Dog Squad
-
పోలీసులకు సవాల్‌గా మారిన విజయ హత్య కేసు
కాజీపేట: ఓ వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా కొట్టి చంపి ఏడాది కాలం గడిచినా.. హంతకుల ఆనవాళ్లు పోలీసులకు చిక్కకపోవడం చర్చనీ యాంశంగా మారింది. హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణం 62వ డివిజన్ రహమత్ నగర్ కాలనీలో ఉండే కోన విజయ (68) అనే మహిళ గత ఏడాది డిసెంబర్ 14న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి అర్ధరాత్రి విగతజీవిగా ఇంటి పక్క సందులో కనిపించింది. విజయ మృతదేహంపై దుస్తులు సరిగ్గా లేకపోవడంతోపాటు బంగారు నగలు కనిపించకుండాపోయాయి. వెంటనే స్థానికుల సాయంతో విజయ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విభిన్న కోణాల్లో పోలీసుల విచారణ.. పోలీసు అధికారులు కేసు నమోదు చేసి క్లూస్ టీం సభ్యులు, డ్వాగ్ స్క్వాడ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాల కోసం ప్రయత్నాలను ముమ్మ రం చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన విజయ దాదాపు 16 గంటలపాటు పట్టణంలో ఎక్కడ ఉంది.. ఒంటిపై ఉన్న బంగారు నగల కోసమే నిందితులు హత్యచేసి ఇంటి వద్ద పడేసి ఉంటారా.. లేక తెల్సిన వాళ్లకు అప్పుడప్పుడు చిన్న మొత్తంలో నగదును ఇస్తుండే విజయను మరెవరైనా హత్య చేశారా.. అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టినా ఆచూకీ లభించలేదు. అయితే .. విజయను ఏమార్చి కిడ్నాప్ చేసిన నిందితులు తలపై బలంగా కొట్టి చంపడంతోపాటు శరీరాన్ని పూర్తిగా సబ్బు పెట్టి కడిగి మృతురాలి ఇంటి పక్కన ఉన్న గల్లీలోనే అర్ధరాత్రి వేళ పడేసి వెళ్లారు. పోలీసులు డాగ్ స్క్వాడ్ తో వెతికినా హత్యప్రదేశాన్ని గుర్తించకుండా ఉండేందుకు నిందితులు సబ్బుతో కడిగి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమైంది. మృతురాలి శరీరంపై ఉన్న బంగారు నగల కోసమే హత్య చేసి ఉంటారా లేక ఇతర కారణాలు ఏమైనా ఉండి ఉంటాయా.. అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నప్పటికీ పోలీసులకు నిందితులకు సంబంధించిన ఆచూకీ చిక్కకపోవడం అందరిని ఆశ్యర్యం కలిగిస్తుంది. హత్య జరిగినప్పుడు ఉన్న అధికారులు బదిలీపై వెళ్లడంతో కొత్తగా వచ్చిన అధికారులు హత్య కేసు ఫైల్‌ను తిరిగి తెరచి విచారణ జరుపుతున్నారు. ఘటనా సమయంలో ఉన్న అధికారులు ఒక క్రమపద్దతిలో విచారణ చేయకపోవడం కారణంగానే సమస్య తీవ్రత పెరగడంతోపాటు నిందితులు దొరక్కుండా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఇప్పటి వరకు సుమారు 100మందిని విచారించారు. చిన్న క్లూ దొరికినా విడిచి పెట్టకుండా నేరస్తుల ఆట కట్టిస్తున్న పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. విజయ కేసులో నానాటికీ చిక్కుముడులు పెరుగుతున్నాయి. మొదట్లో కేసును సునాయాసంగా పరిష్కరించవచ్చని భావించిన పోలీసులకు గతంలో వచ్చిన దృశ్యం సినిమాను జ్ఞప్తికి తేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. సీపీ అంబర్ కిశోర్ ఝా క్రైమ్ సమీక్ష సమావేశాల్లో తరచూ ఈ కేసును పరిష్కరించాలంటూ ఆదేశిస్తున్నప్పటికీ పోలీసుల విచారణ ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది. -
ఇదో రియల్ సస్పెన్స్ కథ: బెడ్రూమ్లోని రూ.55 లక్షలు మాయం!
తగరపువలస (భీమిలి): ఇదో రియల్ సస్పెన్స్ కథ. బెడ్రూమ్లో పాతిపెట్టిన రూ.55 లక్షలు మాయమయ్యాయని ఓ ఆసామి ఫిర్యాదు చేయడం.. పోలీసులు వెంటనే రంగంలోకి దిగటం.. ఆ వెనుకే క్లూస్‌టీమ్.. తరువాత డాగ్ స్క్వాడ్ రావడం.. పలుచోట్ల తవ్వకాలు జరపటం.. సోదాలు చేయటం.. ఎదురింట్లో రూ.19 లక్షలు లభించటం వంటి పరిణామాలు రోజంతా కనిపించాయి. సీన్ కట్‌చేస్తే.. ఉన్నట్టుండి ‘మేమూ.. మేమూ.. పరిష్కరించుకుంటాం. ఇక మీరు వెళ్లి రావొచ్చు’ అని ఆ ఆసామి చెప్పటం.. మారుమాట్లాడకుండా పోలీసులు వెనుదిరగడం జరిగిపోయాయి. భీమిలి జోన్ రెండో వార్డు సంగివలసలో జాతీయ రహదారిని ఆనుకుని ఉంటున్న మేడ చిన్నారావు అలియాస్ గురుమూర్తి కర్ర పెండలం వ్యాపారం చేస్తుంటాడు. ఈ ఏడాది మార్చిలో విజయనగరం జిల్లా గజపతినగరంలో భూమి విక్రయించగా రూ.75 లక్షలు వచ్చాయి. అందులో రూ.20 లక్షలు బంధువులకు చెల్లించి మిగిలిన రూ.55 లక్షల్ని డబ్బాలో ఉంచి బెడ్రూమ్లో గొయ్యి తీసి పాతిపెట్టాడు. ఆపై సిమెంట్‌తో ప్లాస్టింగ్ చేయించాడు. ఈ నెల 17న ఇద్దరు కుమారులు, కోడళ్లు అత్తారింటికి వెళ్లి సాయంత్రం వచ్చి చూడగా డబ్బులు పాతిపెట్టిన చోట కొత్తగా సిమెంట్ ప్లాస్టింగ్ చేసి ఉండటంతో కంగారుపడి అక్కడ తవ్విచూశారు. డబ్బులు కనిపించకపోవడంతో అదే రోజు రాత్రి పోలీసులను ఆశ్రయించారు. దీంతో క్రైమ్ విభాగం క్లూస్ టీమ్ వచ్చి సోమవారం సాయంత్రం వరకు కుటుంబ సభ్యులను విచారించారు. పోలీసులు వచ్చి ఇంట్లో, ఆవరణలో పలుచోట్ల తవ్వి చూశారు. అయినా ప్రయోజనం లేక.. అదే ఇంటికి ఎదురుగా చిన్నారావు (గురుమూర్తి)కే చెందిన పెంకుటింట్లో సోదాలు నిర్వహించగా.. అక్కడ గొయ్యి తీసి దాచిన రూ.19 లక్షలు బయటపడ్డాయి. ఇది ఇంట్లో వాళ్ల పనేనని అనుమానించిన పోలీసులు విచారణ ప్రారంభించగా.. సీన్ మారిపోయింది. ఈ సమస్యను తామే పరిష్కరించుకుంటామని ఫిర్యాదుదారు చిన్నారావు చెప్పడంతో పోలీసులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. రూ.55 లక్షలు మాయమైన భవనంలో ఫిర్యాదుదారు చిన్నారావు నివసిస్తుండగా.. రూ.19 లక్షలు లభ్యమైన ఎదురింట్లో అతని ఇద్దరు కుమారులు ఉంటున్నారు. -
బెజవాడలో వ్యాపారి హత్య
గుణదల (విజయవాడ తూర్పు): విజయవాడలో యువ వ్యాపారి దారుణంగా హత్యకు గురయ్యారు. కారులోనే అతడి గొంతుకు తాడుబిగించి, దిండుతో ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. బుధవారం రాత్రి ఇంటివద్ద నుంచి బయటకు వెళ్లిన కరణం రాహుల్ (30) గురువారం బందరు రోడ్డులో కారులో మృతదేహంగా కనిపించారు. ఒంగోలుకు చెందిన రాహుల్ ప్రస్తుతం కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పోరంకిలోని ఒక విల్లాలో ఉంటున్నారు. జి.కొండూరులో జిక్సిన్ సిలిండర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట స్నేహితుడు కోరాడ విజయ్‌కుమార్‌తో కలిసి 2016 నుంచి గ్యాస్ సప్లయ్ వ్యాపారం చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో విభేదాలున్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలోని ఎం.సి.పల్లె వద్ద సుమారు రూ.57 కోట్లతో జిక్సిన్ గ్యాస్ సిలిండర్ల పరిశ్రమను నెలకొల్పేందుకు ఇటీవల శంకుస్థాపన కూడా చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో కారులో రాహుల్ ఇంటి వద్ద నుంచి బయటకెళ్లారు. రాత్రంతా ఇంటికి రాకపోవడంతో గురువారం కుటుంబసభ్యులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఇంతలో బందరురోడ్డులో కారులో మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. అనుమానం వచ్చి అక్కడకు వెళ్లిన రాహుల్ తండ్రి రాఘవరావు, భార్య పూర్ణిమ.. ఆ మృతదేహం రాహుల్‌దని గుర్తించారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో రాహుల్‌ను విజయకుమార్ హత్యచేసి ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం అనంతరం రాహుల్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. విజయ్‌కుమార్ 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఆధారాల సేకరణ డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లు హత్య జరిగిన కారు నుంచి కొన్ని ఆధారాలు సేకరించాయి. రాహుల్ డ్రైవింగ్ సీటులో కూర్చుని ఉండగా, తల వెనక్కి నెట్టబడి ఉంది. కుడిచేతి భుజం వద్ద రక్తపు మరకలున్నాయి. డ్రైవర్ పక్క సీటులో నైలాన్ తాడు, రాహుల్ ముఖంపై దిండు ఉన్నాయి. ఈ హత్యలో ముగ్గురు వ్యక్తులు పాల్గొని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ హత్య కేసులో కోరాడ విజయ్‌కుమార్, అతడి కుటుంబసభ్యులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. కారే కీలక ఆధారం రాహుల్ ఫోర్డ్ ఎండీవర్ టాప్ ఎండ్ మోడల్ కారు వాడుతున్నారు. కారు ఎక్కడి నుంచి బయల్దేరింది.. ఎక్కడ ఆగింది.. ఎంత వేగంతో వచ్చింది.. బ్రేక్‌లు ఎప్పుడు వేసింది.. వంటి అంశాలను కారులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలుసుకునే వీలుంది. కారులో పెనుగులాట జరిగినా అందులో ఉన్న సెన్సిటివ్ సెన్సార్ల ద్వారా ఆ డేటా నిక్షిప్తం అవుతుంది. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
గ్రాండ్‌గా డాగ్ బర్త్‌డే..
ముజఫర్ నగర్: కుక్క అంటే విశ్వాసానికి ప్రతీక. ఇది మనిషికి తోడుగా ఉంటూ అనేక విధాలుగా తన విశ్వాసాన్ని చూపిస్తుంది. అయితే ఇక్కడ చెప్పబోయే కుక్క మాములుదీ కాదండోయ్..2020లో అప్పటి అమెరికా అధ్యక్షుడు భారత్‌కి వచ్చినప్పుడు భద్రతలో పాల్గొన్న లాబ్రాడార్ జాతికి చెందిన స్నిఫర్ డాగ్. దీనిపేరు డిక్కీ. కాగా, ఈకుక్క పుట్టినరోజుని ముజఫర్ పోలీసులు ఘనంగా జరిపారు. దీనికి కాగితం టోపి పెట్టి, ఒక సూట్‌ని తొడిగారు. దీని కేర్‌టేకర్ సునీల్ కేక్ కట్ చేశాడు. ఈ రోజు డాగ్‌కి ప్రత్యేకంగా గుడ్లు, మటన్, మాంసం, కూరగాయలు, పాలు అందించారు. డిక్కీని హర్యానాలోని ఇండో టిబేటన్ బార్డర్ పోలీస్ పంచకులలో ట్రైనింగ్ ఇచ్చారు. 2019 లో ముజఫర్ నగర్ డాగ్‌స్క్వాడ్ పోలీసులకు అప్పగించారు. అప్పటినుంచి బస్టాండ్లు, మార్కెట్లు, రైల్వేస్టేషన్లు, ఇతర ప్రదేశాల్లో పేలుడు పదార్థాలు వేలికి తీయడంలో సేవలందిస్తోందని అబ్దూల్ రయిస్ ఖాన్ అనే పోలీస్ అధికారి తెలిపారు. -
కోరపళ్ల తుపాకులు
మనకు పోలీసుల, సైనికుల శిక్షణ మాత్రమే తెలుసు. వారు చేసే సాహసాలు తెలుసు. ప్రమాదాల్లో అర్పించే ప్రాణాలు తెలుసు. కాని వారితో సమానంగా వివిధ రక్షణ దళాలలో శునకాలు సేవలు అందిస్తాయి. త్యాగాలూ చేస్తాయి. కాకుంటే అవి పెద్దగా అందరికీ తెలియవు. పోలీసులకు, సైనికులకు శిక్షణ విభాగాలు ఉన్నట్టే ఈ దళాలతో పని చేసే శునకాలకు శిక్షణ ఇచ్చే విభాగం కూడా ఒకటి ఉంది. దానిని ‘ఇండియన్ ఆర్మీ రిమౌంట్ వెటర్నరి కోర్’ అంటారు. ఇది మీరట్‌లో ఉంది. ఇక్కడే భారత దేశంలోని సాయుధ రక్షణబృందాలకు అవసరమైన అశ్వాలకు, శునకాలకు శిక్షణ ఇస్తారు. ఇది కాకుండా బి.ఎస్.ఎఫ్.ఏ వాళ్ల ‘నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్స్’ కూడా ఉంది. ఆయా రాష్ట్రాల పోలీసు విభాగాల కింద నడిచే ట్రయినింగ్ సెంటర్లూ ఉన్నాయి. ఇవన్నీ విధి నిర్వహణ కోసం, ప్రజా రక్షణ కోసం శునకాలకు శిక్షణ ఇచ్చి వాటి సేవలు తీసుకుంటాయి. సి.ఆర్.పి.ఎఫ్ వారి సరిహద్దు సేవల కోసం శిక్షణ పొందిన శునకాలు ఎక్కువ ప్రమాదకరమైన పరిస్థితుల్లో పని చేస్తాయి ∙పోలీసులు, సైనికులకు శిక్షణ ఉన్నట్టే డాగ్ స్క్వాడ్‌లో పని చేసే శునకాలకూ శిక్షణ ఉంటుంది. ∙ట్రాకర్ డాగ్స్ అంటే నిందితులు వాడిన వస్తువుల వాసనను బట్టి నిందితులను వెతుక్కుంటూ వెళ్లే శునకాలకు 36 వారాలు, పేలుడు పదార్థాలను గుర్తించడం కోసం 24 వారాలు, మాదక ద్రవ్యాలను గుర్తించడానికి 24 వారాలు, ప్రమాదాల్లో బాధితులను గుర్తించే శిక్షణ 24 వారాలు, అటవీ సంపద రక్షణకు పని చేసే వీలుగా 24 వారాలు... ఇలా శిక్షణ ఇస్తూ వెళతారు ∙ఈ శునకాలను ఉపయోగించే వ్యక్తిని (పోలీస్/సైనికుడు) డాగ్ హ్యాండ్లర్ అంటారు. డాగ్, డాగ్ హ్యాండ్లర్ ఒక జట్టుగా పని చేస్తారు. సైగలూ, శబ్దాలూ ఉపయోగించి డాగ్ హ్యాండ్లర్ వాటికి పనులు చెబుతాడు. డాగ్ హ్యాండ్లర్ జీతం 31 వేల నుంచి మొదలవుతుంది ∙మొరగడం కుక్క సహజ లక్షణం. కాని కొన్ని సందర్భాలలో అవి మొరగడం వల్ల శత్రువు అప్రమత్తం కావచ్చు. అందుకే వాటిని మొరగకుండా కూడా శిక్షణ ఇస్తారు ∙ఒక డాగ్ స్క్వాడ్ శునకం వృత్తి జీవితం 8 నుంచి 10 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత అవి రిటైర్ అవుతాయి. ఎన్నో సేవలు... భూకంపాలు, సునామీలు వచ్చినప్పుడు తప్పిపోయిన, శిథిలాల కింద చిక్కుకున్నవారిని ఎందరినో ఈ రక్షణ శునకాలు పసిగట్టి కాపాడాయి. ప్రధాని, రాష్ట్రపతి వంటి వి.వి.ఐ.పిలు ప్రయాణించే దారులను ఈ శునకాలే మొదటగా ప్రయాణించి క్లియర్ చేస్తాయి. గతంలో భూటాన్ రాజుకు మన దగ్గర శిక్షణ పొందిన శునకాన్ని కాపలా కోసంగా ఇచ్చారు. రాజు మీద హత్యాయత్నం చేద్దామని వచ్చిన వ్యక్తి జారవిడిచిన రుమాలును వాసన పట్టిన శునకం కొన్ని మైళ్లు ప్రయాణించి మరీ ఆ దుండగుణ్ణి పట్టించింది. జమ్ము–కాశ్మీరు సరిహద్దుల్లో శత్రువు రాకను ఈ శునకాలే పసిగట్టి ఆచూకీ ఇస్తాయి. సి.ఆర్.పి.ఎఫ్ దళాలు తాజాగా తమ శునకాలకు కెమెరాలు బిగించడానికి నిర్ణయించాయి. వాటిని వదిలిపెట్టి శత్రుశిబిరాల వైపు చొచ్చుకెళ్లేలా చేసి అవి చూపిన దృశ్యాల ఆధారంగా దాడులు చేయొచ్చని ఆలోచన. తమ ధైర్యం, తెగువ, విశ్వాసంతో ఎన్నో శునకాలు ప్రజలను కాపాడటమే కాదు తమ ప్రాణాలు కూడా త్యాగం చేశాయి. వాటి త్యాగం చాలామందికి పట్టదు. పెద్దగా ప్రచారానికి నోచుకోదు. వీటిని కుక్కబతుకు కాదు. నిజంగా గొప్ప బతుకు. -
అవలంగిలో వ్యక్తి దారుణ హత్య
సాక్షి, పాలకొండ(శ్రీకాకుళం) :ప్రశాంతతకు మారుపేరైన పాలకొండ మండలం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. చిన్నపాటి నేరాలు తప్పితే హత్యోదంతాలు అంతగా లేని ఈ ప్రాంతంలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆపై కాళ్లు, చేతులు కట్టేసి చెరువులో పడేశారు. అవలంగి గ్రామ సమీపాన నాయుడు చెరువులో తేలిన మృతదేహం గ్రామానికి చెందిన కురమాన జమ్మయ్య(58)గా బుధవారం ఉదయం స్థాని కులు గుర్తించారు. ఏడాది క్రితమే మృతుడు కుమారుడు ఆదినారాయణ (30) అనుమానా స్పదంగా మృతి చెందగా, తాజాగా తండ్రి హత్యతో సర్వత్రా చర్చనీయాంశమైంది. బాధిత కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని గుండెలవిసేలా రోదించారు. తొలుత ఎవరో బహిర్భూమికి వెళ్లి చెరువులో పడి ఉంటారని స్థానికులు భావించారు. వీరి నుంచి సమాచారం అందుకు న్న ఎస్సై ఎస్ బాలరాజు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. కాళ్లు, చేతులు నైలాన్ తాడుతో కట్టేసి, శరీరంపై కత్తిగాట్లు ఉండటాన్ని గుర్తించారు. హత్యగా కేసు నమోదు... అత్యంత పాశవికంగా జమ్మయ్య హత్యకు గురైనట్లు గుర్తించిన పోలీసులు ఘటనా స్థలానికి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లను రప్పించారు. పోలీసులు తీసుకువచ్చిన కుక్కలు చెరువు సమీపంలో ఓ మదుము వరకు, సమీపంలో మరో గిరిజన గ్రామమైన బర్న రహదారికి పరుగులు తీసి ఆగిపోయాయి. అలాగే క్లూస్ టీమ్ మృతదేహంపై వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలానికి డీఎస్పీ పీఆర్ఆర్ ప్రసాద్, సీఐ ఎస్ ఆదాం చేరుకుని మరిన్ని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. హత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. .ఘటనా స్థలంలో వివరాలు సేకరిస్తున్న పోలీసులు, క్లూస్ టీమ్ -
అటవీ చట్ట ఉల్లంఘనలకు చీతా చెక్
కాగజ్‌నగర్: డివిజన్ పరిధిలో ఎవరైనా అటవీ చట్ట ఉల్లంఘనలకు చీతా చెక్ పెట్టనుంది. చీతా అనే పేరు గల జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన స్నిప్ ఫర్ డాగ్‌ను డివిజన్‌కు కేటాయించారనీ, దీంతో చట్టవ్యతిరేక కార్యకలా పాలకు పాల్పడే నిందితులను త్వరగా పట్టుకోవచ్చని కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో రాజారమణరెడ్డి హెచ్చరించారు. మంగళవారం కాగజ్‌నగర్ డివిజన్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి జన్నారం నుంచి వచ్చిన డాగ్ స్క్వాడ్ బృందం గురించి వివరించారు. ఈ డాగ్ పేరు చీతా అని ఇప్పటికే పలు కేసుల్లో నిందితులను దీని సాయంతో పట్టుకున్నట్లు పేర్కొన్నారు. చీతా చాలా చురుకైన డాగ్ అనీ, నేరస్థులతోపాటు అక్రమ వేట సామగ్రిని కూడా గుర్తిస్తుందన్నారు. గత చట్టంలో నిందితులు బెయిల్‌పై వచ్చేవారని, కొత్త చట్టంలో అలాంటి వీల్లేదని ఎఫ్‌డీవో స్పష్టం చేశారు. అడవులను నరికినా, వన్యప్రాణులను వేటాడినా నాన్ బెయిలేబుల్ కేసు నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎప్ఆర్వో అనిత, ఎఫ్ఎస్వో యోగేష్, బీట్ ఆఫీసర్ బానయ్య, డాగ్ స్క్వాడ్ సభ్యులు సత్యనారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఛీతా.. ఇట్టే పసిగట్టేస్తోంది
సాక్షి, మంచిర్యాలఅర్బన్: వేటగాళ్లు, కలప స్మగర్లపై అటవీశాఖ నిఘా పెంచింది. అక్రమార్కుల ఆగడాలు అరికట్టేందుకు అధికారులు ఇటీవల డాగ్స్క్వాడ్పై ప్రత్యేక దృష్టి సారించారు. పక్షం వ్యవధిలో రెండు చిరుత పులులను చంపిన నిందితులతో పాటు వన్యప్రాణి మాంసం, కలప స్మగర్లును పట్టుకోవడంలో ఈ డాగ్‌స్క్వాడ్ కీలకంగా వ్యవహరించిది. ఛీతా (జాగిలం) వచ్చిన కొద్ది రోజుల్లోనే పలు కీలక కేసుల్లో నిందితులను పక్కాగా పసిగట్టి చేధిస్తుండటంతో డాగ్స్క్వాడ్పైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కవ్వాల్ టైగర్‌జోన్‌లో తొలిప్రయత్నంలో భాగంగా ఇద్దరు బీట్ అధికారులతో డాగ్స్వాడ్ ఏర్పాటు చేశారు. కలపస్మగ్లింగ్, వ్యన్యప్రాణుల వేట అరికట్టేందుకు మధ్యప్రదేశ్‌లో ఇచ్చిన శిక్షణకు జన్నారంనకు చెందిన అటవీ బీట్ అధికారులు సత్యనారాయణ, శ్రీనివాస్ వెళ్లివచ్చారు. గ్వాలియర్‌లోని బీఎస్ఎఫ్ కేంద్రంలో ఛీతాకు (జర్మన్ షెపర్డ్ శునకం)ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలోని డాగ్‌స్క్వాడ్ బృందం అడవికి కాపలా కాయడంతో పాటు నేరస్తుల అటకట్టించడంలో ముందు వరుసలో నిలుస్తోంది. ఈనెల 4న జన్నారం అటవీ డివిజన్లో చింతగూడ బీట్ కంపార్ట్మెంట్ నంబర్ 360లో వన్యప్రాణిని హతమార్చిన కేసులో మొదట డాగ్‌స్క్వాడ్ బృందం నిందితులను పట్టుకున్నారు. చింతగూడ బీట్‌లో వన్యప్రాణిని హతమార్చిన అనవాలు లభించడంతో డాగ్‌స్క్వాడ్ వాసన చూసి బొమ్మన గ్రామానికి చెందిన మల్లయ్య కొట్టంలోని పొయ్యి వద్దకు వెళ్లడం.. తర్వాత వండిన మాంసం స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం విధితమే. అలాగే చింతగూడ పొలాల్లో దాచిన దుంగలను పట్టించింది ఈ డాగ్‌స్క్వాడ్ కావడం విశేషం. బొమ్మన గ్రామంలో రెండు టెకు దుంగలను స్వాధీనం పర్చుకున్నారు. ఈనెల 9న జన్నారం అటవీ రెంజ్ పరిధిలో డాగ్‌స్క్వాడ్‌తో కలిసి దాడి నిర్వహిæంచగా 0.328 సీఎంటీ విలువ గల కలప గుర్తించారు. ఈనెల 14న నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మామిడిపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో చిరుతపులి అనుమానాస్పద మృతి చెందిన కేసులో డాగ్‌స్క్వాడ్ ఎంతో కీలకంగా మారింది. పులి మృతి చెందిన స్థలం సమీపంలో ఉన్న బీడీల కట్ట, అంబర్ ప్యాకెట్ ఆధారంగా వాసనతో పసిగట్టి అనుమానితులను గుర్తించారు. తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రంగపేట్ అటవీ ప్రాంతంలో క్లచ్‌వైర్‌తో అమర్చిన ఉచ్చులో పడి పులి మృతి చెందిన విషయం తెలిసిందే. చెప్పుల ఆధారంగా పసిగట్టి వేటగాళ్లకు ఉచ్చు బిగిసేలా చేయటం వెనక ఈ డాగ్‌స్క్వాడ్ కీలకం కావడం గమన్హారం. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు మంచిర్యాలఅర్బన్: లక్సెట్టిపేట్ అటవీ రెంజ్ పరిధిలోని ముల్కల్ల, వెంపల్లి, రంగంపేట్ నీటి పరివాహక ప్రాంతంలో అటవీశాఖ ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు చేపట్టారు. ఫీల్డ్ డైరెక్టర్ కవ్వాల్ టైగర్ ప్రాజెక్టు, నిర్మల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శరవణన్, ఎఫ్‌డీవో వెంకటేశ్వర్రావు నేతృత్వంలో నిర్వహించిన తనిఖీల్లో కలప స్మగ్లింగ్‌తో పాటు వన్యప్రాణులకు హాని తలపెట్టే ఉచ్చులు ఏమైనా ఉన్నాయనే దానిపై డాగ్‌స్క్వాడ్‌తో నాలుగు గంటలపాటు క్షుణ్ణంగా పరిశీలించారు. అటవీ ప్రాంతం మీదుగా వెళ్లే విద్యుత్ లైన్ వెంట కరెంట్ ఉచ్చులు ఏర్పాటు చేసే అవకాశాలపై పరిశీలన జరిపారు. ఈ నెల 14న రంగంపేట్ అటవీ ప్రాంతంలో ఉచ్చుకు చిరుతపులి హతమైన విషయం విదితమే. ఈ మేరకు ఎఫ్‌డీవో వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ రోజువారీ కార్యక్రమంలో భాగంగానే తనిఖీలు చేపట్టామని, శుక్రవారం కూడా డాగ్‌స్క్వాడ్‌తో అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతామన్నారు. కలప స్మగ్లింగ్, వన్యప్రాణుల వేట చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. తనిఖీల్లో డాగ్‌స్క్వాడ్ సభ్యులు సత్యనారాయణ, శ్రీనివాస్, లక్సెట్టిపేట్, దేవాపూర్ అటవీ ఉద్యోగులు పాల్గొన్నారు. -
అటవీశాఖలో డాగ్ స్క్వాడ్!
సాక్షి, హైదరాబాద్: పోలీసుశాఖ మాదిరిగానే తెలంగాణ అటవీశాఖలోనూ డాగ్ స్క్వాడ్‌ను ప్రవేశపెట్టారు. అటవీ ప్రాంతాల్లో చెట్లు నరకడం, వన్యమృగాల వేట వంటి నేరాల నియంత్రణకు ఈ స్క్వాడ్‌ని ఉపయోగిస్తున్నారు. ఈ స్క్వాడ్‌లో భాగంగా మన రాష్ట్రం నుంచి శిక్షణ పొందిన మొదటి జర్మన్ షెపర్డ్ జాతి శునకం ‘ఛీతా’ను ముందుగా కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో అటవీ పరిరక్షణ సేవలకు ఉపయోగిస్తున్నారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లోని బీఎస్ఎఫ్ డాగ్ స్క్వాడ్ ట్రైనింగ్ సెంటర్లో 9 నెలలపాటు శిక్షణ పొందిన అనంతరం ఛీతా సేవలు ఇక్కడ ఉపయోగించుకుంటున్నారు. ఛీతాతో పాటు ఇద్దరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకు (ఎఫ్బీఓ) కూడా గ్వాలియర్లోనే 9 నెలల పాటు శిక్షణనిచ్చారు. అడవుల్లో నేరాలకు పాల్పడే వారి వాసన పసిగట్టడం ద్వారా వారి గుట్టును కనిపెట్టవచ్చని, వాటి ఆధారంగా అరెస్టులు కూడా చేయొచ్చని జన్నారం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ కె.రవీందర్ సాక్షికి తెలిపారు. కవ్వాల్‌లో సంచరించే పులులు, ఇతర వన్యప్రాణులు, మృగాలు సంచరించిన స్థలాల్లో వాటి వాసనను కనిపెట్టి వాటి గమనం, సంచారం ఎటువైపు ఉందో తెలుసుకునే వీలుంటుందని చెప్పారు. స్థానికంగా అందుబాటులో ఉన్న మేలురకం శునకాలను ఎంపిక చేసి వాటికి కూడా ఇద్దరు ఎఫ్‌బీఓల ద్వారా శిక్షణనిచ్చి డాగ్ స్క్వాడ్లను విస్తరించే ఆలోచన ప్రభుత్వానికి ఉందని రవీందర్ తెలిపారు. -
కనకమ్ము మోగింది
కంచు మోగుతుందని తెలుసు.కంచు మోగినట్టు కనకమ్ము మోగదని తెలుసు.కానీ, నేరం దాగదు.దుర్భుద్ధి బయటపడకా మానదు.దొంగ బంగారం నిప్పులా కాలుతుంది.దొంగ దొరికేవరకు మోగుతూనే ఉంటుంది. డిసెంబర్ 26, 2006.ఉదయం 7 గంటలు.గుంటూరు జిల్లా నరసరావుపేట.చలి దుప్పటి కప్పుకున్న సూర్యుడు బద్దకంగా ఒళ్లు విరుచుకుంటున్నాడు. జనం వెచ్చదనాన్ని తొడుక్కోవడానికి ఇళ్ల నుంచి మెల్లగా బయటకు వస్తున్నారు. కొంతమంది చలిని ధిక్కరిస్తూ పనుల్లో పడిపోయారు.ఆ సమయంలోనే చిన్న కలకలం.గీతామందిర్ రోడ్డులో పోలీసుల వాహనాలు ‘రయ్మ’ని దూసుకుపోతున్నాయి.వెనకనే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లూ దౌడు తీస్తున్నాయి.దుమ్ము రేపుకుంటూ వెళుతున్న వాహనాలను చూసి ‘ఏం జరిగిందిరా..’ అని ఆందోళనగా అడిగాడు టీ స్టాల్ యజమాని తన సర్వెంట్‌తో. ‘అదే తెలియడం లేదు ..’ వాహనాలు వెళ్లినవైపునే చూస్తూ అన్నాడు సర్వెంట్.చుట్టుపక్కల వాళ్లు ఏం జరిగిందని తెలుసుకునే లోపునే టీవీల్లో బ్రేకింగ్ న్యూస్.. ‘నరసరావుపేటలో బ్యాంకు దోపిడీ’ అని. దోపిడి ఎలా జరిగిందనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఇంతకూ ఏం జరిగింది? నరసరావుపేట గీతామందిర్ రోడ్డులోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు.డిశంబరు 22న పనివేళలు ముగియగానే సిబ్బంది ఎప్పటిలాగే తాళాలు వేసి వెళ్ళారు.23, 24, 25 తేదీలు వరుసగా సెలవులు. 26వ తేదీ ఉదయం 6:15 గంటలకు బ్యాంక్ మెసెంజర్ కమ్ స్వీపర్ వెంకటేశ్వర్లు బ్యాంకు తాళాలు తీసేందుకు వచ్చాడు.కాని బ్యాంకు మెయిన్‌డోర్ తాళాలు తీసి పక్కన పడేసి వుండటాన్ని చూసి షాక్ అయ్యాడు. వెంటనే బ్యాంకు మేనేజర్‌కు ఫోన్ చేసి ‘సార్, బ్యాంక్‌లో దొంగలు పడ్డట్టున్నారు. తాళాలు పగలగొట్టి కిందపడేసి ఉన్నాయి’ అన్నాడు. హుటాహుటిన మేనేజర్ స్థానిక పోలీసులకు సమాచారం అందించి బ్యాంకుకు చేరుకున్నాడు.సీఐ ప్రసాద్ బ్యాంకు వద్దకు చేరుకొని, బ్యాంక్ మెయిన్ డోర్ తాళాలు పగులగొట్టి ఉండటం గమనించి, విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు.ఎస్పీ జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. క్లూస్, డాగ్ స్వా్కడ్లకు సమాచారం చేరింది.వాళ్లు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించడం మొదలుపెట్టారు. బ్యాంకు లోపలంతా పరిశీలించారు. ఎక్కడా ఫైళ్లు గానీ, ఫర్నీచర్‌గానీ దెబ్బతినలేదు. బంగారం ఉంచిన లాకర్ మాత్రం ఓపెన్ చేసి ఉంది. ఆ లాకర్ని గ్యాస్ కట్టర్‌తో కట్ చేశారు నిందితులు. అందులో వున్న రూ 3.75 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు దొంగిలించబడ్డాయని తేలింది. దాదాపు కిలో బంగారపు ముద్ద కిందపడి ఉండటం గమనించారు. లాకర్‌ను కట్ చేసే క్రమంలో వేడికి ఆభరణాలు కరిగి ముద్దగా మారి ఉంటాయి. వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో బ్యాంకు వైపుగా వచ్చేవారు లేకపోవడంతో గుర్తించడానికి సమయం పట్టింది. నగదు పోలేదని నిర్ధారణకు రావడంతో ఇది ఎవరో తెలిసిన వ్యక్తుల పనేనని పోలీస్ అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. బ్యాంకులో పనిచేసే సిబ్బంది అందరినీ విచారించారు. ఎవరినీ అనుమానించలేని విధంగా సమాధానాలు రావడంతో మిస్టరీని ఛేదించలేక పోలీసులు తలలు పట్టుకున్నారు. బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టిన ఖాతాదారులకు ఇన్సూరెన్స్ కంపెనీ అప్పటి మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించింది.రెండేళ్లు గడిచాయి. నిందితుల ఆచూకీ దొరక్కపోవడంతో కేసును 2008 నవంబరు 24న సెంట్రల్ క్రై ం స్టేషన్ (సీసీఎస్)కు బదిలీ చేశారు. దీంతో సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగారు. బ్యాంకు సిబ్బందిని మరోసారి విచారించారు. అందరి జీవనవిధానాన్ని పరిశీలనలో ఉంచారు. బ్యాంక్ స్వీపరు కమ్ మెసెంజర్‌గా పనిచేసే వెంకటేశ్వర్లు దగ్గర బ్యాంకు మెయిన్‌డోరు తాళాలు ఉంటాయి. ముందుగా చిన్నవెంకటేశ్వర్లను పోలీసుస్టేషన్‌కి పిలిపించారు.‘వెంకటేశ్వర్లూ.. దోపిడీకి ముందు వారం రోజులు ఏమేం జరిగిందో చెప్పు..’ అని అడిగారు. ‘సార్.. నాకేం తెలియదు. మెయిన్ డోర్ తాళాలు ఒక్కటే నా దగ్గర ఉంటాయి. రోజూ వచ్చి బ్యాంకు తలుపులు తీసి చిమ్ముతుంటాను. లోపలి తాళాలు నా దగ్గర ఉండవు.. ’ అతను చెబుతుండగానే ‘మాకుతెలుసు. దొంగతనం జరగడానికి వారం ముందు ఏమైందో అది చెప్పు’ మరోసారి రెట్టించారు. అతని దగ్గర నుంచి వస్తున్న వాసనను పసిగట్టి ‘నువ్వు మందు తాగుతావా’ అని అడిగారు. నోటికి చెయ్యి అడ్డుపెట్టుకొని ‘అప్పుడప్పుడు తాగుతాను సార్’‘దొంగతనానికి ముందు వారంలో ఎవరెవరితో కలిసి మందు తాగావు ’కొన్ని నిమిషాలు ఆలోచనలో పడ్డ వెంకటేశ్వర్లు..‘స్నేహితులతో కలిసి తాగాను సార్. గోవిందం, రాములు, ఖాజాబాబు..’ అని పేర్లు చెబుతుండగా..‘ఖాజాబాబు ఎవరు?’ అని అడిగారు.‘బ్యాంకు అప్రయిజర్ వహీద్ కొడుకు సార్’పోలీసులకు ఏదో అర్ధమైనట్టుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.‘కేసు పూర్తయ్యేవరకు స్టేషన్‌కి వస్తూ ఉండాలి’ ఆర్డర్ వేశారు పోలీసులు. అలాగే అంటూ వారి వద్ద సెలవు తీసుకున్నాడు వెంకటేశ్వర్లు. అప్పటికే అబ్దుల్ వహీద్ అతని కొడుకు ఖాజాబాబుకు సంబంధించిన ఫైల్ టేబుల్ మీద ఉంది. ఈ మధ్య కాలంలో వాళ్లు భారీగా స్థలాలు, వాహనాలు కొనుగోలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి.‘అబ్దుల్ వహీద్, ఖాజాబాబుల ఆస్తుల వివరాలే క్లూ అవనున్నాయా!’ ఫైల్ ఓపెన్ చేస్తూ అన్నాడు సీఐ.‘సార్, అతనికి సంపాదించే కొడుకులు ఉన్నారు. వారి పిత్రార్జితం ఆస్తి కూడా వచ్చిందని తెలుస్తోంది. అతన్నెలా అనుమానించగలం..’ అంటున్న సిబ్బందిని వారిస్తూ.. ‘గతంలో అతనికి పెద్దగా ఆస్తులు లేవు. కానీ ఈ రెండేళ్లలోనే అతనూ, అతని కొడుకు కొన్న ఆస్తుల వివరాలు ఇవి. ఒక సాధారణ ఉద్యోగి ఇతను. ప్రస్తుత ఖర్చు లక్షల్లో ఉంది. ఇందంతా ఎలా సాధ్యం? ఈ రెండేళ్లలో బ్యాంకు మిగతా సిబ్బంది ఆస్తులు కొన్నట్టు రుజువులు లేవు. బ్యాంకు దోపిడీ ఒక్కరితో అవదు. ఇది కొంతమంది కలిసి చేసిన పని. బంగారం మాత్రమే దోపిడీ జరిగిందంటే తెలిసినవారి పనే అయ్యుండాలి. విచారిస్తే .. వివరాలు అవే తెలుస్తాయి’ దృఢంగా అన్నాడు సీఐ.అంతే, తర్వాత పోలీసుల పని వేగవంతమైంది. అబ్దుల్ వహీద్, ఖాజాబాబులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.విచారించడం మొదలుపెట్టారు. వివరాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. బ్యాంక్ అప్రయిజర్‌గా పని చేస్తున్న వహీద్‌కు బ్యాంకులో తాకట్టుగా చాలా బంగారం వచ్చి చేరిందని అర్థమైంది. దాని మీద అతడు కన్నేశాడు. అయితే బ్యాంకులోకి అడుగుపెట్టడం చాలా కష్టమైన పని. ముఖ్యంగా మెయిన్‌డోర్‌ను ఛేదించాలి. ఛేదించాలంటే వాటి తాళాలు కావాలి. అందుకే తన కుమారుడు ఖాజాబాబును రంగంలోకి దించాడు. తండ్రి కోసం బ్యాంకుకు వస్తూ పోతున్నట్టు నటించిన ఖాజాబాబు వెంకటేశ్వర్లుతో స్నేహం చేశాడు. అతనికి మద్యం బలహీనత ఉన్నట్టు కనిపెట్టి తరచూ తాగుడులో కూచోబెట్టేవాడు. ఒకరోజు మద్యం మత్తులో వుండగా అతని వద్ద వున్న బ్యాంక్ మెయిన్ డోర్ తాళాల ముద్రలను సేకరించాడు ఖాజాబాబు. తర్వాత ఆ ముద్రలతో డూప్లికేట్ తాళాలు చేయించాడు. తండ్రితో పాటు బందువు జానీబాషా, గ్యాస్ కట్టర్ షేక్ సుబానీ, స్నేహితులైన షేక్ మౌలాలి, అబ్దుల్ ఖాదర్, పఠాన్ ములాసాఫ్లను ఈ దోపిడీలో భాగస్తులను చేసి, ప్లాన్ రచించాడు ఖాజాబాబు. డిసెంబరు 22 అర్థరాత్రి డూప్లికేట్ తాళాలతో సునాయాసంగా బ్యాంకు తలుపులు తెరిచి, లోపలకు వెళ్లారు.బ్యాంకులో బంగారం ఎక్కడ ఉంచుతారో వహీద్‌కు తెలుసు. ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం లాకర్ రూమ్ తాళాలను పగలగొట్టారు. అయితే, లాకర్ని తెరవడం అంత సులువు కాలేదు. గ్యాస్ కటర్ షేక్ సుభాని కటర్‌తో లాకర్ని తెరిచే ప్రయత్నం చేశాడు. ఈ కటింగ్ టైమ్‌లోనే వేడికి లాకర్లో ఉన్న బంగారం కొంత కరిగి కిందపడింది. లాకర్ని కట్ చేసి లోపలున్న బంగారం తీసి మూటగట్టారు.వచ్చిన దారినే చీకట్లో కలిసిపోయారు.దోపిడీ చేసిన బంగారంమూటను టౌన్‌లోని వరవకట్ట సమీపంలోని బావిలో పడేశారు. ఆ తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు.తర్వాత శని, ఆది, సోమవారం క్రిస్మస్.. ఇలా వరసగా సెలువులు అవడంతో విషయం వెలుగులోకి రాలేదు.విచారణలోనూ వీరి మీద అనుమానం ఎవరికీ రాలేదు.మూడు నెలలు ఓపిక పట్టారు.తర్వాత బంగారం మూటను బావిలో నుంచి బయటకు తీసి, కరిగించి, బిస్కెట్ల రూపంలోకి మార్చారు. వాటిని అమ్మి నగదు చేసుకున్నారు. కొంత బంగారాన్ని అందరూ కలిసి పంచుకున్నారు. దీంట్లో పెద్ద మొత్తం వహీద్, ఖాజాబాబులు సొంతం చేసుకున్నారు. పోలీసులు రికవరీలో భాగంగా బంగారంతో పాటు వారందరి స్థిర, చర ఆస్తులనూ సీజ్ చేశారు. సీసీఎస్ సీఐ విజయభాస్కరరావు దర్యాప్తులో భాగంగా ప్రత్యేకంగా ఇద్దరు కానిస్టేబుళ్ళు బి.నరశింహారావు, అబ్రహాంలను పూర్తి స్థాయిలో నిఘాకు కేటాయించారు. బ్యాంకు సిబ్బంది లావాదేవీలు గమనించడమే వీరి పని. ఎవరూ పెద్దగా ఆస్తుల కొనుగోళ్లకు దిగలేదు. కాని వహీద్ జీవన శైలి మాత్రం ఒక్కసారిగా మారింది. అదే క్లూగా తీసుకుని పై అధికారులకు తెలియచేశారు కానిస్టేబుళ్లు. దీని ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు. దోపిడీకి పాల్పడింది బ్యాంకు అప్రయిజర్ వహీద్, అతని బృందమే అని నిర్ధారించారు. 2009 జూన్ 5న అప్పటి ఎస్పీ లడ్హా కేసు దర్యాప్తులో ప్రతిభను చూపిన సీఐ సి.విజయ భాస్కరరావు, కానిస్టేబుళ్ళు అబ్రహాం, నరశింహారావులను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. స్వా«ధీనం చేసుకున్న రూ 3.25 కోట్ల విలువచేసే బంగారం, వాహనాలు, స్థలాలను కోర్టుకు అప్పగించి, నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతుంది. ఒరిజినల్‌గా పడే కష్టంతో వచ్చే సంపాదనలో ప్రశాంతత ఉంది.ఎప్పుడైతే డూప్లికేట్ మార్గంలో దిగుతామో జీవితం నాశనమవుతుంది. – వుయ్యూరు శ్రీహరిబాబు, గుంటూరు -
ఆమె ఎవరు?
ఏప్రిల్ 24, 2011. హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ప్రాంతం. ఉదయం 5.30. రాత్రి పశువుల వద్ద కాపలాగా ఉన్న కాపరి ఇంటికి బయల్దేరాడు. దారిలో ఏవో మూలుగులు వినిపించాయి. ‘ఊ...ఊ...ఊ’ కొద్దిగా రోడ్డు దిగి చూశాడు. చెట్ల వెనకాల నుంచి ఏదో కదులుతోంది. ‘ఊ...ఊ...ఊ’... మూలుగులు.భయం వేసినా చేతిలోని కర్రను గట్టిగా పట్టుకుని పొద వెనకాల ఉన్న కాలిబాట వైపుతొంగి చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి అదిరిపడ్డాడు. రెండు కాళ్లు తెగిపోయిన ఓ మహిళ ఒంట్లో శక్తినంతా కూడదీసుకుని మెల్లిగా రోడ్డువైపే పాకుతోంది. ఒళ్లంతా రక్తం. చాలా దూరం పాక్కుంటూ వచ్చినట్టుంది... ఆ దారి అంతా నెత్తురు. ఉదయాన్నే ఆ భీతావహ సన్నివేశం చూసేసరికి వాంతి వచ్చినంతపనైంది. వెంటనే తనకు తెలిసిన మీడియా వ్యక్తికి ఫోన్ చేశాడు.శంషాబాద్ నగర శివారు కాబట్టి ఎక్కడో చంపి శవాలు ఇక్కడ పడేయడం సాధారణమే. అందుకే, పశువుల కాపర్లు పోలీసులకు కాకుండా ముందు మీడియాకు చెబుతారు. పశువులకాపరి చెప్పింది విని అపనమ్మకంగానే వచ్చారు మీడియా వాళ్లు. కాపరి వాళ్లను తన వెంట తీసుకెళ్లి చూపించాడు.మీడియా వాళ్లు చాలా ఘటనలు చూసి మొద్దుబారి ఉంటారు. అలాంటిది వాళ్లే ఆమెను చూసి ఒక అడుగు వెనక్కి వేశారు.‘ఈమె దగ్గరకి కుక్కలు రాకుండా ఇక్కడే ఉన్నాను సార్’ అన్నాడు కాపరి.నిమిషాల్లో పోలీసు జీపు, అంబులెన్స్ అక్కడికి చేరుకున్నాయి. పోలీసు వాహనం నుంచి దిగాడు ఎస్.ఐ అశోక్ కుమార్. ఆ మహిళ దగ్గరికి వేగంగా నడుచుకుంటూ వెళ్లాడు.‘ఏమ్మా... ఏమ్మా’ పిలిచాడు.అప్పటికే స్పృహ కోల్పోయింది. రక్తం మరకల ఆధారంగా చిట్టడవిలాంటి ప్రాంతంలోకి వెళ్లగా ఆమె తెగిన కాళ్లు కనిపించాయి. కానిస్టేబుళ్లను, 108 సిబ్బందిని పిలిచాడు. అంతా కలిసి తెగిన కాళ్లతోపాటు బాధితురాలిని అంబులెన్సులో ఎక్కించారు. వీలైనంత త్వరగా ఉస్మానియాకు తరలించాలని ఆదేశించాడు ఎస్.ఐ. సైరన్ మోతతో అంబులెన్స్ హైదరాబాద్ హైవే ఎక్కింది. నిమిషాల్లో ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. నడియీడు మహిళ కాళ్లు నరకడం, ఆమె ప్రాణాలతో పోరాడుతుండటంతో ఒక్కసారిగా మీడియా దృష్టి ఈ కేసుపై పడింది. రోజంతా ఇదే వార్తను తిప్పి తిప్పి ప్రసారం చేస్తుండటంతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది. క్షణాల్లో క్లూస్ టీం రంగంలోకి దిగింది. డాగ్ స్క్వాడ్‌ను కూడా రప్పించాడు ఎస్.ఐ అశోక్. సమీపంలోని పొదల్లో ఓ గ్రానైట్ రాయి దొరికింది. దానికి రక్తం అంటుకుని ఉంది. నేరస్తుడు ఉపయోగించిన ఆయుధం అన్నమాట. పోలీసు కుక్కను వదిలితే వాసన పసిగడుతూ సమీపంలోని దర్గా వద్దకు, అక్కడనుంచి శంషాబాద్ బస్టాప్ వరకు వెళ్లి ఆగింది. ‘ఏం చేద్దాం సార్’ అన్నాడు డాగ్ స్క్వాడ్ కానిస్టేబుల్ ఎస్.ఐతో.‘ఒక గ్రానైట్ రాయితో రెండుకాళ్లను పూర్తిగా తెగ్గొట్టడం మాటలు కాదు. ఒకే వ్యక్తి ఈ పని చేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఒకరి కంటే ఎక్కువ మంది లేదా ఏదైనా బందిపోటు ముఠా ఈ ఘాతుకానికి పాల్పడి ఉండాలి’ అన్నాడు ఎస్.ఐ అశోక్.ఇంతలో సైబరాబాద్ కమిషనర్ నుంచి ఫోన్ వచ్చింది. ‘అశోక్ హియర్ సార్! స్పాట్లోనే ఉన్నాను. ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేశాం’ చెప్పాడు అశోక్.‘నీకెలాంటి టీం కావాలన్నా ఇస్తా. కానీ 24 గంటల్లో నేరస్తుడు దొరకాలి’ అన్నాడు కమిషనర్. మధ్యాహ్నానికి ఫింగర్‌ఫ్రింట్స్ వచ్చాయి. ‘సార్! పాత నేరస్తుల జాబితాతో ఎక్కడా మ్యాచ్ కాలేదు’ చెప్పాడు హెడ్ కానిస్టేబుల్. ఎస్.ఐ. అశోక్ తల పంకించి ‘ఆమెను చూసి వద్దాం పదా’ అంటూ ఉస్మానియాకు బయల్దేరాడు.అప్పటికే ఆమె ఎమర్జన్సీలో ఉంది. వేగంగా వైద్యం చేస్తున్నారు డాక్టర్లు.‘కాళ్లు రెండూ నరికి చాలా సేపయింది. వాటిని అతికించలేం. సారీ’ అన్నాడు డాక్టర్ అశోక్‌తో.‘నా అంచనా ప్రకారం రాత్రి 11 నుంచి 12 గంటల మధ్యలో ఘటన జరిగి ఉంటుంది. ఇక ఆ అభాగ్యురాలికి అవిటి బతుకు తప్పదు’ నిట్టూర్చాడు డాక్టర్. ‘ఇపుడు ఆమెతో మాట్లాడొచ్చా?’ అడిగాడు ఎస్.ఐ. ‘సారీ! ప్రస్తుతం స్ప్పహలో లేదు’ బదులిచ్చాడు డాక్టర్. ‘ఆమె ఎలాగైనా కళ్లు తెరవాలి డాక్టర్. ఆమె స్టేట్మెంట్ ఇపుడు ఎంతో కీలకం’ ‘చాలా రక్తం పోవడం వల్ల స్ప్పహలో లేదు. అంతరక్తం పోయినా అసలామె ఇంతసేపు బతికి ఉండటమే చాలా గొప్ప విషయం. స్పృహ వస్తే ఇన్ఫామ్ చేస్తాను’ అన్నాడు డాక్టర్. ఎస్.ఐ. తిరిగి శంషాబాద్ పిఎస్‌కు చేరుకున్నాడు. చుట్టుపక్కల గ్రామాల్లోని పోలీసు ఇన్ఫార్మర్లు, పశువుల కాపర్లను పిలిపించాడు. అందరిదీ ఒకే సమాధానం ..‘ఆమె ఎవరో తెలియదు.’ ఆలోచనల్లో పడ్డాడు ఎస్.ఐ. బాధితురాలు ఓ నడిఈడు మహిళ. మెడలో పసుపుతాడు, కట్టుకున్న చీర ఆధారంగా పేద మహిళ అని ఇట్టే తెలిసిపోతుంది. మహిళ స్థానికురాలు కాదు. కాబట్టి పక్కనున్న బీదర్, రాయచూర్ లేదా పాలమూరు జిల్లా మహిళ అయి ఉండవచ్చని అనుమానించాడు. మిగతా పోలీస్స్టేషన్లకు ఆమె ఫొటో పంపాడు. ఎక్కడా మిస్సింగ్ కేసు నమోదు కాలేదని తెలిసింది. మరి అయితే, ఈమె ఎవరు? ఈమె కాళ్లు నరకాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? సాయంత్రం సమయంలో ఉస్మానియా నుంచి ఫోన్ చేశాడు కానిస్టేబుల్. ‘సార్.. ఆమెకి స్ప్పహ వచ్చింది’ అన్నాడు. వాయువేగంతో ఆసుపత్రిలో వాలాడు ఎస్.ఐ. తన ఊరు, పేరు, వివరాలు చెప్పింది ఆమె. కానీ తన కాళ్లు నరికిన వ్యక్తి ఎవరో తెలియదంది. ఆ సమాధానంతో మైండ్ బ్లాంక్ అయింది ఎస్.ఐకి. అదేంటి? నీకు తెలియకుండా మీ ఊరు నుంచి ఇక్కడిదాకా అతనితో ఎందుకు వచ్చావు?’ ‘కూలి పని ఇప్పిస్తానని చెప్పి తీసుకొచ్చాడు సార్!’ అని చెప్పింది. ‘వాడి వివరాలు చెప్పగలవా?’ అన్నాడు ఎస్.ఐ. వాడికి 40 ఏళ్లపైనే ఉంటాయి సార్. ఆ టైంలో తాగి ఉన్నాడు. తాగడానికి డబ్బులు కూడా నేనే ఇచ్చా. అంతకుమించి నాకేం గుర్తులేదు’ అంటూ ఏడ్వడం ప్రారంభించింది. ‘పోనీ అతని గుర్తులేమైనా చెప్పగలవా?’ ‘నాకేం గుర్తులేదు...’ మళ్లీ అదే సమాధానం.ఇక లాభం లేదనుకుని నెత్తిన క్యాప్ పెట్టుకుని ముందుకు నడిచాడు. సార్...!’ ఆమె పిలవడంతో వెనక్కి తిరిగాడు. ‘ఇపుడు గుర్తొచ్చింది.. సార్!’ అంది.విషయం విన్న ఎస్సైకి పోయిన ప్రాణం లేచివచ్చినట్లయింది. ఈ ఒక్క విషయం చాలు. వాడిని పట్టుకునేందుకు. అసలు వాడెవడో నీకు తెలియనపుడు నీ కాళ్లు నరకాల్సిన అవసరం వాడికెందుకు వచ్చింది?’ అన్నాడు ఎస్.ఐ. ‘ఏమో సార్! కూలి పని చేసుకుని బతికేదాన్ని, నా కాళ్లకు కడియాలు, పట్టీలు తప్ప మరేం లేవు’ అని మళ్లీ బోరుమంది. అంతే! ఎస్.ఐకి విషయం అర్థమైంది. శంషాబాద్‌లోని అన్ని బంగారు దుకాణాలు, కల్లు కాంపౌండ్లలో నిఘా పెట్టారు పోలీసులు. సాయంత్రం షాద్‌నగర్‌లోని ఓ కల్లు కాంపౌండ్ నుంచి ఇన్ఫార్మర్ ఫోన్ వచ్చింది. పచ్చరంగు టీషర్టు వేసుకున్న వ్యక్తి అనుమానాస్పదంగా ఉన్నాడన్నది ఆ కాల్ సారాంశం. పోలీసులు వెంటనే ఆ కల్లు కాంపౌండ్‌ను చుట్టుముట్టారు. అంతమంది పోలీసులు ఒకేసారి రావడంతో మందుబాబులంతా కంగారు పడ్డారు. కొందరు పరుగులు తీశారు. ఇంకొందరు పరిగెత్తలేక అక్కడే ఉన్నారు. కానీ, పోలీసులు నేరుగా వెళ్లి రాజయ్యనే పట్టుకున్నారు. పీకలదాకా కల్లు తాగిన రాజయ్యకు వచ్చింది పోలీసులన్న సంగతి కూడా తెలియట్లేదు. శంషాబాద్ పోలీస్ స్టేషన్...ఇన్వెస్టిగేషన్ రూమ్‌లో రాజయ్యకు ఎదురుగా కూర్చున్నాడు అశోక్. ‘ఇపుడు చెప్పు ఈ నేరం ఎందుకు చేశావు?’ ప్రశ్నించాడు ఎస్.ఐ. సార్... ఆ రోజు కల్లు కాంపాండ్ యజమాని పాతబాకీ కట్టకుండా కల్లు ఇవ్వనన్నాడు. దీంతో ఎవరినైనా తెలిసినవారిని డబ్బులు అడుగుదామని బస్టాప్‌దాకా వచ్చాను. అక్కడ కూలి పని కోసం ఎదురుచూస్తోన్న ఒకామె కనిపించింది. ఆమె కాళ్లకున్న కడియాలు నా కంట్లో పడ్డాయి. నేనొక మేస్త్రీని, శంషాబాద్‌లో పనిచేస్తా. నాతో వస్తే పని ఇప్పిస్తానని చెప్పా. నా మాటలు నమ్మి ఆమె నాతో వచ్చింది. ఆమె డబ్బులతోనే కల్లు కొని తాగుదామని పొదల్లోకి తీసుకెళ్లా. కల్లు తాగాక నా బుర్ర నా చేతుల్లో ఉండదు. కడియాల కోసం ఇంతపని చేశా. కడియాలు కుదవపెడితే నాలుగువేల రూపాయలు వచ్చాయి. మార్వాడీ కొట్టయితే అనుమానం వస్తుందని, తెలిసినవాడికి అమ్మేశా’ చెప్పాడు. మళ్లీ అతనే ‘సార్, ఎవరికీ తెలియకుండా ఈ పని చేశా. నన్నెలా పట్టుకున్నారు’‡ అన్నాడు.రాజయ్య కుడిచేతిని చూపిస్తూ ‘ఈ కాల్చిన గుర్తుతో’ అన్నాడు ఎస్.ఐ. ‘నీకు కామెర్లు వచ్చినపుడు నాటువైద్యం చేయించుకున్నావుగా.. అదే గుర్తు నిన్ను పట్టించింది. ఆమె ఇచ్చిన సమాచారంలో అతని కుడిచేతిమీద కాలిన గాయం తాలూకు మచ్చ ఉంది అని చెప్పింది. ఆ మచ్చ గల మనిషి ఎవరు వచ్చినా తెలియజేయమని అన్ని కల్లు కాంపౌండ్ల యజమానులకు ఇన్ఫామ్ చేశాం. రెండో క్లూ.. నీకు పనీపాటా లేదు. ఎపుడూ కల్లు కాంపౌండ్లలో అప్పు చేసి, వారిని వీరిని బతిమిలాడి తాగేవాడివి. కానీ రెండురోజులుగా నాన్‌స్టాప్‌గా తాగుతున్నావు. పాతబాకీ కట్టేశావు. ఈ రోజు ఉదయం నుంచి నీ మిత్రులకూ తాగిస్తున్నావు. చేతిలో చిల్లిగవ్వ ఉండని నువ్వు ఇంత ఖర్చు పెడుతుంటే నీ స్నేహితులకే అనుమానం వచ్చి మాకు ఉప్పందించారు..’ అన్నాడు ఎస్.ఐ. రాజయ్య తలదించుకున్నాడు.అపరిచితులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించా లని ఈ కేసు మరోమారు హెచ్చరించింది. - అనిల్‌కుమార్ భాషబోయిన -
మా ‘మోతీ’ ఎక్కడ?
బంజారాహిల్స్: ఇంటి ముందు తిరుగుతున్న తమ పెంపెడు శునకం ‘మోతి’ని.. జీహెచ్ఎంసీ డాగ్ స్క్వాడ్ ఏనిమిల్ బర్త్ కంట్రోల్ స్టెరిలైజేషన్ కోసం తీసుకెళ్లి వదిలి పెట్టలేదని, ఇందుకు బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ యజమానులు జీహెచ్ఎంసీ విజిలెన్స్ సెల్లో ఫిర్యాదు చేశారు. ఖైరతాబాద్ డివిజన్ వెంకటరమణ కాలనీకి చెందిన శ్రీనివాస్ నాయుడు, సరితానాయుడు దంపతులు బ్లాక్‌బెర్రి (ముద్దు పేరు మోతి) మిక్స్డ్ బ్రీడ్ రకం కుక్కను పెంచుకుంటున్నారు. ఫిబ్రవరి 5న యజమాని ఇంటి ముందు పెంపుడు కుక్క మోతీ తిరగసాగింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన డాగ్‌స్క్వాడ్.. మిగతా వీధి కుక్కలతో పాటు దీన్నీ పట్టుకెళ్లారు. ఇది గమనించిన యజమాని శ్రీనివాస్ నాయుడు డాగ్‌స్క్వాడ్ వాహనం వెంబడి పరిగెత్తగా రెండు వారాల్లో సమీప ప్రాంతంలో వదిలేస్తామని చెప్పి వెళ్లిపోయారు. ఎన్నిసార్లు ప్రశ్నించినా సమాధానం చెప్పలేదు. అయితే తాము ఏనిమిల్ బర్త్ కం ట్రోల్ స్టెరిలైజేషన్ చేసి ఆ కుక్కను నిమ్స్ ప్రాం తంలో వదిలేశామని సమాధానమిచ్చారు.ఆ ప్రాంతమంతా శ్రీనివాస్ దంపతులు నెలరోజుల పాటు గాలించినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో విజిలెన్స్ సెల్లో ఫిర్యాదు చేశారు. టార్గెట్ కోసమే చేస్తున్నారా..! తమ టార్గెట్ చేరుకోవడానికి డాగ్ స్క్వాడ్ వెహికిల్ సిబ్బంది పెంపుడు కుక్కలు వాటి యజమానుల ఇంటి ముందు తిరుగుతున్న సమయంలో తీసుకెళ్తున్నారని చాలా మంది విజిలెన్స్ సెల్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే తాము కుక్కలను చంపడం లేదని, స్టెరిలైజేషన్ కోసమే తీసుకెళ్తున్నామని, తర్వాత అదే ప్రాంతంలో వదిలేస్తున్నమని సెంట్రల్ జోన్ వెటర్నరీ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ జె.వి.విల్సన్ చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఒక్క సెంట్రల్ జోన్ పరిధిలోనే 1.50 లక్షల కుక్కలు ఉన్నట్లు ఇటీవల ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో గుర్తించారు. -
సికింద్రాబాద్‌లో డాగ్ స్క్వాడ్‌తో మాక్‌డ్రిల్
-
రెండు బంగారు దుకాణాల్లో చోరీ యత్నం
కందుకూరు: పట్టణంలోని రెండు బంగారు దుకాణాల్లో చోరీకి తెగబడ్డ దొంగలు భంగపడి చేతికందిన కొద్దిపాటి సొత్తుతో పరారయ్యారు. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి పట్టణంలోని పొట్టి శ్రీరాములు బొమ్మసెంటర్‌లో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యాపారి తాజ్గోల్డ్ జ్యూయలరీ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాడు. ఈ దుకాణం పక్కనే షేక్ సలీం అనే యువకునికి చెందిన బంగారు నగల తయారీ షాపు కూడా ఉంది. ఈ నేపథ్యంలో తొలుత దొంగలు తాజ్గోల్డ్షాపు భవనం పైభాగం నుంచి రంధ్రం చేసి లోపలకి వెళ్లారు. అయితే యజమాని ప్రతి రోజూ నగలను అక్కడ ఉంచకుండా మరో చోట దాస్తాడు. ఇది తెలియని దొంగలు ఆశపడి భంగపడ్డారు. అక్కడ ఏమీ దొరక్కపోవడంతో పక్కనే ఉన్న సలీం దుకాణం పై భాగంలో రేకులు తొలగించి లోపలికి వెళ్లారు. అక్కడ ఉన్న రూ. 60 వేల విలువ చేసే ఒక జత బంగారు కమ్మలు, వెండి వస్తువులు తీసుకొని పరారయ్యారు. సోమవారం ఉదయం షాపులు తీసిన యజమానులు దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ నరసింహారావు, రూరల్ ఎస్సై ప్రభాకర్‌తో పాటు, డాగ్స్వాడ్, క్లూస్‌టీం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. నిత్యం అత్యంత రద్దీగా ఉండే సెంటర్లో బంగారుషాపులను దొంగలు లక్ష్యంగా చేసుకోవడం పట్ల భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. -
ప్రద్యుమన్ కేసు.. అదే అధికారుల తప్పు
సాక్షి, ఛండీగఢ్: స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే ఏడేళ్ల బాలుడు ప్రద్యుమన్ ప్రాణాలు కోల్పోయాడన్నది తల్లిదండ్రులు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో స్కూళ్ల భద్రతా చర్యలపై ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఇదిలా ఉంటే హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్.. ప్రద్యుమన్ ఇంటికి వెళ్లి మరి కుటుంబ సభ్యులను పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ చోటు చేసుకున్న కొన్ని పరిణామాలపై ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. అందులో మొదటిది.. సీఎం ఖట్టర్, బాలుడి ఇంటికి రాక ముందు డాగ్ స్క్వాడ్‌తో గుర్‌గ్రామ్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే కేసు విచారణలో మాత్రం డాగ్ స్క్వాడ్ ను ఎందుకు వినియోగించలేదన్న ప్రశ్నను ఇప్పుడు లేవనెత్తుతున్నారు. ‘హత్య జరిగిన స్కూల్ టాయ్లెట్లోకి డీసీసీతో సహా పలువురు అధికారులు వెళ్లి పరిశీలించారు. వారితోపాటు క్లూస్ టీం కూడా పైపైనే ఆధారాలు సేకరించింది. ఇలాంటి కేసుల్లో డాగ్ స్క్వాడ్‌ను ఉపయోగించాలన్న కనీస ఆలోచనను కూడా అధికారులు చేయలేదు. ఆ లెక్కన్న కేసుపై వాళ్లు ఎంత శ్రద్ధగా పని చేశారో అర్థమౌతోంది’ అని బాలుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అధికారులు పెద్ద తప్పు చేశారని.. ఒకవేళ డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి ఉండి ఉంటే కేసులో వెలుగు చూడని బోలెడు విషయాలు బయటపడేవి కావొచ్చని వారు అంటున్నారు. బాలుడి హత్య తర్వాత ఘటనా స్థలిని శుభ్రం చేసేందుకు స్కూల్ యాజమాన్యం ప్రయత్నించిందన్న ఆరోపణలు వినిపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే అధికారులు డాగ్ స్క్వాడ్ టీంలో ఒకే ఒక్క శునకాన్ని వాడుతుండటంపై కూడా విమర్శిస్తున్నారు. ప్రద్యుమ్న హత్యకు గురైన ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ను ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని, మూడు నెలల పాటు నిర్వహించేందుకు ముందు వచ్చిన విషయం తెలిసిందే. -
కొట్టక్కిలో హత్య
♦ గణేష్ నిమజ్జనం నాటి గొడవలే కారణమా? ♦ డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలు రంగ ప్రవేశం ♦ పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబ సభ్యులు ప్రశాంతతకు మారుపేరైన కొట్టక్కి గ్రామం మంగళవారం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గ్రామంలో హత్యకు గురైన వ్యక్తిని చూసి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. తెల్లవారి పొలం పనులకు వెళ్తున్న వారికి రోడ్డు పక్కనే హత్యకు గురై కనిపించిన మృతదేహాన్ని చూసి భయకంపితులయ్యారు. పెద్ద చెరువు గట్టుపై గ్రామానికి చెందిన వ్యక్తే హత్యకు గురై ఉండడంతో ఉలిక్కి పడ్డారు. వివరాల్లోకి వెళ్తే... రామభద్రపురం(బొబ్బిలి రూరల్) : కొట్టక్కి గ్రామానికి చెందిన వాకాడ సత్యనారాయణ(30) మంగళవారం హత్యకు గురై విగతజీవిగా కనిపించడంతో ఒక్కసారిగా గ్రామస్తులంతా భయభ్రాంతులయ్యారు. దీనికి సంబంధించి సీఐ జి.సంజీవరావు తెలిపిన వివరాలు...గ్రామానికి చెందిన సత్యనారాయణ ఈ నెల 11న తెల్లవారుజామున ఐదు గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడతో కుటుంబ సభ్యులు గ్రామ పరిసరాల్లో వెదికారు. ఎక్కడా కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. మంగళవారం ఉదయం అదే గ్రామానికి చెందిన రైతు తన పొలానికి నీరు కట్టేందుకు వస్తూ చెరువు మదుము తీద్దామని చెరువు గట్టుపైకి వెళ్లేసరికి అక్కడ సత్యనారాయణ మృతదేహం కనిపించడంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో సత్యనారాయణ భార్య మంగమ్మ వచ్చి గుర్తించి బోరుమంది. విషయం తెలిసి ఎస్ఐ డిడి.నాయుడు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గణేష్ నిమజ్జనమే కారణమా... పోలీసు ప్రాథమిక విచారణలో కొన్ని విషయాలు వెలుగు చూశాయి. గత నెల 30న గ్రామంలో గణేష్ నిమజ్జనం జరుపుతున్న సమయంలో డ్యాన్స్‌లు చేస్తుండగా వీధిలోని యువత మధ్య గొడవ చోటుచేసుకుంది. పెద్దలు సముదాయించారు. అదే సమయంలో ఒక వర్గానికి చెందిన వారు వేరో వర్గానికి చెందిన వారిలో ఒకరిని ఏదో రోజున చంపేస్తామని హెచ్చరించినట్టు తేలింది. ఈ హెచ్చరికే హత్యకు దారి తీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే సమయంలో ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనేది కూడా విచారిస్తున్నారు. అయితే సత్యనారాయణ కుటుంబ సభ్యులైన తల్లి గంగమ్మ, ఆమె మరిది వాకాడ సూర్యయ్య మాత్రం గణేష్ నిమజ్జనం రోజున హెచ్చరించిన వారే చంపేశారని ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్నే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి గణేష్ నిమజ్జనం రోజు జరిగిన గొడవకు సత్యనారాయణకు ఎటువంటి సంబంధం లేదని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఆ గొడవలో సత్యనారాయణ తమ్ముడు పాలుపంచుకున్నాడే తప్ప హతునికి సంబంధం లేదని చెబుతున్నారు. తల్లి గంగమ్మ ఇచ్చిన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ నాయుడు కేసు నమోదు చేశారు. సీఐ సంజీవరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా ప్రదేశానికి డాగ్ స్వా్వడ్, ఆరుగురు బృందంతో కూడిన క్లూస్ టీం వచ్చింది. గాలింపు చర్యలు చేపట్టారు. ప్రాథమిక ఆధారాలను సేకరించారు. ఇదిలా ఉండగా హతుడు సత్యనారాయణ ముఖంపై తీవ్ర గాయాలున్నాయి. ముక్కు వెంబడి రక్తం కారిన చాయలు ఉండడంతో కచ్చితంగా హత్యేనని అంతా భావిస్తున్నారు. వీధిన పడిన కుటుంబం హతుడు సత్యనారాయణ గొర్రెల కాపరిగా పని చేస్తున్నాడు. అలా వచ్చిన ఆదాయంతోనే కుటుంబాన్ని పోషిస్తున్నారు. హతునికి భార్య మంగమ్మతో పాటు సూర్య, రుషి అనే పిల్లలు కూడా ఉన్నారు. వీరంతా ఇతని ఆదాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు సత్యనారాయణ హత్యకు గురవడంతో ఎలా బతికేదని రోదిస్తున్నారు. ఆ నలుగురే చంపేశారు... గణేష్ నిమజ్జనం రోజున జరిగిన గొడవలో హెచ్చరించిన గ్రామానికి చెందిన వాకాడ భాస్కరరావు, వాకాడ వెంకయ్య, వాకాడ చిన్నయ్య, జి.గురునాయుడు కక్ష కట్టి చంపేశారు. వాస్తవానికి ఆ గొడవతో సత్యనారాయణకు ఎటువంటి సంబంధం లేదు. అన్యాయంగా చంపేశారు. కఠినంగా శిక్షించాలి. –వాకాడ సూరయ్య, హతుడి చిన్నాన్న -
కాలిన స్థితిలో యువకుడి మృతదేహం
పహాడీషరీఫ్: కాలిన స్థితిలో ఉన్న యువకుడి మృతదేహాన్ని పహాడీషరీఫ్ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ వీవీ చలపతి తెలిపిన వివరాల ప్రకారం.... పహాడీషరీఫ్–మామిడిపల్లి రహదారిని ఆనుకొని ఉన్న ఇందూ టెక్ కంపెనీ ఆవరణలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం కాలిపోయి ఉండగా ఉదయం 8 గంటలకు సూపర్వైజర్ గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. అక్కడ మృతుడికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. కాగా, మృతుడు ముస్లిం అని, వయసు 20 –25 ఏళ్ల మధ్య ఉంటుందని, ఒడిశా నుంచి కూలీ పనికి వచ్చి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, కిరోసిన్/పెట్రోల్ పోసి నిప్పంటించడంతో మృతదేహం కాలిపోయిందన్నారు. డాగ్ స్క్వాడ్‌ను రప్పించి పరిశీలించగా... పోలీసు జాగిలం ఘటనా స్థలం నుంచి కొద్ది దూరం వెళ్లి తిరిగి వచ్చేసింది. పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు హత్యకు గురయ్యాడా...? ఆత్మహత్యకు పాల్పడ్డాడా...? అనే విషయాలు పోస్టుమార్టం అనంతరం తెలుస్తాయని పోలీసులు తెలిపారు. మృతుడి సంబంధీకులెవరైనా ఉంటే పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో లేదా 9490617241 నంబర్లో సంప్రదించాలని పోలీసులు కోరార -
సిర్పూర్లో వ్యక్తి దారుణహత్య
గొడ్డలితో నరికి చంపిన దుండగులు రక్తపు మడుగులో మృతదేహం డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ నిజామాబాద్ రూరల్ : నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్పూర్లో ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన మాధాపూర్ శ్యాం(45) దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అతడి ఇంట్లో గొడ్డలితో నరికి హతమార్చారు. సోమవారం ఉదయం పక్కింట్లో ఉండే బంధువులు వచ్చి చూడగా రక్తపు మడుగులో శ్యాం మృతదేహం కనిపించింది. వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా వారు పోలీసులకు విషయం తెలిపారు. నిజామాబాద్ రూరల్ ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసు డాగ్ స్క్వాడ్ బృందం తెప్పించి గ్రామంలో పరిశీలన చేశారు. మృతుడు శ్యాంకు భార్య స్వర్ణ, ఇద్దరు పిల్లలు ఉండగా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరగగా ఆమె భర్తను వదిలేసి పిల్లలను తీసుకొని ఆర్మూర్‌కు వెళ్లి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఎనిమిది నెలల నుంచి శ్యాం ఇంట్లోనే ఉండేవాడు. పొద్దంతా తిరిగి రాత్రికి స్నేహితులతో కలిసి వచ్చి ఇంట్లోనే ఉండేవాడని స్థానికులు తెలిపారు. కొత్తకొత్త స్నేహితులు ఇళ్లకు వచ్చే వారని వివరించారు. విషయాన్ని భార్యకు తెలపడంతో ఆమె పిల్లలను తీసుకొని సిర్పూర్‌కు వచ్చింది. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పెద్ద కూతురు దివ్య డిగ్రీ చదువుతోంది. చిన్న కూతురు దీపిక ఇంటర్మీడియట్ చదువుతోంది. గతంలో మృతుడు పలు చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడేవాడని, రూరల్ పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వర్లు తెలిపారు. తమ్ముడు చిన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌హెచ్‌వో చెప్పారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
విశాఖలో చిన్నారి అదృశ్యం కలకలం
విశాఖపట్నం: విశాఖలో చిన్నారి(6) అదృశ్యం కావడం కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని దేవరాపల్లికి చెందిన ఆరేళ్ల చిన్నారి దివ్య మంగళవారం స్కూలుకు వెళ్లింది. అయితే సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు చిన్నారి కోసం తెలిసిన వారి ఇళ్లల్లో, బంధువుల దగ్గర వాకబు చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. దీంతో చేసేదేం లేక కుమార్తె అదృశ్యంపై కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిన్న స్కూలుకు వెళ్లిన తమ చిన్నారి దివ్య ఇప్పటివరకూ ఇంటికి తిరిగిరాలేదంటూ తమ ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దివ్య మేనమామ శేఖర్‌ను అనుమానిస్తున్నారు. దాంతో అతడిని అదుపులోనికి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. దేవరాపల్లిలో పాప ఆచూకీ కోసం జాగిలాలతో పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. -
విశాఖలో చిన్నారి అదృశ్యం కలకలం
-
’డాగ్‌స్క్వాడ్-మొయినాబాద్’
-
ర్యాట్ స్క్వాడ్!
డాగ్‌స్క్వాడ్ మాదిరిగా వాసన చూసి మందుపాతరలను కనిపెట్టే మూషికమిది. గురువారం కంబోడియాలోని సీమ్ ప్రావిన్స్‌లో మందుపాతరలు క్రియారహితంగా ఉన్న ఓ ప్రాంతంలో మూషికంతో కంబోడియన్ మైన్ యాక్షన్ సెంటర్ సిబ్బంది అన్వేషిస్తున్న దృశ్యమిది. బెల్జియంకు చెందిన ఓ సంస్థ ఈ గాంబియన్ ఎలుకల్ని కంబోడియా నుంచి టాంజానియా వర కూ అనేక చోట్ల మందుపాతరలు కనిపెట్టేందుకు రంగంలోకి దించింది. -
బాంబ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు
గుంటూరు క్రైం : అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదేశాల మేరకు బాంబ్ అండ్ డాగ్ స్క్వాడ్ సిబ్బంది శుక్రవారం నగరంలో తనిఖీలు నిర్వహించారు. రంజాన్ మాసం ప్రారంభం కారణంగా మసీదులు వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వుండేందుకు అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టారు. నగరంలోని అన్ని మసీదుల వద్ద ప్రాధాన్యతా ప్రకారం తనిఖీలు నిర్వహించేలా పోలీసులు ప్రణాళిక రూపొందించారు. ముస్లింలు అధికంగా వుండే ప్రాంతాల్లోని మసీదులను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనిలో భాగంగా పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని మసీదులను బాంబ్ డిస్పోజబుల్ టీం ఇన్చార్జి పి.మునియ్య నేతృత్వంలో సిబ్బంది ప్రత్యేక పరికరాల సహాయంతో మసీదులతోపాటు పరిసర ప్రాంతాలను సైతం తనిఖీచేశారు. డాగ్ స్క్వాడ్ సిబ్బంది పోలీస్ జాగిలం స్కూబీతో సోదాలు నిర్వహించారు. -
వివాహిత దారుణ హత్య
- భర్తే చంపాడంటున్న మృతురాలి అన్న - డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు - బిక్కాజిపల్లిలో విషాద ఛాయలు బిక్కాజిపల్లి(దుగ్గొండి) : ఓ వివాహిత దారుణ హత్యకు గురైన సంఘటన బిక్కాజిపల్లిలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గీసుగొండ మం డలం చంద్రయ్యపల్లికి చెందిన పేర్ల ఎల్లమ్మ కూతురు రమ(35)కు, దుగ్గొండి మండలం బిక్కాజిపల్లికి చెందిన కన్నెబోయిన సదయ్యకు 16 ఏళ్ల క్రితం వివాహం జరి గింది. వీరి దాంపత్య జీవితంలో శరత్, గణేష్ అనే ఇద్దరు కొడుకులు జన్మించారు. అయితే సోమవారం ఉదయం 10 గంటలకు సదయ్య నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లెలో ఉంటున్న తన అన్న సమ్మయ్య వద్దకు మరో అన్నయ్య ఓదేలుతో కలిసి వెళ్లాడు. వారు వెళ్లిన తర్వాత రమ నల్లబెల్లి గ్యాస్ కేంద్రంలో ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తానని కొడుకులకు చెప్పి బయటకు వెళ్లింది. సాయంత్రం అయినా ఆమె, సదయ్య సైతం ఇంటికి రాలేదు. సాయంత్రం తన తల్లికి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ రావడంతో పిల్లలు ఇద్దరే పడుకున్నారు. మంగళవారం ఉదయం శివాజీనగర్‌కు చెందిన కొండ్లె సదయ్య తన బావి వద్దకు పనులకు వెళ్లాడు. ఎస్సారెస్పీ డీబీఎం-38 కాలువ పక్కనే వ్యవసాయ బావి వద్ద పొదల మధ్య మహిళ శవం కనిపించింది. దీంతో గ్రామస్తులకు సమాచారం అందించాడు. మృతురాలి బంధువులు వెళ్లి చూడగా.. రమ మెడ భాగంలో మారణాయుధాలతో నరికి ఉండ టం.. రక్తపు మడుగు కట్టడంతో బోరున విలపించారు. భర్తకు సమాచారం ఇవ్వడంతో దస్తగిరిపల్లె నుంచి తన అన్నదమ్ములతో కలిసి వచ్చి మృతదేహాన్ని చూసి రోదించాడు. నర్సంపేట డీఎస్పీ మురళీధర్, రూరల్ సీఐ బోనాల కిషన్, దుగ్గొండి, నల్లబెల్లి ఎస్సైలు వెంకటేశ్వర్లు, హమీద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీ చేశారు. భర్త వద్దకు వెళ్లి ఆగిన డాగ్ స్క్వాడ్ కాగా, డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలంలో పలుచోట్ల తిరిగి చివరికి మృతురాలి భర్త సదయ్య వద్దకు వెళ్లి అతడిని వాసన చూసి అక్కడే ఉంది. ఇలా రెండు మూడుసార్లు పరీక్షించారు. సంఘటన స్థలానికి కొంత దూరంలోని ఓ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి మొక్కజొన్న చొప్ప కింద ఉన్న పారను పసిగట్టింది. దానిని తొలగించగా పార లభించింది. రమను ఇనుప పారతోపాటు గొడ్డలి లాంటి పరికరంతో చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. మహిళ ఇంటికి వస్తుండగా రాత్రివేళ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరయినా తీసుకెళ్లి చంపి ఉంటారా.. అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా, మృతురాలి అన్న పేర్ల సుధాకర్ తన చెల్లి రమను కుటుంబ కలహాలను దృష్టిలో ఉంచుకుని భర్త సదయ్యతోపాటు అతడి బంధువులు చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కిషన్ తెలిపారు. కాగా, బిక్కాజిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వందలాది మంది ప్రజలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మూడు గంటలపాటు వారిని నిలువరించడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. -
గుర్తుతెలియని యువకుడి దారుణ హత్య
•డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంలతో పోలీసుల వేట •కొడుపాక శివారులో కలకలం పాపన్నపేట: మండల పరిధిలోని కొడుపాక శివారులో గుర్తు తెలియని పాతికేళ్ల యువకుడు శుక్రవారం తెల్లవారు జామున దారుణ హత్యకు గురయ్యాడు. పదునైన ఆయుధాలతో గొంతుకోసి తలపై నరికి చంపారు. గ్రామ శివారులో కలకలం రేపిన ఈ సంఘటనకు సంబంధించిన హంతకులను పట్టుకునేందుకు పోలీసు లు డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంలతో వేట ప్రారంభించారు. మెదక్ రూరల్ సీఐ రామకృష్ణ, పాపన్నపేట ఎస్ఐ శ్రీకాంత్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. కొడుపాక శివారులో రోడ్డు పక్కనే గల వరిపొలాల్లో తీవ్రగాయాల పాలైన గుర్తు తెలియని యువకుడు కొన ఊపిరిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఉదయం ఇది గుర్తించిన స్థానిక రైతులు 108కు సమాచారం అందించారు. ఉదయం 9 గంటల వరకు 108 సిబ్బంది అక్కడికి చేరుకునేలోగానే బాధితుడు మృత్యువాత పడ్డాడు. అతని జేబుల్లో వెతికినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఒంటిపై ఆకుపచ్చ ఫుల్ షర్ట్, నలుపురంగు జీన్స్‌ప్యాంట్ ఉన్నా యి. బెల్టు బకెల్పై ఆర్ అనే అక్షరం ఉంది. ఎడమచేతి మడమపై ఆంగ్లలో కె.ఎస్. అనే అక్షరాలు, కుడిచేతి బొటనవేలిపై కె.ఎస్.సాయి అనే అక్షరాలు, కుడిచేతి భుజంపై ఓం ఆకారంలో పచ్చబొట్లు ఉన్నాయని ఎస్ఐ వివరించారు. కాగా సంఘటన స్థలాన్ని క్లూస్‌టీం సిబ్బంది వెంకటేశ్వర్లు, నర్సింలు, డాగ్‌స్క్వాడ్ అధికారులు సందర్శించి పరిశోధన ప్రారంభించారు. సదరు యువకుడిని హత్య చేసిన చోట పెనుగులాడిన ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. గొంతు, తలపై పదునైన ఆయుధాలతో దాడి చేయడం వల్ల అతడు మరణించి ఉంటాడని పోలీసులు అనుకుంటున్నారు.ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగి ఉం టుందని భావిస్తున్నారు. మృతుడు సమీప జిల్లాల కు చెందిన వాడైఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేశామని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. -
చంపి ఉరేశారా..?
* తుజాల్పూర్లో వ్యక్తి అనుమానాస్పదంగా మృతి * మృతుని ట్రాక్టర్ ఇంజన్ సైతం దహనం * చంపి ఉరివేశారని కుటుంబసభ్యుల ఆరోపణ * డాగ్‌స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు * తుజాల్పూర్లో కలకలం దోమకొండ : మండలంలోని తుజాల్పూర్ గ్రామానికి చెందిన సుంకరి వెంకట్‌గౌడ్(35)అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే మృతదేహం ఉన్న తీరును బట్టి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపి ఉరేసి ఉంటారని కుటుంబీకులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు మృతునికి చెందిన ట్రాక్టర్ ఇంజన్ సైతం ఇదే రోజు దహనం కావడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. వివరాల్లోకి వెళితే వెంకట్‌గౌడ్ తన భార్య లావణ్యతో కలిసి శుక్రవారం అర్ధరాత్రి వరకు తాగునీటి మోశాడు. అయితే తెల్లవారుజామున నిద్ర లేచిన భార్యకు భర్త కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో వారు గ్రామంలో వెతికగా గ్రామ శివారులో ఎల్లమ్మగుడికి వెళ్లే దారిలో చెట్టుకు ఉరేసుకున్నట్లు వెంకట్‌గౌడ్ మృతదేహం కనిపించింది. విషయం తెలుసుకున్న భిక్కనూర్ సీఐ శ్రీధర్‌కుమార్, దోమకొండ ఎస్సై శోభన్‌బాబు, బీబీపేట ఏస్సైలు నరేందర్, రాంప్రసాద్‌లు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిజామాబాద్ నుంచి డాగ్‌స్వ్కాడ్‌ను పిలిపించి సంఘటనా స్థలంలో తనిఖీలు నిర్వహించారు. కాగా వెంకట్‌గౌడ్‌ను కావాలనే ఎవరో చంపి ఉరివేశారని మృతుని భార్య లావణ్య, తండ్రి బాల్‌రాజ్, తల్లి పోశవ్వలు ఆరోపించారు. మృతదేహం కూడా అనుమానాస్పదంగా ఉండటంతో ఇది హత్యా..? లేక ఆత్మహత్య అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు గ్రామంలో గీత కార్మికునిగా పనిచేస్తున్నారు. మృతునికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కామారెడ్డిలో పోస్టుమార్టం వద్ద డీఎస్పీ భాస్కర్ మృతదేహాన్ని పరిశీలించారు. ఈ సంఘటన గ్రామంలో కలకలం సృష్టించింది. -
యువకుడి దారుణ హత్య
నిజాంసాగర్ : మండలంలోని నర్వ గ్రామానికి చెందిన పెంటబోయిన నాగరాజు (27) అనే యువకుడు శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. కుటుంబీకుల ప్రోద్బలంతో స్నేహితులు ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల ద్వారా తెలిసింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నర్వ గ్రామానికి చెందిన పెంటబోయిన ఎల్లవ్వ మనుమడు నాగరాజు వ్యవసాయ పనులు చేసుకుంటూ మద్యానికి బానిసగా మారాడు. చిన్ననాటి నుంచి మద్యం సేవించడంతో కుటుంబంలో తరుచూ తగాదాలు చోటుచేసుకుంటున్నాయి. చెడువ్యసనాలకు బానిసగా మారిన నాగరాజు పరివర్తనలో మార్పురాకపోవడంతో ఐదేళ్ల కిందట ఓ యువతితో పెళ్లి జరిపించారు. అయినా నాగరాజులో మార్పు కన్పించలేదు. రోజూ మద్యం సేవించి వచ్చి భార్యను, కుటుంబీకులను కొట్టేవాడు. భర్త చిత్రహింసలను భరించలేక మొదటి భార్య విడాకులు తీసుకుంది. ప్రతిరోజూ మద్యం సేవించడంతో పాటు పక్కగ్రామాల్లో పేకాట ఆడుతూ ఆస్తిని గుల్ల చేశాడు. కాగా మూడేళ్ల కిందట మమహమ్మద్నగర్కు చెందిన మమతతో రెండో పెళ్లి జరిపించారు. అప్పటి నుంచి కొద్దిరోజుల పాటు నాగరాజు లో మార్పుకన్పించింది. వీరికి ఏడాదిన్నర కింద ట బాలుడు పుట్టాడు. కొద్దిరోజులకు మళ్లీ మ ద్యానికి బానిసై భార్య తో పాటు కుటుంబీకుల తో గొడవపడుతూ దాడి చేసేవాడు. ఈ విషయ మై రెండు సార్లు నాగరాజుపై కుటుంబ సభ్యులు పోలీ స్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.కొన్నేళ్ల నుంచి చిత్రహింసలను భరిస్తున్న కుటుంబీకులు నాగరాజును హత మార్చడానికి వారం రోజుల కిందట పథకం పన్నారు. రోజులాగే మద్యం సేవించి వచ్చిన నాగరాజు కుటుం బీకులతో గొడవపడ్డాడు. ఇదే అదునుగా భావించినకు టుంబీకులు నాగరాజు హత్యకోసం ప్రయత్నాలు చేశా రు. నాగరాజు స్నేహితులైన ఇదే గ్రామానికి చెందిన బోండ్ల మచ్చెందర్, రుద్ర రాంచందర్‌లను కుటుం బీకులు ఇంటికి పిలిచారు. చిత్తుగా మద్యం తాగి ఉన్న నాగరాజును హతమార్చాలని వారిని కోరారు. కుటుం బీకుల సహకారంతో ఇంట్లోనే నాగరాజు గొంతు, మర్మాంగాలను కుటుంబీకులు, స్నేహితులు నులిమి దాడి చేసి హత్య చేశారు. హత్య విషయం బయటకు పొక్కకుండా నాగరాజు మృతదేహాన్ని ఇంటి కొద్దిదూరంలో ఉన్న చింతచెట్టు కిందపడేశారు. వేకువజామున నిద్రలేచిన కుటుంబీకులు చింతచెట్టుకింద నాగరాజు హత్యకు గురైనట్లు గ్రామస్తులను నమ్మబలికారు. చుట్టుపక్కల వారు వచ్చి మృతదేహన్ని పరిశీలించి హత్యగా భావించారు. ఈ విషయమై స్థానికులు కుటుంబీకులను ప్రశ్నించగా తమకు ఎవరిపైనా అనుమానాలు లేవని, పోలీసులకు ఫిర్యాదు వద్దన్నారు. చివరకు బంధువుల ద్వారా సమాచారం అందుకున్న ఎస్సై అంతిరెడ్డి సంఘటనస్థలానికి చేరుకొని మృతదేహన్ని పరిశీలించారు. విషయాన్ని బాన్సువాడ రూరల్ సీఐ రమణారెడ్డికి చేరవేశారు. దీంతో సీఐ అక్కడికి చేరుకొని జిల్లా కేంద్రం నుంచి డాగ్‌స్క్వాడ్‌ను రప్పించారు. అప్పటికే కుటుంబీకులను అనుమానించగా హత్య నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. డాగ్ స్వ్కాడ్ ఘటన స్థలం నుంచి ఇంట్లోకి వెళ్లి కుటుంబీకులను పట్టుకుంది. ఈ మేరకు పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య మమతతో పాటు చిన్నమ్మ మంజుల, అమ్మమ్మ ఎల్లవ్వ, స్నేహితులు రాంచందర్, మచ్చెందర్లపై కేసునమోదు చేసినట్లు ఎస్సై అంతిరెడ్డి తెలిపారు. హంతకులు పరారిలో ఉన్నారని పోలీసులు తెలిపారు. -
యువతి సజీవ దహనం
* పెదతాడేపల్లిలో ఘాతుకం * రంగంలోకి డాగ్ స్క్వాడ్ * అత్యాచారం జరిపి హత్య చేసి ఉంటారని అనుమానం తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి వద్ద జాతీయ రహదారి వద్ద వ్యవసాయ క్షేత్రంలో గుర్తు తెలియని యువతి సజీవ దహనమైంది. శరీరం పూర్తిగా కాలిపోగా.. కేవలం రెండు చేతులు మోచేయి వరకూ మాత్రమే మిగిలాయి. ఆ ఆనవాళ్లను బట్టి సజీవ దహనమైంది యువతి అని, వయసు 15 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహం మెడ భాగంలో బెల్టు బిగించి ఉన్నట్టు కనపడుతోంది. ఆమెపై అత్యాచారం జరిపి అనంతరం పెట్రోల్ పోసి దహనం చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. శుక్రవారం ఈ ఘటన వెలుగుచూడగా, సీఐ జి.దేవకుమార్ ఆధ్వర్యంలో ఎస్సైలు కొండలరావు, కరుటూరి రామారావు ఘటనా స్ధలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని గుర్తించిన బంటా కార్మికులు పెదతాడేపల్లి జాతీయ రహదారి బైపాస్ పక్కన శుక్రవారం వేకువజామున వ్యవసాయ క్షేత్రాలలో కూలి పనులకు వెళుతున్న బంటా కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మృతదేహం తాలూకా భాగాలను కుక్కలు ఎత్తుకెళుతుండటాన్ని వారు గమనించారు. కొంతదూరంలో పిచ్చిమొక్కల మధ్య నుంచి పొగ వస్తోంది, ఏమిటా అనే ఆసక్తితో అక్కడికి వెళ్లి చూసిన వారు నిర్ఘాంతపోయారు. అక్కడ ఓ మృతదేహం పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టకుండా ఉంది. అంతకు ముందు కుక్క తీసుకెళుతున్న శరీర భాగం ఈ మృతదేహానిదే అని తెలిసి వారి గుండెలు గుభిల్లుమన్నాయి. దగ్గరకు వెళ్లి చూస్తే ఆ మృతదేహం యువతిదిగా గుర్తించారు. వెంటనే విషయాన్ని వీఆర్ఏ దృష్టికి తీసుకువెళ్లారు. వీఆర్ఏ నుంచి వీఆర్వో ద్వారా ఈ సమాచారం పోలీసులకు చేరింది. ఈ ఘటన ఈ ప్రాంతంలో సంచలనం రేకెత్తించింది. యువతా.. బాలికా.. దుండగులు కిరాతకంగా హత్య చేసినట్టు తెలుస్తోంది. శరీర మొత్తంలో కేవలం రెండు చేతి భాగాలు అదీ మోచేయి పైకి మాత్రమే ఉన్నాయి. శరీరం దహనం కాగా మిగిలిన భాగాలను బట్టి యువతి లేదా బాలిక కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి దగ్గరలో ఒక నల్లని చెప్పు ఉంది. మరో పాత చెప్పు ఒకటి ఉంది. ఈ చెప్పు ఆధారంగా హత్యకు గురైన వ్యక్తి యువతి లేదా బాలిక కావచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మృతదేహం మెడకు బెల్టు లాంటిది బిగించి ఉంది. దీనిని బట్టి బెల్టుతో మెడకు బిగించి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతదేహం ముఖానికి గుడ్డ ఒకటి అడ్డుగా కట్టే ఉంది. మృతదేహం కాలిఉన్న ప్రాంతానికి దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఉన్న మొక్కలు నలిగినట్టు కనిపిస్తున్నాయి. మెడకు బెల్టు వేసి వీటి మధ్య నుంచి సజీవంగా కాని, లేదా హత్య చేసి కాని ఇక్కడకు తీసుకువచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇదే రహదారి తణుకు వైపు వెళ్లే మార్గంలో రోడ్డుకు ఎడమ పక్క మద్యం బాటిళ్లు, వాటర్ప్యాకె ట్లు, వాటికి దగ్గరగా ఖాళీ ప్లాస్లిక్ సీసాలను పోలీసులు గుర్తించారు. దీనిని బట్టి హత్యకు ముందు అనుమానితులు మద్యం తాగి ఉంటారని అంటున్నారు. దహనమైన మృతదేహం పక్కన తొమ్మిది నంబర్ కలిగిన చెప్పు లభించింది. దీనిని బట్టి హత్యకు పాల్పడిన వారు ఇక్కడ ఎవ్వరి సహాయం అయినా తీసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు ముందు యువతిలేదా బాలికైపై అత్యాచారం జరిగి ఉంటుందా అనే కోణంలో కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈఘాతుకానికి ఒడిగట్టింది స్థానికులా, వేరే ప్రాంతానికి చెందిన వ్యక్తులా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కీలకం కానున్న ఆధార్ వేలిముద్రలు పెదతాడేపల్లి జాతీయ రహదారి బైపాస్ పక్కనున్న జరిగిన ఘోర హత్యోదంతంలో ఆధార్ ఆధారం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇక్కడ ఘటనలో పూర్తిగా యువతి కాలిపోగా చేతులు మాత్రం మిగిలి ఉండటంతో వాటి వేలిముద్రల ఆధారంగా మృతురాలిని గుర్తించాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలిసింది. ఘటనా స్తలంలో మృతదేహానికి పంచనామా అనంతరం, పోస్టుమార్టం శనివారం ఉదయం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కలియదిరిగిన స్నిపర్ డాగ్ ఏలూరు నుంచి ట్రైనర్ అంజనీకుమార్ పర్యవేక్షణలో స్నిపర్ డాగ్ డాన్‌తో ఘటనా స్థలంలో ఆధారాల కోసం కలియదిరిగింది. ఘటనా స్థలంలో లభించిన చెప్పు, కాలిన దేహం వాసన చూసిన డాగ్ అక్కడ నుంచి నేరుగా ఏలూరు వైపున ఉన్న పొలాలలోకి వెళ్లింది. అక్కడి పొలాలలో పడి ఉన్న ఎముక ముక్కను గుర్తించింది. తర్వాత వెనక్కి వచ్చింది. బైపాస్ రహదారి పక్కనుంచి గ్రామంలోకి విద్యుత్ సబ్‌స్టేషన్ వైపున ఉన్న రహదారి వైపు వెళ్లింది. మార్గ మధ్యమంలో స్మశానం దగ్గరలో ఉన్న మలుపు వద్ద పగిలి పడి ఉన్న మోటారు సైకిల్ హెడ్ లైట్ ముక్కల వద్ద కొంత సేపు ఆగింది. అక్కడి నుంచి పెదతాడేపల్లి గ్రామంలోకి వెళ్లే రోడ్డుపైకి ఎక్కింది. అక్కడ రోడ్డుపక్కగా ఉన్న ఓ టెక్నికల్ విద్యాసంస్థలోకి వెళ్లి అక్కడ ఒక గది వద్ద తచ్చాడింది. అక్కడ్నించి పక్కనే ఉన్న ఓ ప్రార్ధనా మందిరంలోకి ఒకసారి వెళ్లి బయటకు వచ్చి, తిరిగి దీని ఎదురుగా ఉన్న స్థలంలో తచ్చాడి. మళ్లీ అదే ప్రార్ధనా స్థలంలోకి వెళ్లింది. తిరిగి దీని పక్కగా వ్యవసాయ క్షేత్రాలవైపున ఉన్న చెరువు వద్దకు పరుగు తీసింది. ఈ చెరువు చుట్టూ తిరిగి అక్కడి నుంచి జాతీయ రహదారి బైపాస్ రోడ్డు ఎక్కే ప్రాంతంలో ఆగింది. అక్కడ కాటన్ చున్నీ, లంగా బొందు ఉంది. అక్కడ డాగ్ ఆగింది. ఆ చున్నీని, లంగా బొందును తీసుకొచ్చి డాగ్‌కు వాసన చూపించాక, ఘటనా స్థలం సమీపంలో కుక్క తచ్చాడింది. దీంతో ఈ ప్రాంతం గురించి క్షుణ్ణంగా తెలిసున్నవారే అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. చెరువు గట్టు మీద కాని అత్యాచారానికి పాల్పడి, ఆనక అఘాయిత్యం చేసి, చేలలో నుంచి యువతిని లాక్కొచ్చి, పెట్రోలు కాని యాసిడ్ లాంటి పదార్దం పోసి కాని తగులబెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ జి.దేవ్‌కుమార్ చె ప్పారు. వీఆర్ఓ తల్లాప్రగడ శ్రీనివాసు ఫిర్యాదు మేరకు సంఘటనా స్తలాన్ని చూశామన్నారు. గుర్తుతెలియని యువతిగా భావించి, కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నామన్నారు. ఘటనలో ఇద్దరికంటే ఎక్కువ మంది పాల్గొని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణ ఎస్ఐ కొండలరావు, రూరల్ ఎస్ఐ రామారావులు దర్యాప్తులో ఉన్నారు . -
మహిళ దారుణహత్య
మెదక్ రూరల్ : మహిళ దారుణహత్యకు గురైన సంఘటన మండల పరిధిలోని భూర్గుపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి కుమారుడు అరవింద్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన మైసన్నగారి కిష్టవ్వ (42), మైసయ్య దంపతులకు ఓ కుమార్తె స్వప్న, కుమారుడు అరవింద్ ఉన్నారు. మైసయ్య ఉపాధి పనుల నిమిత్తం కొన్నేళ్ల క్రితం ముంబ యికి వలస వెళ్లాడు. అయితే కుమార్తె స్వప్న కొద్ది రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీంతో కిష్టవ్వ, కుమారుడు అరవింద్ మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. కాగా మృతురాలు కిష్టవ్వ మంగళవారం మెదక్‌కు వచ్చి కిరాణా సామగ్రిని కొనుగోలు చేసి ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అరవింద్, అతని మిత్రుడు రవితేజలు ఇంట్లో టీవీ చూస్తూ తొమ్మిది గంటల ప్రాంతంలో మూత్ర విసర్జన నిమిత్తం బయటకు వచ్చారు. ఈ సమయంలో ఇంటి సమీపంలో ఓ వ్యక్తి సెల్‌ఫోన్ పట్టుకుని తచ్చాడుతూ కనిపించాడు. అయితే చీకట్లో సరిగా కనపడకపోవడంతో గ్రామానికే చెందిన వ్యక్తి అయి ఉండవచ్చని భావించిన అరవింద్ మిత్రుడితో కలిసి ఇంటికి వచ్చి రాత్రి పది గంటల వరకు టీవీ చూసి పడుకున్నారు. ఉదయం లేచి చూసేసరికి తల్లి నెత్తుటి మడుగులో ఉన్న విషయాన్ని చూసి అరవింద్ బోరుమన్నాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ రాజరత్నం, పట్టణ సీఐ కొమురయ్య, రూరల్ ఎస్ఐ వినాయక్ రెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం వివరాలను సేకరించింది. అదే విధంగా డాగ్‌స్క్వాడ్.. మృతురాలి ఇంటి నుంచి సమీపంలోని ఓ కల్లు దుకాణంలోకి వెళ్లి అక్కడ కూర్చుంది. అక్కడి నుంచి నేరుగా ఎస్సీ కాలనీలో గల పలువురు వ్యక్తుల ఇళ్ల ముందు నుంచి కాలనీలో తిరుగుతూ ప్రధాన సీసీ రోడ్డుకు వెళ్లింది. ఈ మేరకు పోలీ సులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. హంతకుడిని పట్టుకుంటాం : డీఎస్పీ రాజరత్నం హత్యా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ రాజరత్నం అనంతరం విలేకరులతో మాట్లాడారు. కిష్టమ్మను పరిచయస్తులే చంపినట్లు హత్యా స్థలాన్ని బట్టి తెలుస్తోందన్నారు. మృతురాలి ఒంటిపై ఉన్న కడియాలు, పట్టగొలుసులు, గుండ్లను హంతకుడు అపహరించినట్లు ఆయన అనుమానించారు. కాగా నిందితుడు హత్యను పక్కదారి పట్టించేందుకు పుస్తెలతాడు, చెవి కమ్మలను అలాగే వదలి పోయాడని డీఎస్పీ చెప్పారు. హంతకుడిని అతి త్వరలో పట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు. -
ఎక్కడో.. చంపి ఇక్కడకు తెచ్చి..
వేటపాలెం : గుర్తుతెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన వేటపాలెంలో ఆలస్యంగా సోమవారం వెలుగు చూసింది. వివరాలు.. చీరాల - ఒంగోలు రోడ్డులో గతంలో కనకదుర్గా వైన్స్ నిర్వహించిన భవనం, దాని పక్కనే మరో వ్యక్తి ఇంటికి మధ్య కొద్దిపాటి ఖాళీ స్థలం ఉంది. అక్కడి నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇంటి యజమాని టైలర్ సోమేశ్వరరావు గమనించాడు. అక్కడ గుర్తుతెలియని యువకుని మృతదేహం ఉండటంతో ఆందోళనకు గురయ్యాడు. వెంటనే బంధువులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చీరాల సీఐ ఫిరోజ్, ఎస్సై జి.రామిరెడ్డిలు హుటాహుటిన వచ్చి మృత దే హాన్ని పరిశీలించారు. మృతుని శరీరంపై దుప్పటి కప్పి ఉంది. దుప్పటి తొలిగించి చూడగా దుస్తులు లేవు. మెడకు తాడు బిగించి ఉంది. రెండు కాళ్లు కలిపి తాడుతో కట్టి ఉంది. మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతునికి సుమారు 35 ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు. మృదేహం ఉబ్బి ముఖం గుర్తు పట్టేందుకు వీల్లేకుండా ఉంది. హత్య జరిగి రెండు రోజులై ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడకు తెచ్చి పడేసినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని డీఎస్పీ నరహర పరిశీలించారు. చుట్టపక్కల కలియదిరిగిన డాగ్ స్క్వాడ్ ఒంగోలు నుంచి డాగ్ స్క్వాడ్ వచ్చింది. హంతకుల ఆధారాల కోసం రూబీ (పోలీసు కుక్క) చుట్టుపక్కల కలియదిరిగింది. మృతదేహం నుంచి పాత కనకదుర్గా వైన్స్ షాపు వెనక మీదగా కూరగాయల మార్కెట్‌కు వెళ్లింది. అక్కడి నుంచి గడియార స్తంభం సెంటర్ మీదుగా ఒన్‌వే రోడ్ వైపునకు మళ్లింది. తిరిగి పోస్టాఫీస్ రోడ్డు మీదుగా చీరాల -ఒంగోలు రోడ్డుకు వచ్చి మళ్లీ సంఘటన స్థలం చేరుకుని ఆగింది. మృతదేహానికి శవ పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. స్థానికుల్లో భయాందోళన వేటపాలెం ప్రధాన సెంటర్‌కు దగ్గరలో నివాసాలు అధికంగా ఉండే ప్రాంతంలో గుర్తుతెలియని యువకుడి హత్య సంచలనం సృష్టించింది. స్థానికులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. నిత్యం ర ద్దీగా ఉండే ప్రాంతంలో మృతదేహం కనిపించడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఎత్తుకెళ్లి...గొంతు కోసి చిన్నారిని చిదిమేశాడు
అమ్మఒడిలో ఆదమరిచి నిద్దరోతున్న చిన్నారి.. శాశ్వత నిద్రలోకి జారుకుంటానని ఊహించలేకపోయింది.. పెద్దల మధ్య పొరపచ్చాలు...ఆ పాప పాలిట శాపమయ్యాయి.. కఠినాత్ముడు...కర్కశంగా వ్యవహరించాడు.. కృష్ణవేణిని కడతేర్చాడు... నార్కట్‌పల్లి: నార్కట్‌పల్లి మండలంలో సంచలనం సృష్టించిన చిన్నారి కృష్ణవేణి హత్యోదంతం వెనుక అయినవా రి కుట్రదాగి ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం మండలంలోని బంటుగూడెంలో వెలుగుచూసిన చిన్నారి దారుణ హత్య ఉదం తం మండల వ్యాప్తంగా దావానంలా వ్యాపి ంచింది. పోలీసులు ఘటనస్థలాన్ని పరిశీలించి దర్యాప్తును వేగవంతం చేశారు. డాగ్‌స్వ్కాడ్ గుర్తించిందని.. చిన్నారి హత్య విషయం తెలుసుకున్న డీఎస్పీ రాంమోహన్‌రావు, సీఐ రాఘవేంద్ర వెంటనే బంటుగూడెం గ్రామానికి వచ్చారు. డాగ్‌స్క్వాడ్‌ను రప్పిం చారు.అయితే డాగ్‌స్క్వాడ్ అక్కడే ఉన్న రమావత్ శ్రీ ను గుర్తించింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పనిచేసుకునేందుకు వచ్చి.. పోలీసులు అదుపులోకి తీసుకున్న రమావత్ శ్రీను హత్యగాబడిన కృష్ణవేణికి వరుసకు మామ అవుతాడు. పెద్దవూర మండలం మూలతండాకు చెందిన హనుమంతు మొ దటి భార్య భారతి చనిపోవడంతో తన మేడకోడలు చంద్రకళను వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు ఇద్దరు, రెండో భార్యకు ఇద్దరు చొప్పు న ఆడపిల్లలు జన్మించారు. కాగా, 3 నెలల నుంచి హనుమంతు తన భార్య పిల్లలో కలిసి బంటుగూడెం లో తోట వద్ద జీతానికి పనిచేస్తున్నాడు. మొదటిభార్య సోదరుడైన రమావత్ శ్రీను బావ దగ్గరికి ఇరవై రోజుల క్రితం వచ్చి కూలిపనులు చేసుకుంటున్నాడు. ఇతడితో పాటు చంద్రకళ చిన్నాన్న కుమారుడు అరుణ్ కూడా వచ్చి ఉంటున్నాడు. అయితే కృష్ణవేణి హత్య జరిగిన రోజే తండ్రి స్వగ్రామానికి వెళ్లడం, డాగ్‌స్క్వాడ్ శ్రీనును గుర్తించడంతో హత్య వెనుక అయినవారి హస్తం ఉందనే కోణంలోనే విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న ట్లుఎస్ఐ ప్రణీత్‌కుమార్ తెలిపారు. -
అర్ధరాత్రి తెగబడిన దొంగలు
కుల్కచర్ల: అర్ధరాత్రి దొంగలు తెగబడ్డారు. ఓ ఇంట్లోకి చొరబడి బీరువాను గ్రామ శివారులోకి తీసుకెళ్లి ధ్వంసం చేశారు. రూ. 10 విలువ చేసే సొత్తు అపహరించుకుపోయారు. పోలీసులు క్లూస్‌టీం, జాగిలాలతో వివరాలు సేకరించారు. ఈ సంఘటన మండల పరిధిలోని కొత్తపల్లి అనుబంధ లింగనపల్లిలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగనపల్లి గ్రామానికి చెందిన సంపంగి నర్సింలుకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఒకే ఇంట్లో తండ్రీకొడుకులు వేర్వేరుగా ఉంటున్నాడు. నర్సింలు వడ్డీ వ్యాపారంతో పాటు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి నర్సింలు తన భార్య నాగమ్మ, మనువడితో కలిసి ఇంటికి తాళం వేసి భవనం పైన నిద్రించాడు. ఆయన చిన్న కొడుకు హన్మంతు పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. పెద్ద కొడుకు భార్యతో కలిసి ఇంటి ఎదుట ఉన్న మరో ఇంట్లో నిద్రించాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళం విరగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న రెండు బీరువాలు ధ్వంసం చేశారు. ఓ బీరువాను గ్రామ శివారులోకి తీసుకెళ్లారు. అక్కడ ధ్వంసం చేసి అందులో ఉన్న రూ. 6 లక్షలు నగదు, 8 తులాల బంగారంతో పాటు 80 తులాల వెండి నగలు అపహరించుకుపోయారు. గురువారం ఉదయం నర్సింలు కిందికి వచ్చి చూడగా తాళం విరిగిపోయి కనిపించిం ది. ఇంట్లోకి వెళ్లి చూడగా రెండు బీరువాలో ధ్వంసమై కనిపించాయి. మరో బీరువా కనిపించలేదు. గ్రామ శివారులో ఓ బీరువా కనిపించడంతో స్థానికులు నర్సింలు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. బాధితుల ఫిర్యాదుతో చేవెళ్ల డీఎస్పీ శ్రీధర్, పరిగి సీఐ వేణుగోపాల్‌రెడ్డి, కుల్కచర్ల ఎస్ఐ కృష్ణ తదితరులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంతో వివరాలు సేకరించారు. పోలీసు జాగిలాలు నర్సింలు ఇంటి వద్ద తచ్చాడాయి. రూ. 10 లక్షలు విలువ చేసే సొత్తు చోరీ జరిగిందని నర్సింలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దుండగులను త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
వరంగల్ రైల్వే స్టేషన్లో తనిఖీలు
మట్టెవాడ, న్యూస్‌లైన్ : చైన్నై రైల్వేస్టేషన్లో గురువారం ఉదయం జరిగిన జంట బాంబు పేలుళ్లతో నగరంలోని పోలీసులు అప్రమత్తమయ్యూరు. వరంగల్ రైల్వేస్టేషన్లో బాంబు, డాగ్ స్క్వాడ్‌తో మూడు ప్లాట్‌ఫాంలపై తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన సూట్‌కేసులు, ప్రయాణికుల వస్తువులను పరిశీలించారు. అలాగే వెరుుటింగ్ హాళ్లు, ప్రతీ రైలులోని బోగిలన్నీ తనిఖీ చేశారు. ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, సూట్‌కేసులు కనిపించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రయాణికులను కోరారు. ఈ తనిఖీల్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ సీఐలు రవికుమార్, హరిబాబు, ఎస్సైలు రవిప్రకాష్, శంకరయ్య, స్టాలిన్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. కాజీపేట జంక్షన్లో.. కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్లో గురువారం రైల్వేపోలీసులు తనిఖీలు చేపట్టారు. చెన్నై రైల్వేస్టేషన్లో గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స అధికారులు అప్రమత్తమయ్యారు. సికింద్రాబాద్ రైల్వేపోలీస్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో కాజీపేట రైల్వే పప్రొటెక్షన్ ఫోర్స్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ విజయ్‌కుమార్, కాజీపేట రైల్వే డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాజీపేట ఆర్పీఎఫ్ ఏఎస్సైలు చంద్రమౌళి, రాజన్న, ఏడుకొండలు హెడ్‌కానిస్టేబుల్ సర్వర్‌ఖాన్ కాజీపేట జంక్షన్లో అనుమానాస్పద వస్తువులు, బ్యాగులను తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేసి విచారించి విడిచిపెట్టారు. పోలీసుల తనిఖీలతో రైల్వేస్టేషన్‌లోని ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లలోనూ ఎస్కార్ట్ పోలీసులను అప్రమత్తం చేసినట్లు రైల్వే పోలీస్ అధికారులు తెలిపారు. -
షేమ్.. షేమ్..
అత్యాధునిక పరిజ్ఞానం.. సమర్థవంతమైన క్లూస్ టీం.. శుశిక్షిత డాగ్ స్క్వాడ్.. నేర పరిశోధనలో కాకలు తీరిన యోధులు.. వెరసి ఇద్దరు చిన్నారులను పట్టపగలు చంపి వెళ్లిన వారి ఆచూకీ కూడా కనుక్కోలేకపోయారు. ఆ ఘోరానికి పాల్పడిన వారు అంతర్జాతీయ తీవ్రవాదులో, ఐఎస్ఐ ఏజెంట్లో అయితే అంత త్వరగా దొరకరులే అని సరిపెట్టుకోవచ్చు. ఆస్తి తగాదాలా లేక మామూలు దొంగల పనా అన్నది కూడా తేల్చలేకపోయారు. నింపాదిగా దర్తాప్తు చేద్దామనా.. లేక నిర్లక్ష్యమా? అదేమైనా సరే క్షమార్హం కాని నిర్లక్ష్యమని జనం భావించకుండా మసలుకునే బాధ్యత పోలీస్ శాఖదే. మడకశిర, న్యూస్‌లైన్ : సంచలనం కలిగించిన ఇద్దరు చిన్నారుల హత్య కేసులో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. హత్యలు జరిగి 48 గంటలు దాటినా కనీసం క్లూ కూడా సంపాదించకపోవడంతో వారి పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. గురువారం మడకశిరలో అక్కాతమ్ముడైన మంజువాణి (13), రంగనాథ్ (8)లను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. పట్టపగలే ఈ హత్యలు చోటు చేసుకోవడంతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అభంశుభం ఎరుగని పిల్లలను చంపడానికి వారికి చేతులెలా వచ్చాయో అంటూ శాపనార్థాలు పెట్టిన జనం.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు ర్యాలీలు కూడా నిర్వహించాయి. కాగా హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించలేకపోయారు. పిల్లలకు పట్టణంలో రక్షణ లేకుండా పోతోందని స్థానికులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో పిల్లలను స్కూళ్లకు పంపేందుకు కూడా జంకుతున్నారంటే ఇక్కడ పరిస్థితి ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నపుడు నిందితులను వెంటనే పట్టుకుంటే ప్రజల్లో ఆ భయం తగ్గి తమకు పోలీసుల అండ ఉందనే భరోసా పెరుగుతుంది. కానీ పోలీసులు మాత్రం నిందితులను గుర్తించడంలో సక్సెస్ కాలేకపోయారు. ఈ కేసును ఛేదించడం కోసం పెనుకొండ డీఎస్పీ సుబ్బారావు ఆధ్వర్యంలో ఎస్పీ ప్రత్యేకృబందాన్ని ఏర్పాటు చేశారు. వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించిన ఈృబందం ఇంత వరకు ఎలాంటి క్లూ సంపాదించలేకపోయింది. హత్య కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు డీఎస్పీ సుబ్బారావు తెలిపారు. క్లూస్ లేకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగడం లేదన్నారు. సాధ్యమైనంత త్వరలో నిందితులను పట్టుకుంటామన్నారు. కాగా, ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నా ఫలితం లేదని తెలిసింది. -
కుక్కలొచ్చాయి జాగ్రత్త!
రుద్రవరం, న్యూస్‌లైన్: నల్లమల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అటవీశాఖ అధికారులు పోలీసుల సహకారం తీసుకున్నారు. డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. దీంతో స్మగ్లర్లలో వణుకు పుడుతోంది. రుద్రవరం రేంజ్ పరిధిలోని ఆర్. నాగులవరం, రుద్రవరం తదితర గ్రామాల్లో ఎర్రచందనం స్మగర్లు దుంగలను నిల్వ ఉంచి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు మంగళవారం అటవీ అధికారి రాంసింగ్, పోలీసు అధికారి శ్రీకాంతరెడ్డి డాగ్ స్క్వాడ్ సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రాంసింగ్ మాట్లాడుతూ రేంజ్ పరిధిలోని చాలా గ్రామాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టగలిగామన్నారు. ఆర్ నాగులవరం, టి లింగందిన్నె, తిప్పారెడ్డి పల్లె గ్రామాల్లో స్మగర్లు ఎర్రచందనం అక్రమ రవాణా కొనసాగిస్తున్నారని అక్రమ రవాణాను అడ్డు కోవడానికి పోలీసుల సహకారం కోసం జిల్లా ఎస్పీ రఘురామి రెడ్డిని కోరామన్నారు. స్పందించిన ఆయన జిల్లా పోలీసు అధికారి పోలీసు బలగాలతోపాటు డాగ్ స్క్వాడ్‌ను పంపించారన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో పేరొందిన ఆర్. నాగులవరం గ్రామాన్ని మొదట ఎన్నుకుని దాడులు నిర్వహించామన్నారు. అలాగే రుద్రవరం గ్రామంలోని బెస్తకాలనీలో సోదాలు నిర్వహించామన్నారు. ఇప్పటి నుంచి డాగ్ స్క్వాడ్ సిబ్బంది రుద్రవరం ఫారెస్ట్ కార్యాలయంలో ఉంటుందని రాత్రి సమయంలో దాడులు చేస్తామన్నారు. దాడుల్లో సెక్షన్ అధికారి జాకీర్ ఉశేన్, బీటు అధికారి రామకృష్ణలతోపాటు డాగ్ స్క్వాడ్, పోలీసు, ఫారెస్టు సిబ్బంది పాల్గొన్నారు.