
హమ్ ఆప్‌కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై, వివాహ్, ప్రేమ్ రతన్ థన్ పాయో లాంటి చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, రాజశ్రీ ఫిలింస్ అథినేత రాజ్ కుమార్ బర్జాత్య గురువారం ఉదయం అనారోగ్య కారణాలతో మృతి చెందారు. తండ్రి అడుగు జాడల్లో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన రాజ్ కుమార్ ఎన్నో విమర్శకుల ప్రశంసలందుకున్న ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు.
టెలివిజన్ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు రాజ్‌కుమార్. దాదాపు అన్ని ప్రముఖ హిందీ చానల్స్‌లోనూ రాజ్‌కుమార్ నిర్మాణంలో తెరకెక్కిన సీరియల్స్ ప్రసారమయ్యాయి. తన వారసుడిగా సూరజ్ బర్జాత్యను ఇండస్ట్రీకి పరిచయం చేసిన రాజ్‌కుమార్, తనయుడి దర్శకత్వంలో మైనే ప్యార్ కియా, హమ్ ఆప్‌కే హై కౌన్, వివాహ్ లాంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. దాదాపు 70 సంవత్సరాలుగా సినీ రంగంతో సంబంధాలు ఉన్నా రాజ్‌కుమార్ బర్జాత్య మృతి పట్ల బాలీవుడ్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment