![Mazaffar Police Celebrates Dogs Birthday - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/15/Dog-birthday-celebrations.jpg.webp?itok=WJtaLiuz)
ముజఫర్ నగర్: కుక్క అంటే విశ్వాసానికి ప్రతీక. ఇది మనిషికి తోడుగా ఉంటూ అనేక విధాలుగా తన విశ్వాసాన్ని చూపిస్తుంది. అయితే ఇక్కడ చెప్పబోయే కుక్క మాములుదీ కాదండోయ్..2020లో అప్పటి అమెరికా అధ్యక్షుడు భారత్‌కి వచ్చినప్పుడు భద్రతలో పాల్గొన్న లాబ్రాడార్ జాతికి చెందిన స్నిఫర్ డాగ్. దీనిపేరు డిక్కీ. కాగా, ఈకుక్క పుట్టినరోజుని ముజఫర్ పోలీసులు ఘనంగా జరిపారు. దీనికి కాగితం టోపి పెట్టి, ఒక సూట్‌ని తొడిగారు. దీని కేర్‌టేకర్ సునీల్ కేక్ కట్ చేశాడు.
ఈ రోజు డాగ్‌కి ప్రత్యేకంగా గుడ్లు, మటన్, మాంసం, కూరగాయలు, పాలు అందించారు. డిక్కీని హర్యానాలోని ఇండో టిబేటన్ బార్డర్ పోలీస్ పంచకులలో ట్రైనింగ్ ఇచ్చారు. 2019 లో ముజఫర్ నగర్ డాగ్‌స్క్వాడ్ పోలీసులకు అప్పగించారు. అప్పటినుంచి బస్టాండ్లు, మార్కెట్లు, రైల్వేస్టేషన్లు, ఇతర ప్రదేశాల్లో పేలుడు పదార్థాలు వేలికి తీయడంలో సేవలందిస్తోందని అబ్దూల్ రయిస్ ఖాన్ అనే పోలీస్ అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment