ ఎలక్ట్రిషియన్ చదివి ఉండాలంట కదా..? అదంతా నేను చూసుకుంటాలే.. అధికారంలో ఉండగా ఇట్లాంటి చిన్న పనులు కూడా చేయించుకోలేమా! ఏందీ... సరేన్నా నీ ఇష్టం. ఇది గ్రామీణ నాయకులు నిరుద్యోగుల మధ్య కొన్ని రోజులుగా జరుగుతున్న సంభాషణ.. అంతలోనే రెండురోజులు గడిచాక... నువ్వు చెప్పింది నిజమేబ్బీ... ఐటీఐ చదివిండాలంటా! సరే నేను ఒక మాట చెబుతా వింటావా...ఏమీ లేదు. ఐటీఐ సర్టిఫికెట్టు నీపేరుతో నేనే తీసుకువస్తా.. ట్రాన్సుకో ఆఫీసర్లను మేనేజ్ చేయాలా. వాళ్లు రెండు లక్షలు అడుగుతాండారు... నువ్వు రెడీ అంటే చూడూ...ఉద్యోగం నీదే. అయినా పెద్దకారు పైరు దిగుబడే కదా... ఆలోచించు నువ్వు సిద్ధమైతే నేను రెడీ... సరేలేన్నా.. ఎంత కాలమని ఇట్లానే ఉండాలా... నేను ఆలెక్క తెస్తానుగానీ నువ్వు మాట్లాడి నాకే ఉద్యోగం ఇప్పించున్నా... ఈ సంభాషణలు జిల్లాలో ఇటీవల జోరుందుకున్నాయి. అందుకు నిదర్శనంగానే ట్రాన్స్‌కోలో నియమాకాలు జరుగుతున్నాయి. పైరవీలకే ప్రాధాన్యం కమలాపురం మండలం కుప్పూరివారిపల్లె సబ్‌స్టేషన్‌ను ఇటీవల ప్రారంభించారు. అందులో నలుగురు ఆపరేటర్లు, ఒక వాచ్మెన్ పోస్టును భ ర్తీ చేశారు. ఆపరేటర్ పోస్టుకు ఐటీఐ ఎలక్ట్రీ షియన్ పూర్తి చేసి ఉండాలనేది కనీస నిబంధన. స్థానిక నాయకుడు అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే సిఫార్సు లెటర్ తెచ్చుకున్నారు. నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి నలుగురు ఆపరేటర్ల పోస్టులలో తన వారిని నియమించుకున్నాడు. అధికార పార్టీ ఎమ్మెల్యే సిఫార్సు, లక్షలో నగదు వస్తుండటంతో ఆలస్యం చేయకుండా ట్రాన్స్‌కో యంత్రాంగం ఉద్యోగాలను కట్టబెట్టింది. సర్టిఫికేట్లు నకిలీనా..! ఒరిజినలా అని చూడకుండా ఉద్యోగాలను కట్టబెట్టారు. ట్రాన్సుకో పేరు చెప్పి గ్రామీణ నాయకుడు సందిట్లో సడేమియా అన్నట్లుగా ఒక్కొక్కరి నుంచి రూ. 2లక్షలు వసూలు చేసి జేబులో వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జిల్లాలో 17 సబ్సేష్టన్లను నూతనంగా నిర్మించారు. వాటిల్లో సుమారు 85 మందిని (ఆపరేటర్లు, వాచ్మెన్లు) ఉద్యోగాలలో నియమించారు. ప్రతి సబ్‌స్టేషన్ లోనూ స్థానిక నాయకుల పైరవీలకే ప్రాధాన్యత ఇస్తూ నియామకాలు చేశారు. ఈమొత్తం వ్యవహారంలో దాదాపు రూ. కోటికి పైగా చేతులు మారినట్లు తెలుస్తోంది. వెరిఫికేషన్ ఏదీ..! గతంలో సబ్‌స్టేషన్ ఆపరేటర్ల నియామకాలను స్థానిక ట్రాన్స్‌కో ఏడి స్థాయి అధికారి చేసేవారు. కాలక్రమేణా అధికార పార్టీ నేతల పైరవీలతో గ్రామస్థాయి నేతలు తమ అనుచరులకు ఉద్యోగాలు ఇప్పించుకుంటున్నారు. ఆశాఖ ఉన్నతాధికారి జోక్యంతో ఇటీవల ఇబ్బడి ముబ్బడిగా నియామకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నేతల పైరవీ లేఖలతో పాటు, నగదు ముట్టజెప్పకపోతే నియామకాలు చేపట్టడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలో నకిలీ సర్టిఫికేట్లు ఉన్నా ఏమాత్రం పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. వాస్తవానికి ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. అటువంటి చర్యలు ఏమాత్రం తీసుకుంటున్న దాఖలాలు లేవు. ట్రాన్కో ఎస్ఈ గంగయ్య ఏమంటున్నారంటే.. నకిలీ సర్టిఫికెట్ల ఆరోపణలొస్తే విచారణ చేసి అలాంటి వారిని తొలగిస్తున్నాం. పాయసంపల్లె సబ్‌స్టేషన్‌లో ఇరువురిని తొలగించాం. కప్పూరువారిపల్లె నియామకాలపై విచారణ కోసం ఆయా విద్యా సంస్థలకు పంపాం. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం. ఇకపై ఉద్యోగాలు పొందిన ప్రతి ఒక్కరి సర్టిఫికెట్‌ను విచారణకు పంపుతాం. -
దాడి చేస్తే చంపేయండి
వినాయక్‌నగర్, న్యూస్‌లైన్ : ‘మీరు ధైర్యంగా ముందుకు సాగండి. అడవి దొంగలు దాడి చేస్తే చంపేయండి. నేను మీ వెనక కాదు.. ముందుంటా. అటవీ సంపద రక్షణకు కలసికట్టుగా కృషి చేద్దాం’ అని అడిషనల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు బాబూరావు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. భూ ఆక్రమణదారుల చేతిలో హత్యకు గురైన ఎఫ్ఆర్ఓ గంగయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగయ్యను అతికిరాతకంగా హత్య చేసిన వారిని అక్కడే చంపేయాల్సిందన్నారు. కానీ సిబ్బంది తక్కువగా ఉండడం, ఆయుధాలు లేకపోవడంతో దుండగుల ఆటలు సాగుతున్నాయన్నారు. దుండగులు గంగయ్య కంట్లో కారం చల్లి, దాడికి పాల్పడ్డారని పేర్కొన్నా రు. ఇకపై ఉద్యోగులు తప్పనిసరిగా హెల్మెట్ ధరిం చాలని సూచించారు. సిబ్బందికి ఆయుధాలు కావాలని ఉన్నతాధికారులతో పేర్కొన్నానన్నారు. రెండు రోజుల్లో రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి ఆయుధాల విషయం చర్చిస్తానన్నారు. రేంజ్‌కు ఆరు ఆయుధాల చొప్పున తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. వీటి వినియోగంపై అటవీశాఖలోని యువ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తానని పేర్కొన్నారు. సిబ్బందిలో మనోధైర్యం నింపడానికి యత్నించారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ చేస్తానని, 24 గంటలు సిబ్బందికి అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. విధి నిర్వహణలో అవసరమైతే పోలీసు రక్షణ తీసుకోవాలని టెరిటరియల్ డీఎఫ్ఓ భీమ సూచించారు. కార్యక్రమంలో ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్ఓ వేణుబాబు, టెరిటోరియల్ సబ్ డీఎఫ్ఓ గోపాల్‌రావు, నిజామాబాద్ రేంజ్ ఎఫ్ఆర్ఓ గంగాధర్, నిజామాబాద్ డివిజన్లోని అటవీ ఉద్యోగులు పాల్గొన్నారు. -
డెంగీతో ఒకరి మృతి
నల్లమాడ, న్యూస్‌లైన్ : నల్లమాడలోని ఎస్సీ కాలనీకి చెందిన గంగయ్య (32) డెంగీ జ్వరంతో ఆదివారం మృతి చెందాడు. బంధువుల కథనం మేరకు... గంగయ్య 15 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. నల్లమాడ, కదిరి ఆస్పత్రుల్లో చూపించుకున్నా తగ్గకపోవడంతో బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. డెంగీ జ్వరంతో బాధపడుతున్నాడని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం మృతి చెందాడు. కాలనీలో మరికొంత మంది కూడా డెంగీ జ్వరాల బారినపడ్డారు. వీరిలో గంగయ్య భార్య రాములమ్మతోపాటు రామలక్ష్మి, హేమంత్ ఆర్డీటీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. మరో నలుగురైదుగురు నల్లమాడ తదితర ఆస్పతుల్లో చేరారు. డెంగీతో మృతి చెందినట్లు సమాచారం అందుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ హరికృష్ణ వెంటనే ఎస్సీ కాలనీలో పర్యటించారు. అపరిశుభ్రత పేరుకుపోవడం, మురుగు నీటి గుంతల్లో దోమలు విపరీతంగా ఉండడం ఆయన గమనించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు డాక్టర్ హరికృష్ణ వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉన్నా పాలకులు గానీ, అధికారులు గానీ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డాక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ కాలనీలో డెంగీ జ్వరాలు ప్రబలి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి పట్టడం లేదని విమర్శించారు. కాలనీలో తక్షణమే వైద్య శిబిరం ఏర్పాటు చేసి జ్వరాలను అదుపులోకి తేవాలని డిమాండ్ చేశారు. పారిశుధ్యం మెరుగునకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఎఫ్ఆర్ఓ గంగయ్య హత్య కేసులో మరోకోణం
సాక్షి, నిజామాబాద్ : ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ గంగయ్య హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భూ ఆక్రమణదారులు ఒక్క గంగయ్యనే లక్ష్యంగా చేసుకొని దాడి చేసినట్లు సంఘ టన జరిగిన తీరును బట్టి తెలుస్తోంది. ఈ విషయమై హతుడు గంగయ్య కుటుంబ సభ్యులు సైతం పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయనకు స్వల్ప వ్యవధిలోనే పదోన్నతి లభించిందని, ఇది శాఖలోని పలువురికి కంట గింపుగా మారిందని వారంటున్నారు. విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరించేవారని, దీంతో కొందరికి ఆయనంటే పడలేదని పేర్కొంటున్నారు. అయితే గంగయ్య కుటుంబ సభ్యులనుంచి రాత పూర్వకంగా గానీ మౌఖికంగా గానీ తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఎస్పీ మోహన్‌రావు పేర్కొన్నారు. హత్య విషయమై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ విషయమై అటవీ శాఖ ఉన్నతాధికారులూ స్పందించారు. ‘‘కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యలో అటవీశాఖ అధికారులు, సిబ్బంది ప్రమేయం పరోక్షంగానైనా ఉందని తేలిన పక్షంలో శాఖాపరమైన విచారణ చేపడతాం’’ అని నిజామాబాద్ సర్కిల్ సీసీఎఫ్ గోపీనాథ్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. వివాదాలిలా.. ఒక్క ఇందల్వాయి రేంజ్‌లోనే కాదు.. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల పెద్ద ఎత్తున అటవీ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. అటవీ శాఖలోని కొందరు అధికారులు, సిబ్బంది పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని భూ ఆక్రమణలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇలా డబ్బులు పుచ్చుకున్న అధికారులు ఆక్కడి నుంచి బదిలీపై వెళ్లగా, ఆ స్థానంలోకి వచ్చిన అధికారులు ఆక్రమణలకు అడ్డుతగులుతుండడంతో గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ గొడవలే దాడులకు దారితీస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూములు, పట్టాలు ఇప్పిస్తామంటూ కొందరు నేతలు, రెవెన్యూ అధికారులు అమాయకుల వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కాగా అటవీ భూము లా? రెవెన్యూ భూములా అన్న విషయం తేల్చకుండానే అధికారులు అందినకాడికి దండుకుని పట్టాలిస్తుండడంతో అమాయక గిరిజనులు, గ్రామీణలు అటవీ భూములను దున్నుకుంటున్నారు. తీరా అటవీశాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో వివాదం ముదురుతోందని, భూ ఆక్రమణదారులు అఘాయిత్యాలకూ పాల్పడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంతాపసభ సుభాష్‌నగర్ : భూఆక్రమణదారుల చేతిలో ఇటీవల హత్యకు గురైన ఎఫ్ఆర్ఓ గంగయ్య సంతాప సభను ఆదివారం జిల్లాకేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో నిర్వహించారు. మాదిగ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో బీజేపీ శాసనసభాపక్ష నేత యెండల లక్ష్మీనారాయణ, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్, ఫెడరేషన్ నాయకులు సీహెచ్.గంగాధర్, ఎస్.సురేశ్, ఎస్.లింగయ్య, సీతయ్య, మహేశ్‌కుమార్, గంగారాం, గంగయ్య, సాయిలు, చిన్నయ్య, పోశెట్టి, బాలచందర్, రాములు తదితరులు పాల్గొన్నారు. ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షుడు తెడ్డు గంగారాం అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. గంగయ్య సేవలను వక్తలు కొనియాడారు. హంతకులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరామర్శ కలెక్టరేట్ : ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ గైని గంగారాం, నాయకులు బాబూరావు, దేవయ్య తదితరులు ఆదివారం గంగయ్య కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంగయ్య కుటుంబ సభ్యులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. అరెస్టు అయింది వీరే.. సాక్షి, నిజామాబాద్ : ఎఫ్ఆర్ఓ గంగయ్య హత్య కేసులో మొత్తం 36 మందిపై కేసు నమోదు చేశామని, 11 మందిని అరెస్టు చేశామని ఎస్పీ మోహన్‌రావు తెలిపారు. మిగిలిన 25 మందిలో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిందితులపై 147, 148, 353, 332, 307, 302, 120(బి) రెడ్‌విత్ 149 ఐపీసీ, సెక్షన్ 15, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ చట్టం 4, 5 సెక్షన్ల కింద, పీడీపీపీ చట్టం సెక్షన్ 3 (1), ఎస్సీ, ఎస్సీ అట్రాసిటీ చట్టం సెక్షన్ 3 (2)(వి) కింద కేసులు నమోదు చేశామన్నారు. అరెస్టు అయినవారిలో ఒడ్డె భాస్కర్, ఒడ్డె రాములు, మందుల ముత్యం (ఆటోడ్రైవర్), మందుల పెద్దసాయిలు (మెకానిక్), గొల్ల మల్లేశ్ (మెకానిక్), మక్కాల చిన్న వెంకటి, శివరాత్రి ప్రసాద్ (సుమో డ్రైవర్), సింగజోగి పోచయ్య, మందుల లింగం, సింగజోగి పోచయ్య, బాదావత్ గోపాల్ (కెకె తండా) ఉన్నారన్నారు. వీరి నుంచి గొడ్డలి, కొడవలి, కర్రలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిజామాబాద్ డీఎస్పీ అనీల్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారని, పరారీలో ఉన్నవారిని వెంటనే పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సమావేశంలో ఓఎస్డీ సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఎఫ్ఆర్ఓ గంగయ్య హత్యపై అటవీశాఖలో సర్వత్రా ఆందోళన
సాక్షి, నిజామాబాద్ : ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ గంగయ్య దారుణ హత్య తో అటవీశాఖ సిబ్బం దిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. భూఆ క్రమణదారులు, కలప స్మగ్లర్లు దారుణాలకు ఒడిగడుతుండటంతో ధైర్యం సడలిపోతున్నారు. ఎఫ్ఆర్ఓ స్థాయి ఉన్నతాధికారినే హతమార్చితే తమ పరిస్థితి ఏంటని ఆశాఖ క్షేత్ర స్థా యి సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. వీరిలో ఆత్మస్థైర్యం నిం పేందుకు ఆశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారిం చారు. ఈ మేరకు ఇందల్వాయి రేంజ్ కార్యాలయం లో ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కామారెడ్డి డీఎఫ్ఓ నాగేశ్వర్రావు వంటి ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు గం గయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎక్స్‌గ్రేషియాతో పాటు, గంగయ్య సర్వీసు ఉన్నంతకాలం పూర్తి వేతనాన్ని ఆయన కుటుంబానికి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వేతన చెల్లింపుతోపాటు, గంగయ్య కుమారునికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనే ప్రతిపాద న ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందని జూనియర్ ఫారెస్టు ఆఫీసర్స్ అసోసియోషన్ డివిజన్ అధ్యక్షులు బాబు పేర్కొన్నారు. త్వరలోనే ప్రభుత్వం ఈ నిర్ణ యం తీసుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నా రు. 1967 నాటి అటవీచట్టాలను మార్చి కఠినతరం చేయాలని, 1972 వన్యప్రాణుల చట్టాన్ని కూడా సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాలపై ఇప్పటికే ముఖ్యమంత్రి, ఆశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ స్థాయిల్లో సమావేశాలు జరిగాయన్నారు.తొందరలో నే తుది నిర్ణయం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. స్మారక స్థూపం నిర్మాణం.. నల్లవెల్లి ఘటన నేపథ్యంలో అటవీశాఖ అమరవీరుల స్థూపాన్ని నిర్మించాలని ఆశాఖ ఉద్యోగులు భావిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో ఉద్యోగులు తమ సొంత ఖర్చులతో ఈ స్థూపం నిర్మా ణం చేపట్టనున్నారు. స్థూపంపై గంగయ్యతో పాటు మరో ఇద్దరు విధి నిర్వహణలో అసువులు బాసిన వారి పేర్లు పెట్టాలని నిర్ణయించారు. నిజామాబాద్ సర్కిల్ పరిధిలో మరో ఇద్దరు అటవీ అధికారులు విధి నిర్వహణలో అసువులు బాసారు. 1984లో కామారెడ్డి రేంజ్ (సదాశివనగర్ మండలం రామారెడ్డి గ్రామ శివారు) పరిధిలో అక్బర్ అలీ అనే సెక్షన్ ఆఫీసర్ విధి నిర్వహణలో మృత్యువాతపడ్డారు. నక్సల్స్ తూటాలకు ఆయన నేలకొరిగారు. సుమారు ఎని మిది నెలల క్రితం నిజామాబాద్ సర్కిల్ పరిధిలోకి వచ్చే మెదక్ జిల్లా కల్హేర్ మండలంలో అక్కడి బీట్ ఆఫీసర్ ధరావత్పూల్సింగ్ను స్మగ్లర్లు సజీవదహనం చేశారు. నిర్మించబోయే ఈ స్థూపంపై ఈ ముగ్గురు పేర్లను పెట్టాలనుకుంటున్నారు. -
నిజమాబాద్ లో గిరిజనుల దాడిలో ఫారెస్ట్ ఆఫీసర్ మృతి
హైదరాబాద్: గిరిజనులు చేసిన దాడిలో ఓ ఫారెస్ట్ అధికారి గంగయ్య మరణించగా, మరో ఏడుగురి తీవ్ర గాయలయ్యాయి. ఈ ఘటన నిజమాబాద్ జిల్లాలో ధార్ పల్లే మండలంలోని తండా అడవుల్లో శనివారం రాత్రి జరిగినట్టు పోలీసు అధికారులు తెలిపారు. అటవీ భూములను ఆక్రమించుకొని వ్యవసాయం చేస్తున్నట్టు సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారి, తన సిబ్బందితో అక్కడికి వెళ్లగా గిరిజనులు దాడి చేసినట్టు అధికారులు తెలిపారు. గిరిజనులు జరిపిన దాడిలో గంగయ్య అక్కడికక్కడే మరణించగా, ఏడుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాక ఫారెస్ట్ విభాగానికి చెందిన వాహనాన్ని కూడా గిరిజనులు తగులపెట్టారు. వ్యవసాయానికి భూమిని కేటాయించాలని డిమాండ్ చేయగా, అధికారులు నిరాకరించడమే ఈ సంఘటనకు కారణమని తెలుస్తోంది.