Krishnaveni
-
వైఎస్సార్సీపీ మహిళా నేతపై కక్ష సాధింపు
-
‘కిమ్స్’ బొల్లినేని కృష్ణయ్యపై క్రిమినల్ కేసు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే, కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్యపై క్రిమినల్ కేసు నమోదైంది. రెండో భార్యకు పుట్టిన సంతానం మెదటి భార్య, సమీప బంధువులకు జన్మించినట్లు నకిలీ పత్రాలు సృష్టించారన్నది ఆరోపణ. వీటి ఆధారంగా బర్త్ సర్టిఫికెట్లు, పాస్‌పోర్టులు కూడా తీసుకున్నారు. విషయం తెలుసుకున్న రెండో భార్య కృష్ణవేణి రాయదుర్గం ఠాణాలో ఫిర్యాదు చేశారు. బొల్లినేని కృష్ణయ్యతో పాటు ఆయన సమీప బంధువులు లోటస్ హాస్పిటల్ యజమానులు హేమ, ప్రసాద్లనూ నిందితులుగా చేరుస్తూ కేసు నమోదైంది. నేరం మొత్తం నగరంలో జరిగినట్లు దర్యాప్తులో తేలడంతో కేసును దర్యాప్తు నిమిత్తం హైదరాబాద్ సీసీఎస్‌కు బదిలీ చేశారు. విశాఖపటా్ననికి చెందిన కృష్ణవేణి 2003లో నాంపల్లిలోని మెడ్విన్ ఆస్పత్రిలో పని చేస్తుండగా కిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్‌గా ఉన్న కృష్ణయ్యతో పరిచయమైంది. తన భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేదంటూ కృష్ణవేణిని నమ్మించిన కృష్ణయ్య 2004 ఫిబ్రవరిలో ఆమెను వివాహం చేసుకున్నారు. వీళ్లు బంజారాహిల్స్‌లో కాపురం పెట్టారు. కొన్నిరోజుల తర్వాత ఇంటికి తీసుకెళ్లడంతోపాటు బంధువులకూ భార్యగా పరిచయం చేస్తానంటూ నమ్మబలికారు. వీరికి 2004లో కుమారుడు అర్జున్ జన్మించాడు. కృష్ణయ్య, కృష్ణవేణి తల్లిదండ్రులుగా బర్త్ సర్టిఫికెట్ తీసుకున్నారు. 2006లో అనారోగ్య కారణాలు చెప్పిన కృష్ణయ్య తన కుమారుడిని తనతో తీసుకెళ్లారు. తర్వాత ఇద్దరు కుమార్తెలు... 2006లో కృష్ణవేణి కుమార్తె కృష్ణ వైష్ణవికి జన్మనిచ్చింది. రెండేళ్ల తర్వాత వివిధ కారణాలు చెప్పిన కృష్ణయ్య వైష్ణవినీ తీసుకెళ్లిపోయారు. వీరికి 2011లో రెండో కుమార్తె శ్రీనిక పుట్టింది. ఆ తర్వాత నుంచి కృష్ణయ్య... కృష్ణవేణి వద్దకు రావడం మానేశారు. కుమారుడు, మొదటి కుమార్తె వివరాలను కూడా ఆమెకు తెలియనీయలేదు. కృష్ణవేణి ఎన్నిసార్లు కోరినా అర్జున్, వైష్ణవిలను చూపించడానికి సుముఖత చూపలేదు. ప్రతి నెలా కృష్ణవేణికి నిర్ణీత మొత్తం చెల్లిస్తూ వచ్చారు. 2016లో ఆమెను ఖాజాగూడలో ఉన్న తన విల్లాలోకి మార్చారు. తనతోపాటు తన పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వాలని కృష్ణవేణి కోరారు. దీంతో ఆయన వీళ్లు నివసిస్తున్న విల్లాను మాత్రం శ్రీనిక పేరుతో బదిలీ చేశారు. ఆ తర్వాత నుంచి కృష్ణవేణిని పట్టించుకోవడం మానేశారు. తన కుమారుడిని కలవడానికి అనేక ప్రయత్నాలు చేసిన కృష్ణవేణి ఎట్టకేలకు 2021లో కలవగలిగారు. ఆమె తన తల్లి అని తెలుసుకున్న అర్జున్ షాక్ అవడంతోపాటు తండ్రి కృష్ణయ్య తన మొదటి భార్యనే తన తల్లిగా నమ్మించినట్లు చెప్పాడు. ఈమె అర్జున్ను కలుస్తున్న విషయం తెలుసుకున్న కృష్ణయ్య మానుకోవాలని బెదిరించారు. నకిలీ పత్రాలు సృష్టించి.. 2022లో విదేశాలకు వెళ్లిన అర్జున్ ఇక్కడకు వచ్చినప్పుడు తల్లిని కలిసేవారు. వైష్ణవి తన సోదరి అని తల్లి కృష్ణవేణి ద్వారా తెలుసుకున్నాడు. ఆమె కృష్ణయ్య సమీప బంధువులైన హేమ, ప్రసాద్‌ల కుమార్తెగా పెరుగుతున్నట్లు చెప్పాడు. కృష్ణయ్య తదితరులు అర్జున్, వైష్ణవిలకు సంబంధించి కొన్ని నకిలీ పత్రాలు సృష్టించి, ధ్రువీకరణలు పొందినట్లు కృష్ణవేణి గుర్తించారు. వీటి ఆధారంగానే జీహెచ్ఎంసీ నుంచి బర్త్ సర్టిఫికెట్లు, రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం నుంచి పాస్‌పోర్టులు పొందినట్లు తెలుసుకున్నారు. ఈ ఆధారాలన్నీ పొందుపరుస్తూ రాయదుర్గం ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసు కొట్టేయాలంటూ కృష్ణయ్య కోర్టుకు వెళ్లినా ఫలితం దక్కలేదు. తొలుత చీటింగ్, ఆపై అదనపు ఆధారాలతో ఫోర్జరీ కేసుగా మారింది. సీసీఎస్ పోలీసులు కేసును రీ–రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టారు. -
నారా లోకేష్ నిజస్వరూపాన్ని బయటపెట్టిన టీడీపీ మహిళ
-
ఎన్టీఆర్‌ని వెండితెరకు తెచ్చిన 'కృష్ణవేణి' ఎవరో తెలుసా..?
మణిలాంటి నటి... మణిలాంటి గాయని... మణిలాంటి నిర్మాత... కృష్ణవేణి చిత్రసీమకు ఒక అమ్యూలమైన మణి. మంచి నటీమణిగా తెరపై తన అభినయాన్ని కనబర్చారు. మంచి గాయనీమణిగా తన గాత్రాన్ని వినిపించారు. ‘మన దేశం’ వంటి చిత్రంతో అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు. నేడు నూరవ వసంతంలోకి అడుగుపెడుతున్నారు సి. కృష్ణవేణి. ఈ సందర్భంగా కృష్ణ‘మణి’ జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి గ్రామంలో 1924 డిసెంబరు 24న జన్మించారు కృష్ణవేణి. తండ్రి యర్రంశెట్టి కృష్ణారావు డాక్టర్. పాఠశాల నాటకాల్లో ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి వేషాలు వేసి బహుమతులు అందుకున్నారు కృష్ణవేణి. ఆ తర్వాత వెండితెరపైనా ప్రేక్షకులను మెప్పించారు. ప్రముఖ దర్శక–నిర్మాత సి. పుల్లయ్య బాలనటీనటులతో ‘సతీ అనసూయ’ చిత్రానికి సన్నాహాలు చేశారు. ఆ సమయంలో రాజమండ్రి వెళ్లినప్పుడు ఆయన ‘తులాభారం’ నాటకం చూశారు. అందులో కృష్ణవేణి నటన నచ్చి, సినిమాలో నటించమని అడి గారు. అలా ‘సతీ అనసూయ’ (1936) సినిమాలో తొలి అవకాశం అందుకున్నారు కృష్ణవేణి. ఆ చిత్రం తర్వాత మళ్లీ నాటకాల్లో నటించారు. ఆ సమయంలో తండ్రి కృష్ణారావు మృతి చెందడంతో అమ్మమ్మ, బాబాయిల వద్ద పెరిగారు కృష్ణవేణి. ఆ తర్వాత ‘తుకారాం’ (1973) సినిమా కోసం చెన్నైలో అడుగుపెట్టారు. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. కృష్ణవేణి హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘కచదేవయాని’ (1938) విజయం సాధించడంతో మంచి గుర్తింపు, పేరు వచ్చాయి. ఆ తర్వాత ‘మహానంద’ చిత్రంలో నటించేందుకు చెన్నైలోనే స్థిరపడ్డారు. ఆ సమయంలోనే ప్రముఖ దర్శక–నిర్మాత, మీర్జాపురం రాజాతో (మేకా రంగయ్య) కృష్ణవేణి వివాహం 1940లో విజయవాడలో జరిగింది. వివాహం తర్వాత బయటి సంస్థల్లో పని చేయడం ఇష్టం లేక సొంత ప్రోడక్షన్ జయా పిక్చర్స్–శోభనాచల స్టూడియోస్ నిర్మించిన చిత్రాల్లో నటించారామె. మీర్జాపురం రాజా నిర్మించిన తొలి సాంఘిక చిత్రం ‘జీవన జ్యోతి’లో (1940) హీరోయిన్గా చేశారు. ఆ చిత్రంతో సీహెచ్ నారాయణరావు హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు కృష్ణవేణి. నటిగా ఆమెకు ‘గొల్లభామ, లక్ష్మమ్మ’ వంటి చిత్రాలు బాగా పేరు తెచ్చాయి. ‘కచదేవయాని, గొల్లభామ, అనసూయ’ వంటి పలు చిత్రాల్లో పాటలు పాడారు కృష్ణవేణి. ‘తిరుగుబాటు’ సినిమాలో ఆమె చేసిన వ్యాంప్ క్యారెక్టర్‌పై ప్రేక్షకులు పెదవి విరిచారు. 1942లో రాజా–కృష్ణవేణి దంపతులకు కుమార్తె రాజ్యలక్ష్మి అనూరాధ జన్మించడం.. భర్త రాజా సినిమాల నిర్మాణంలో బిజీగా ఉండటంతో స్టూడియో వ్యవహారాలు చూసుకోవాల్సి రావడం... వంటి కారణాలతో నటనకు స్వస్తి పలికారు కృష్ణవేణి. కుమార్తె పేరుపై ‘ఎంఆర్ఏ’ప్రోడక్షన్ స్థాపించి, తొలి ప్రయత్నంగా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో ‘మన దేశం’ (1949) సినిమా తీసి, విజయం అందుకున్నారు. ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్‌ని వెండితెరకు పరిచయం చేశారు కృష్ణవేణి. కాగా ‘వరూధుని’ సినిమా తర్వాత ఊరు వెళ్లిపోయిన ఎస్వీ రంగారావుని పిలిపించి, ‘మన దేశం’లో ఓ పాత్రకు అవకాశం ఇచ్చారామె. తన అభిరుచి మేరకు నిర్మించిన ఆ సినిమా ఎంతో సంతృప్తి ఇచ్చిందని పలు సందర్భాల్లో కృష్ణవేణి పేర్కొన్నారు. ఇక ఆ రోజుల్లో ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరోయిన్‌గానూ తన ప్రత్యేకత చాటుకున్నారామె. ‘ధర్మాంగద’కి రూ. నలభై ఐదు వేలు పారితోషికం తీసుకున్నారు. ఆమె నిర్మించిన ‘గుడ్ ఈవెనింగ్, లేడీ డాక్టర్’ వంటి కొన్ని చిత్రాలు పరాజయం కావడం, ‘కుమ్మరి మొల్ల’ వంటి మరికొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోవడంతో అసంతృప్తికి గురయ్యారు కృష్ణవేణి. ఆమె హీరోయిన్గా నటించిన ఆఖరి చిత్రం ‘సావాసం’ (1952). మహారాష్ట్ర గవర్నర్‌గా చేసిన కోన ప్రభాకరరావు ఆ చిత్రంలో హీరోగా నటించడం విశేషం. కృష్ణవేణి నిర్మించిన చిత్రాల్లో ‘భక్త ప్రహ్లాద’ (1942) ఒకటి. నిర్మాతగా 1957లో విడుదలైన ‘దాంపత్యం’ కృష్ణవేణి చివరి సినిమా. నటిగా, నిర్మాతగా, గాయనిగా చిత్ర పరిశ్రమలో ప్రత్యేకత చాటుకున్న ఆమె 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. గత ఏడాది ‘సాక్షి ఎక్స్‌లెన్స్’ అవార్డుల్లో భాగంగా ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకున్నారు కృష్ణవేణి. తల్లి బాటలో కుమార్తె కృష్ణవేణి బాటలో ఆమె కుమార్తె ఎన్ఆర్ అనురాధా దేవి నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. ముందు పలు అనువాద చిత్రాలు విడుదల చేసి, లక్ష్మి ఫిలింస్ కంబైన్స్‌పై ఆమె కన్నడంలో తన తొలి చిత్రం ‘భక్త కుంబారా’ (1974)ని నిర్మించారు. ఇందులో రాజ్‌కుమార్ హీరో. తెలుగులో అనురాధ నిర్మించిన తొలి చిత్రం ‘చక్రధారి’ (1977). అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ, జయప్రద కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందింది. నిర్మాతగా మొత్తం 17 చిత్రాలు నిర్మించారు అనురాధ. ఆమె నిర్మించిన చివరి చిత్రం ‘మా పెళ్లికి రండి’ (2000). జేడీ చక్రవర్తి, సాక్షీ శివానంద్ కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందింది. ప్రపంచంలో అత్యధిక చిత్రాలు నిర్మించిన మహిళా నిర్మాతగా అనురాధా దేవి 2001లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌ని సొంతం చేసుకున్నారు. - అనురాధా దేవి -
వీణను బహుమతిగా ఇచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి
-
తాడిపత్రిలో చైన్‌స్నాచింగ్
తాడిపత్రి: స్థానిక రూరల్ పరిధిలోని గన్నెవారిపల్లి కాలనీలో నివాసముంటున్న కృష్ణవేణి మెడలోని బంగారు గొలుసును దుండగులు అపహరించుకెళ్లారు. పోలీసులు తెలిపిన మేరకు... మంగళవారం తెల్లవారుజామున తన ఇంటి వద్ద ఉన్న పశువుల పాక వద్ద చెత్తను కృష్ణవేణి శుభ్రం చేస్తుండగా ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై అక్కడకు చేరుకున్నారు. వీరిలో ఒకరు కిందకు దిగి కృష్ణవేణి మెడలోని 3 తులాల బంగారు గొలుసును లాక్కొని ద్విచక్ర వాహనంపై ఉడాయించాడు. మంకీక్యాప్ ధరించడం వల్ల వారు ఎవరైంది తెలియకుండా పోయింది. కృష్ణవేణి కేకలతో చుట్టపక్కల వారు అక్కడకు చేరుకునే లోపు దుండగులు కంటికి కనిపించకుండా పోయారు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు తాడిపత్రి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన ప్రదేశంలోని ఓ ఇంటి వద్ద ఉన్న సీసీకెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
వైఎస్ఆర్సీపీ నాయకురాలు కృష్ణవేణి దంపతులపై దాడి
-
వైఎస్ఆర్సీపీ నాయకురాలు కృష్ణవేణి దంపతులకు లోకేష్ టీం వార్నింగ్
-
‘పూజారమ్మా... అర్చన చెయ్యి’.. ఇక అక్కడ ఇదే మాట వినపడుతుంది
‘పూజారి గారూ... అర్చన చెయ్యండి’ అనే మాట ప్రతి గుడిలో వినపడేదే. కాని తమిళనాడులో ఒక మార్పు జరిగింది. పూజారులుగా స్త్రీలు నియమితులయ్యే ప్రయత్నం మొదలయ్యింది. ‘పూజారమ్మా... అర్చన చెయ్యి’ అనే ఇకపై మాట వినపడనుంది. రమ్య, కృష్ణవేణి, రంజిత అనే ముగ్గురు మహిళలు అర్చకత్వం కోర్సును ముగించి త్వరలో పూజారులుగా నియమితం కానున్నారు. ‘మహిళలు పైలెట్లుగా, వ్యోమగాములుగా దిగంతాలను ఏలుతున్నప్పుడు దేవుని అర్చనను ఎందుకు చేయకూడదు’ అనే ప్రశ్న తమిళనాడు ప్రభుత్వం లేవనెత్తింది. అంతేకాదు దానికి సమాధానం కూడా వెతికింది. జవాబును ప్రజల ముందుకు తెచ్చింది. గతంలో ఛాందస దృష్టితో బహిష్టు కారణాన స్త్రీలను ‘అపవిత్రం’ అని తలచి గర్భగుడి ప్రవేశానికి, అర్చనకు దూరంగా ఉంచేవారు. గ్రామదేవతల అర్చనలో స్త్రీలు చాలా కాలంగా ఉన్నా ఆగమశాస్త్రాలను అనుసరించే దేవాలయాలలో స్త్రీలు అర్చకత్వానికి నిషిద్ధం చేయబడ్డారు. ఇప్పుడు ఆ విధానంలో మార్పును తెచ్చింది తమిళనాడు ప్రభుత్వం. మహిళా అర్చకులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వనుంది. అందులో భాగంగా ముగ్గురు మహిళలు ఒక సంవత్సరం కోర్సును ముగించి సహాయక అర్చకులుగా శిక్షణ పొందనున్నారు. ఒక సంవత్సరంపాటు ఆలయాల్లో శిక్షణ పొందాక ప్రధాన అర్చకులు కానున్నారు. అందరూ యోగ్యులే డి.ఎం.కె నేత కరుణానిధి 2007లో అర్చకత్వానికి అన్ని కులాల వాళ్లు యోగ్యులే అనే సమానత్వ దృష్టితో తమిళనాడులో ఆరు అర్చక ట్రైనింగ్ స్కూళ్లను తెరిచారు. అయితే ఆ కార్యక్రమం అంత సజావుగా సాగలేదు. ఇప్పుడు స్టాలిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని కులాల వాళ్లు అర్చకత్వం కోర్సు చేసి పూజారులుగా నియమితులు కావచ్చన్న విధానాన్ని ప్రోత్సహించింది. దాంతో గత సంవత్సరం నుంచి చాలామంది ఈ కోర్సుల్లో చేరుతున్నారు. అయితే తిరుచిరాపల్లిలోని అర్చక ట్రైనింగ్ స్కూల్లో ముగ్గురు మహిళలు ఈ కోర్సులో చేరడంతో కొత్తశకం మొదలైనట్టయ్యింది. రమ్య, కృష్ణవేణి, రంజిత అనే ముగ్గురు మహిళలు ఒక సంవత్సరం కోర్సులోని థియరీని విజయవంతంగా పూర్తి చేసి ప్రభుత్వ హిందూ ధార్మిక మంత్రిత్వ శాఖ నుంచి తాజాగా సర్టిఫికెట్లు పొందారు. ప్రాక్టికల్స్‌లో భాగంగా ఒక సంవత్సరం పాటు వివిధ ఆలయాల్లో సహాయక అర్చకులుగా పని చేసి తదుపరి అర్చకులుగా నియమితులవుతారు. కోర్సు చదివిన కాలంలో వీరికి 3000 రూపాయల స్టయిపెండ్ లభించింది. దేవుడు కూడా బిడ్డడే ‘దేవుడు కూడా చంటిబిడ్డలాంటివాడే. గర్భగుడిలో దేవుణ్ణి అతి జాగ్రత్తగా ధూపదీపాలతో, నైవేద్యాలతో చూసుకోవాలి. స్త్రీలుగా మాకు అది చేతనవును’ అంది రమ్య. కడలూరుకు చెందిన ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగం మాని మరీ అర్చకత్వం కోర్సులో చేరింది. మరో మహిళ కృష్ణవేణి ఇంటర్ వరకూ చదివి ఈ కోర్సు చేసింది. మూడో మహిళ రంజిత బి.ఎస్సీ చదివింది. ‘మా బ్యాచ్‌లో మొత్తం 22 మంది ఉంటే మేము ముగ్గురమే మహిళలం. కాని గత నెలలో మొదలైన కొత్తబ్యాచ్‌లో 17 మంది అమ్మాయిలు చేరారు. రాబోయే రోజుల్లో ఎంతమంది రానున్నారో ఊహించండి’ అంది రమ్య. తమిళనాడులో మొదలైన ఈ మార్పును మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తాయో లేదో ఇప్పటికైతే సమాచారం లేదు. కాని స్త్రీలు దైవాన్ని కొలిచేందుకు ముందుకు వస్తే ఇకపై వారిని ఆపడం అంత సులువు కాకపోవచ్చు. -
ఇల్లే సేవా కేంద్రం
కావల్సినన్ని వనరులు సమకూరినప్పుడు కూర్చుని సేద తీరుదామనుకుంటారు చాలామంది. తమ చుట్టూ ఉన్న నలుగురికైనా వారి స్వశక్తిని నమ్ముకునేలా చేయూతనిద్దాం అనుకుంటారు అతి కొద్దిమంది. అలాంటివారిలో కొత్తమాసు కృష్ణవేణి ఒకరు. సికింద్రాబాద్‌లోని టెలికాం కాలనీ, కానాజీగూడలో ఉంటున్న ఈ గృహిణి తన ఇంటినే సేవాకేంద్రంగా మలిచి పదేళ్లుగా మహిళలకు ఉపాధి శిక్షణా కార్యక్రమాలను ఉచితంగా అందిస్తున్నారు. మహిళలకు శిక్షణ ఇస్తూ బిజీగా ఉన్న కృష్ణవేణిని కలిసినప్పుడు, ఆమె సేవామార్గం వివరాలను ఇలా పంచుకున్నారు.. ‘‘పదిహేనేళ్ల క్రితం మావారు రంగారావు సత్యసాయి సేవాకార్యక్రమాలలో పాల్గొనేవారు. నేనూ ఆ కార్యక్రమాలకు వారి వెంట వెళ్లేదాన్ని. ఆ సమయంలోనే గ్రామాలలోని మహిళలకు స్వయం ఉపాధికి పనికి వచ్చే కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనుకున్నాను. అప్పుడే మల్లాపూర్ గ్రామంలో మొట్ట మొదటిసారిగా నాకు వచ్చిన కుట్టు పనులను అక్కడి మహిళలకు నేర్పించి, వారికి ఆదాయ మార్గం చూపటం సంతృప్తినిచ్చింది. ఇంటి వద్ద నుంచి.. సేవా కార్యక్రమాలు ఎలా చేయచ్చో ఆ ఆడుగులు ఎలాగూ నేర్పించాయి. ఇంట్లో మా వారికి చెప్పి పైన ఓ గదిని ఏర్పాటు చేశాను. ఇంట్లోనే ఉంటాను కాబట్టి మహిళలకు టైలరింగ్, సాయంకాలాలు పేద పిల్లలకు ట్యూషన్లు చెప్పేదాన్ని. ఇక్కడ ఒక్కచోటే సేవ చేస్తూ ఉంటే కాదు, మరికొందరికి ఉపాధిని అందిస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో గ్రామాలకి వెళ్లడం ్రపారంభించాను. వెళ్లిన ఊళ్లో ముందుగా అక్కడ అనువైన స్థలం చూసుకొని, ఒక టీచర్ని ఏర్పాటు చేసి, నేర్చుకునేవారిని ఎంపిక చేసేదాన్ని. సాయిసంస్థ ద్వారానే రెండు నెలల పాటు 200 మందిని 10 బృందాలుగా చేసి, స్వయంగా శిక్షణ ఇచ్చాను. గృహిణిగా ఇంటి పనులు చేసుకుంటూ ఉండే నేను అలా ఒక్కో ఏడాది దాటుతూ సేవాకార్యక్రమాల్లో తీరికలేకుండా అయిపోవడం ఎంతో సంతృప్తినిచ్చింది. స్వచ్ఛంద సంస్థలతో కలిసి.. ఈ 10 ఏళ్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలోని 300 గ్రామాలలో దాదాపు çపన్నెండు వేల మంది గ్రామీణ మహిళలకు కుట్టు మిషను, మెహెందీ, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, పేపర్ వర్క్, ఫ్యాషన్ జ్యువెలరీ తయారీ, బ్యూటీషియన్ .. వంటి శిక్షణా కార్యక్రమాలను ఉచితంగా నిర్వహించాం. ఆ తర్వాత ఈ సేవామార్గంలో కొన్ని స్వచ్ఛంద సంస్థల వాళ్లు పరిచయమయ్యారు. అలా మేధా చారిటీ, అభయ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థలతోనూ కలిసి గ్రామీణ మహిళలకు ఎనిమిది వేల కుట్టుమిషన్లు, ఇతర ఉపాధులకు అవసరమయ్యే పని ముట్లను ఏర్పాటు చేశాం. పిల్లలకు ఫ్రీ ట్యూషన్లు కరోనా తర్వాత పిల్లలకు చదువులు బాగా తగ్గిపోయాయి. డల్‌గా ఉన్న స్టూడెంట్స్ మరీ వెనకబడిపోకుండా ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకు ఫ్రీ ట్యూషన్స్ ఏర్పాటు చేశాం. ఇందుకు ప్రభుత్వ స్కూల్ విద్యార్థులనే ఎంచుకుంటాం. ఉపాధికి దారులు అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో తెలిసినవారి నుంచి ఇక్కడి మహిళలకు ఆర్డర్ మీద వర్క్స్ ఇప్పిస్తుంటాను. ఈ ఆర్డర్లు తెచ్చుకోవడానికి ఈ బృందంలోని వారి నుంచి కొందరిని నియమిస్తాను. అమెరికాలో, దూర్రపాంతాల్లో తెలిసినవారుంటే వారికి మావాళ్లు చేసిన వర్క్స్ ఫోన్ల ద్వారా చూపించి, ఆర్డర్స్ తెప్పిస్తుంటాం. వారికి కొరియర్ ద్వారా పంపిస్తుంటాం. దీని ద్వారా ఈ మహిళలకు కొంత ఆదాయం లభిస్తుంది. కోర్సు తర్వాత వారి ఇంటి వద్దనే నేర్చుకున్న పనిని కొనసాగించేలా కూడా చూస్తున్నాం’’ అని కృష్ణవేణి వివరించారు. – నిర్మలారెడ్డి -
కృష్ణవేణికి ఘంటసాల శతాబ్ది పురస్కారం
ప్రముఖ సీనియర్ నటి, నిర్మాత కృష్ణవేణి ‘ఆకృతి– ఘంటసాల శతాబ్ది పురస్కారం’ అందుకున్నారు. ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆకృతి–ఘంటసాల శతాబ్ది పురస్కారాన్ని కృష్ణవేణికి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ఎవరినైనా సక్సెస్ తర్వాతే గుర్తు పెట్టుకుంటారు. కానీ, ఎంతోమందికి సక్సెస్ ఇచ్చిన కృష్ణవేణిగారికి తగినంత గుర్తింపు రాకపోవడం బాధాకరం’’ అన్నారు. ‘‘నేటి తరం సినిమా వాళ్లకు కృష్ణవేణిగారి జీవితం పుస్తకంలా ఉపయోగపడుతుంది’’ అన్నారు తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొల్లేటి దామోదర్. ‘‘కృష్ణవేణిగారు ఒక లెజెండ్’’ అన్నారు నటి రోజా రమణి. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవరాలు అజిత, ఫిక్కీ సీఎండీ అచ్యుత జగదీష్ చంద్ర, నటుడు మోహనకృష్ణ, ‘ఆకృతి’ సుధాకర్ పాల్గొన్నారు. -
మంగళగిరి రూరల్ పోలీసులకు మరోసారి కృష్ణవేణి ఫిర్యాదు
-
నా భర్తను కరెంట్ వైర్లతో కాల్చి పీక పిసికి చంపారు
1979లో 'నగ్న సత్యం' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది నటి కృష్ణవేణి. 43 సంవత్సరాల కెరీర్లో హీరోయిన్గా, సహాయక నటిగా, కమెడియన్‌గా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించిందావిడ. సుమారు 200కు పైగా సినిమాల్లో నటించిన ఆమె తన జీవితంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి వెల్లడించింది. 'నేను 'వారాలబ్బాయి' డైరెక్టర్ రాజచంద్రను పెళ్లి చేసుకున్నాను. అప్పటికే ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. వాళ్లు ఏమీ లేనివారు. ఇంటి అద్దె కట్టుకోవడానికి కూడా కష్టాలు పడ్డారు. తీరా ఒక్కో మెట్టు ఎదిగి ఒక సినిమాకు రెండు, మూడు లక్షల రూపాయలు తీసుకునే సమయానికి చచ్చిపోయాడు. మేం ఇద్దరం పెళ్లి చేసుకున్నాక కలిసి నాలుగేళ్లున్నాం. నిజానికి నాకు నలుపంటేనే నచ్చదు. టీ నల్లగా ఉంటేనే తాగను, అలాంటిదాన్ని అనుకోని పరిస్థితుల వల్ల నల్లగా ఉండే అతడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మీలాంటోళ్లు నాకు హెల్ప్‌గా ఉంటే నేనెక్కడో ఉండేవాడిని అని తరచూ అంటుండేవాడు. ఆయన తీసిన ఎన్నో సినిమాలు వందరోజులు ఆడాయి. ఇది చూసి ఓర్వలేక ఇండస్ట్రీవాళ్లే ఆయనను హత్య చేశారు. కరెంట్ వైర్లతో కాల్చి, పీక పిసికి ఊపిరాడకుండా చేసి చంపేశారు. పోలీసువాళ్లు కూడా ఎవరు చేయించారో మాకు తెలుసు, కానీ మేం ఏం చేయలేం అని చేతులెత్తేశారు. మా కుటుంబాన్ని లేపేస్తామని బెదిరింపులు రావడంతో పోలీసులు రెండేళ్లపాటు ఇంటిచుట్టూ కాపలాగా ఉన్నారు. దీనికంతటికీ కారణమైన హీరోయిన్ చనిపోయింది' అని చెప్పుకొచ్చింది కృష్ణవేణి. కానీ ఆ హీరోయిన్ ఎవరన్న విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. -
ఊరు ఇంటర్ పాసైంది
ఇరులపట్టి గ్రామం. ఎక్కడుంది? డెంకణికొట్టయ్ తాలూకా. ఎక్కడుంది? బొమ్మతతనూర్ పంచాయితీ. ఎక్కడుంది? కృష్ణగిరి జిల్లా. ఓ.. తమిళనాడు! తమిళనాడులోని ఆ ఇరులపట్టి గ్రామం ఇప్పుడు వార్తలలోకి రావడానికి మంచి కారణమే ఉంది. ఆ ఊరి ఇంటర్ విద్యార్థిని కృష్ణవేణి గురువారం వచ్చిన ఫలితాలలో 600 మార్కులకు 295 మార్కులతో పాసై ఊరికి గుర్తింపును తెచ్చింది. ఇరులపట్టి గ్రామంలో ఇంటర్ పాస్ అయిన తొలి విద్యార్థి కృష్ణవేణి. పక్క జిల్లా అయిన ధర్మపురిలో.. పాలాకోడ్ సమీపంలోని కొత్తూరు ప్రభుత్వ కళాశాలలో ఆమె చదివింది. టెన్త్ కూడా అక్కడే. తొంభై తొమ్మిది, తొంభై ఎనిమిది శాతాలతో పిల్లలు పాస్ అవుతున్న కాలం ఇది. అయితే కృష్ణవేణిని వారితో సమానంగా అభినందించడానికి ఆమె సాధించిన మార్కులను కాకుండా, ఆమె ప్రయత్నాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఇంటర్లో కామర్సు, అకౌంట్స్ సబ్జెక్టులతో పాసైంది కృష్ణవేణి. ఇరులపట్టి చుట్టుపక్కల చాలావరకు తెలుగు, కన్నడ మీడియం పాఠాశాలలే. అందుకని తమిళ మీడియం కోసం పొరుగు జిల్లాల్లోని హాస్టల్లో ఉండి.. అక్కడే ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకుంది. బ్యాంక్ పరీక్షలు రాస్తూ, సివిల్ సర్వీసుకు ప్రిపేర్ అవుతూ ఒక మంచి ఉద్యోగం సంపాదించాలని ఆమె లక్ష్యం. తండ్రి రైతు. తల్లి గృహిణి. ఇద్దరు తోబుట్టువులు. వాళ్ల చదువు టెన్త్ తర్వాత ఆగిపోయింది. కృష్ణవేణి ఆ ఊరి చరిత్రలోనే ఇంటర్ పాస్ అయిన తొలి విద్యార్థి అనే వార్త రాగానే చుట్టుపక్కల డిగ్రీ కళాశాలల నుంచి ఆమెకు సీటు ఇస్తామన్న ఆఫర్లు మొదలయ్యాయి! ధర్మపురిలోని ‘ఆర్ట్స్ అండ్ సైన్స్’ ప్రైవేటు కాలేజీ ఇప్పటికే ఆమె కోసం అడ్మిషన్‌ను రిజర్వు చేసి ఉంచింది! ఇంటర్ ఫలితాలు వచ్చిన రోజు డెంకణికొట్టయ్ డిఎస్పీ సంగీత, కేళమంగళం పోలీస్ స్టేషన్ సిబ్బంది ఇరులపట్టి గ్రామంలోనే ఉన్నారు. స్థానికులకు రేషన్ బియ్యం, పప్పు, నూనెల పంపిణీ సక్రమంగా జరుగుతున్నదో లేదో పర్యవేక్షిస్తున్నారు. ఆ పనిలో ఉన్నప్పుడే కృష్ణవేణి గురించి డిఎస్పీ సంగీతకు తెలిసింది. వెంటనే ఆమెను పిలిపించి అభినందించారు. ‘‘నేనూ నీ లాగే పల్లె ప్రాంతం నుంచి వచ్చాను. మా ఇంట్లో నేనే తొలి గ్రాడ్యుయేట్‌ని’’ అని తన సంతోషాన్ని పంచుకున్నారు సంగీత. ఆర్థికంగా కృష్ణవేణికి సహాయం చేకూరేలా చేస్తానని కూడా చెప్పారు. ఇరులపట్టి గిరిజన గ్రామం. ఇకముందు కృష్ణవేణి ఏం సాధించినా అది ఊరు పంచుకునే విషయమే అవుతుంది. కృష్ణవేణి ర్యాంకు సాధించలేదు. నైంన్టీ నైన్ పర్సెంటేమీ రాలేదు. ఇంటర్ పూర్తి చేసింది.. అంతే! ఊరి పేరు మార్మోగిపోతోంది. ఊరి చరిత్రలోనే.. తొలి.. ఇంటర్ ఉత్తీర్ణురాలు కృష్ణవేణి!! -
తమ్మారెడ్డి భరద్వాజకు మాతృ వియోగం
ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాతృమూర్తి కృష్ణవేణి (94) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం తుది శ్వాస విడిచారు. తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి కృష్ణమూర్తి కూడా చిత్ర నిర్మాతే. రవీంద్ర ఆర్ట్స్ పతాకంపై ‘లక్షాధికారి, జమీందారు, బంగారు గాజులు, ధర్మదాత, దత్త పుత్రుడు, డాక్టర్ బాబు’ వంటి అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించారు కృష్ణమూర్తి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు లెనిన్ బాబు చనిపోయారు. చిన్న కుమారుడు భరద్వాజ నిర్మాతగా, దర్శకుడిగా అనేక విజయవంతమైన చిత్రాలు అందించారు. మొదటి నుంచి వీరిది వామపక్ష భావాలున్న కుటుంబం. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘నా తల్లి రెండు నెలలుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న నా మిత్రులు, శ్రేయోభిలాషులు ఫోన్లు చేస్తున్నారు. కరోనా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నందున నన్ను పరామర్శించడానికి ఎవరూ ఇంటికి రావద్దు’’ అని కోరారు. కాగా కృష్ణవేణి మరణ వార్త లె లుసుకున్న చిరంజీవి ఫో¯Œ లో తమ్మారెడ్డి భరద్వాజను పరామర్శించారు. -
తమ్మారెడ్డికి చిరంజీవి పరామర్శ
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి కృష్ణవేణి(94) సోమవారం మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నేడు తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇందుకు సంబంధించి తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. తన తల్లి రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పారు. తన తల్లి మరణవార్త తెలిసి మిత్రులు, శేయోభిలాషులు చాలా మంది ఫోన్లు చేస్తున్నారని అయితే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున తనను పరామర్శించేందుకు ఎవరు ఇంటికి రావద్దని కోరారు. తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి కృష్ణమూర్తి కూడా నిర్మాత అనే సంగతి తెలిసిందే. రవీంద్ర ఆర్ట్స్ పతాకంపై లక్షాధికారి, జమీందారు, బంగారు గాజులు, ధర్మదాత, దత్త పుత్రుడు, డాక్టర్ బాబు వంటి హిట్ చిత్రాలను ఆయన నిర్మించారు. కృష్ణమూర్తి, కృష్ణవేణి దంపతులకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు లెనిన్‌బాబు మరణించాడు. చిన్న కుమారుడు తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాతగా, దర్శకుడిగా అనేక విజయవంతమైన చిత్రాలను అందించారు. తొలి నుంచి వీరిది వామపక్ష కుటుంబం. కాగా, కృష్ణమూర్తి 2013లో మృతిచెందారు. తమ్మారెడ్డి భరద్వాజను ఫోన్లో పరామర్శించిన చిరంజీవి.. తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కృష్ణవేణి మరణవార్త తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆయనను ఫోన్లో పరామర్శించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సంతాప సందేశాన్ని తెలియజేశారు. సినిమా ఒక మజిలీ, సమ సమాజం నా అంతిమ లక్ష్యం అనే కృష్ణమూర్తి.. తెలుగు సినిమా పరిశ్రమకు ఇతోదిక సేవలదించారని చిరంజీవి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. -
మగవాళ్ల రాజ్యంలో ‘స్త్రీ మహాలక్ష్మి’
స్త్రీకి ఉండనిదే ఆర్థిక స్వాతంత్య్రం. అదుంటే అన్ని స్వాతంత్య్రాలూ వచ్చేస్తాయి. ఆర్థిక స్వాతంత్య్రం అంటే.. చేతి నిండా డబ్బు ఉండటం కాదు. ఆ డబ్బును ఇష్టానికి ఖర్చు చేసే స్వేచ్ఛ ఉండటం. కృష్ణవేణి, ఆమె కూతురు అనురాధ.. స్వప్నాదత్, ప్రియాంకాదత్, లక్ష్మీ మంచు .. వీళ్లకు.. సినిమాలు నిర్మించడం ఇష్టం. నిర్మిస్తే డబ్బు రావచ్చు.. పోవచ్చు. పోతుందేమోనని ఇష్టాన్ని చంపుకోలేదు వీళ్లు! మంచి మంచి సినిమాలు తీశారు. తీస్తున్నారు. రేపు మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా.. మగవాళ్ల రాజ్యంలో ‘స్త్రీ మహాలక్ష్మి’గా వెలిగిన.. వెలుగుతున్న.. సినీ మహిళా నిర్మాతలతో సాక్షి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలు ఇవి. ►చిత్రసీమకు సంబంధించిన తొలి తరం తారల్లో గాయనిగా, నటిగా, నిర్మాతగా మీకు మంచి పేరు ఉంది. నటిగా కెరీర్ ఎలా మొదలైందో చెబుతారా? కృష్ణవేణి: ‘సతీ అనసూయ’ (1936)లో బాలనటిగా నటించాను. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాను. అంతకుముందు డ్రామాల్లో నటించాను. అప్పట్లో మా పాత్రలకు మేమే పాడుకోవాలి. అలా గాయనిగా కూడా మంచి పేరు వచ్చింది. మీర్జాపురం రాజా మేకా వెంకటరామయ్య అప్పారావుగారు నిర్మించిన ‘భోజ కాళిదాసు’కి నన్ను సెకండ్ హీరోయిన్గా తీసుకున్నారు. అందులో కన్నాంబ ఫస్ట్ హీరోయిన్. ఆ తర్వాత ఆయన బేనర్లోనే ‘జీవన జ్యోతి’ సినిమాలో మెయిన్ హీరోయిన్గా చేశాను. నటిగా నన్ను బాగా ఎస్టాబ్లిష్ చేసిన సినిమా అది. 15 సినిమాలకు పైగా హీరోయిన్గా నటించాను. ►మరి నిర్మాణరంగంవైపు ఎలా వచ్చారు? కృష్ణవేణి: ‘జీవనజ్యోతి’ తర్వాత మీర్జాపురం రాజాగారితో నా పెళ్లయింది. మాది ప్రేమ వివాహం. అప్పుడు నాకు 17 ఏళ్లు. జయా పిక్చర్స్‌పై నా భర్త తీసిన సినిమాలకు నిర్వహణ బాధ్యతలు చూసుకునేదాన్ని. అలా నిర్మాణరంగంవైపు వచ్చాను. ఆ సంస్థ పేరుని ఆ తర్వాత ‘శోభనాచల పిక్చర్స్’గా మార్చాం. ‘గొల్లభామ’ (1947), ‘మన దేశం’ (1949), ‘లక్ష్మమ్మ’ (1950), ‘దాంపత్యం’ (1957) వంటి సినిమాలు నిర్మించాం. కొన్నింటిలో నేను కూడా నటించాను. ‘మన దేశం’తో ఎన్టీఆర్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేశాం. ఇది నిర్మాతగా నాకు కంప్లీట్ సినిమా. ఎన్టీఆర్‌తో ‘పల్లెటూరి పిల్ల’ కూడా తీశాం. నా భర్తతో కలిసి ప్రొడక్షన్ చూసుకునేదాన్ని. స్టోరీ సిట్టింగ్స్, మ్యూజిక్ సిట్టింగ్స్‌లో కూడా కూర్చునేదాన్ని. షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ అంతా చేసేదాన్ని. ►భానుమతిగారు, విజయ నిర్మలగారు, మీరు.. ఇలా కొందరు నిర్మాతగా చేశారు. తర్వాత మీ అమ్మాయి (అనురాధా దేవి). ఇప్పుడు కూడా వేళ్ల మీద లెక్కపెట్టేంత మంది మహిళా నిర్మాతలే ఉన్నారు... కృష్ణవేణి: భానుమతి డైనమిక్. ఆవిడని చూసి అందరూ గడగడలాడేవాళ్లు. అంత ధైర్యం ఉంటే ఇక్కడ నిర్మాతగా రాణించవచ్చు. లేకపోతే కష్టం. ఇక విజయనిర్మల కూడా చాలా ధైర్యవంతురాలు. చాలా స్వీట్ పర్సన్. భానుమతి, విజయనిర్మలలది ఒక మొండి వైఖరి. అలా ఉంటే నిర్మాతలుగా చేయొచ్చు. నిర్మాత అంటే మగవాళ్లే అనే ఫీలింగ్ ఏదో పడిపోవడం వల్ల కొందరు రావడంలేదేమో. అనురాధ: అమ్మాయి అంటే నటిగా ఓకే కానీ నిర్మాతలుగా రానివ్వరు. బ్యాకింగ్ ఉంటే ఓకే. కోట్లు ఉన్నాయి.. నిర్మాత అయిపోవచ్చు కదా అనుకుంటే కుదరదు. ర్యాపో ఉండాలి. ఎంతోమంది నా దగ్గరకు సినిమాలు తీస్తామని వస్తారు. కానీ ఎంకరేజ్ చేయను. ఎందుకంటే బ్యాగ్రౌండ్ లేకపోతే కష్టం. ►మీరన్నట్లు నిర్మాతలంటే పురుషులే అనే ఫీలింగ్ చాలామందిలో ఉంది. అలాంటి పరిస్థితిలో మీకు నిర్మాణం ఏమైనా అసౌకర్యంగా అనిపించేదా? కృష్ణవేణి: చాలా హ్యాపీగా ఉండేది. కాశీమజిలీ కథలు చదివేదాన్ని. ఇంకా చాలా పుస్తకాలు చదివి, వాటిలో ఉన్న మంచి పాయింట్స్‌తో సినిమాలు నిర్మించేవాళ్లం. అంతా సాఫీగా సాగేది. కొన్ని సినిమాల్లో డబ్బులు పోయినా అదేం పెద్ద బాధ అనిపించలేదు. అనురాధ: శోభనాచల స్టూడియో మాదే. నాన్నగారు పెద్ద బ్యాకింగ్. ఇక అసౌకర్యంగా ఎందుకు ఉంటుంది? (నవ్వుతూ). చెప్పాలంటే చాలామంది అవకాశాల కోసం అమ్మని కాకాపట్టేవాళ్లు. స్ట్రాంగ్ బ్యాగ్రౌండ్ ఉంటే ఎలాంటి అసౌకర్యం ఉండదు. ►అమ్మ తర్వాత మీరు నిర్మాతగా మారారు. మీరు ఇష్టపడి వచ్చారా? వారసత్వాన్ని కంటిన్యూ చేయాలనా? అనురాధ: నాన్నగారికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో నన్ను నిర్మాతగా కంటిన్యూ అవ్వమన్నారు. నిజానికి సినిమా ఇండస్ట్రీకి రావాలనే ఆలోచన నాకంతగా లేదు. అయితే అప్పటికి కన్నడంలో రాజ్‌కుమార్‌గారితో ‘భక్త కుంభార’ అనే సినిమాని నాన్నగారు నిర్మిస్తున్నారు. ఆరోగ్య సమస్యలతో కంటిన్యూ చేయలేనని నన్ను, నా భర్త (నంగనూరు శ్రీనివాసరావు) ను ఆ సినిమా ప్రొడక్షన్ చూసుకోమన్నారు. ఆ సినిమాని నాగేశ్వరరావుగారితో తెలుగులో ‘చక్రధారి’గా రీమేక్ చేశాను. ఆ తర్వాత ఆయనతోనే ‘రాముడే రావణుడైతే’ సినిమా తీశాం. ఈ సినిమాకి దాసరిగారు డైరెక్టర్. మా బేనర్లో ఆయనకు ఫస్ట్ సినిమా. ఏయన్నార్‌గారికి ఇది ఫస్ట్ సినిమా స్కోప్ పిక్చర్. ఆ తర్వాత ఏయన్నార్–దాసరిగార్ల కాంబినేషన్లో ‘శ్రీవారి ముచ్చట్లు’ అనే సినిమా తీశాం. ఈ ఇద్దరి కాంబినేషన్లోనే తీసిన ‘రాముడు కాదు కృష్ణుడు’ కూడా సూపర్ హిట్ అయింది. అలాగే ఏయన్నార్ హీరోగా కోదండరామిరెడ్డి డైరెక్షన్లో తీసిన ‘అనుబంధం’ సూపర్ హిట్ అయింది. మురళీమోహన్, శోభన్‌బాబులతో కూడా సినిమాలు తీశాం. ►నిర్మాణం మీకెలా అనిపించింది? ఏవైనా చేదు అనుభవాలు? అనురాధ: నేను పెరిగిందే సినిమా ఇండస్ట్రీలో. నాగేశ్వరరావుగారు నన్ను బాగా ఎత్తుకునేవారు. ఎన్టీఆర్‌గారు బాగా తెలుసు. మా బేనర్లో శోభన్‌బాబుగారు నటించారు. అందరూ తెలిసినవాళ్లే కావడంతో నిర్మాతగా ఇబ్బందిపడలేదు. పైగా దాసరి నారాయణరావుగారు నన్ను సొంత సిస్టర్లా అనుకునేవారు. ఆయన నాకు ‘రాఖీ బ్రదర్’. ►బ్యాగ్రౌండ్ లేనివాళ్లకయితే ఇబ్బందులు ఎదురవుతాయా? అనురాధ: బ్యాడ్ సైడ్ ఆఫ్ ది ఇండస్ట్రీ నాకు తెలియదు. ఎందుకంటే నా లైఫ్ అంతా బాగా గడిచింది. అయితే ఇక్కడ పురుషాధిక్యం ఉంటుంది. నిర్మాత పురుషుడైతే ఒక రకంగా, ఆడవాళ్లయితే ఒకరకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. బేసిక్‌గా మేల్ డామినేషన్. అంత ఈజీగా స్త్రీలను నిర్మాతలుగా అంగీకరించే పరిస్థితి లేదు. చెప్పుకోవాలంటే ఎన్నో ఉంటాయి. కానీ ఎక్కడ లేవని సినిమా పరిశ్రమ విషయాలను బయటకు చెప్పమంటారు? ప్రపంచం మొత్తం జరుగుతున్నదే సినిమా పరిశ్రమలోనూ జరుగుతోంది. ►అయితే ఒక లేడీ నిర్మాత ఉన్నప్పుడు ఫీమేల్ టెక్నీషియన్స్‌కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే వీలు ఉంటుంది కదా? అనురాధ: అది కరెక్ట్. నా బేనర్లో సినిమా చేసిన ఎవరూ ఇబ్బందిపడలేదు. వాళ్లు సురక్షితంగా పని చేసుకునే వాతావరణం కల్పించేవాళ్లం. అయితే హీరోయిన్ సాక్షీ శివానంద్ లాంటి వాళ్లు మమ్మల్నే ఇబ్బందిపెట్టేవాళ్లు. వాళ్లంతట వాళ్లు కాస్ట్యూమ్స్ తెచ్చుకుని, డైరెక్టర్‌కి కూడా చూపించకుండా నేరుగా లొకేషన్‌కి వచ్చేయడం వంటివి చేసేవాళ్లు. ►17 సినిమాలు నిర్మించిన క్రెడిట్ మీది. ఎక్కువ సినిమాలు నిర్మించిన లేడీ ప్రొడ్యూసర్‌గా ‘లిమ్కా బుక్’ రికార్డ్‌ని సొంతం చేసుకున్నారు.. ఇప్పుడు ఎందుకు సినిమా నిర్మాణం ఆపేశారు? అనురాధ: ఆలయ దీపం (1984), ఇల్లాలే దేవత (1985) వంటి సినిమాలు తీశాం. ‘ఇల్లాలే దేవత’ సినిమా సరిగ్గా ఆడలేదు. ఆ తర్వాత ఓ పదేళ్లు నిర్మాణం మానుకున్నాం. నవీన్, అబ్బాస్, సిమ్రాన్ హీరో హీరోయిన్లుగా ‘ప్రియా ఓ ప్రియా’ (1997) సినిమాతో మళ్లీ నిర్మాణం మొదలుపెట్టాను. ఆ తర్వాత నవీన్, రవితేజతో ‘ప్రేమించే మనసు’, జేడీ చక్రవర్తి, సాక్షీ శివానంద్ జంటగా ‘మా పెళ్లికి రండి’ సినిమాలు నిర్మించాను. అయితే ‘మా పెళ్లికి రండి’ (2001) సినిమా అప్పుడు చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆ సినిమా థియేటర్లో ఉండగానే మాకు తెలియకుండా ఎవరో అమ్మేశారు. దాంతో కేబుల్‌లో వచ్చింది. సినిమా బాగున్నా నిర్మాతగా నష్టపోయాను. ఇక ఆ తర్వాత నిర్మాతగా ఫుల్స్టాప్ పెట్టేశాను. ఆ సినిమా అప్పుడు నిర్మాతగా నన్ను అణగదొక్కాలని చాలామంది ప్రయత్నించారు. సినిమా విడుదల చేయకుండా అడ్డుకోవడానికి ట్రై చేశారు. దాసరిగారి సహాయంతో ఎలాగో విడుదల చేశాను. 2005లో మావారు చనిపోయారు. నాకు ముగ్గురు కూతుళ్లు. ఇద్దరు కూతుళ్లు చనిపోయారు. మూడో అమ్మాయి మ్యారీడ్ లైఫ్ బాగుంది. అయితే భర్త, ఇద్దరు కుమార్తెలు చనిపోవడంతో ఇక నేను ప్రొడక్షన్ కొనసాగించలేకపోయాను. సౌత్ అంటే చిన్నచూపు – అనురాధ నాకు ఇందిరా గాంధీ ప్రియదర్శిని అవార్డు వచ్చింది. ఆ అవార్డుకి ఎవరో ఒకరు నా పేరుని రిఫర్ చేయాలి. అవార్డు తీసుకుని వచ్చేశాక ఎవరు రిఫర్ చేసి ఉంటారా? అని అడిగితే.. మన తెలుగు పరిశ్రమ నుంచి నా పేరుని ప్రతిపాదించలేదు. కన్నడ పరిశ్రమ తరఫున నాకు వచ్చిన అవార్డు అది. కన్నడంలో మమ్మల్ని చాలా గౌరవిస్తారు. రాజ్‌కుమార్‌గారితో తీసిన ‘భక్త కుంభార’కి బోలెడన్ని అవార్డులు వచ్చాయి. కన్నడ స్టేట్ అవార్డు కూడా వచ్చింది. అయితే నేషనల్ అవార్డు విషయంలో చిన్న చేదు అనుభవం ఎదురైంది. మన దక్షిణాది పరిశ్రమవారంటే ఉత్తరాదివారికి చిన్న చూపు. ‘భక్త కుంభార’ సినిమాని నేషనల్ అవార్డుకి పంపించాం. అయితే అవార్డు దక్కలేదు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే.. అసలు ఆ సినిమా బాక్సుని అవార్డు కమిటీవాళ్లు ఓపెన్ కూడా చేయలేదట. సౌత్ సినిమా ఇండస్ట్రీ అంటే అక్కడివారికి అంత చిన్న చూపు. -
పుట్టుక వెక్కిరించినప్పుడు
డెబొరా జియాంగ్ స్టయన్ రాసిన, ‘ప్రిసన్ బేబీ: ఎ మెమోయిర్’లో, పన్నెండేళ్ళ డెబొరా– అమెరికా, సియాటెల్‌లో ఉండే యూదులైన ఇంగ్లిష్ ప్రొఫెసర్ల జంట దత్తత తీసుకున్న పిల్ల. నవలికకి కథకురాలు డెబొరాయే. ఆమె దత్తు తల్లిదండ్రులు తెల్లవారు. ఆమె చామనఛాయతో, బహుళజాతి రూపురేఖలున్నది. డెబొరా తన గతం గురించి ప్రశ్నించినప్పుడల్లా, తల్లిదండ్రులు సమాధానం ఇవ్వకుండా దాటవేసేవారు. ఆమె ఆరవ తరగతి చదువుతున్నప్పుడు, ఒకరోజు వారి పడగ్గదిలోకి వెళ్తుంది. ‘డెబొరా జనన ధృవీకరణ పత్రాన్ని మార్చేయండి. తను వర్జీనియా జైల్లో ఉన్న, హెరాయిన్ వ్యసనానికి లోనైన తల్లికి పుట్టిందని తెలియకూడదు. సియాటెల్‌లోనే పుట్టిందని రాయండి. ఆమె మా హృదయాల్లో పుట్టిన పిల్లే కదా! తనకు నిజం తెలిస్తే, తల్లి గురించీ, తను రెండు మూడేళ్ళున్న పెంపుడిళ్ళ గురించీ ప్రశ్నిస్తుంది’ అంటూ, దత్తు తల్లి తన లాయరుకు రాసిన ఉత్తరం కంటబడుతుంది. ‘నా తల్లిదండ్రుల పడగ్గదిలో టేబుల్ అరలో ఉన్న ఆ కాగితాన్ని చదివి, వెనక్కి తోసేశాను. అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు, నా శరీరం అతిబరువుగా అనిపించింది’ అంటారు రచయిత్రి. ఆమె తనను తాను ద్వేషించుకుంటుంది. ‘జైల్లో ఉన్నవారిని ప్రేమించేదెవరు?’ అని ప్రశ్నించుకుంటుంది. ప్రతీ అవసరాన్నీ ప్రేమతో తీర్చే పెంపుడు తల్లి గానీ, తనకు రెండు సంవత్సరాల ముందట, తల్లిదండ్రులు దత్తత తీసుకున్న అన్న తెల్లరంగు జోనాథన్ తనను ముద్దుగా చూసుకుంటాడని గానీ గుర్తురాదు. పైగా, ఊచల వెనకున్న జీవసంబం«ధి అయిన తల్లిని కలుసుకోవాలన్న కోరిక హెచ్చవుతుంది. ‘1960ల వరకూ, వెయ్యి తెల్ల కుటుంబాలు కూడా నల్ల పిల్లలను దత్తు తీసుకోలేదని దత్తత పరిశోధన సర్వేక్షణలు సూచిస్తాయి. నా మార్గదర్శక తల్లిదండ్రులు నన్ను దత్తత తీసుకుని, ఆ పరిమితులను దాటారు. నా పంచదార పాకపు రంగు, బొత్తాం ముక్కు, బాదం ఆకారపు కళ్ళ గురించి అడిగినప్పుడల్లా– తను నన్ను ప్రేమిస్తోందనీ, నేను కుటుంబంలో భాగమే అనే చెప్పేది అమ్మ. నేనిప్పుడు, దేనికీ భాగం అనుకోవడం లేదని చెప్పాలంటే భయం వేసేది’ అంటారు. ఆ సంఘటన తరువాత, రక్తంలో హెరాయిన్నిండి పుట్టి, తొలి ఏడాది ఖైదులో ఆ వాతావరణంలోనే గడిపిన డెబొరా– తన సొంత తల్లిని అనుకరిస్తూ, సులభంగానే మాదక ద్రవ్యాలకు అలవాటుపడతారు. 19 ఏళ్ళొచ్చేటప్పటికి వాటిని సరఫరా కూడా చేసేవారు. దత్తు తల్లిదండ్రులతో సాన్నిహిత్యం కోల్పోతారు. ‘మాదక ద్రవ్యాలు సామాజిక వినోదం, మద్యం కేవలం పానీయం కావు నాకు. అవి నాకు మత్తు కలిగించే మాసికలా, మందులా అయి స్వస్థపరిచి– స్వేచ్ఛ కలిగించాయి. ఎడ్రినలిన్ వేగం మిగతా ప్రతీదాన్నీ ముంచేసేది.’ డెబొరా తన 30లకు చేరినప్పుడు, వ్యసనం వదిలిపెట్టడానికి అవసరమైన సహాయాన్ని పొందారు. పెంపుడు కుటుంబంతో తిరిగి సంబంధం పెంపొందించుకుని, తన జీవితపు ఉనికితో రాజీపడ్డారు. తను పుట్టిన జైలుకెళ్ళి– అక్కడ సహాయం అందించడం, ఉపన్యాసాలివ్వడం మొదలుపెట్టారు. అప్పటికి ఆమె సొంత తల్లి మరణించి ఉంటారు. పుస్తకపు చివర్న, తన కూతుళ్ళ గురించి ప్రస్తావిస్తారు రచయిత్రి. అయితే, పెళ్ళి గురించి గానీ, పిల్లలెప్పుడు పుట్టారో అన్న వివరాలు గానీ ఇవ్వరు. 2012లో– జైళ్ళలో ఉండే స్త్రీలకు అక్షరాస్యతను అందించే, ‘అన్ప్రిజన్ ప్రాజెక్ట్’ ప్రారంభించారు డెబొరా. ‘వారు జైలు నుండి బయట పడి, తిరిగి వెనక్కి వచ్చే అగత్యం లేకుండా, విజయవంతమైన జీవితం గడిపేందుకు– ఏదో ఒక ప్రావీణ్యత నేర్పే పనిది’. ఇప్పుడు పేరు పొందిన వక్తయిన యీ రచయిత్రి, తన ఉపన్యాసాలను అమెరికా జైళ్ళ సంస్కరణ, పట్టుదల, రెండవ అవకాశాలు, ఆశకుండే శక్తిపైన కేంద్రీకరిస్తారు. 176 పేజీలుండి, నిజాయితీగా రాసినదనిపించే, స్ఫూర్తినిచ్చే ఈ ఆశ్చర్యకరమైన సంస్మరణను బీకన్ ప్రెస్ 2014లో ప్రచురించింది. కృష్ణ వేణి -
ఆమె భార్య అయ్యాక
జెన్నీ ఓఫ్ఫిల్ రాసిన డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పెక్యులేషన్–‘ఆమె’ ‘భార్య’ అవకముందు మొదలవుతుంది. కథకురాలూ ప్రధానపాత్రా అయిన ‘ఆమె’ అమెరికాలోని బ్రూక్లిన్‌లో తను చేపట్టిన చిన్న ఉద్యోగాలు, గుమ్మంలో నిలుచున్న బాయ్‌ఫ్రెండ్, అతడి బీరు సీసాలనుండి తను పీకేసిన లేబెళ్ళను గుర్తు చేసుకుంటుంది. ‘పెళ్ళి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. కళా రాక్షసిని అవుదామనుకున్నాను. వారికి కళ తప్ప, లౌకిక విషయాలు పట్టవు కనుక, స్త్రీలెప్పుడూ కళా రాక్షసులు కాలేరు. వ్లాదిమిర్ నబకోవ్ తన గొడుగునే మూసేవాడు కాదు. అతని స్టాంపులను అతని భార్య వీరా నాకి అతికించేది’ అనుకుంటుంది. ‘ఆమె’ కోసం రేడియో పాటలను పెట్టే ‘నీవు’ను కలుసుకుంటుంది. వారికి పెళ్ళవుతుంది. ‘మేము అరువు గదిలోకి చటాల్న దూరి, అరువు మంచంమీద పడ్డాం. మమ్మల్ని ప్రేమించేవారందరూ బయటున్నారు. ఒక ఇల్లు ఉండటం అంటే– కొంతమందినే ఇంట్లోకి రానిచ్చి, మిగతావారందరినీ బయటే పెట్టడం. ఇంటికి ఒక చుట్టుకొలత ఉంటుంది. కొన్నిసార్లు దాన్ని ఇరుగుపొరుగులూ, యహోవా సాక్షులూ అతిక్రమించేవారు’ అంటుంది ‘భార్య’. వారిద్దరూ, ఒకరికి మరొకరు ఉత్తరాలు పంపుకునేవారు. తిరుగు చిరునామా ఎప్పుడూ ఒకటే అయుండేది, ‘డిపార్ట్మెంట్ ఆఫ్ స్పెక్యులేషన్’. ‘అప్పటికి వారు చిన్నవారు, ధైర్యవంతులు, తమ భవిష్యత్తు గురించిన కలల మైకంలో ఉండేవారు’. కొద్దికాలంలోనే, తాము త్వరపడి సంబంధం ఏర్పరచుకున్నామేమో అన్న అనుమానం ఇద్దరికీ కలుగుతుంది. అయితే, వొంటరిగా ఉండటం ఇష్టంలేక, వారా సందేహాన్ని కొట్టి పారేస్తారు. కూతురు పుట్టినప్పుడు ‘భార్య’ సంతోషపడుతుంది. అయితే, పిల్ల అరుపులూ, కేకలూ పెట్టే రకం అయినందువల్ల, తనను తీసుకుని బయటకు వెళ్ళడం కష్టమవుతుంది. పాప ప్రకాశవంతమైన ఫ్లోరోసెంట్ లైట్లు ఇష్టపడుతుందని తెలిసిన తరువాత, పక్కనున్న సూపర్ మార్కెట్‌కు తీసుకెళ్ళి, అక్కడే వీలయినంత సమయం గడుపుతుంది. ‘నీవు నన్ను ఆలోచించుకోనివ్వడం లేదు. ఒక్క నిముషంపాటు ఆలోచించుకోనియ్యేం’ అంటూ కూతుర్ని బతిమిలాడుతుంది. ‘కొందరు స్త్రీలు ఇంక తమకు పట్టని ఖరీదైన కోటును పక్కకి తోసేసినంత సులభంగా ఉద్యోగాన్ని వదిలేస్తారు’ అంటుంది– ప్రసవానికి ముందు సృజనాత్మక రచనల ప్రొఫెసర్ అయిన భార్య. ఈ డైరీలాంటి రాతలు హెచ్చవుతూ, సంసార జీవితం కలిగించే స్థలభీతిని ఎక్కువ చేస్తాయి. పెళ్ళి, తల్లిదనం గురించిన భయాందోళనలను, తత్తరబాటును– సునిశితంగా వర్ణిస్తారు ఓప్ఫిల్. నీవుకు మరెవరితోనో సంబంధం ఉందని భార్యకు తెలుస్తుంది. భార్య, ఆ వేరే అమ్మాయిని నిలదీసినప్పుడు, తను ముందెలా ఉండేదో, అలాగే ఉన్న అమ్మాయిని భర్త ఎంచుకున్నాడని గ్రహిస్తుంది. ‘ఎవరికీ, ఏదీ చెప్పొద్దు. ఆమెకు ప్రాముఖ్యతనివ్వకు’ అని బంధువు సలహా ఇస్తుంది. ఈ స్థితికి తమని తెచ్చిన అడుగులని వెనక్కి లెక్కబెట్టుకుంటూ– ఏది పోయిందో, మిగిలినదేమిటో అని విశ్లేషించుకుంటూ, కాఫ్కా, కీట్స్ నుండీ – శిక్షించబడిన రష్యన్ వ్యోమగాముల వ] రకూ, అందరినీ వేడుకొంటుంది భార్య. తమ సంబంధం చక్కబడ్డానికి జంట ఆ ప్రదేశం వదిలిపెడతారు. పోట్లాటలవుతూనే ఉంటాయి. కూతుర్ని స్కూల్లో చేర్పించి, జీవితంలో ఓడిపోయినట్టనిపించినప్పటికీ – భార్య విధిని అంగీకరించడంతో 160 పేజీల పుస్తకం హఠాత్తుగా ముగుస్తుంది. నవలికలో ఉన్న అధ్యాయాలు 46. కొన్ని ఒకే ఆలోచనతో, గమనింపుతో నిండి ఉన్నవి. అతి తక్కువ పాత్రలున్న పుస్తకంలో, ఎవరికీ పేరుండదు. నవలికలా కాక, దానికోసం రాసిపెట్టుకున్న గమనికల్లాగా అనిపించే పుస్తకం, వంకరటింకర అంచులున్న ఆధునిక వివాహాన్ని చూపుతుంది. పెళ్ళి, గుర్తింపు కోసం అన్వేషణ అన్న ఇతివృత్తం కొత్తదేమీ కాకపోయినా, నిశితమైన గమనింపుతో రాసినది. ఈ నవలికను కాఫ్ బుక్స్ 2014లో ప్రచురించింది. ఓప్ఫిల్ రచయిత్రి, ఎడిటర్. కొలొంబియా, క్వీన్స్ విశ్వవిద్యాలయాల్లో ‘మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’ బోధిస్తారు. -కృష్ణ వేణి -
నమ్మాలనుకునే గతం
‘మనకి గుర్తున్నదే, మనం చూసినదై ఉండనవసరం లేదు.’ ఇలా మొదులయ్యే బ్రిటిష్ రచయిత జూలియస్ బార్న్స్ రాసిన ‘ద సెన్స్ ఆఫ్ యాన్ ఎండింగ్’ నవలకు ప్రధాన పాత్రా, కథకుడూ అయిన టోనీ, అరవైల్లో ఉన్న వ్యక్తి. ‘జీవితం నన్నెక్కువ అల్లరి పెట్టకూడదనుకున్నాను. జీవితపు చివరి దశలో కొంతయినా విశ్రాంతి అవసరం. దానికి నేను అర్హుడిని’ అనుకునే సగటు మనిషి. అలాంటి వ్యక్తిని, 40 ఏళ్ళ కిందకి లాక్కెళ్లే పరిస్థితులు ఎదురవుతాయి. టోనీ హైస్కూల్లో చదువుతున్నప్పుడు, యేడ్రియన్ అన్న తెలివైన అబ్బాయి అదే స్కూల్లో చేరతాడు. ఇద్దరూ స్నేహితులవుతారు. యూనివర్సిటీలో టోనీకి, వెరోనికా గర్ల్‌ఫ్రెండ్ అవుతుంది. ఒక వారాంతం, టోనీ ఆమె ఇంట్లో గడపడానికి వెళ్తాడు. వెరోనికా తల్లయిన సారా– కూతురి గురించి చెడుగా చెప్పి, టోనీతో సరసాలాడుతుంది. వెనక్కి వచ్చిన తరువాత, వెరోనికా– టోనీ మధ్య అన్యోన్యత పోతుంది. యూనివర్సిటీ చివరి సంవత్సరంలో, టోనీకి– తను వెరోనికాతో కలిసున్నానని రాసిన యేడ్రియన్ ఉత్తరం అందుతుంది. ‘ప్రియమైన యేడ్రియన్, (వెరోనికా, దీన్ని నువ్వూ చదువుతూనే ఉండి ఉంటావని తెలుసు.) మీరు ఒకరికొకరు సరిగ్గా సరిపోతారు. నేను మిమ్మల్నిద్దరినీ పరిచయం చేసిన రోజుని మీరు తిట్టుకుంటారని అనుకుంటాను. కాలం తీర్చుకునే ప్రతీకారాన్ని నమ్ముతాను కనుక మీకిద్దరికీ ఒక బిడ్డ తప్పక పుట్టాలి. ఆ బిడ్డ, తల్లిదండ్రుల పాపాలకు వెల చెల్లించాలి. వెరోనికా తల్లే నన్ను కూతురి గురించి హెచ్చరించింది. నేనే నీ స్థానంలో ఉండివుంటే, నిర్ణయం తీసుకునేముందు ఒకసారి సారానూ సంప్రదించేవాడిని’ అని విషం కక్కుతూ జవాబు రాసిన టోనీ, దాని గురించి ఇక మరచిపోతాడు. ఆ 40 ఏళ్ళ పాత ఉత్తరం, అందరి జీవితాలనూ మార్చేస్తుంది. కొన్ని నెలల తరువాత యేడ్రియన్ ఆత్మహత్య చేసుకున్నాడన్న కబురు అందుతుంది టోనీకి. ప్రస్తుత కాలపు పుస్తకపు రెండవ భాగంలో, సారా– టోనీకి అయిదు వందల డాలర్ల ‘బ్లడ్ మనీ’తో పాటు రెండు పత్రాలను వదిలిపెట్టిందని లాయర్ ఉత్తరం వస్తుంది. యేడ్రియన్ డైరీ వెరోనికా వద్దే ఉందని తెలుస్తుంది. లాయర్, టోనీకి అతని గతపు ఉత్తరం అందించాక, ‘అది రాసినది నేనేనా!’ అనుకుని, నమ్మడానికి నిరాకరిస్తాడు. వెరోనికా తన వద్దున్న యేడ్రియన్ డైరీ ఇవ్వనన్నప్పుడు, టోనీ ఆమెతో ‘మర్యాదగా, స్నేహంగా’ ప్రవర్తిస్తున్నట్టు నటిస్తాడు. వెరోనికా, టోనీని మానసిక వికలాంగులుండే చోటుకి తీసుకెళ్తుంది. వాళ్ళలో ఒక వ్యక్తికి యేడ్రియన్ పోలికలుండటం గమనించిన టోనీ, ‘నీకూ, యేడ్రియన్కూ కొడుకున్నాడని తెలియలేదు’ అన్నప్పుడు, తిరుగు మెయిల్లో, ‘నీకె ప్పుడూ, ఏదీ అర్థం కాదేం?’ అన్న ప్రశ్న సమాధానంగా వస్తుంది.‘అప్పుడు జరిగినదాని గురించిన నా పక్షపు కథ ఇది. ఆ సంఘటనల నా జ్ఞాపకం అనుకోండి’ అని టోనీ, పాఠకులకు చెప్తాడు. ఆ వ్యక్తి నిజానికి యేడ్రియన్కూ, సారాకూ పుట్టినవాడు. వెరోనికా సవతి తమ్ముడు. యేడ్రియన్, వెరోనికాల సంబంధం తెగిపోవడానికీ, సారాతో అతని సంబంధానికీ, అతని ఆత్మహత్య కారణాలనూ పాఠకుల ఊహకే వదిలేస్తాడు రచయిత. గతంలో– ఏది, ఎలా జరిగిందని టోనీ నమ్మాడో, వాటికి వ్యతిరేకంగా జరిగినవే అన్నీ. కాలం, అవగాహనను మార్చేస్తుందని చెప్తుంది పుస్తకం. కష్టపెట్టే నిజాలను మరచిపోడానికి– వాటిని అణచిపెట్టి, మనసులో అల్లుకున్న కథలనే నమ్ముతాం అని కూడా చెబుతుంది. ‘భద్రంగా బతికే ప్రవృత్తి నాలో ఉండివుంటుంది. దాన్ని పిరికితనం అనేది వెరోనికా. నేనైతే అది ప్రశాంతంగా బతకడం అనుకున్నాను’ అని ఆధారపడలేని కథకుడైన టోనీ గుర్తిస్తాడు. స్ఫుటమైన, సంక్షిప్తమైన బ్రిటిష్ వచనం ఉన్న యీ 150 పేజీల పుస్తకాన్ని ‘జోనథన్ కేప్’ 2011లో ప్రచురించింది. నవల– బుకర్ ప్రైజుతో పాటు అనేకమైన అవార్డులు గెలుచుకుంది. దీని ఆధారంగా 2017లో భారత దర్శకుడు రితేష్ బత్రా దర్శకత్వంలో ఇదే పేరుతో సినిమా వచ్చింది. కృష్ణ వేణి -
బండలు
ఒకరోజు నీరజ్ అగర్వాల్ నుండి ఫోనొచ్చింది– మీ ఎయిర్‌లైనుని కోర్టుకీడ్చకపోతే చూడండి. ‘విలువైన సామాను కాజేసి, అందరూ కలిపి డబ్బు పంచుకుంటున్నట్టుగా ఉంది,’ అన్న బెదిరింపులతో, కోపంతో భగభగమంటున్నాడు. ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ మొదలవకముందు, ఇండియన్ ఎయిర్‌లైన్సే రాజై వెలుగుతున్నప్పటి కాలంలో– ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లో పనిచేస్తుండేవాళ్ళం. ‘‘ఇందూ, గంట వరకూ గ్యాంగుకి డ్యూటీలేవీ లేవు. మళ్ళీ ఎండ పోతుంది. బండలు ఖాళీగానే ఉన్నాయా?’’ ఇంటర్‌కామ్‌లో అడిగింది ప్రీతి. మా గ్యాంగులో వారి డ్యూటీలు– ఎయిర్‌బస్ టెర్మినల్‌లోనూ బోయింగ్ టెర్మినల్‌లోనూ. నన్ను మాత్రం ఈ రెండిటికీ మధ్యనున్న డొమెస్టిక్ కార్గో సెక్షన్లో పడేశారీ మధ్య. ‘‘వచ్చేయండి, ఖాళీగానే ఉన్నాయి. నేనూ నా డ్యూటీ బ్రేక్ ఇప్పుడే తీసేసుకుంటాను.’’ చెప్పాను. మూడవ వస్తోంది. కార్గో బిల్డింగ్‌కి సరిగ్గా బయట, టార్మాక్ వైపు, అందరికీ ‘అడ్డా’ –అడ్డంగా పడేసున్న ఆ పొడుగాటి స్తంభాలు. మూడడుగుల వెడల్పున్న ఆ భారీ, చదరపు, నలుపురంగు స్తంభాలు కార్గో డివిజన్లో భాగమే అనిపిస్తాయి. అవే మా అందరి బండలు! ఎండలకి కాలవు. వానలకి జడవవు. చలికి వణకవు. వడగళ్ళకి చితకవు. ఏ పది నిముషాలో ఖాళీ ఉన్న ప్రతీ ఒక్కరమూ శీతాకాలంలో వాటిమీద కూర్చోక మానం. అటునుంచిద్దరూ, ఇటునుంచిద్దరూ వచ్చారు. కాంటీన్ ట్రాలీ తోసుకుంటూ ఎటెండర్లు వస్తుంటే– సాండ్విచ్లూ సమోసాలూ పేపర్ ప్లేట్లలో సర్దుకుని, టీ, కాఫీలూ అక్కడే వున్న ప్లాస్టిక్ టేబుల్స్ మీద పెట్టుకున్నాం. కబుర్లూ, టీలూ పూర్తయాయి. ఎవరి డ్యూటీ పాయింట్లకి వాళ్ళు తిరిగి వెళ్ళారు. నేనూ కార్గో బిల్డింగ్ లోపలికి వచ్చాను.నాకోసమే ఎదురు చూస్తున్నాడు ఫెడ్ఎక్స్ ఏజెంట్, ‘‘మాడమ్, నా కన్సైన్మెంట్ సంగతేమయింది?’’ అంటూ. నక్షత్రకుడు! పది రోజుల కిందట సీ–నోట్ అని మేం పిలుచుకునే ఏడేళ్ళనాటి పాత కన్సైన్మెంట్ నోట్ ఒకటి తెచ్చినప్పటినుంచీ విసుగూ విరామం లేకుండా రోజూ ఇక్కడే చక్కర్లు కొడుతున్నాడు. ఆ నోట్లో బుక్ చేసిన వ్యక్తి పేరు సతీష్ అగర్వాల్ అని రాసుంది. ‘‘బాబూ, కార్గోలోనే కాదు, ఎయిర్‌పోర్టంతటా వెతికించినా మీ సామాను కనబడలేదు. అయినా 40 కోట్ల విలువయిన సామాను అని ఇన్వాయిస్లో ఉంది. అదీ, పన్నెండు టన్నుల మెటల్!’’ అరిగిపోయిన రికార్డులా చెప్పి, ‘‘అయినా ఇన్నేళ్ళూ మీ క్లయింట్ పట్టించుకోనేలేదేం?’’ చివరికి కుతూహలం పట్టలేక అడిగాను.‘‘నేను కొత్తగా చేరాను మామ్, నాకంత తెలియదు. బుక్ చేసిన సతీష్‌గారు పోయి ఆరేళ్ళు దాటిందట. ఇప్పుడు ఆయన కొడుకు నీరజ్ అగర్వాల్, ‘సామాను వెతికిస్తారా, చస్తారా!’ అంటూ మా పీకలమీద కూర్చున్నారు. మీకూ ఫోన్ చేస్తానన్నారు. ప్లీజ్, మళ్ళీ చూడండి’’ బతిమాలుకున్నాడు. జాలేసింది కానీ కనిపించని వాటి నెక్కడినుంచి తెచ్చేది! ఏ ఈగో దోమో చిన్న పాకెట్టో కూడా కాదు, ఎక్కడో పోయిందనుకోడానికి. ‘‘మళ్ళీ రెండ్రోజుల్లో రండి. ఇంకెక్కడైనా దొరికే వీలుంటుందేమో ప్రయత్నిస్తాను.’’ వాగ్దానం లాంటిది చేశాను.సీ–నోట్ కాపీలు తీయించి, అవేవో కరపత్రాలయినట్టు హెల్పర్లకి పంచి, కన్సైన్మెంట్ వెతకమని అన్ని చోట్లకీ పరిగెత్తించాను.ఈ వ్యవహారం అంతు తేలనప్పటికీ మా బండల మీది సంబంధాల్లో మాత్రం మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఎప్పట్లాగే. మిత్రులు శత్రువులవుతున్నారు. ఒకరి మొహం ఇంకొకరు చూసుకోడానికి కూడా ఇష్టపడని వాళ్ళు ప్రాణస్నేహితులయి పోతున్నారు. కొత్త రొమాన్సులు మొదలవుతున్నాయి. అత్తగారి ఆరళ్ళ గురించిన కబుర్లకి అంతమే లేదు. ‘రాజకీయాలు చర్చించుకోవద్దు మొర్రో!’ అని ఒకళ్ళిద్దరు గీపెట్టినా వినక, వాటి గురించిన వాదనలూ భేదాభిప్రాయాలూ మొహాలు ముడిచెట్టుకోవడం, రుసరుసలూ ఎలాగూ సామాన్యమే. కొత్తగా హైదరాబాదు నుంచి బదిలీ అయి వచ్చిన రాధిక నోట్లోంచి వచ్చీరాని హిందీ తప్ప ఇంకో భాష ఊడిపడదు.‘పోనీ, ఇంగ్లీష్‌లో ఏడవ్వమ్మా,’ అన్నా వినదు. పూనమ్ మగవాళ్ళందరి అందాన్నీ గ్రేడ్ చేస్తూ ఉంటుంది. మేం విన్నా వినకపోయినా, తనకున్నాయని ఊహించుకునే రోగాలన్నిటినీ రాజ్ ఏకరువు పెడుతుంటాడు. డైటింగ్ చిట్కాలు చెప్తుంది అనుభ. సునీతకి ఎప్పుడూ తన వంటల గోలే!ఈ మధ్యెవరో కొత్తమ్మాయి ఉద్యోగంలో చేరింది. ఆ వేటలో పడి జయంత్ రానే రావడంలేదు. వినితకి ఎప్పుడూ ‘నేను, నాకు’ అన్న టాపిక్ తప్ప మరేదీ పట్టదు.అన్ని సమస్యలకూ పరిష్కారం అజయ్ దగ్గిర మాత్రం తప్పక ఉంటుంది. వద్దు నాయనా అన్నా, ఉచిత సలహాలు ఇవ్వడం మానడు. ఒకరోజు మామూలుగా ఏ మూలో కూర్చుని ప్రేమ ఒలకబోసుకుంటుండే నీలేష్, నీనా ఎప్పుడూ లేనిది ఇక్కడికి వచ్చారు, మొహాలు చిటపటలాడించుకుంటూ! ఒక బండ చివర్న కూర్చుని లోగొంతుకలతో వాదించుకున్నారు. ఉన్నట్టుండి ఒకపక్క చెమర్చిన కళ్ళని అద్దుకుంటూనే నీనా అతన్ని చెంప మీద కొట్టింది. అతనూ తిరిగి కొట్టాడు. మేం నిశ్చేష్టులమై, చలనం లేకుండా బండలలో కలిసిపోయాం. తను ఇంచుమించు పరిగెత్తుతూ బోయింగ్ టర్మినల్ వైపు నడిచింది. అతనూ అనుసరించాడు. అదృష్టం కొద్దీ మేము తప్ప అక్కడింకెవరూ లేరు. లేకపోతే, అదో కేస్ అయి కూర్చునేది. అదంతా చూసి మేము కంగారుపడ్డాం. బండలు మాత్రం నిర్వికారంగానే గమనించాయి అంతా. ఇంతలో ఎండాకాలం వచ్చింది. బండలు వేడెక్కాయి. వాటిమీద కూర్చోవడం కాదు కదా సమీపించాలన్నా కాల్చేస్తున్న ఎండ వద్దు, వద్దంటూ వారిస్తోంది. మరవి చిన్నబుచ్చుకున్నాయో ఏమో కానీ కారునలుపుకి మారాయి.కొన్నాళ్ళు ఫెడ్ఎక్స్ అబ్బాయీ రాలేదు, నీరజ్ అగర్వాల్ నుంచి ఫోనూ లేదు. ‘హమ్మయ్యా, ప్రస్తుతానికి కొంత ఉపశమనం’ అనుకుంటూ కార్గోలో పనిచేస్తున్న వాళ్ళందరం ఊపిరి పీల్చుకున్నాం. హెల్పర్లు కూడా ఆకాశంవైపు తలెత్తి దండాలు పెట్టుకున్నారు. ఒకరోజు నీరజ్ అగర్వాల్ నుండి ఫోనొచ్చింది– మీ ఎయిర్‌లైనుని కోర్టుకీడ్చకపోతే చూడండి. ‘విలువైన సామాను కాజేసి, అందరూ కలిపి డబ్బు పంచుకుంటున్నట్టుగా ఉంది,’ అన్న బెదిరింపులతో, కోపంతో భగభగమంటున్నాడు.‘‘సర్, అంత భారీ సామాను సెక్యూరిటీ కంటపడకుండా ఎవరు బయటకి తీసుకెళ్ళగలరో మీరే ఒక్కసారి ఆలోచించండి’’ అనునయంగా చెప్పాను. కొంత వాదన తరువాత, నా శాంతస్వరం వినో ఏమో కానీ అతనే చల్లబడి, ‘‘మా ఫాక్టరీ మేనేజర్ చాలాకాలంగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతానికి ఊళ్ళో లేడు. వెంట తెస్తాను. ఆయనే గుర్తుపడతాడు.’’ అన్నాడు. సరే ఆయనొచ్చాక చూడచ్చులే అని నేనూ మర్చిపోయాను. హఠాత్తుగా ఒకరోజు, రీజినల్ డైరెక్టర్ నన్ను వెంటనే రమ్మంటున్నారన్న కబురుతో, ఎయిర్పోర్ట్ మేనేజర్ ఫోనొచ్చింది. ఎందుకా! అనుకుంటూ, ఉరుకులూ పరుగులతో ఆయన ఆఫీసులోకి అడుగుపెట్టాను. ‘‘ఈయన నీరజ్ అగర్వాల్!’’ అక్కడ కూర్చుని తీరిగ్గా టీ తాగుతున్న ఒక వ్యక్తిని పరిచయం చేశారాయన. ‘ఓహో, ఇతనేనా! పైనుండి నరుక్కు వస్తున్నాడన్నమాట! అందుకే, ఉలుకూ పలుకూ లేదీ మధ్య’ అనుకున్నాను. ‘‘ఏమమ్మా, ఈయన కన్సైన్మెంట్ పోయిందట. మీరెవరూ సహకరించడం లేదంటున్నారీయన. మీరే కదూ ఈ కేసు చూస్తున్నదీ?’’ తిన్నగా విషయానికి వచ్చారు డైరెక్టర్. పని అయిందో లేదో అని తప్ప ఆయన వివరాలు పట్టించుకోరని, నెపాలు చెప్తున్నానని అనగలిగే అవకాశం ఉందని తెలిసీ ఉండబట్టలేక, వెతికించడానికి ఎంత కష్టపడుతున్నామో క్లుప్తంగా చెప్పాను. ‘‘దాని విలువెంతో చూశారా! ఇంత నిర్లక్ష్యం ఏమిటి?’’ అడిగారాయన. అవును, చూశాను కానీ ‘మెటల్’కి ఆ ధరెందుకో అంతు పడితే కదా! ‘‘అది బుక్ చేసినదెవరో, ఏమిటో కనుక్కోండి. రేపట్లోగా రిపోర్ట్ కావాలి నాకు.’’ ‘‘ఇంక నువ్వు దయచేయి’’ అన్నారని అర్థమై, తిరుగు మొహం పట్టాను. నాకెందుకు తట్టలేదీ సంగతి? బుక్ చేసిన ఆ కొలీగ్‌నే అడిగుంటే సరిపోయేది కదా! నన్ను నేను తిట్టుకుంటూ నా ఫైల్లో ఉన్న కాపీ తీశాను. ఆర్.కె.జి. అన్న ఇనీషియల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి తప్ప సంతకం గిలికేసినట్టుంది. ఎవరిని అడిగినా చెప్పలేకపోయారు. అది పట్టుకుని ఎయిర్పోర్ట్ మేనేజర్ వద్దకి వెళ్ళాను. ‘‘ఆ టైములో మీ సెక్షన్లో ఎవరెవరి పోస్టింగ్ అయిందో కనుక్కుంటాను,’’ అన్నారాయన. మర్నాడే, ఆ వ్యక్తి రాధాకృష్ణ గుప్తా అని తెలిసింది. ఇండోర్ నుంచి శ్రీనగర్‌కి బదిలీ అయే మధ్యన మూడ్రోజులు ఇక్కడ టెంపరరీ డ్యూటీ పడిందట. ఇప్పుడతని పోస్టింగ్ బాంకాక్లో అట. ఫోన్లో మాట్లాడితే, ‘‘అవును. మొదటిరోజే భారీ సీ–నోటేదో తయారుచేశానన్న గుర్తే. కార్గోలో పనిచేసిన అనుభవం లేదప్పటికి. సలహా అడగడానికి చుట్టుపక్కల ఎవరూ కనిపించలేదు. ఏజెంటెవరో తెచ్చిన కాపీలో ‘ఇంత ఇనుమో, ఏదో’ అని రాసుందని లీలగా తప్ప మరేదీ జ్ఞాపకం రావడం లేదు. ఎన్నేళ్ళ కిందటి సంగతో!’’ అని చెప్పాడట.అయినా, బుక్ చేసింది తనే కాబట్టి అతన్ని మర్నాటి ఫ్లైటులోనే రప్పించారు. మొత్తానికి గుప్తా అయితే వచ్చాడు కానీ సామాను ఆకారం కూడా గుర్తు లేదు అన్నాడు. సిటీ, ఇంటర్నేషనల్ కార్గోతో సహా అన్ని చోట్లకీ ఇద్దరు హెల్పర్లని వెంటబెట్టుకుని తిరిగొచ్చాం. ఫలితం లేకపోయింది. రెండ్రోజుల తరువాత, మరేం తోచిందో ఏమో కానీ ఆత్రంగా వచ్చి మా బండల చుట్టూ తిరుగుతూ, ‘‘ఇదే ఆ కన్సైన్మెంట్ అనుకుంటాను’’ అన్నాడు.కనుక్కోడానికి జూనియర్ అగర్వాల్‌కి ఫోన్ చేస్తే, తన మేనేజర్ ఊరినుంచి తిరిగి వచ్చాడనీ, అతన్నీ తనతో పాటు తెస్తాననీ అన్నాడాయన ఉత్సాహంగానే.మేనేజర్‌కి 50 ఏళ్ళుంటాయి. వచ్చీ రావడంతోనే బండల్ని చూసి, ‘ఇవే, ఇవే!’ అంటూ సంతోషం పట్టలేక ఇక గెంతులేయడమొక్కటే తక్కువ!అంతటా కబురు పాకింది. ఎయిర్పోర్ట్ మేనేజర్ కూడా వచ్చి అయోమయంగానే ఆయన్ని అడిగారు, ‘‘అయితే, మీ బిల్లు మీద కోట్ల విలువ రాసుందేమిటండీ? అసలే మెటలైనా అంత ధర పలుకుతుందా!’’మేనేజర్ చిద్విలాసంగా నవ్వి, ‘‘ఇది వెండండీ!’’ అన్నాడు.అందరం నోళ్ళు వెళ్ళబెట్టాం. ‘‘అసలేమయిందంటే, వీటిని మా చెన్నై ఫాక్టరీకి పంపించాలనుకున్నాం. ఇంత బరువున్న వెండి కడ్డీలు వంగిపోతాయి కదా అని వాటికి ఇనప తాపడం చేయించాం. అప్పటికే సతీష్‌గారి ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయన వీటిని బుక్ చేయించినప్పుడు నేను లేనక్కడ. నీరజ్‌గారేమో యుఎస్‌లో ఉన్నారు. ఫెడ్ఎక్స్ వాళ్ళే సలహా ఇచ్చారట, ఏదో మెటల్ అని రాసేయమని. సతీష్‌గారు పోయాక, ఎవరూ వీటి సంగతి పట్టించుకోలేదు. ఫాక్టరీ లెక్కలు చూస్తున్నప్పుడు అవి తేలకపోయి ఫైల్సన్నీ చెక్ చేస్తుంటే ఈ మధ్యే నీరజ్‌గారి కంటపడింది.’’ ప్రశ్నార్థకంగా పెట్టిన మా మొహాలని చూస్తూ తేలిగ్గా తేల్చేశాడాయన. హమ్మయ్యా, చిక్కు ముడి విడింది! మర్నాటి చెన్నై ఫ్లైట్‌లో వాటిని లోడ్ చేయడానికి పెద్ద క్రేనులూ పటాటోపం కనిపించాయి. దూరంగా ఉన్న బే మీద నిలుచున్న ఎయిర్‌బస్ వెనకాతల హెల్పర్లందరూ గుమిగూడి ఉన్నారు. వెళ్ళి చూస్తే, వెనకనున్న కార్గో హోల్డుల్లో కడ్డీలు పట్టలేదు. వాటిని దింపేసి మళ్ళీ ఎత్తి, ముందు హోల్డులో ఎక్కించడానికి ప్రయత్నిస్తుంటే పొడుగు చాలలేదు. ఇంక వీలవక రెండిటినీ దించేశారు. ఇన్నేళ్ళూ అవిక్కడే ఎందుకు పడున్నాయో అర్థమయింది. అవసలు మా విమానాలు వేటిల్లోనూ పట్టగలిగే కొలతలున్నవి కావు!అవి తిరిగి అగర్వాలుల ఇంటికి రాజసంగా పెద్ద ట్రక్కులో ప్రయాణమయాయి. గుప్తా తప్పు కేవలం సీ–నోట్ సరిగ్గా తయారు చేయకపోవడం మాత్రమే అనుకున్నారు ముందు. కానీ, ఈ సంఘటన తరువాత కడ్డీల పొడుగు సరిగ్గా కొలిపించకుండానే బుక్ చేసి, ఆ తరువాత అవి లోడ్ అయ్యాయో లేదో అని కూడా పట్టించుకోని అతని నిర్లక్ష్యానికి అతని ఇంటర్నేషనల్ పోస్టింగ్ రద్దు చేసి, మూడు నెల్లు సస్పెండ్ చేశారు.ఇప్పుడు కాంక్రీట్ మీద మా అందరి అనుభూతులకీ సాక్షిగా ఉండే చలనరహితమైన మా బండలైతే లేవు కానీ వాటి కింద ఇన్నేళ్ళూ వర్షం, ధూళి, నుండి తప్పించుకున్న తారూ ఇసుకా మేళవించిన టార్మాక్ భాగం మట్టుకు తళతళలాడుతోంది!కానీ మేము మాత్రం మా కబుర్లకి మరో చోటేదే వెతుక్కోవాలి. -
డబ్బు అక్కరలేని చివరి మనిషి
ముంబయిలో, విమానాశ్రయం దగ్గరే ఉన్న ‘వకోలా’ అన్న ప్రాంతంలో ఉన్న ‘విశ్రామ్ టవర్స్ సొసైటీ’లో రెండు బిల్డింగులుంటాయి. అవి శిథిలమవుతున్నప్పటికీ ‘పక్కా’వే. రోజుకి రెండుసార్లు నీళ్ళొస్తాయి. వాటిల్లో ఉండేది, వివిధ వర్గాలకు చెందిన దిగువ మధ్య తరగతి కుటుంబాలు. చుట్టుపక్కలుండేవి గుడిసెలు. అరవింద్ అడిగా రాసిన, ‘లాస్ట్ మాన్ ఇన్ టవర్’లో ‘ఇతరుల వద్దనున్నవాటి గురించీ, నీ వద్ద లేకపోయిన వాటి గురించీ కలలు కను. అదే నిన్ను ధనవంతుడిని చేస్తుంది’ అని నమ్మే– ధర్మేష్ షా, ‘వంటినిండా బంగారం, ఉబ్బసం’ ఉన్న వ్యక్తి. ఆ బిల్డింగులను పడగొట్టి, ‘షాంఘై’ అన్న ఆకాశహార్మాన్ని కడదామనుకుంటాడు. ప్రతీ అపార్టుమెంటు యజమానికీ 1.52 కోట్ల రూపాయలు ఇస్తాననీ, సెప్టెంబర్ చివరికల్లా ఇళ్ళు ఖాళీ చేయాలనీ, మే నెలలోనే ప్రకటిస్తాడు. ఏ వొక్కరు ఒప్పుకోకపోయినా, తన ప్రతిపాదన వెనక్కి తీసుకుంటానని, తన సహాయకుడైన షణ్ముగం ద్వారా వారికి చెప్పిస్తాడు. అంత సొమ్ముకి రెండు అపార్టుమెంట్లు కొనుక్కోవచ్చుననుకున్న బిల్డింగ్ నివాసులలో కొందరు, వెంటనే ఒప్పేసుకుంటారు. అయితే ‘పింటో’లు, శ్రీమతి రేగో, శ్రీ కుడ్వా లాంటివారు తమతమ కారణాలవల్ల నిరాకరిస్తారు. అందరికన్నా ఎక్కువ బలంగా నిలుచుని, ఆ డబ్బుని తోసిపుచ్చిన వ్యక్తి, ‘మాస్టర్జీ’ అని అందరూ పిలిచే, ఉపాధ్యాయుడిగా రిటైర్ అయిన యోగేశ్ మూర్తి. చనిపోయిన తన భార్యా, కూతురి జ్ఞాపకాలతో బతుకుతున్నవాడు. ‘అతను ముంబయిలో 44 ఏళ్ళు గడిపాడు. నాస్తికుడయినప్పటికీ, ‘మురికి చెరువులో కమలంలా లోకంలో ఉండు కానీ, దానిలో భాగం అవకు’ అని బోధించిన హిందూ తత్వవేత్తల మాటలను తు.చ. తప్పకుండా పాటించేవాడు.’ ‘నా ఇల్లు అమ్మకపోవడం నా ఇష్టం అయి ఉండాలి’ అని నమ్మే వ్యక్తి. అయితే, దీని తరువాత, మాస్టర్జీ–భార్య చనిపోయిన తరువాత మొట్టమొదటిసారి, లోకంలో తను ఒంటరివాడిని కాననుకుంటాడు. అపార్టుమెంట్ల అమ్మకాన్ని ఆపేందుకు– సామాజిక సంస్థలనూ, పోలీసులనూ, వకీలునూ, వార్తాపత్రిలనూ, పాత విద్యార్థులనూ సమీపిస్తాడు కానీ ఫలితం ఉండదు. అతని నిర్ణయాన్ని మార్చడానికి మొదట్లో షా బతిమాలతాడు, సున్నితంగా ఒప్పించేందుకు ప్రయత్నిస్తాడు. అయితే, మాస్టర్జీ ఆదర్శవాదాన్ని అర్థం చేసుకోలేకపోతాడు. ‘డబ్బవసరం లేని వ్యక్తి తన హృదయంలో రహస్య అరలు లేనివాడు. ఎటువంటివాడితను! బేరసారాల విధానాలన్నిటినీ చూశాను. ఇలా ‘వద్దు’ అని స్థిరంగా చెప్పే ఎత్తుగడని ఎప్పుడూ చూడలేదు’ అనుకుంటాడు. సొసైటీ ప్రెసిడెంట్, సెక్రెటరీ ఒత్తిడికి లోనై, మొదట ప్రతిఘటించినవారు తమ నిర్ణయం మార్చుకుంటారు. ఈ లోపల, సెప్టెంబర్ వస్తుంది, పోతుంది. షా నుండి ఏ స్పందనా రాకపోవడంతో ఆదుర్దాపడిన కొందరు సొసైటీ సభ్యులు, మాస్టర్జీని సుత్తితో కొట్టి స్పృహ తప్పించి, డాబా మీదినుంచి కిందకి తోసేస్తారు. అతని మరణాన్ని ఆత్మహత్యగా ప్రకటిస్తారు. షా అందరి డబ్బూ చెల్లిస్తాడు. రెండు నెల్ల తరువాత, మిగతావారు కొత్త చోట్లలో నివాసం ఏర్పరచుకుంటారు. కొందరు మాస్టర్జీ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, షా ఇచ్చిన డబ్బు తీసుకోరు. తమ అపరాధ భావాన్ని తొలగించుకునేందుకు, పేదపిల్లలకు చదువు చెప్పడం ప్రారంభిస్తారు. మాస్టర్జీ పోరాటం విజయవంతం అవనప్పటికీ, అర్థవంతమైనదిగా అయితే మారుతుంది. నవల చివర్న, విశ్రామ్ సొసైటీ బయటున్న మర్రిచెట్టు, మాస్టర్జీ ఆత్మలాగే– కూల్చివేతను, ముళ్ళకంచెలను, గాజుపెంకులను తట్టుకొని, కొత్తగా వేళ్ళూనుతుంది. రచయిత రాస్తారు: ‘స్వేచ్ఛ పొందాలనుకున్న దేన్నీకూడా, ఆపేదేదీ ఉండదు’. దురాశా, కలలూ– మనిషిని ఎలా నిర్బంధిస్తాయో చెబుతుందీ నవల. అయితే, ఉన్నదాని కన్నా ఎక్కువ కావాలనుకోవడం పాపమా? అని కూడా ప్రశ్నిస్తుంది. షా కన్నా మాస్టర్జీ తక్కువ స్వార్థపరుడా? అన్న సందేహమూ కలిగిస్తుంది. ఈ పుస్తకాన్ని 2011లో ప్రచురించినది అట్లాంటిక్ బుక్స్. చెన్నైలో పుట్టిన కన్నడిగుడు అరివింద్ అడిగా. ప్రస్తుతం ఆస్ట్రేలియా పౌరుడు. వృత్తి రీత్యా పాత్రికేయుడు. 2008లో తన తొలి నవల ‘వైట్ టైగర్’కుగానూ మ్యాన్ బుకర్ బహుమతి పొందారు. -కృష్ణ వేణి -
అలాంటి ఒకమ్మాయి చనిపోతే...
సౌదీ అరేబియా, జెడ్డాలో – పదహారేళ్ళ జరీన్ వాడియా, ఆమె స్నేహితుడైన 18 ఏళ్ల పోరస్ – రహదారిపై కారు ప్రమాదంలో చనిపోతారు. ఇద్దరూ చేతులు పట్టుకుని గాల్లో తచ్చాడుతుండగా, తనాజ్ భాతేనా తొలి నవలైన ‘ఎ గర్ల్ లైక్ దట్’ మొదలవుతుంది. వారి ఆత్మలు – కింద గుమిగూడిన వారిని గమనిస్తుంటాయి. ‘జీవితంలో ఎంత అపఖ్యాతి పాలయిందో, మరణంలోనూ అలాగే ఉన్న’ అమ్మాయి జీవితం గురించి ఆమె స్నేహితులూ, బంధువులూ, పోలీసులూ– తమ తమ అభిప్రాయాలను వెళ్ళబుచ్చుతుంటారు. ‘పిన్ని ఏడుస్తున్న విధానం మనస్సును కలిచివేస్తోంది. తను నన్నొకసారి పిలిచినట్టు ‘తన అక్క గర్భం నుండి వచ్చిన పరాన్నజీవి’ని కాకుండా నేను తనకే పుట్టిన కూతుర్ని అన్నట్టుగా ఏడుస్తోంది’ అని వ్యంగ్యం కనబరుస్తుంది జరీన్. ‘సహోదరుడూ, భర్తా కాని మగవాడితో ఒకమ్మాయి ఉండటం కన్నా సౌదీ అరేబియా పోలీసులను ఇబ్బంది పెట్టేదీ మరేదీ ఉండదు’ అంటుంది. యీ సంఘటన తరువాత, నవల ఏ కాలక్రమాన్నీ పాటించక, గతానికి మళ్ళుతుంది. జరీన్ ముంబయిలో పుడుతుంది. బార్ డాన్సర్ అయిన ఆమె తల్లి పార్సీ. ముఠాకోరుడైన తండ్రి హిందూ. ఆమె చిన్నపిల్లగా ఉన్నప్పుడే వారు చనిపోతారు. పిన్ని, బాబాయి– జరీన్‌ను దత్తత తీసుకుని, తమతోపాటు జెడ్డా తీసుకెళ్తారు. పిన్నికి మానసిక అస్వస్థత ఉన్నప్పటికీ, జరీన్ తల్లిదండ్రులకు పెళ్ళవలేదని దెప్పే అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోదు. జరీన్‌ను కొడుతుంది. అబ్బాయిలను దూరంగా ఉంచేందుకు జరీన్‌కు ప్యాంట్లు తొడుగుతుంది. జుట్టు పొట్టిగా కత్తిరిస్తుంది. పినతండ్రి భార్యావిధేయుడు. వీటన్నిటిపట్లా తిరగబడిన జరీన్ తనకు 14 ఏళ్ళు వచ్చేటప్పటికే, అబ్బాయిలతో కార్లలో తిరగడం, వాళ్ళను ముద్దు పెట్టుకోవడం, వాళ్ళ సిగరెట్లు పంచుకోవడం మొదలుపెడుతుంది. అయితే వారెవరికీ మానసికంగా దగ్గరవకుండా తన ఉదాసీనతను కవచంలా వాడుకుంటుంది. పరుషమైన భాష ఉపయోగిస్తుంది. జీవితంలోనూ, ఆన్‌లైన్‌లోనూ కూడా వేధింపులకు గురవుతుంది. ‘అలాంటి పిల్ల’కి దూరంగా ఉండమని అబ్బాయిల తల్లిదండ్రులు, కొడుకులను హెచ్చరిస్తుంటారు. ఆమెకి స్వతహాగా ఉన్న తెలివి, తిరగబడే లక్షణం, స్వయం ప్రతిపత్తి గమనించిన స్కూలు పిల్లలు, పుకార్లు పుట్టిస్తుంటారు. సౌదీ సమాజంలో– పురుషులకుండే, స్త్రీలకు లేని హక్కుల లాంటి ద్వంద్వ ప్రమాణాలు జరీన్‌కు విసుగు పుట్టిస్తాయి. ఆడవాళ్ళను ఆటవస్తువులుగా చూసే బోయ్‌ఫ్రెండ్స్ చిరాకు తెప్పిస్తారు. ‘నువ్వు తప్పని, చెడ్డదానివని– సంవత్సరాలుగా అనేకమంది అనేకసార్లు చెప్పినప్పుడు, వాళ్ళను నమ్మడం ప్రారంభిస్తావు. మొహం దాచుకోవడం ప్రారంభిస్తావు. వాళ్ళు నిన్ను జడ్జ్ చేస్తున్నారనుకుంటావు. బతికేటందుకు అసలు జీవితానికే విలువైనా ఉందా! అని ఆలోచించే స్థితికి చేరతావు’ అంటుంది. చిన్ననాటి స్నేహితుడైన ‘పోరస్ దుమాసియా’ జెడ్డాలో పని చేస్తూ, ఆమె జీవితంలోకి తిరిగి ప్రవేశిస్తాడు. ముంబయి పార్సీ ‘కామా’ కాలనీ నివాసి అతను. జరీన్‌కు ఉండే ‘జాగ్రత్తయిన చిరునవ్వులూ, సిగ్గుగా ఊపే చేతులూ’ గుర్తు చేస్తాడు. గుజరాతీ ధారాళంగా మాట్లాడతాడు. ఆమెకు ఇంటిని గుర్తుకు తెస్తాడు. గమ్యం లేకుండా, గంటల తరబడి పోరస్‌తో కార్లో తిరుగుతుంది జరీన్. ఆమె అంత్యక్రియల మీదకన్నా, ఆమె మరణానికి ముందేమి జరిగిందన్న వివరాల మీదే నవల కేంద్రీకృతమవుతుంది. బహుళ దృక్పథాలతో సాగే కథనం– తమ సొంత భావోద్వేగాలనూ, మారుతున్న శరీరాలనే అర్థం చేసుకోలేకపోయే టీనేజీ పిల్లలను చెదిరిన కుటుంబ బంధాలు మరింత గాయపరుస్తాయని చెబుతుంది. కిశోరావస్థలో ఉండే పిల్లల అతిరిక్త ప్రవర్తనకు అవి మూలకారణాలు అవుతాయంటుంది. లింగ అసమానత్వం, మానసిక అస్వస్థత, మతం గురించి మాట్లాడే ఈ నవల్లో– మానభంగపు ప్రయత్నం కూడా ఉంటుంది. ఫరార్, స్ట్రౌస్, జిరూ బుక్స్ దీన్ని 2018లో ప్రచురించింది. భాతేనా ఇండియాలో పుట్టి– సౌదీ అరేబియాలోనూ, కెనడాలోనూ పెరిగారు. ఈ నవల 2019 ఒలా(ఒంటారియో లైబ్రరీ అసోసియేషన్) వైట్ పైన్ అవార్డుకి షార్ట్ లిస్ట్ అయింది. -కృష్ణ వేణి -
చీకటికి అలవాటుపడని కళ్లు
‘మమ్మల్నెవరూ చూడకుండా చీకటి పడ్డాక, ఆఖరి బస్సెక్కాం.’ కొడుకులైన తొమ్మిదేళ్ల స్టాన్, స్టాన్ సవితి తమ్ముడైన కెవిన్ని వెంటబెట్టుకుని– పేరుండని ఊరి నుంచి, అజ్ఞాతమైన ఊర్లో ఉన్న సముద్రతీరానికి బయల్దేరుతుంది ‘ఆమె.’ ఫ్రెంచ్ రచయిత్రి రేవనిక్ ఓల్మీ రాసిన ‘బిసైడ్ ది సీ’ నవలికలో– ‘అది పిల్లల ఆఖరి ప్రయాణమని ఆమెకు తెలుసు’. ‘ఉన్న డబ్బంతా మార్చి చిల్లర’ తెచ్చుకుంటుంది. తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోదు. ‘నా ఊడిన పళ్ళ వల్ల నోటికి చెయ్యడ్డం పెట్టుకోకుండా నవ్వలేను’ అనే ఆమె– కలుసుకునే సామాజిక కార్యకర్త, ఆస్పత్రి ప్రస్తావన వంటి స్వల్ప సూచనలు తప్ప, ఆమె నేపథ్య వివరాలేమీ ఉండవు. పేరు తెలియని మానసిక రోగానికని మందులు తీసుకుంటుంటుంది. వాటినీ పట్టుకెళ్లదు. ‘‘పొద్దున్నే పిల్లల్ని స్కూల్లో దింపే ఓపిక నాకుండదు. ‘స్టాన్ నన్ను తీసుకెళ్తే నాకెప్పుడూ ఆలస్యం అవదు,’ అంటాడు కెవిన్. తిన్న ప్రతిసారీ పళ్ళు తోముకోవాలని తన టీచర్ చెప్పిందంటాడు స్టాన్. వాడికి ఆత్మవిశ్వాసం ఎక్కువవుతోంది. క్రూరమైన లోకంలో ఇమిడిపోతున్నాడు. నా మినహా, సమర్థవంతుడెలా అవుతున్నాడు?’’ అనుకునే ఆమెకు అభద్రత కలుగుతుంది. ప్రయత్నించినాగానీ, మానసిక పొందిక చేతనవదు. పిల్లలకు ‘విశేషమైన చివరి రోజు’ అందించేందుకు– ఉన్మాదిలా, అలిసిపోయేవరకూ వాళ్ళను తిప్పుతుంది. హాట్ చాక్లెట్, భోజనం కొనడం కూడా కష్టమైన పనామెకు. చివర్న, తిరునాళ్ళలో ‘గంటల మ్రోత ఆగడం లేదు. ఎంత వానో, ఎంత శబ్దమో, ఎన్ని లైట్లో! అన్ని దిక్కులనుండీ జనాలు వచ్చేస్తున్నారు. అన్నీ కొనేయగలంత డబ్బెక్కడ నుండి వచ్చింది వారికి?’ అనడుగుతుంది. ‘ఇక ఇంటికి పోదాం’ అని స్టాన్ మృదువుగా చెప్తాడు. లోకం చీకటితో నిండి ఉందనీ, జీవించేందుకు అనుకూలమైనది కాదనీ ఆమె ఏర్పరచుకున్న అభిప్రాయం గట్టిపడుతుంది. కొడుకులు పెద్దయితే, తనకి ఎదురయిన నిరాశ, ఒంటరితనమే వారూ అనుభవిస్తారని ఊహించుకుంటుంది. వారిని కాపాడుకోవాలనుకుంటుంది. హోటెల్లో, వారికి ఊపిరాడకుండా చేసి చంపేస్తుంది. ‘నాకైతే చనిపోయిన పిల్లలిద్దరున్నారు. వాళ్ళకేముంది! దుప్పట్లు, కంబళ్ళ మధ్య దాగున్న వారి శరీరాలను చూడ్డానికి నిలుచున్నాను. కెవిన్ శరీరం బంతిలా ముడుచుకునుంది. స్టాన్‌ది జాచుకొనుంది. కెవిన్ మొహం గోడవైపు తిరిగి ఉంది, స్టాన్‌ది కిటికీ వైపు. మరణం యందు కలిసే ఉంటారనుకున్నాను. నేనిది ఊహించలేదు.’ ఆ ఆరవ అంతస్తు కిటికీ బయటకి చూసి, ‘వాన నాకింద ఉన్నవారికోసం కురుస్తోంది. నేను వీటన్నిటికీ పైన ఉన్నాను’ అంటుంది. చైతన్య స్రవంతిలో సాగే వాడుక భాష కథనం, ఆమె చదువుకున్నది కాదని సూచిస్తుంది. తల్లి ప్రేమకుండే శక్తికీ, తల్లి బాధ్యతలు నిర్వర్తించలేకపోయే పర్యవసానాలకీ మధ్యనుండే సంఘర్షణను ఎత్తి చూపుతుంది నవలిక. ‘పిల్లలకు తిరునాళ్ళలో చిప్స్ తినిపించి, చంపేసిన తల్లి’ అన్న వార్తాపత్రిక శీర్షిక చదివిన తరువాత, ‘పిచ్చితనం’ వంటి సాధారణీకరణాలని పట్టించుకోకుండా– ఏ ఆలోచనా రుగ్మత, సొంత పిల్లల ప్రాణాలను సైతం తీయడానికి ప్రేరేపిస్తుందో అని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తూ– నాటకకర్తా, రచయిత్రీ అయిన ఓల్మీ యీ పుస్తకం రాశారు. ‘ఇలాంటి విషాదాలని అరికట్టాలంటే, మానసిక అనారోగ్యపు సంక్లిష్టతలను అర్థం చేసుకోవాలి’ అంటారామె. 120 పేజీల యీ నవలికను, యేడ్రియానా హంటర్ ఇంగ్లిష్‌లోకి అనువదించారు. దీన్ని 2010లో ప్రచురించినది ప్రిరనీ ప్రెస్. తొలి ప్రచురణ 2001లో. ఫ్రెంచ్‌లో ‘బార్డ్ డె మేర్’ పేరుతో వచ్చిన యీ పుస్తకం ఎన్నో యూరోపియన్ భాషల్లోకి అనువదించబడింది. ఇంగ్లిష్‌లోకి ప్రచురించడానికి మాత్రం చాలాకాలం ఎవరూ ముందుకు రాలేదు. యీ అనువాదానికి అనువాదకురాలు ‘స్కాట్ మోన్క్రీఫ్’ బహుమానం పొందారు. కృష్ణ వేణి -
స్త్రీత్వం కనబడని లోకం
వుల్ఫ్‌గోంగ్ హిల్బీస్ రాసిన ‘ద ఫిమేల్స్’ జర్మన్ నవలిక– తూర్పు జర్మనీలో చిన్న పారిశ్రామిక సంఘపు నేపథ్యంతో ఉన్నది. పేరుండని కథకుడి మాటల్లో, అతను ‘అపరిశుభ్రమైన, అప్రయోజకుడైన, సమాజంలో ఇమడని మధ్యవయస్కుడు’. తల్లితో కలిసుంటాడు. ‘పదో తరగతి దాటని నీకు రాతలెందుకు?’ అని తల్లి కోపగించుకున్నా, సాహిత్యం రాస్తాడు. స్త్రీల పట్ల పరిపక్వత చెందని కిశోర ప్రాయపు అభిప్రాయాలుంటాయి. పుస్తకపు ప్రారంభంలో– కథకుడి నుంచి వచ్చే దుర్వాసనా, అతని చేతగానితనంవల్లా, ఒక కర్మాగారంలో నేలమాళిగలో పనికి పెడతారు. అతని తలపైనున్న ఇనుపచట్రాల్లోంచి పైన పని చేసే స్త్రీలు కనబడతారు. వారతనికి భౌతికంగా అందుబాటులో ఉండనప్పటికీ, వారిని చూడ్డానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. ‘నాపైన స్థిరమైన శక్తితో, పొగ కక్కుతున్న ఆ వేడి కింద– సగం చీకట్లో, కుర్చీలో కూర్చున్నాను. నా చుట్టూతా అనేకమైన ఖాళీ బీరు సీసాలు దొర్లుతున్నాయి. స్త్రీలను చూడ్డానికి తల పైకైనాఎత్తాలి లేకపోతే కుర్చీలోనైనా నిలబడాలి.’ బస్సుల్లో యువతులను ఒక పర్యవేక్షకుడు వేధించాడని తెలిసిన కథకుడు, అతన్ని బెదిరిస్తాడు. ఉద్యోగం పోతుంది. తన జీవితం గురించీ, తప్పెక్కడ జరిగిందో ఆలోచిస్తూ, మతిభ్రమతో– ‘స్త్రీలు, స్త్రీత్వపు జాడలూ కూడా ఊరినుండి మాయమైపోయాయన్న నా అనుమానాన్ని నిర్ధారించుకునేందుకు రాత్రిళ్ళు వీధివీధికీ తిరిగాను’ అంటాడు. ‘లైంగిక కోరికలు అస్వాభావికమైనవన్న వికలోద్వేగ వైద్యుల నియమాలను పాటిస్తూ పెరిగాను’ అనే కథకుడు, స్త్రీల పట్ల ఆకర్షితుడూ అవుతాడు, వారతనికి చీదరా పుట్టిస్తారు. ప్రేమించబడాలనుకొని, మానవ సాహచర్యం కోసం తహతహలాడతాడు. తన ఆత్రుత తనను ఇతరులకి దూరం చేస్తుందేమోనని భయపడతాడు. అతని నిరాశ హెచ్చవుతుండగా, అతనంటే పాఠకులకు చిరాకు ఎక్కువవుతుంది. ఏకభాషణతో సాగే నవలికలో–నిర్బంధ శిబిరంలో అతను గడిపిన కాలం, రచయితయే ప్రయత్నాలు, ఒక ఉద్యోగంలో నిలకడగా ఉండలేకపోవడానికి ఉండే కారణాలతో– ఒక క్రమంలేకుండా సాగుతుంది కథనం. ‘ప్రభుత్వం నా చేతిలో ఉన్న ప్రతి ఉపకరణాన్నీ లాక్కుంది’ అనే అతను, తన సమస్యల మూల కారణాలను వెతుకుతాడు. చివరకు బెర్లిన్ చేరుకుని, జైల్లో ఉద్యోగం చేపడతాడు. జైలు ఆవరణలో ఆడ ఖైదీలను చూసినప్పుడు, ‘ఇప్పుడు స్త్రీలెక్కడ కనిపిస్తారో తెలిసింది. వారిని తిరిగి చూసి, నా హృదయంలో పదిలపరచుకున్నాను’ అంటాడు. తనపట్ల తనకు సిగ్గు, అసహ్యం ఉండే వ్యక్తి చిత్రం ఇది. సృజనాత్మకతనూ, లైంగికతనూ, కోరికలనూ అణచివేసే ప్రభుత్వం పట్ల కోపాన్ని చూపే కథ. ఆ పరిధీకృత సమాజంలో– పాత్రలు, మగతనం గురించుండే కఠినమైన నిర్వచనాలతో సతమతమవుతాయి. దీన్లో ఉన్న స్త్రీలు పశుప్రాయులు, పురుషులకన్నా మెరుగైనవారు. మగవారు మానసిక నపుంసకులు. కథనంలో భాష– ముతకగా, అసభ్యంగా ఉన్నప్పటికీ, చివరకు గుర్తింపు కోసం కథకుని శోధన– సానుభూతి కలుగజేసి, బలవంతంగానైనా సరే, చదివిస్తుంది. అధ్యాయాల విభజన కనపడదు. హిల్బీస్ 1987లో రాసిన ‘డీ వీబర్’ పేరుతో వచ్చిన యీ నవలికను ఇంగ్లిష్‌లోకి అనువదించినది ఈసబెల్ ఫార్గో కోల్. 136 పేజీలున్న పుస్తకాన్ని ‘టూ లైన్స్ ప్రెస్’ 2018లో ప్రచురించింది. హిల్బీస్ (1941–2007) యుద్ధానంతర యుగంలో పేరు తెచ్చుకున్న జర్మన్ రచయితల్లో ఒకరు. ఆయన తరంలో చాలామందికిలాగానే హిల్బీస్కు కూడా తండ్రి లేకుండా పోయారు. ఆయన తూర్పు జర్మనీలో పెరుగుతున్నప్పుడు– అధికారులకు ఇబ్బందికరంగా మారడంతో, బెర్లిన్ గోడ పడగొట్టడానికి ముందే 1985లో ఆయన్ను పశ్చిమ జర్మనీకి వలసపోయేందుకు అనుమతించింది ప్రభుత్వం. జర్మన్ ప్రధాన సాహిత్య బహుమతుల్లో ఇంచుమించు అన్నిటినీ హిల్బీస్ పొందారు. కృష్ణ వేణి