మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
పహాడీషరీఫ్: కాలిన స్థితిలో ఉన్న యువకుడి మృతదేహాన్ని పహాడీషరీఫ్ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్ వీవీ చలపతి తెలిపిన వివరాల ప్రకారం.... పహాడీషరీఫ్–మామిడిపల్లి రహదారిని ఆనుకొని ఉన్న ఇందూ టెక్ కంపెనీ ఆవరణలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం కాలిపోయి ఉండగా ఉదయం 8 గంటలకు సూపర్‌వైజర్ గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. అక్కడ మృతుడికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. కాగా, మృతుడు ముస్లిం అని, వయసు 20 –25 ఏళ్ల మధ్య ఉంటుందని, ఒడిశా నుంచి కూలీ పనికి వచ్చి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, కిరోసిన్/పెట్రోల్ పోసి నిప్పంటించడంతో మృతదేహం కాలిపోయిందన్నారు. డాగ్ స్క్వాడ్‌ను రప్పించి పరిశీలించగా... పోలీసు జాగిలం ఘటనా స్థలం నుంచి కొద్ది దూరం వెళ్లి తిరిగి వచ్చేసింది. పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు హత్యకు గురయ్యాడా...? ఆత్మహత్యకు పాల్పడ్డాడా...? అనే విషయాలు పోస్టుమార్టం అనంతరం తెలుస్తాయని పోలీసులు తెలిపారు. మృతుడి సంబంధీకులెవరైనా ఉంటే పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో లేదా 9490617241 నంబర్‌లో సంప్రదించాలని పోలీసులు కోరార