అర్ధరాత్రి తెగబడిన దొంగలు | Rs 10lakhs theft by Thieves in Linganapalli area | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి తెగబడిన దొంగలు

Published Thu, Jun 26 2014 11:47 PM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM

అర్ధరాత్రి తెగబడిన దొంగలు - Sakshi

అర్ధరాత్రి తెగబడిన దొంగలు

కుల్కచర్ల: అర్ధరాత్రి దొంగలు తెగబడ్డారు. ఓ ఇంట్లోకి చొరబడి బీరువాను గ్రామ శివారులోకి తీసుకెళ్లి ధ్వంసం చేశారు. రూ. 10 విలువ చేసే సొత్తు అపహరించుకుపోయారు. పోలీసులు క్లూస్‌టీం, జాగిలాలతో వివరాలు సేకరించారు. ఈ సంఘటన మండల పరిధిలోని కొత్తపల్లి అనుబంధ లింగనపల్లిలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగనపల్లి గ్రామానికి చెందిన సంపంగి నర్సింలుకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఒకే ఇంట్లో తండ్రీకొడుకులు వేర్వేరుగా ఉంటున్నాడు.

నర్సింలు వడ్డీ వ్యాపారంతో పాటు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి నర్సింలు తన భార్య నాగమ్మ, మనువడితో కలిసి ఇంటికి తాళం వేసి భవనం పైన నిద్రించాడు. ఆయన చిన్న కొడుకు హన్మంతు పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. పెద్ద కొడుకు భార్యతో కలిసి ఇంటి ఎదుట ఉన్న మరో ఇంట్లో నిద్రించాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళం విరగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న రెండు బీరువాలు ధ్వంసం చేశారు.
 
ఓ బీరువాను గ్రామ శివారులోకి తీసుకెళ్లారు. అక్కడ ధ్వంసం చేసి అందులో ఉన్న రూ. 6 లక్షలు నగదు, 8 తులాల బంగారంతో పాటు 80 తులాల వెండి నగలు అపహరించుకుపోయారు. గురువారం ఉదయం నర్సింలు కిందికి వచ్చి చూడగా తాళం విరిగిపోయి కనిపించిం ది. ఇంట్లోకి వెళ్లి చూడగా రెండు బీరువాలో ధ్వంసమై కనిపించాయి. మరో బీరువా కనిపించలేదు. గ్రామ శివారులో ఓ బీరువా కనిపించడంతో స్థానికులు నర్సింలు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. బాధితుల ఫిర్యాదుతో చేవెళ్ల డీఎస్పీ శ్రీధర్, పరిగి సీఐ వేణుగోపాల్‌రెడ్డి, కుల్కచర్ల ఎస్‌ఐ కృష్ణ తదితరులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
 
డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంతో వివరాలు సేకరించారు. పోలీసు జాగిలాలు నర్సింలు ఇంటి వద్ద తచ్చాడాయి. రూ. 10 లక్షలు విలువ చేసే సొత్తు చోరీ జరిగిందని నర్సింలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దుండగులను త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement