
సీనియర్ నటి, నిర్మాత కృష్ణవేణి మరణం పట్ల మా అధ్యక్షుడు మంచు విష్ణు సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగు సినిమాలో ఒక చిరు దీపం వెలిగించిన లెజెండరీ కృష్ణవేణి.. నందమూరి తారక రామారావును బిగ్ స్క్రీన్‌కి పరిచయం చేసి మన ఇండస్ట్రీకి ఒక అమూల్యమైన బహుమతి ఇచ్చారు. ఆమె జ్ఞాపకాలు ఎప్పుడు మన హృదయాల్లో శాశ్వతంగా ఉండిపోతాయన్నారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని మంచు విష్ణు పోస్ట్ చేశారు.
కాగా.. కృష్ణవేణి సినిమాల్లోకి రాక ముందు రంగస్థల నటిగా పనిచేశారు. 1936లో సతీఅనసూయ /ధృవ చిత్రంతో బాలనటిగా సినీ రంగప్రవేశం చేశారు. ఆ తరువాత కథానాయకిగా తెలుగులో దాదాపు 15 చిత్రాలలో నటించారు. కొన్ని తమిళ, కన్నడ భాషా చిత్రాలలో కూడా కథానాయకిగా నటించారు. కృష్ణవేణికి తెలుగు సినిమా నిర్మాత మీర్జాపురం రాజా మేకా రంగయ్యతో వివాహం జరిగింది. కేవలం నటిగానే కాదు.. తానే స్వయంగా అనేక సినిమాలు నిర్మించింది. ఈమె తన సినిమాలలో తెలుగు సాంప్రదాయ విలువలకు అద్దంపట్టి జానపదగీతాలకు పెద్దపీట వేసింది. 1949 తెలుగులో సినిమా చరిత్రలో మైలురాయి అయినటువంటి మన దేశం చిత్రాన్ని నిర్మించి అందులో తెలుగు తెరకు నందమూరి తారక రామారావును, యస్వీ రంగారావును,నేపథ్యగాయకునిగా ఘంటసాల వెంకటేశ్వరరావును పరిచయం చేశారు.
ఆ తరువాత సినిమాలలో అనేక గాయకులు నటులు, సంగీత దర్శకులను ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. 1957లో తీసిన దాంపత్యం సినిమాతో మరో సంగీత దర్శకుడు రమేష్ నాయుడును తెలుగు సినిమాకు పరిచయం చేసింది. తెలుగు సినిమా పరిశ్రమకు ఈమె చేసిన జీవితకాలపు కృషికి గానూ 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. ఆమె భర్త స్థాపించిన సంస్థ జయా పిక్చర్స్ ఆ తరువాతి కాలంలో దీన్ని శోభనాచల స్టూడియోస్‌గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఆమె కుమార్తె మేకా రాజ్యలక్ష్మీ అనురాధ పేరు మీదుగా ఎం.ఆర్.ఏ.ప్రొడక్షన్స్ నిర్వహిస్తున్నారు.
కృష్ణవేణి నిర్మించిన సినిమాలు
మన దేశం (1949)
లక్ష్మమ్మ (1950)
దాంపత్యం (1957)
గొల్లభామ (1947)
భక్త ప్రహ్లాద (1042)
Telugu cinema lo oka chiru deepam veliginchina Legendary Krishnaveni Garu kalasina tidhi 🙏. Aame parishrama tho Nandamuri Taraka Rama Rao Garu ni big screen ki introduce chesi, mana industry ki oka amulya mayina gift icharu. Aame gnapakalu eppudu mana hrudayallo undipothayi.… pic.twitter.com/dYYqz6nmxK
— Vishnu Manchu (@iVishnuManchu) February 16, 2025
Comments
Please login to add a commentAdd a comment