M.Gangaiah Death, Telugu Film Producer Passed Away - Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌లో మరో విషాదం.. నాగార్జున ‘సంకీర్తన’నిర్మాత మృతి

Apr 22 2021 3:29 PM | Updated on Apr 22 2021 6:00 PM

Tollywood Producer M Gangaiah Passed Away - Sakshi

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. కరోనా కారణంగా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు మృతి చెందగా, తాజాగా అనారోగ్యంతో నిర్మాత డాక్టర్‌ యం.గంగయ్య రాజమండ్రిలో కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో బుధవారం ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంభ సభ్యులు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించిన ‘సంకీర్తన’ మూవీకి గంగయ్య నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ద్వారా గీతాకృష్ణ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇళయరాజా స్వరాలు సమకూర్చిన 'సంకీర్తన' మ్యూజికల్ హిట్ గా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement