![YS Jagan Condoles To Actress Krishnaveni Death](/styles/webp/s3/article_images/2025/02/16/ysjagan1.jpg.webp?itok=3bmvl3wC)
సాక్షి, తాడేపల్లి: సినీ నటి, నిర్మాత, నేపథ్య గాయని కృష్ణవేణి మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. నటిగా తనదైన ముద్ర వేసిన కృష్ణవేణి మృతి సినీ రంగానికి తీరని లోటు అని అన్నారు. కృష్ణవేణి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సినీ నటి కృష్ణవేణి మృతి పట్ల వైఎస్ జగన్ స్పందించారు. వైఎస్ జగన్.. ఈ సందర్బంగా సంతాపం తెలిపారు. అనేక భాషల్లో నటించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందారు. నటిగా తనదైన ముద్ర వేసిన కృష్ణవేణి మృతి సినీ రంగానికి తీరని లోటు. అనేక గొప్ప చిత్రాలు తీసి నిండు నూరేళ్లు సంపూర్ణంగా జీవించి పరమపదించిన ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. కృష్ణవేణి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment