అత్యాధునిక పరిజ్ఞానం.. సమర్థవంతమైన క్లూస్ టీం.. శుశిక్షిత డాగ్ స్క్వాడ్.. నేర పరిశోధనలో కాకలు తీరిన యోధులు.. వెరసి ఇద్దరు చిన్నారులను పట్టపగలు చంపి వెళ్లిన వారి ఆచూకీ కూడా కనుక్కోలేకపోయారు. ఆ ఘోరానికి పాల్పడిన వారు అంతర్జాతీయ తీవ్రవాదులో, ఐఎస్‌ఐ ఏజెంట్లో అయితే అంత త్వరగా దొరకరులే అని సరిపెట్టుకోవచ్చు. ఆస్తి తగాదాలా లేక మామూలు దొంగల పనా అన్నది కూడా తేల్చలేకపోయారు. నింపాదిగా దర్తాప్తు చేద్దామనా.. లేక నిర్లక్ష్యమా? అదేమైనా సరే క్షమార్హం కాని నిర్లక్ష్యమని జనం భావించకుండా మసలుకునే బాధ్యత పోలీస్ శాఖదే.
మడకశిర, న్యూస్‌లైన్ : సంచలనం కలిగించిన ఇద్దరు చిన్నారుల హత్య కేసులో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. హత్యలు జరిగి 48 గంటలు దాటినా కనీసం క్లూ కూడా సంపాదించకపోవడంతో వారి పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. గురువారం మడకశిరలో అక్కాతమ్ముడైన మంజువాణి (13), రంగనాథ్ (8)లను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. పట్టపగలే ఈ హత్యలు చోటు చేసుకోవడంతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అభంశుభం ఎరుగని పిల్లలను చంపడానికి వారికి చేతులెలా వచ్చాయో అంటూ శాపనార్థాలు పెట్టిన జనం.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు ర్యాలీలు కూడా నిర్వహించాయి. కాగా హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించలేకపోయారు. పిల్లలకు పట్టణంలో రక్షణ లేకుండా పోతోందని స్థానికులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో పిల్లలను స్కూళ్లకు పంపేందుకు కూడా జంకుతున్నారంటే ఇక్కడ పరిస్థితి ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నపుడు నిందితులను వెంటనే పట్టుకుంటే ప్రజల్లో ఆ భయం తగ్గి తమకు పోలీసుల అండ ఉందనే భరోసా పెరుగుతుంది. కానీ పోలీసులు మాత్రం నిందితులను గుర్తించడంలో సక్సెస్ కాలేకపోయారు.
ఈ కేసును ఛేదించడం కోసం పెనుకొండ డీఎస్పీ సుబ్బారావు ఆధ్వర్యంలో ఎస్పీ ప్రత్యేకృబందాన్ని ఏర్పాటు చేశారు. వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించిన ఈృబందం ఇంత వరకు ఎలాంటి క్లూ సంపాదించలేకపోయింది. హత్య కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు డీఎస్పీ సుబ్బారావు తెలిపారు. క్లూస్ లేకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగడం లేదన్నారు. సాధ్యమైనంత త్వరలో నిందితులను పట్టుకుంటామన్నారు. కాగా, ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నా ఫలితం లేదని తెలిసింది.
షేమ్.. షేమ్..
Published Sun, Apr 6 2014 3:55 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 AM
Advertisement
Advertisement