ఏసీబీకి చిక్కిన ల్యాండ్ సర్వే ఇన్‌స్పెక్టర్ | ACB attacks on land survey inspector | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన ల్యాండ్ సర్వే ఇన్‌స్పెక్టర్

Published Fri, Jul 4 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM

ACB attacks on land survey inspector

నిజామాబాద్ క్రైం : భూమి కొలతలు తీసి ఇచ్చేందుకు రైతు నుంచి లంచం డబ్బులు తీసుకుంటూ ల్యాండ్ సర్వే ఇన్‌స్పెక్టర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కడం ఇక్కడ కలకలం సృష్టించింది. డిచ్‌పల్లి మండలం యానంపల్లి గ్రామానికి చెందిన రైతు మోత్కూరి తిరుమలేశ్‌గౌడ్ 2012లో 10 ఎకరాల పట్టా భూమి కొనుగోలు చేశాడు. ఇందులో తన పేరిట ఐదు ఎకరాలు, భార్య శైలజ పేరిట ఐదు ఎకరాల మూడు గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.

 ఈ భూములకు హద్దులు సక్రమంగా లేకపోవటంతో తిరుమలేశ్ గత జనవరి 30న జిల్లా కేంద్రంలోని లాండ్ సర్వే కార్యాలయం అధికారులను సంప్రదిం చాడు. అధికారుల సూచన మేరకు చాలన్ కూడ కట్టాడు. మూడు నెలల పాటు కార్యాలయం చుట్టూ తిరిగినా పని కాక పోవటంతో తిరుమలేశ్ చివరకు కార్యాలయంలోని ల్యాండ్ సర్వే ఇన్‌స్పెక్టర్ గంగయ్యను కలిశాడు. ఆయన ఎకరానికి రూ. 15 వేల చొప్పు న మొత్తం 10 ఎకరాలకు రూ. 1.50లక్షలు లంచంగా ఇస్తేనే భూమి కొలతలు తీసిస్తానని స్పష్టం చేశాడు.

 చివరకు ఇద్దరి మధ్య లక్ష రూపాయ లకు ఒప్పం దం కుదిరింది. ఒప్పందం మేరకు తిరుమలేశ్ గత మార్చిలో రూ. 50 వేలు నగరంలోని విజయ టాకీస్ వద్ద గంగయ్య కు ఇచ్చాడు. మరికొన్ని రోజుల తర్వాత విజయటాకీస్ వద్దే మరో రూ. 15 వేలు చెల్లించాడు. అనంతరం మరో రూ.15 వేలు ల్యాండ్ సర్వే కార్యాలయం సమీపంలోని  గాయత్రి మెస్‌లో చెల్లించా డు. ఇలా మొత్తం రూ. 80 వేలు గంగయ్యకు రైతు ముట్టచెప్పాడు. వారం క్రితం ల్యాండ్ సర్వే కార్యాలయానికి వెళ్లి  మిగిలిన రూ. 20 వేలు భూమి కొలతలు తీశాక ఇస్తానని రైతు చెప్పగా అందుకు గంగయ్య ఒప్పుకోలేదు.

దీంతో  తిరుమలేశ్ మంగళవారం  ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు  కెమికల్ పూసిన రూ. 20 వేల నోట్లను ఇవ్వగా వాటిని తీసుకుని తిరుమలేశ్ గురువారం ల్యాండ్ సర్వే కార్యాలయానికి వెళ్లాడు. గంగయ్య వాటిని తీసుకోకుండా గాయత్రి మెస్ లో వేచి ఉండాలని చెప్పాడు. అనంతరం మెస్‌లో తిరుమలేశ్ నుంచి రూ.20 వేలు తీసుకుంటుండగా గంగయ్యను అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుడిని హైదబాద్‌లోని ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్లు డీఎస్పీ సంజీవ్‌కుమార్ తెలిపారు.ఈ దాడిలో సీఐలు వెంకటేశ్వర్లు, రఘునాథ్, చంద్రశేఖర్‌రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. లంచం తీసుకుంటూ పట్టు బడ్డ సర్వేలాండ్ ఇన్‌స్పెక్టర్ గంగయ్యకు మరిన్ని రోజుల్లో అసిస్టెంట్ డెరెక్టర్ ఆఫ్ సర్వేయర్‌గా పదోన్నతి లభించేదని కార్యాలయం సిబ్బం ది తెలిపారు.

 ఉలిక్కిపడ్డ కార్యాలయాలు
 నిజామాబాద్‌అర్బన్ : జిల్లా కేంద్రం లోని ల్యాండ్ అండ్ సర్వే కార్యాలయం లో గురువారం ఏసీబీ అధికారుల దాడి  పక్కనే ఉన్న కార్యాలయాలను ఉలిక్కిపడేలా చేసింది. ఖలీల్‌వాడిలోని  ఈ కార్యాలయం పక్కన ఎంఆర్‌వో, ఆర్‌డీఓ, జిల్లా విద్యాశాఖ కార్యాలయాలు ఉండడమే ప్రధాన కారణం.  ఈ కార్యాలయాలు ఉన్న ప్రాంతంలో  ఎప్పుడు ఉద్యోగులు, సంబంధిత పనుల కోసం వచ్చే వారితో సందడిగా ఉంటుంది. ముఖ్యంగా రెవెన్యూ కార్యాలయాలు ఉండడంతో విలువైన పనులు ఇక్కడే కొనసాగుతాయి.

 కార్యాలయాలంతంటికి ఒక హోటల్  ప్రధాన కేంద్రంగా కొనసాగుతోంది. ఏసీబీ దాడి పకడ్బందీగా జరిగింది. ఏసీబీ అధికారులు దాదాపుగా నెలరోజులకు ఒకసారి అవి నీతి అధికారులను దాడిచేసి పట్టుకుం టున్నారు. నెల రోజుల క్రితమే జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అసిస్టెంట్ డెరైక్టర్, జుక్కల్ ఎంఈవోను, ఆయన కారు డ్రైవర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన జరుగడంతో ఉద్యోగుల్లో తీవ్ర చర్చ నెలకొంది.అవినీతి అధికారుల గుండెలు గుబులు మంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement