
ఎత్తుకెళ్లి...గొంతు కోసి చిన్నారిని చిదిమేశాడు
అమ్మఒడిలో ఆదమరిచి నిద్దరోతున్న చిన్నారి..
శాశ్వత నిద్రలోకి జారుకుంటానని ఊహించలేకపోయింది..
పెద్దల మధ్య పొరపచ్చాలు...ఆ పాప పాలిట శాపమయ్యాయి..
కఠినాత్ముడు...కర్కశంగా వ్యవహరించాడు..
కృష్ణవేణిని కడతేర్చాడు...
నార్కట్‌పల్లి: నార్కట్‌పల్లి మండలంలో సంచలనం సృష్టించిన చిన్నారి కృష్ణవేణి హత్యోదంతం వెనుక అయినవా రి కుట్రదాగి ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం మండలంలోని బంటుగూడెంలో వెలుగుచూసిన చిన్నారి దారుణ హత్య ఉదం తం మండల వ్యాప్తంగా దావానంలా వ్యాపి ంచింది. పోలీసులు ఘటనస్థలాన్ని పరిశీలించి దర్యాప్తును వేగవంతం చేశారు.
డాగ్‌స్వ్కాడ్ గుర్తించిందని..
చిన్నారి హత్య విషయం తెలుసుకున్న డీఎస్పీ రాంమోహన్‌రావు, సీఐ రాఘవేంద్ర వెంటనే బంటుగూడెం గ్రామానికి వచ్చారు. డాగ్‌స్క్వాడ్‌ను రప్పిం చారు.అయితే డాగ్‌స్క్వాడ్ అక్కడే ఉన్న రమావత్ శ్రీ ను గుర్తించింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు.
పనిచేసుకునేందుకు వచ్చి..
పోలీసులు అదుపులోకి తీసుకున్న రమావత్ శ్రీను హత్యగాబడిన కృష్ణవేణికి వరుసకు మామ అవుతాడు. పెద్దవూర మండలం మూలతండాకు చెందిన హనుమంతు మొ దటి భార్య భారతి చనిపోవడంతో తన మేడకోడలు చంద్రకళను వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు ఇద్దరు, రెండో భార్యకు ఇద్దరు చొప్పు న ఆడపిల్లలు జన్మించారు. కాగా, 3 నెలల నుంచి హనుమంతు తన భార్య పిల్లలో కలిసి బంటుగూడెం లో తోట వద్ద జీతానికి పనిచేస్తున్నాడు.
మొదటిభార్య సోదరుడైన రమావత్ శ్రీను బావ దగ్గరికి ఇరవై రోజుల క్రితం వచ్చి కూలిపనులు చేసుకుంటున్నాడు. ఇతడితో పాటు చంద్రకళ చిన్నాన్న కుమారుడు అరుణ్ కూడా వచ్చి ఉంటున్నాడు. అయితే కృష్ణవేణి హత్య జరిగిన రోజే తండ్రి స్వగ్రామానికి వెళ్లడం, డాగ్‌స్క్వాడ్ శ్రీనును గుర్తించడంతో హత్య వెనుక అయినవారి హస్తం ఉందనే కోణంలోనే విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న ట్లుఎస్‌ఐ ప్రణీత్‌కుమార్ తెలిపారు.