
బంజారాహిల్స్: ఇంటి ముందు తిరుగుతున్న తమ పెంపెడు శునకం ‘మోతి’ని.. జీహెచ్‌ఎంసీ డాగ్ స్క్వాడ్ ఏనిమిల్ బర్త్ కంట్రోల్ స్టెరిలైజేషన్ కోసం తీసుకెళ్లి వదిలి పెట్టలేదని, ఇందుకు బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ యజమానులు జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేశారు. ఖైరతాబాద్ డివిజన్ వెంకటరమణ కాలనీకి చెందిన శ్రీనివాస్ నాయుడు, సరితానాయుడు దంపతులు బ్లాక్‌బెర్రి (ముద్దు పేరు మోతి) మిక్స్‌డ్ బ్రీడ్ రకం కుక్కను పెంచుకుంటున్నారు.
ఫిబ్రవరి 5న యజమాని ఇంటి ముందు పెంపుడు కుక్క మోతీ తిరగసాగింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన డాగ్‌స్క్వాడ్.. మిగతా వీధి కుక్కలతో పాటు దీన్నీ పట్టుకెళ్లారు. ఇది గమనించిన యజమాని శ్రీనివాస్ నాయుడు డాగ్‌స్క్వాడ్ వాహనం వెంబడి పరిగెత్తగా రెండు వారాల్లో సమీప ప్రాంతంలో వదిలేస్తామని చెప్పి వెళ్లిపోయారు. ఎన్నిసార్లు ప్రశ్నించినా సమాధానం చెప్పలేదు. అయితే తాము ఏనిమిల్ బర్త్ కం ట్రోల్ స్టెరిలైజేషన్ చేసి ఆ కుక్కను నిమ్స్ ప్రాం తంలో వదిలేశామని సమాధానమిచ్చారు.ఆ ప్రాంతమంతా శ్రీనివాస్ దంపతులు నెలరోజుల పాటు గాలించినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో విజిలెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేశారు.
టార్గెట్ కోసమే చేస్తున్నారా..!
తమ టార్గెట్ చేరుకోవడానికి డాగ్ స్క్వాడ్ వెహికిల్ సిబ్బంది పెంపుడు కుక్కలు వాటి యజమానుల ఇంటి ముందు తిరుగుతున్న సమయంలో తీసుకెళ్తున్నారని చాలా మంది విజిలెన్స్ సెల్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే తాము కుక్కలను చంపడం లేదని, స్టెరిలైజేషన్ కోసమే తీసుకెళ్తున్నామని, తర్వాత అదే ప్రాంతంలో వదిలేస్తున్నమని సెంట్రల్ జోన్ వెటర్నరీ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ జె.వి.విల్సన్ చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఒక్క సెంట్రల్ జోన్ పరిధిలోనే 1.50 లక్షల కుక్కలు ఉన్నట్లు ఇటీవల ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment