వైఎస్సార్ కడపజిల్లాలో మరో హత్య జరిగింది.
► వైఎస్సార్ జిల్లాలో వ్యక్తి దారుణహత్య
రామాపురం(వైఎస్‌ఆర్ జిల్లా): వైఎస్సార్ కడపజిల్లాలో మరో హత్య జరిగింది. పాతకక్షల నేపధ్యంలో జరిగిన దాడుల్లో రామాపురం మండలం చిట్లూరు గ్రామంలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన గంగయ్యను గుర్తుతెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో కిరాతకంగా నరికారు.
దీంతో గంగయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు చిట్లూరు ఎంపీటీసీ లక్ష్మీదేవమ్మకు సమీప బంధువు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.