muzaffarnagar
-
కన్వర్ యాత్రకు ఉగ్రవాద ముప్పు.. ఏటీఎస్ బలగాల మోహరింపు
ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న కన్వర్ యాత్రకు ఉగ్రవాద ముప్పు పొంచివుందంటూ నిఘా వర్గాలకు సమాచారం అందిన నేపధ్యంలో యాత్ర భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దీని పర్యవేక్షణ బాధ్యతను యాంటీ టెర్రరిస్ట్ స్క్యాడ్(ఏటీఎస్)కు అప్పగించారు. ఈ నేపధ్యంలో ఏటీఎస్ బృందం భద్రతా ఏర్పాట్లను పరిశీలించింది.ఉగ్రవాదుల దాడి యత్నానికి సంబంధించిన ఇన్పుట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు అందినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నేపధ్యంలో యూపీలోని ముజఫ్ఫర్‌నగర్ జిల్లాకు ఏటీఎస్ కమాండోల బృందం తరలివచ్చింది. వీరికి ఎస్ఎస్పీ అభిషేక్ సింగ్ విధులకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. ఈ బృందాన్ని శివచౌక్, మీనాక్షి చౌక్, హాస్పిటల్ తిరహా తదితర ముఖ్యమైన ప్రాంతాల్లో మోహరించినట్లు అధికారులు తెలిపారు. దీంతోపాటు యాంటీ శాబోటేజ్ టీం, బీడీడీఎస్ (బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్) కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరంతరం తనిఖీలు చేస్తున్నాయి. -
కాబోయేవాడు కన్నుమూసిన బాధను దిగమింగుకుని..
ఇద్దరిదీ ఒకే డిపార్ట్మెంట్. వివాహ బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలనుకున్నారు. కానీ, విధి వక్రచూపు చూసింది. ఊహించని ఘటన.. ఆ ఇద్దరినీ ఒక్కటి కాకుండా చేసింది. ఇక తిరిగి రాడని తెలిసినా.. అతని కుటుంబాన్ని ఓదార్చడం కోసం ఆమె ఎంతో ప్రయత్నించింది. మృతదేహం పక్కనే మౌనంగా కూర్చుండిపోయింది. అయితే.. అంతిమ సంస్కారాలకు వెళ్లే సమయంలో బోరున విలపిస్తూ కనిపించిందామె. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో పెను విషాదం చోటుచేసుకుంది. మరో నెల రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన పోలీస్ కానిస్టేబుల్ అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ఓ కరుడుగట్టిన నేరస్థుడిని పట్టుకునే క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో.. బుల్లెట్ గాయాలతో చికిత్స పొందుతూ సదరు కానిస్టేబుల్ ప్రాణాలు విడిచాడు. దీంతో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట విషాదం అలుముకుంది. పోలీస్ కానిస్టేబుల్ సచిన్ రాఠీ(30), మరో ముగ్గురు పోలీసులతో కలిసి సోమవారం అశోక్ యాదవ్(52) అనే నేరస్థుడిని పట్టుకోవడానికి తన టీంతో వెళ్లాడు. కన్నౌజ్‌లోని నిందితుడి ఇంటి వద్దకు చేరుకోగానే.. పోలీసులపైకి ఎదురు కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో సచిన్ రాఠీ తొడపై బుల్లెట్ దిగింది. అయినా సచిన్ తగ్గలేదు. రక్తమోడుతున్నా.. నిందితుల కోసం గంట సేపు పోరాటం జరిపాడు. కొద్దిసేపటికే పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో నిందితులు అశోక్ యాదవ్, అభయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఈ కాల్పుల్లో గాయపడిన కానిస్టేబుల్ సచిన్ రాఠిని లక్నోలోని కాన్పూర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో యువ పోలీసు చాలా రక్తాన్ని కోల్పోయాడు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి తుది శ్వాస విడిచాడు. ముజఫర్‌నగర్‌కు చెందిన సచిన్ రాఠి 2019లో పోలీసు శాఖలో చేరారు. కోమల్ దేస్వాల్‌తో కానిస్టేబుల్. ఇద్దరికీ వివాహం చేయాలని నిశ్చయించారు పెద్దలు. ఫిబ్రవరి 5న సచిన్-కోమల్ వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. దీంతో పెళ్లి వేడుకలకు సిద్ధమవ్వాల్సిన వారి కుటుంబం ప్రస్తుతం శోకసంద్రంలో మునిగిపోయింది. भाई सचिन राठी को सत् सत् नमन🙏 हमारी सरकारों की नूराकुश्ती की वजह , कितने घरों के दीप उजड़ गये 😢😢 #SachinRathi pic.twitter.com/2RDPgaw8Hs — Subhash Fouji (@TheSubhashFouji) December 27, 2023 కన్నౌజ్ నుంచి సచిన్ తండ్రి, అతని మేనమామ మృతదేహం తీసుకొచ్చారు. విగత జీవిగా ఉన్న సచిన్‌ను ఆమె బోరున విలపించింది. ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. గౌరవ వందనం కోసం పోలీస్ లేన్‌లో సచిన్ పార్థీవ దేహం ఉంచారు. ఆ సమయంలో తన బాధను దిగమింగుకుంటూ.. సచిన్ తల్లిదండ్రుల్ని కోమల్ ఓదారుస్తూ కనిపించింది. ఆఖరి క్షణాల్లో మాత్రం గుండెలు అవిసెలా రోదించడం పలువుర్ని కలచివేసింది. ఉత్తర ప్రదేశ్‌లో 2017 నుంచి యోగి సర్కార్ అధికారం చేపట్టాక 11 వేలకు పైగా ఎన్కౌంటర్లు జరిగాయి. సచిన్‌తో కలిపి ఇప్పటిదాకా 16 మంది పోలీస్ సిబ్బంది చనిపోయారు. సుమారు 1,500 మంది గాయపడ్డారు. -
ఐదేళ్ల చిన్నారి హత్య.. తల్లి మీద పగతో పొరుగింటి మహిళ ఘాతుకం
ముజఫర్‌నగర్: పొరుగింటి మహిళపై పగతో ఆమె ఐదేళ్ల కొడుకుని హతమార్చిన మహిళను ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వివరాల్లోకి వెళ్తే... ముజఫర్‌నగర్ జిల్లాలో తేవ్రా గ్రామానికి చెందిన ఆసిఫా అనే మహిళ.. పొరిగింట్లో ఉంటున్న దినిస్టా బేగంపై పగతో ఆమె ఐదేళ్ల కుడుకు అర్సలాన్‌ని కిడ్నాప్ చేసి హత్య చేసింది. నవంబర్ 11న బాలుడు అదృశ్యం కాగా మూడు రోజుల తరువాత కక్రౌలీ పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామ శివార్లలో అడవిలో గోనె సంచిలో అర్సలాన్ మృతదేహం లభ్యమైంది. అర్సలాన్ను హత్య చేసినట్లు విచారణలో అసిఫా అంగీకరించిందని కేసు దర్యాప్తు చేస్తున్న సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. బయట ఆడుకుంటున్న అర్సలాన్ను ఆసిఫా కిడ్నాప్ చేసి తన ఇంట్లో బంధించింది. గ్రామమంతా వెతికిన బాలుడి తండ్రి షాజాద్ ఖాన్ ఆచూకీ దొరక్కపోవడంతో కక్రౌలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన స్థానిక పోలీసులు గ్రామశివార్లలో బాలుడి మృతదేహాన్ని గుర్తించి గుర్తు తెలియని వ్యక్తి హత్య చేసినట్లుగా కేసు నమోదు చేశారు. తర్వాత ఆసిఫా ఇంట్లో బాలుడి టోపీ, చెప్పులు, గొంతుకు బిగించేందుకు ఉపయోగించిన తాడును స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫాను తమదైన శైలిలో పోలీసులు విచారించగా బాలుడిని చంపింది తానే అని ఒప్పుకుంది. అర్సలాన్ తల్లి దనిస్టా బేగం తనను అగౌరవంగా చూసేదని, తరచూ అవమానించేదని, అందుకు ఆమె కొడుకుని హత్య చేసినట్లు పోలీసులకు చెప్పింది. -
బిహార్‌లో పోలీసు స్టేషన్లో దొంగతనం
పట్నా: దొంగలు ఏకంగా పోలీసు స్టేషన్‌ను టార్గెట్ చేశారు. రాత్రిపూట లోపలికి ప్రవేశించి, మద్యం సీసాలు ఎత్తుకెళ్లారు. బిహార్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ పోలీసు స్టేషన్లో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. బిహార్‌లో మద్యంపై నిషేధం అమల్లో ఉంది. అక్రమ రవాణా జరుగుతున్న మద్యం సీసాలను పోలీసులు స్వా«దీనం చేసుకొని ఈ స్టేషన్‌లోని స్టోర్‌రూమ్‌లో భద్రపర్చారు. శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. చిమ్మచీకట్లో దొంగలు చాకచక్యంగా గోడదూకి లోపలికి అడుగుపెట్టారు. స్టోర్‌రూమ్‌లో ఐదు పెట్టెలు, ఒక సంచిలో ఉన్న మద్యం బాటిళ్లను చోరీ చేశారు. విచిత్రం ఏమిటంటే ఈ సంఘటన జరుగుతున్నప్పుడు పోలీసు సిబ్బంది స్టేషన్లోనే ఉన్నారు. అసలు విషయం మరుసటి రోజు బయటపడింది. దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసుల నిర్లక్ష్యంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. -
స్టూడెంట్‌పై దాడి వైరల్.. సమర్థించుకున్న టీచర్
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ టీచర్ ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఖాబాపూర్ గ్రామంలోని ప్రైవేటు పాఠశాలలోని క్లాస్‌రూమ్‌లో ఆగస్టు 24న జరిగిన ఈ ఘటనకు చెందిన వీడియో తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మ్యాథ్స్ టేబుల్ నేర్చుకోలేదని ఏడేళ్ల ముస్లిం బాలుడిని తోటీ విద్యార్ధులతో టీచర్ అమానుషంగా దాడి చేయించింది. కాగా ఈ వీడియోను బాలుడి బంధువు నదీవ్ అనే వ్యక్తి వీడియో తీశారు. ఇందులో టీచర్.. విద్యార్థి ముఖం మీద దాడి చేయవద్దని, వెన్నులో కొట్టాలని స్టూడెంట్స్‌కు చెప్పడం వినిపిస్తోంది. ఈ వీడియోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మత విద్వేషాలను రెచ్చగెట్టే విధంగా టీచర్ వ్యవహరించడం రాజకీయ దుమారాన్ని రేపింది. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ సహా పలువురు నేతలు ఈ చర్యను ఖండిస్తూ.. టీచర్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దేవాలయంగా భావించే పవిత్రమైన పాఠశాలలో విద్యార్థుల్లో విద్వేషాలను నింపుతున్నారని.. అధికార బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. "Main ne to declare kar diya hai Jitne Mohammad bacche Hain inko mar ke bhijao" : Lady Teacher, Tripta Tyagi, headmistress of Neha Public School , Mansurpuri, Muzaffarnagar, UP And the man has a Rascal's laugh..Ha...ha..ha The cost of being a Muslim Kid in India today pic.twitter.com/ZciNQKbxfz — ᎠϴΝ ⚽ (@_Jhon_D_N__30) August 25, 2023 తాజాగా ఈ వైరల్ వీడియోపై టీచర్ త్రిప్తా త్యాగి స్పందించారు. ముస్లిం విద్యార్థిపై దాడి చేసిన చర్యను ఆమె సమర్థించుకున్నారు. బాధితుడు 5వ గుణితం నేర్చుకోవాలని చెప్పానని.. సెలవులు వచ్చినా నేర్చుకోలేదని అన్నారు. అందుకే ఇతర విద్యార్థులతో కొట్టించానన్నారు. ఈ ఘటనలో మతపరమైన కోణాన్ని ఆమె కొట్టిపారేశారు. బాలుడు తన హోంవర్క్ చేయనందున అతన్ని కొట్టమని కొంతమంది విద్యార్థులను కోరినట్లు చెప్పారు. అతనితో కఠినంగా ఉండమని పిల్లల తల్లిదండ్రుల నుంచే ఒత్తిడి వచ్చిందన్నారు. తాను దివ్యాంగురాలు అవ్వడం వల్ల కొంతమంది విద్యార్థులతో కొట్టించానని చెప్పుకొచ్చారు. అయితే వీడియోను ఎడిట్ చేసి మతపరమైన కోణం వచ్చేలా బయడకు విడుదల చేశారని ఆమె ఆరోపించారు. విద్యార్ధి బంధువు క్లాస్‌లో కూర్చొని ఆ వీడియోను అతను రికార్డ్ చేశాడని తరువాత దాని ఎడట్ చేశాడని ఆన్నారు. విద్యార్ధిని ఉద్ధేశపూర్వకంగా కొట్టించలేదని.. తన తప్పును అంగీకరిస్తున్నానని చెప్పారు. కానీ అనవసరంగా దీనిని పెద్ద సమస్యగా మార్చవద్దని కోరారు. ‘ఇది చిన్న సమస్య అని రాజకీయ నాయకులకు చెప్పాలనుకుంటున్నాను. రాహుల్ గాంధీతో సహా ఇతర నేతలు దీనిపై ట్వీట్ చేశారు. ఇది అంత పెద్ద విషయం కాదు. ఇలాంటి చిన్న విషయాలను వైరల్ చేస్తే టీచర్లు ఎలా పనిచేస్తారు.’ అని ఆమె ప్రవర్తనను వెనకేసొచ్చారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదైనట్లు ముజాఫర్‌నగర్ కలెక్టర్ అరవింద్ మల్లప్ప తెలిపారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా చిన్నారికి, అతని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చామని పేర్కొన్నారు. A fake anti hindu propaganda is being run by Leftist Islamist gang and Anti Hindu Political leaders over Muzaffarnagar School incident Truth is: - There is no Hindu Muslim angle in this incident - Mslm kid didn't complete his homework - Teacher was worried abt studies of Mslm… pic.twitter.com/PMnjbmgDwd — STAR Boy (@Starboy2079) August 25, 2023 మరోవైపు టీచర్ కొట్టిపించడంపై బాధిత విద్యార్థి మాట్లాడుతూ.. ‘నేను గణిత పట్టికలు నేర్చుకోలేదు. నేను తప్పు చేశానని టీచర్ కొట్టమని చెప్పింది. తోటి విద్యార్థులతో కొట్టించింది. నాపై గట్టిగా దాడిచేయాలని ఆదేశించింది. వారు నన్ను గంటపాటు కొట్టారు’ అని వాపోయాడు. తన కొడుకు వయసు 7 ఏళ్లు అని, గంట, రెండు గంటలపాటు అతడిని చిత్రహింసలకు గురిచేశాడని బాలుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలపై ఆరోపణలు చేయనని.. అయితే ఇకపై తన బిడ్డను ఆ పాఠశాలకు పంపకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. Perhaps ppl on Twitter r deaf. In d video Tripta Tyagi can be clearly heard saying,"Why don't you hit hard?" What is wrong in this? Maybe she isn't getting full satisfaction. Every1 has a right to be satisfied. I stand with #Mrs_Tyagi,a teacher frm #Muzaffarnagar#मुस्लिम_बच्चे pic.twitter.com/rAbIFeVqwS — K.R.Tripathi🇮🇳🙏🚩 (@t97688663) August 25, 2023 ఇదిలా ఉండగా ముజఫర్ నగర్ వైరల్ వీడియోలో చెంప దెబ్బ కొట్టిన విద్యార్ధులతో బాధితుడిని కౌగించుకునేలా చేశారు రైతు సంఘాల నాయకుడు నరేష్ తికాయత్. అందరూ ద్వేషాన్ని వదిలేసి సోదరభావాన్ని కాపాడుకోవాలని ఆయన కోరారు. कांग्रेस के स्थानीय नेताओं की पहल पर किसान नेता नरेश टिकैत ने #Muzaffarnagar की वायरल वीडियो में थप्पड़ मारने वाले छात्र और पीड़ित छात्र को गले मिलवाया. ख़ुशी की बात है कि सभी ने आगे बढ़कर भाईचारा क़ायम रखने के लिए नफ़रत को खुलकर नकारा है.pic.twitter.com/qfMzgiAgja — Aditya Goswami आदित्य गोस्वामी (@AdityaGoswami_) August 26, 2023 -
యూపీలో ఆవు దొంగతనం.. అర్థరాత్రి కారులో వచ్చి.. వైరలవుతున్న వీడియో
-
Viral: కట్నంగా రూపాయి చాలు.. 11 లక్షలు, బంగారు ఆభరణాలు వెనక్కి
ముజఫర్‌నగర్: కట్నంగా ముట్టజెప్పిన రూ.11 లక్షలు, బంగారు ఆభరణాలను వద్దంటూ వెనక్కిచ్చి ఆదర్శంగా నిలిచాడో యువకుడు. కేవలం రూ.1 కట్నం తీసుకుని శెభాష్ అనిపించుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో రెవెన్యూ అధికారిగా పనిచేసే సౌరభ్ చౌహాన్‌కు లఖాన్ గ్రామం ఓ మాజీ జవాను కూతురుతో శుక్రవారం పెళ్లయింది. వరకట్నం కింద వధువు తల్లిదండ్రులు రూ.11 లక్షల కట్నం, ఆభరణాలు ఇవ్వగా కట్నం అక్కర్లేదంటూ తిరిగిచ్చేశాడు. ‘‘మీ దీవెనగా జ్ఞాపకం పెట్టుకుంటా’నంటూ వారినుంచి కేవలం ఒక్క రూపాయి తీసుకున్నాడు. దాంతో ఆహూ తులు సౌరభ్‌పై అక్షింతలతోపాటు ప్రశంస జల్లులు కూడా కురిపించారు. సమాజంలో మంచి మార్పు కోసం ముందడుగు వేశాడంటూ మెచ్చుకున్నారు. -
బెడిసి కొట్టిన రావణ దహనం.. వీడియో వైరల్
లక్నో(యూపీ): ముజఫర్‌నగర్‌లో జరిగిన రావణ దహన కార్యక్రమం బెడిసి కొట్టింది. దిష్టి బొమ్మ నుంచి బాణాసంచా జనాలపైకి దూసుకొచ్చింది. దీంతో అంతా పరుగులు తీశారు. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఏం కాలేదు. బుధవారం సాయంత్రం ముజఫర్‌నగర్ ప్రభుత్వ ఇంటర్ కళాశాల మైదానంలో రావణ దహన కార్యక్రం ఏర్పాటు చేశారు. ఇది చూడడానికి వందల మంది చేరుకున్నారు. అయితే.. దహనం అనంతరం దిష్టిబొమ్మ నుంచి బాణాసంచా మిస్సైళ్ల మాదిరి దూసుకురావడంతో ప్రజలతో పాటు పోలీసులు పరుగులు తీశారు. అయితే ఇది ఇక్కడితోనే ఆగలేదు. బాణాసంచా తర్వాత.. ఒక ఎద్దు మైదానంలో వీరంగం సృష్టించింది. దీంతో జనాలు తలోవైపు పరుగులు తీశారు. చివరకు అధికారులు ఆ ఎద్దును ఎలాగోలా లొంగదీసుకుని.. పక్కకు తీసుకెళ్లారు. मुज़फ़्फ़रनगर में अपने को जलाए जाने से क्रुद्ध रावण ने मौक़े पर मौजूद लोगों पर अग्नि-वाण चलाए 😬 pic.twitter.com/zuDmH3dKXa — Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) October 5, 2022 #NewsNonstop: मुजफ्फरनगर में रावण दहन के वक्त हुआ हादसा | तेज रफ्तार में देखिए, देश-विदेश की 50 अहम खबरें @Anant_Tyagii #UttarPradesh #MuzaffarNagar #Dussehra #Dussehra2022 pic.twitter.com/4JFB3b7j3d — Times Now Navbharat (@TNNavbharat) October 5, 2022 Video Credits: TNNavbharat హర్యానాలోని యమునా నగర్లోనూ ఇదే తరహాలో ఘటన జరిగింది. రావణ దహనం తర్వాత దిష్టిబొమ్మ జనాల వైపుగా పడిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని స్థానిక పోలీసులు తెలిపారు. -
యువకుడి కడుపులో 63 ‘స్టీల్ స్పూన్లు’.. ఏడాదిగా అవే ఆహారం!
లక్నో: ఏదైనా ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతేనే.. కడుపులో నొప్పితో సతమతమవుతాం. అలాంటిది ఓ వ్యక్తి ఏడాదిగా స్టీల్ స్పూన్లు తింటున్నాడు. పొట్ట నిండా స్పూన్లు ఉన్న ఈ షాకింగ్ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. బాధితుడి శరీరంలో ఏకంగా 63 స్టీల్ స్పూన్లు ఉండటం చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు. గంటల తరబడి శస్త్రచికిత్స చేసి చెంచాలను బయటకు తీశారు. ఏం జరిగింది? జిల్లాకు చెందిన విజయ్ అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. దాంతో ఏడాది క్రితం కుటుంబ సభ్యులు డీఅడిక్షన్ కేంద్రంలో చేర్పించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆరోగ్యం మరింత క్షీణించగా.. స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. కడుపులో స్పూన్లు ఉన్నట్లు తేల్చారు. ఆపరేషన్ చేసి 63 చెంచాలను బయటకు తీశారు. అయితే.. స్పూన్లు ఎలా వచ్చాయని డాక్టర్లు ప్రశ్నించగా.. తాను గత ఏడాది నుంచి స్పూన్లు తింటున్నానని విజయం చెప్పటంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ‘ఆ స్పూన్లు నువ్వే తింటున్నావా అని మేము అడిగితే అవునని చెప్పాడు. సుమారు 2 గంటల పాటు ఆపరేషన్ చేసి స్పూన్లు తొలగించాం. ప్రస్తుతం అతడు ఐసీయూలో ఉన్నాడు. పరిస్థితి విషమంగానే ఉంది. రోగి సుమారు ఏడాది కాలంగా స్టీల్ చెంచాలు తింటున్నాడు.’ అని డాక్టర్ రాకేశ్ ఖర్రాన్ తెలిపారు. మరోవైపు.. డీఅడిక్షన్ కేంద్రంలోనే విజయ్‌కి బలవంతంగా స్పూన్లు తినిపించారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఇదీ చదవండి: 11కేవీ హైఓల్టేజ్ కరెంట్ తీగలపై స్టంట్స్.. తర్వాత ఏం జరిగిందంటే? -
భర్తను చెట్టుకు కట్టేసి.. మహిళపై గ్యాంగ్‌రేప్!
ముజఫర్‌నగర్(యూపీ): ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో కొందరు వ్యక్తులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు శుక్రవారం చెప్పారు. ఆమె భర్తను చెట్టుకు కట్టేసి దురాగతం సాగించారని తెలిపారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారు. ఈ ఘటనపై న్యూమండీ పోలీసు స్టేషన్లో కేసు నమోదయ్యింది. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. చదవండి: (నిర్మాత అని చెప్పి పెళ్లి చేసుకుని వ్యభిచారం చేయమంటున్నాడు: సహాయనటి) -
ప్రాక్టికల్స్ పేరుతో.. 17 మంది బాలికలపై ప్రిన్సిపల్ అత్యాచారం
లక్నో: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కామాంధుడిగా మారాడు. విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించాల్సిన గురువు బాధ్యతను మరిచి పైశాచికంగా ప్రవర్తించాడు. పరీక్షల పేరుతో పాఠశాలకు పిలిచి విద్యార్థినులపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఓ కీచకుడు. గౌరవప్రదమైన ప్రధానోపాధ్యాయ వృత్తిలో ఉండి ఆ పదవికే మాయని మచ్చగా తయారయ్యాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మంది విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘోర ఘటన ఉత్తర ప్రదేశ్‌లో నవంబర్ 17న చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగు చూసింది. చదవండి: పోలీసుల అదుపులో 44 మంది మహిళలు.. కువైట్ వెళ్తుండగా.. ముజఫర్‌నగర్‌లోని పుర్కాజి ప్రాంతంలో ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ పరీక్షల సాకుతో పదో తరగతి చదువుతున్న 17 మంది బాలికలను పాఠశాలకు పిలిపించాడు. మరునాడు సీబీఎస్ఈ ప్రాక్టికల్ పరీక్షలు ఉన్నాయని రాత్రంతా అక్కడే ఉండాలని సూచించాడు. విద్యార్థుల కోసం భోజనం తయారు చేసి.. అందులో మత్తు మందు కలిపిన ఆహారాన్ని విద్యార్థినులకు అందించాడు. తరువాత విద్యార్థులు స్పృహ కోల్పోవడంతో ప్రధానోపాద్యాయుడితోపాటు అతని సహచరుడు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం గురించి ఎవరికీ చెప్పవద్దని, చెబితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని, వారి కుటుంబ సభ్యులను చంపేస్తామని బాలికలను బెదిరించారు. చదవండి: Banjarahills: మహిళ స్నానం చేస్తుండగా వీడియో.. కేబుల్ టెక్నిషియన్ నిర్వాకం బాలికలు మరుసటి రోజు పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. అయితే బాధిత బాలికలు పేద కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. వీరిలో ఇద్దరు బాధితులు మాత్రం ధైర్యం చేసి జరిగిన దారుణం గురించి వారి తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో తమ పిల్లలకు జరిగిన అన్యాయంపై కేసు నమోదు చేయాలని అనేకసార్లు కోరినప్పటికీ.. పోలీసులు పట్టించుకోలేదు. దీంతో తల్లిదండ్రులు పుర్కాజి ఎమ్మెల్యే ప్రమోద్ ఉత్వాల్‌ను ఆశ్రయించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చదవండి: టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం.. ప్రయోజకురాలవుతుందనుకుంటే.. ఈ ఘటనపై వెంటనే విచారణ జరపాలని ఎస్పీ అభిషేక్ యాదవ్‌ను ఎమ్మెల్యే కోరారు. ప్రస్తుతం ఇద్దరు వ్యక్తలు ప్రధానోపాధ్యాయుడితోపాటు అతని సహచరుడిపై ఎఫ్ఐఆర్ నమోదవ్వగా ఒకరిని అరెస్టు చేశారు. అంతేగాక ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పుర్కాజి స్టేషన్ హౌస్ ఆఫీసర్ వినోద్ కుమార్ సింగ్‌ను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. -
ముజఫర్‌నగర్ వద్ద రైతులు నిరసన తెలిపారు
-
ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో వర్షం బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా ముజఫర్‌నగర్‌లోని ఒక భవనం కుప్పకూలింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ దుర్ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. కాగా, ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు.. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు. అయితే, వీరిని పరీక్షించిన వైద్యులు ప్రమాద స్థలంలోనే ముగ్గురు చనిపోయినట్లు పేర్కొన్నారు. మృతి చెందిన వారిని జుబేదా(35), మీనా(65), అలీశాలుగా గుర్తించారు. అదే విధంగా గాయపడిన మరో నలుగురిని ఇంతియాస్ (45),సైరా(40), నగ్మా(21), పర్వేజ్‌లుగా గుర్తించించామని తెలిపారు. వీరికి అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్నయూపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
అత్త అల్లుడు వివాహేతర సంబంధం, పెళ్లి, ట్విస్టు ఏంటంటే?
లక్నో: సమాజంలో రోజు రోజుకీ విలువలు పతనమవుతున్నాయి. కామంతో కళ్లుమూసుకుపోయి వావి వరుసలు మరిచి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. నిండు కాపురాలను నిలువునా కూల్చేస్తున్నాయి. అత్త, అల్లుడు పారిపోయి పెళ్లి చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్ జిల్లాలోని మధుభార్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. 50 ఏళ్ల మహిళ ఒకరు పాతికేళ్ల వయసున్న తన సొంత అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే వీరి సంబంధం గురించి తెలిసిన కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో 10 నెలల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే 10 నెలల క్రితం పారిపోయిన వీరిద్దరూ బుదవారం ఇంటికి చేరుకున్నారు. తమ కుటుంబ సభ్యులకు వివాహం జరిగిన విషయం తెలియజేశారు. తామిద్దరం కలిసి ఉండాలని అనుకుంటున్నట్టు కుటుంబ సభ్యులకు స్పష్టం చేశారు. అయితే ఇందుకు కుటుం సభ్యులు అంగీకరించలేదు. దీంతో అక్కడ గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ జంటను అరెస్టు చేశారు. ఈ విషయం కాస్తా గ్రామస్తులకు తెలియడంతో.. అత్త, అల్లుడి అక్రమ సంబంధంపై నిరసన వ్యక్తం చేశారు. -
గ్రాండ్‌గా డాగ్ బర్త్‌డే..
ముజఫర్ నగర్: కుక్క అంటే విశ్వాసానికి ప్రతీక. ఇది మనిషికి తోడుగా ఉంటూ అనేక విధాలుగా తన విశ్వాసాన్ని చూపిస్తుంది. అయితే ఇక్కడ చెప్పబోయే కుక్క మాములుదీ కాదండోయ్..2020లో అప్పటి అమెరికా అధ్యక్షుడు భారత్‌కి వచ్చినప్పుడు భద్రతలో పాల్గొన్న లాబ్రాడార్ జాతికి చెందిన స్నిఫర్ డాగ్. దీనిపేరు డిక్కీ. కాగా, ఈకుక్క పుట్టినరోజుని ముజఫర్ పోలీసులు ఘనంగా జరిపారు. దీనికి కాగితం టోపి పెట్టి, ఒక సూట్‌ని తొడిగారు. దీని కేర్‌టేకర్ సునీల్ కేక్ కట్ చేశాడు. ఈ రోజు డాగ్‌కి ప్రత్యేకంగా గుడ్లు, మటన్, మాంసం, కూరగాయలు, పాలు అందించారు. డిక్కీని హర్యానాలోని ఇండో టిబేటన్ బార్డర్ పోలీస్ పంచకులలో ట్రైనింగ్ ఇచ్చారు. 2019 లో ముజఫర్ నగర్ డాగ్‌స్క్వాడ్ పోలీసులకు అప్పగించారు. అప్పటినుంచి బస్టాండ్లు, మార్కెట్లు, రైల్వేస్టేషన్లు, ఇతర ప్రదేశాల్లో పేలుడు పదార్థాలు వేలికి తీయడంలో సేవలందిస్తోందని అబ్దూల్ రయిస్ ఖాన్ అనే పోలీస్ అధికారి తెలిపారు. -
ప్రతి కుక్కకు ఒక రోజు ఉంటుంది..
‘ప్రతి కుక్కకు ఒక రోజు ఉంటుంది’ అంటారు. రోజు సంగతి సరే, విగ్రహాల గురించి కూడా మాట్లాడుకోవాలి. విశ్వాసానికి మారు పేరు శునకాలు అంటారు. మనుషులకు మాత్రమే కాదు మంచికి, సాహసానికి ప్రతీకగా నిలిచిన శునకాలకు సైతం విగ్రహాలు ఉండాలి అనుకోవడంలో ఎలాంటి పొరపాటు లేదు. ప్రతి కుక్కకు కాకపోయినా ప్రత్యేకమైన కుక్కకు ఒక విగ్రహం తప్పకుండా ఉంటుందని తాజాగా నిరూపించారు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు. ముజఫర్‌నగర్ డాగ్స్క్వాడ్లోని ఆ శునకం పేరు ఏఎస్పీ టింకీ. 49 కేసులను పరిష్కరించడంలో కీలకపాత్ర పోషించిన టింకి గత సంవత్సరం నవంబర్‌లో చనిపోయింది. ఈ శునకానికి నివాళి అర్పిస్తూ పోలీస్‌లైన్‌లో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. టింకీ పర్యవేక్షకుడు సునీల్ కుమార్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. -
మరోసారి స్టేట్మెంట్ ఇచ్చిన సిద్దిఖీ భార్య
లక్నో : బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ భార్య అలియా ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని బుధాన పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. గతంలో ఆమె తన కుటుంబంపై ముంబై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. ఆ తరువాత సాంకేతిక కారణాలతో ఆ కేసును పోలీసులు బుధాన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో పోలీసుల పిలుపు మేరకు ఆదివారం అక్కడకు చేరుకుని తన వాగ్మూలం నమోదు చేశారు. కాగా నవాజుద్దీన్ సిద్దిఖీ నుంచి విడిపోవాలని కోరుకుంటు అలియా ఇది వరకే విడాకుల నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. సిద్దిఖీతో తనకున్న మనస్పర్ధాలతో పాటు ఆయన సోదరుడు షామాస్, కుటుంబ సభ్యులు కూడా కారణమని పేర్కొన్నారు. ఈ మేరకు మే 7న నోటీసులు పంపినట్లు అలియా తరఫు లాయర్ అభయ్ తెలిపారు. విడిపోయిన అనంతరం అలియాకు చెల్లించాల్సిన భరణం గురించి కూడా ఇందులో ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగానే నవాజుద్దీన్, ఆయన కుటుంబంపై అలియా తీవ్ర ఆరోపణలు చేశారు. -
చెకప్ కోసం ఆస్పత్రికెళ్లిన మహిళపై..
ముజఫర్‌నగర్ : వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికెళ్లిన ఓ మహిళపై ఇద్దరు వైద్యులు లైంగిక వేధింపులకు పాల్పడిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ మహిళ శుక్రవారం అనారోగ్యానికి గురికావడంతో, వైద్య పరీక్షల నిమిత్తం తల్లి, సోదరుడితో కలిసి నగరంలోని ఓ క్లీనిక్‌కు వెళ్లారు. మహిళపై కన్నేసిన ఇద్దరు యువ డాక్టర్లు.. వైద్య పరీక్షల కోసం గదిలోకి రావాలని చెప్పి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారు. (చదవండి : భర్త వదిలేస్తాడని: గర్భిణి కడుపు కోసి..) ఈ సమయంలో ఆమె తల్లి, సోదరుడు గది బయటే ఉన్నారు. డాక్టర్ల ప్రవర్తన పట్ల విసుగు చెందిన మహిళ.. పరీక్షలు వద్దని చెప్పి ఇంటికి వెళ్లారు. అనంతరం డాక్టర్లు తనను లైంగిక వేధింపులకు గురి చేశారని కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో కోపోద్రిక్తులైన కుటుంబీకులు.. శనివారం క్లినిక్ వద్దకు వెళ్లి వైద్యులపై దాడి చేశారు.అనంతరం పోలీసులుకు ఫిర్యాదు చేశారు. అశోక్, అనిల్ అనే ఇద్దరు డాక్టర్లపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం నిందితులు పరారిలో ఉన్నారని, త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. -
హృదయ విదారకం: చనిపోయిన తల్లిని లేపుతూ..
పట్నా: వలస కార్మికుల వెతలు అన్నీ ఇన్నీకావు. బతువు దెరువు కోసం పట్నం వచ్చినవారిని కరోనా కన్నా ముందు ఆకలి కాటేస్తోంది. రోజుల తరబడి ఆకలి దప్పికలను ఓర్చుకోలేని ఓ వలస కార్మికురాలు ప్రాణాలు విడిచింది. ఆమె శాశ్వతంగా నిద్రపోయిందని తెలియని ఆమె కుమారుడు అమ్మను లేపడానికి ప్రయత్నించాడు. గుండెల్ని పిండేస్తోన్న ఈ వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. బీహార్‌కు చెందిన వలస కార్మికురాలు ఉపాధి కోసం వెళ్లిన గుజరాత్ నుంచి శనివారం శ్రామిక్ రైలులో స్వస్థలానికి తిరుగు పయనమైంది. అయితే ఆ రైలు తన గమ్యం చేరుకోకముందే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. దీంతో ఆమె మృతదేహాన్ని ముజఫర్‌నగర్ స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై ఉంచారు. (సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ) అయితే ఆమె కుమారుడికి తల్లి మరణవార్త తెలీక ఆమెను లేపేందుకు ప్రయత్నించాడు. ఆమె ఒంటిపై కప్పిన దుప్పటినీ లాగుతూ తల్లిని లేవమని చెప్పకనే వేడుకున్నాడు. ఈ హృదయ విదారక దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియయాలో చక్కర్లు కొడుతోంది. తిండీ, నీళ్లు లేకే రైలులో అనారోగ్యానికి గురైందని ఆమె బంధువులు పేర్కొంటున్నారు. కాగా ఇలాంటి ఎన్నో దృశ్యాలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. గూడు చేరేందుకు బహదూరపు బాటసారులుగా మారిన వలస కార్మికులను రోడ్డు ప్రమాదాలు, ఆకలి కేకలు బలి తీసుకుంటున్నాయి. (నీరింకిన కళ్లు..!) -
సీసీఏ వ్యతిరేక ఆందోళన; భారీ జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లోని ముజాఫర్‌నగర్‌లో ఆందోళన చేస్తూ ప్రజల ఆస్తులకు నష్టం కల్గించిన వారికి ముజాఫర్‌నగర్ జిల్లా కోర్టు నష్ట పరిహారం కింద భారీ జరిమానా విధించింది. సమష్టిగా 23.41 లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని చెల్లించాల్సిందిగా మొత్తం 53 మంది నిందితులను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు వారి నుంచి పరిహారం వసూలు చేయాల్సిందిగా ఆదేశిస్తూ జిల్లా తహసీల్దార్‌కు ఉత్తర్వులు జారీ చేసినట్లు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ అమిత్ సింగ్ మీడియాకు తెలిపారు. (చదవండి: కొట్టరాని చోటా కొట్టారు) సీఏఏకు వ్యతిరేకంగా డిసెంబర్ 20వ తేదీన యూపీలోని లక్నో, కాన్పూర్, మీరట్, ముజాఫర్‌నగర్, సంభాల్, రాంపూర్, బిజ్నార్, బులంద్‌షహర్ జిల్లాల్లో ప్రజలు ఆందోళనలు నిర్వహించారు. అవికాస్త విధ్వంసకాండకు దారితీయడంతో 1.9 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. దీనిపై కేసులు నమోదు చేసిన రాష్ట్ర పోలీసులు, సీసీటీవీ కెమేరాల ఫుటేజ్ ద్వారా విధ్వంసానికి పాల్పడిన మొత్తం 295 మందిని గుర్తించారు. వారిలో ముజాఫర్‌నగర్‌లో విధ్వంసానికి పాల్పడిన వారు 57 మంది ఉన్నారు. వారందరికి కోర్టు ద్వారా నోటీసులు వెళ్లాయి. తాము ఎలాంటి విధ్వంసానికి పాల్పడలేదంటూ వారిలో 53 మంది కోర్టుకు సమాధానం ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించిన కోర్టు మరో మాట లేకుండా 23.41 లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. (చదవండి: వినూత్న నిరసన తెలిపిన పెళ్లికొడుకు) -
డ్యాన్స్‌లు చేశారు.. సస్పెండ్ అయ్యారు
ముజఫర్‌నగర్ : విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని షామ్లి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానిక థానాభవన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కర్‌వీర్‌సింగ్ సబ్ ఇన్స్పెక్టర్గా, నితిన్ కుమార్, సోనూలు కానిస్టేబుళ్లుగా పని చేస్తున్నారు. కాగా శనివారం డ్యూటీలో ఉండగానే స్థానికంగా నిర్వహించిన ఓ ప్రైవేట్ వేడుకకు హాజరై బోజనం చేసి డ్యాన్స్‌లు చేయడం వివాదాస్పదమయింది. ఈ ఘటనపై సీరియస్ అయిన ఎస్పీ అజయ్‌కుమార్ ఆ ముగ్గురిని తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు. -
మహిళపై సామూహిక అత్యాచారం
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ 23 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు దుండగులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజఫర్‌నగర్ నగరంలోని జబేపూర్ గ్రామానికి చెందిన మహిళ(23) ఇంట్లో ఉండగా.. శనివారం గుర్తుతెలియని నలుగురు దుండగులు కిడ్నాప్ చేశారు. కారులో ఆమెను పుర్కాజీ పోలీసు స్టేషన్ సమీపంలో ఉన్న చెరుకు తోటలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బయట చెబితే చంపేస్తామని బెదిరించి మహిళను వదిలేశారు. ఇంటికెళ్లిన మహిళ జరిగిన విషయంలో కుటుంబ సభ్యులకు తెలిపగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని పుర్కాజీ పోలీసులు తెలిపారు. -
‘ముజాఫర్‌నగర్’ ఓటు ఎవరికి?
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని ముజాఫర్‌నగర్‌లో 2013లో ముస్లింలు, జాట్ల మధ్య అల్లర్లు చెలరేగి 60 మంది మరణించడం, వేలాది మంది ముస్లింలు ఇల్లు వాకిలి వదిలి పెట్టి వలస పోవడం తెల్సిందే. ఇప్పుడు ముజాఫర్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ సంజీవ్ బలియాన్, ఆయనపై మాజీ ప్రధాని చరణ్ సింగ్ కుమారుడు, ఆర్ఎల్డీ నాయకుడు అజిత్ సింగ్ (80) పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు వారు సహజంగా అజిత్ సింగ్‌కు ఓటేయాలి. ఆయన కూడా జాట్ కులస్థుడు అవడం వల్ల ఆయనకు ఎలా ఓటేయాలని అక్కడి ముస్లింలు తర్జనభర్జన పడుతున్నారు. వారంతా నగర ప్రముఖుడు, మర్యాదస్తుడు ముఫ్తీ జుల్ఫికర్ అభిప్రాయాన్ని కోరుతున్నారు. నాడు జాట్ కులస్థులే తమ మీద దాడులు జరిపారని, ఇల్లు తగులబెట్టారని మండిపోతున్న ముస్లింలకు ఈ సంశయం రావడం సబబేనని జుల్ఫికర్ తనను కలిసిన మీడియా ప్రతినిధితో అన్నారు. ‘పాము కాటుకు గురైన వ్యక్తుల చికిత్సకు విరుగుడుగా మళ్లీ విషాన్నే ఇస్తారు. నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్, ఆరెస్సెస్ నేతల పాలనలో మేము నిర్లక్ష్యానికి గురవుతున్నాం. ముందు పెద్ద శత్రువును ఓడించాలి. వారిని ఓడించడానికి జాట్లతో జరిగిన గొడవను పూర్తిగా మరచిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం’ తన సలహాను అడిగిన ప్రతి ముస్లింకు తాను ఇదే విశయం చెబుతున్నానని ఆయన చెప్పారు. ఎన్నో దశాబ్దాలుగా ముస్లింలు, జాట్లు కలిసిమెలసి ఉంటున్న ముజాఫర్‌నగర్‌లో 2014లో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలోనే 2013లో అల్లర్లు చెలరేగాయి. అనేక మంది ముస్లింలు చనిపోవడంతోపాటు పదుల సంఖ్యలో మహిళలు గ్యాంగ్ రేప్‌లకు గురయ్యారు. ఇప్పటికీ ఆ కేసుల్లో ఎవరికి శిక్ష పడలేదు. నాటి అల్లర్లలో నిందితుడైన సంజీవ్ బల్యాన్ ఎంపీగా పోటీ చేసి నాలుగు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మళ్లీ ఈసారి కూడా ఆయనే పోటీ చేస్తున్నారు. ఆయనపై అజిత్ సింగ్, బీఎస్పీ, ఎస్పీ, ఆర్ఎల్డీ కూటమి అభ్యర్థిగా నిలబడ్డారు. అజిత్ సింగ్‌కు మద్దతుకు కాంగ్రెస్ పార్టీ ఎవరినీ పోటీకి పెట్టడం లేదు. -
పెళ్లైన తొలి రాత్రే... నవవధువుపై బావతో కలిసి భర్త..
ముజఫర్‌నగర్ : పెళ్లైన తొలి రాత్రే బావతో కలిసి కట్టుకున్న భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గపు భర్త. మద్యం మత్తులో మృగంలా ప్రవర్తిస్తూ నవవధువుకి నరకం చూపించాడు. ఈ ఘోరమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మజఫర్‌నగర్ నగరంలో మార్చి 6 చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ 26 ఏళ్ల యువతికి ఇటీవల అదే నగరానికి చెందిన యువకునితో మర్చి 6న వివాహం జరిగింది. అదే రోజు రాత్రి నవ వధువు(26)పై బావతో కలిసి ఆమె భర్త అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతిని తప్పించుకోవడానికి ప్రయత్నించగా తీవ్రంగా కొట్టి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలి సోదరుడు మాట్లాడుతూ.. పెళ్లి రోజు కట్నం కోసం వరుడు, అతని కుటుంబ సభ్యులు గొడవ చేశారని తెలిపాడు.సోదరి పెళ్లి కోసం అప్పటికే తాము రూ.7లక్షలు కట్నం ఇచ్చామన్నారు. పెళ్లి రోజు రాత్రి వరుడు, అతని బావ కలిసి మద్యం సేవించారని, అదే మత్తులో తన సోదరిపై అత్యాచారానికి తెగబడ్డారని వెల్లడించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసికొని విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం యువతి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. -
ఆహా.. యూపీలో ఏమి సహనం?!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఎవరైనా అంటే.. అన్న వారిని పట్టుకొని చావ చితక్కొడుతారు అక్కడి అల్లరి మూకలు. బుధవారం నాడు ఒక్క రోజులో జరిగిన నాలుగు దైర్జన్య, హింసాత్మక సంఘటనలు అక్కడి ‘సహనానికి’ మచ్చుతునకలు. లక్నోలో బుధవారం పట్టపగలు రోడ్డు పక్కన డ్రైఫ్రూడ్స్ అమ్ముతున్న ఇద్దరు కశ్మీరీలను పట్టుకొని కాషాయ దుస్తులు ధరించిన యువకులు చితకబాదారు. పైగా వారే వీరోచితంగా వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. (యూపీలో కశ్మీరీలపై దుండగుల దాడి) అదే రోజు ముజాఫర్‌నగర్‌లో విద్యా, ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఓ టీవీ కార్యక్రమంలో ప్రశ్నించినందుకు ఓ యువకుడిని వెతికి పట్టుకొని బీజేపీ కార్యకర్తలు చితక బాదారు. టెర్రరిస్టుగా ముద్ర వేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఆన్లైన్లో సర్కులేట్ అవుతోంది. అదే రోజు సంత్ కబీర్ నగర్ జిల్లాలో బీజేపీ ఎంపీ, బీజేపీ ఎమ్మెల్యే ప్రజల ముందే బహిరంగంగా కొట్టుకున్నారు. వారిద్దరు ఓ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. శంకస్థాపన పలకం మీద తన పేరు ఎందుకు లేదంటూ బీజేపీ ఎంపీ శరద్ త్రిపాఠి ప్రశ్నించారు. పేర్లు పెట్టదల్చుకోలేదని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ సింగ్ బాఘెల్ సమాధానం చెప్పారు. దాంతో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది. పట్టలేని ఆవేశానికి గురైన బీజేపీ ఎంపీ శరద్ త్రిపాఠి ఒక్కసారిగా తన కాలికున్న బూటును లాగి దాంతో బాఘెల్ నెత్తిపై ఠపీ ఠపీమంటూ కొట్టారు. ఆ తర్వాత ఈ సంఘటనకు ప్రతీకారంగా జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలోకి ఎమ్మెల్యే అనుచరులు జొరబడి అక్కడున్న ఎంపీ శరద్ త్రిపాఠిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు లాఠీచార్జి జరిపి వారిని చెదరగొట్టారు. (ఎమ్మెల్యేను షూతో చితక్కొట్టిన బీజేపీ ఎంపీ) అదే రోజు మీరట్‌లో గుడిశెవాసులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలు రాళ్లు విసురుకున్నారు. పోలీసులు వచ్చి దౌర్జన్యంగా తమ గుడిసెలను తగులబెట్టారంటూ గుడిశెవాసులు రోడ్డెక్కి ప్రైవేటు వాహనాలను, బస్సులను దగ్ధం చేశారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఎంతటి ‘సహనం’ రాజ్యమేలుతుందో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ మరుసటి రోజు అంటే, గురువారం నాడు ఆదిత్యనాథ్ యోగి ప్రభుత్వం ‘నయే భారత్ నయా ఉత్తరప్రదేశ్’ నినాదంతో ఇచ్చిన పూర్తి పేజీ యాడ్ అన్ని ప్రధాన పత్రికల్లో ప్రచురితమైంది. తన ప్రభుత్వం హయాంలో అన్ని నగరాల్లో శాంతి భద్రతల పరిస్థితి మెరుగయిందని, నేరస్థులను అనుమాత్రం ఉపేక్షించమనే తమ విధానం విజయవంతం అయిందని కూడా ఆ యాడ్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఆ యాడ్ మధ్య భాగంలో శాంతి భద్రతల పరిస్థితి మెరగయిందన్న శీర్షిక కింద నేరాల పట్ల అణు మాత్రం సహించని విధానాన్ని అమలు చేస్తున్నామని, పోలీసు బృందాల ఎన్కౌంటర్ల వల్ల 69 మంది నేరస్థులు మరణించారని, 7043 మంది అరెస్టయ్యారని, ప్రభుత్వ విధానంలో వచ్చిన మార్పును గమనించి 11,981 మంది నేరస్థులు తమ బెయిళ్లను రద్దు చేసుకొని కోర్టుల ముందు హాజరయ్యారని చెప్పడంతో రాష్ట్ర పోలీసులు అందిస్తున్న సేవల గురించి, లక్ష మంది పోలీసుల నియామకానికి ప్రక్రియ కొనసాగుతోందని కూడా ఆ యాడ్‌లో పేర్కొన్నారు. బుధవారం జరిగిన నాలుగు, దౌర్జన, హింసాత్మక సంఘటనలకు సబంధించిన వీడియోలు అందుబాబులో ఉన్నా ఒక్క గుడిశెవాసులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి మినహా మిగతా మూడు సంఘటనల్లో పోలీసులు ఇంతవరకు ఏ చర్యా తీసుకోలేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు. అనవసరమైన పబ్లిసిటీ పేరిట లక్షల రూపాయలు తగిలేసే బదులు, శాంతి భద్రతల పరిరక్షణకు కేటాయిస్తే ఎప్పటికైనా ‘సహనం’ వస్తుందేమో! -
యూపీలో ఒక్క రోజులోనే నాలుగు హింసాత్మక సంఘటనలు
-
విద్యార్థిని చితక్కొట్టారు, వీడియో వైరల్
లక్నో: దేశంలో విద్వేషపూరిత దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లక్నోలో డ్రైఫ్రూట్స్ విక్రయించే ఇద్దరు కశ్మీరీలపై హిందూ అతివాద గ్రూపునకు చెందిన కొందరు బుధవారం సాయంత్రం కర్రలతో దాడి చేసిన ఘటన మరువకముందే.. అలలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌లో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని జీర్ణించుకులేకపోయిన కొందరు వ్యక్తులు ఓ విద్యార్థిని చితక్కొట్టారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రోజున ఓ వార్త చానల్ ముజఫర్‌నగర్‌లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులతో మాట్లాడించే కార్యక్రమం చేపట్టింది. ఆ సముహంలోని ఓ విద్యార్థి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించాడు. దీంతో ఓ గ్రూప్ అతనిపై దాడికి దిగారు. అతనిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. దీంతో ఆ టీవీ కార్యక్రమానికి అంతరాయం కలిగింది. ఈ ఘటనను కొందరు వ్యక్తులు చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాడి అనంతరం బాధితుడు మాట్లాడుతూ.. ‘కేవలం ఉద్యోగాలు లేవని మాట్లాడినందుకు నాపై దాడి జరిగింది. వాళ్లు నన్ను టెర్రరిస్టు అంటూ.. భారత్‌కు, బీజేపీకి వ్యతిరేకివి అంటూ దాడికి తెగబడ్డారు. ముజఫర్‌నగర్ పోలీసులు ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ.. ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వీడియోలో నిందితుల ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నాయ’ని తెలిపారు. కాగా, ఈ ఘటనను హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ఖండించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ నాయకులు అసహనంతో దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. -
టీవీ చానల్‌తో మాట్లాడుతున్న విద్యార్థిని చితక్కొట్టారు
-
షెల్టర్ హోం కేసు: ఢిల్లీ కోర్టుకు బదలాయింపు
సాక్షి, న్యూఢిల్లీ : షెల్టర్ హోంల నిర్వహణ పట్ల బిహార్ ప్రభుత్వం తీరును సుప్రీం కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ముజఫర్‌పూర్ షెల్టర్ హోంలో బాలికలపై లైంగిక వేధింపుల కేసును ఢిల్లీ కోర్టుకు బదలాయించాలని ఆదేశించింది. షెల్టర్ హోం కేసులన్నింటినీ బిహార్ సీబీఐ కోర్టు నుంచి ఢిల్లీలోని పోక్సో సాకేత్ ట్రయల్ కోర్టుకు రెండు వారాల్లోగా తరలించాలని ఆదేశించింది. ఆరు నెలల్లోగా షెల్టర్ హోం కేసుల విచారణను ముగించాలని సాకేత్ కోర్టును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ ఆదేశించింది. గత ఏడాది ముజఫర్‌పూర్ వసతి గృహంలో దాదాపు 40 మందికి పైగా బాలికలపై అఘాయిత్యాలు జరిగిన వార్త బయటపడడంతో దేశవ్యాప్తంగా సంచలంగా మారిన సంగతి తెలిసిందే. బ్రజేష్ ఠాకూర్ అనే వ్యక్తి నడుపుతున్న ఎన్జీవో ఆధ్వర్యంలోని వసతి గృహంలో ఈ దారుణాలు చోటుచేసుకున్నాయి. కాగా, కేసు రికార్డుల తరలింపు, సాక్షుల హాజరు వంటి అంశాల్లో సీబీఐకి సహకరించాలని బిహార్ ప్రభుత్వాన్ని కోరింది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ముజఫర్‌పూర్ షెల్టర్ హోం కేసులో గత ఏడాది డిసెంబర్ 19న సీబీఐ చార్జిషీట్‌ను నమోదు చేసింది. షెల్టర్ హోం లైంగిక దాడి కేసును విచారిస్తున్న అధికారిని బదిలీ చేయడం పట్ల సీబీఐపై కోర్టు మండిపడింది. దీనిపై వివరణ ఇస్తూ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని దర్యాప్తు ఏజెన్సీని సుప్రీం బెంచ్ ఆదేశించింది. షెల్టర్ హోంలో చిన్నారులపై లైంగిక అకృత్యాలు సాగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని బిహార్ ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసింది. ఈ కేసులకు సంబంధించిన సమాచారాన్ని అందించని పక్షంలో ప్రభుత్వం ప్రధాన కార్యదర్శికి కోర్టు సమన్లు జారీ చేస్తుందని స్పష్టం చేసింది. ముజఫర్‌పూర్‌లో ఓ ఎన్జీవో నిర్వహిస్తున్న షెల్టర్ హోంలో పలువురు బాలికలపై హోం నిర్వాహకులు లైంగిక దాడి జరిగిందనే ఆరోపణలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నివేదిక ద్వారా షెల్టర్ హోం బాలికలపై లైంగిక వేధింపుల ఉదంతం గత ఏడాది మేలో వెలుగుచూసింది. -
మహిళా వైద్యాధికారిని వెంబడించి..
లక్నో : ఉత్తర్ ప్రదేశ్‌లో మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ముజఫర్‌నగర్‌లోని రాంపురి ప్రాంతంలో మహిళా వైద్యాధికారిని లైంగికంగా వేధించిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు మంగళవారం పోలీసులు వెల్లడించారు. ఈ నెల ఏడున బాధితురాలు జిల్లా ఆస్పత్రిలో విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వెంటాడి లైంగికంగా వేధింపులకు గురిచేశారు. దుండగుల చర్యను ప్రతిఘటించగా వారు తనను తీవ్రంగా కొట్టారని బాధితురాలు ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పారు. మహిళ ఫిర్యాదుపై నిందితులు చందు సింగ్, బిహరి, మరో గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు వెల్లడించారు. -
షెల్టర్ హోం కేసు : మంజు వర్మ భర్త లొంగుబాటు
పట్నా : దేశవ్యాప్తంగా దుమారంరేపిన ముజఫర్‌పూర్ షెల్టర్ హోంలో బాలికలపై లైంగిక దాడి కేసుకు సంబంధించి బిహార్ మాజీ మంత్రి మంజు వర్మ భర్త సోమవారం కోర్టులో లొంగిపోయారు. షెల్టర్ హోం ఘటనలో తన భర్త చంద్రశేఖర వర్మపై ఆరోపణల నేపథ్యంలో మంజు వర్మ మంత్రి పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. బెగుసరై జిల్లా మంజ్హాల్ సబ్ డివిజనల్ మేజిస్ర్టేట్లో లొంగిపోయిన వర్మను నవంబర్ 6వరకూ జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని మేజిస్ర్టేట్ యోగేష్ కుమార్ మిశ్రా ఆదేశించారు. బెగుసరై జిల్లాలోని వర్మ నివాసంలో సీబీఐ దాడుల సందర్భంగా పెద్ద సంఖ్యలో ఆయుధాలు లభ్యం కావడంతో కేసు నమోదు చేశారు. మరోవైపు షెల్టర్ హోంలో 30 మంది బాలికలపై లైంగిక దాడుల ఆరోపణల కేసులోనూ వర్మ ప్రమేయంపై వార్తలు రావడంతో ఆయన భార్య, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మంజు వర్మ ఈ ఏడాది ఆగస్ట్‌లో తన పదవికి రాజీనామా చేశారు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన నివేదిక ద్వారా తొలుత ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. -
రవీనా టాండన్‌పై కేసు నమోదు
ముజఫర్‌పూర్ : బాలీవుడ్ నటి రవీనా టాండన్‌పై బిహార్‌లో కేసు నమోదైంది. ఆమె కారణంగా తాను ట్రాఫిక్‌లో కొన్ని గంటల పాటు వేచి చూడాల్సి వచ్చిందని ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. వివరాలు... గత శుక్రవారం ముజఫర్‌పూర్‌లో ఓ హోటల్ ప్రారంభోత్సవానికి రవీనా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెను చూసేందుకు జనాలు బారులు తీరడంతో ట్రాఫిక్ నిలిచి పోయింది. దీంతో తన సమయం వృథా అయిందని, అందుకే రవీనా, హోటల్ యజమానులపై ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది పేర్కొన్నారు. కాగా నవంబరు 2న ఈ కేసు విచారణకు రానుంది. -
భర్తను చంపిన భార్యకు, ఆమె ప్రియుడికి యావజ్జీవం
ముజ్జాఫర్నగర్ : ఇటీవల ప్రియుడి మోజులో పడి భార్యలు, తమ భర్తలను కడతేర్చుతున్న సంఘటనలను చూస్తూనే ఉన్నాం. ఈ సంఘటనలకు పాల్పడిన వారికి కోర్టులు జైలు శిక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ముజ్జాఫర్నగర్లో ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్యకు, ఆమె ప్రియుడికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. భర్త వారి అక్రమ సంబంధాన్ని వ్యతిరేకించినందుకు గాను, వీరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అదనపు జిల్లా సెషన్స్ జడ్జి రవిందర్ కుమార్ శుక్రవారం సాయంత్రం వీరికి ఈ శిక్ష విధించారు. అంతేకాక రహీస, ఆమె ప్రేమికుడు రిజ్వాన్‌కు రూ.7000 చొప్పున జరిమానా కూడా విధిస్తున్నట్టు ప్రకటించారు. ఐపీఎస్ సెక్షన్లు 302(హత్యానేరం), 201(సాక్ష్యాలు కనుమరుగు చేయడం) కింద ఈ శిక్ష విధించారు. ప్రాసిక్యూషన్ ప్రకారం, రహీస, ప్రియుడి రిజ్వాన్‌తో కలిసి తన భర్త షానవాజ్‌ను 2010 జూన్ 15న హతమార్చింది. ఆ తర్వాత సాక్ష్యాలను కనుమరుగు చేసింది. షానవాజ్ దుకాణదారుడు. రహీస, రిజ్వాన్‌ల అక్రమ సంబంధాన్ని అతను వ్యతిరేకించాడు. షానవాజ్ హత్యపై అతని తమ్ముడు ఇస్లామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ అనంతరం ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. -
బిహార్ షెల్టర్ హోం కేసు: కీలక మలుపు
పాట్నా : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిహార్ ముజఫర్‌పూర్ వసతిగృహంలో బాలికలపై హత్యాచారాలకు పాల్పడిన కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై దర్యాప్తు నిమిత్తం కేంద్రం సీబీఐని నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీబీఐ విచారణలో భాగంగా సికందర్పూర్ ప్రాంతంలోని శ్మశానంలో ఓ అస్థిపంజరం బయటపడింది. దీన్ని వసతి గృహానికి చెందిన బాలిక అస్థిపంజరంగా భావిస్తున్నారు సీబీఐ అధికారులు. దాంతో ఈ అస్థిపంజరానికి ఫోరెన్సిక్ పరీక్షలు, డీఎన్ఏ పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బ్రజేష్ ఠాకూర్ డ్రైవర్ తెలిపిన వివరాలతో ఈ అస్థిపంజరాన్ని గుర్తించినట్లుగా వెల్లడించారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తరువాత మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. కొద్ది రోజుల క్రితం ముజఫర్‌పూర్ వసతి గృహంలో దాదాపు 40 మందికి పైగా బాలికలపై అఘాయిత్యాలు జరిగిన వార్త బయటపడడంతో దేశవ్యాప్తంగా సంచలంగా మారిన సంగతి తెలిసిందే. బ్రజేష్ ఠాకూర్ అనే వ్యక్తి నడుపుతున్న ఎన్జీవో ఆధ్వర్యంలోని వసతి గృహంలో ఈ దారుణాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో కొందరు బాలికలను చంపి వసతి గృహంలోనే పూడ్చారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో స్థానిక పోలీసులు బాలికలు చూపిన చోట వసతిగృహంలో తవ్వకాలు జరిపారు.. కానీ అక్కడ ఏమీ లభ్యం కాలేదని అధికారులు వెల్లడించారు. -
ఆరునెలలుగా పైశాచికం..
ముజఫర్‌నగర్ : యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కీచక తండ్రి కన్నకూతురిపై సాగించిన పైశాచిక దాడి వెలుగుచూసింది. బుధానా పట్టణంలో ఆరు నెలలుగా మైనర్ కుమార్తెపై తండ్రి లైంగిక దాడికి పాల్పడుతూ బాధితురాలి తల్లి కంటపడ్డాడు. కంటికిరెప్పలా కాపాడాల్సిన కూతురుపై తాను చేస్తున్న ఘోరం బయటపడటంతో నిందితుడు తల్లీకూతుళ్లను బెదిరించాడు. దారుణానికి తెగబడ్డ తండ్రిపై బాధితురాలు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికను వైద్య పరీక్షలకు తరలించి కేసు దర్యాప్తు చేపట్టామని పోలీసులు చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు చేపడతామని ముజఫర్‌నగర్ ఎస్పీ ఓంవీర్ సింగ్ తెలిపారు. -
అత్యాచారం కేసు.. నిందితునికి జీవిత ఖైదు
ముజఫర్‌నగర్: పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఓ నిందితుడికి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అలాగే రూ.25 వేల జరిమానా కూడా విధించింది. 2014 సంవత్సరం జూలై 8న కిరణ్‌పాల్ అనే వ్యక్తి ముజఫర్‌నగర్ జిల్లా పంచెండకాలా గ్రామానికి చెందిన 10 ఏళ్ల బాలికను ఇంట్లో నుంచి ఎత్తుకు వచ్చాడు. అనంతరం స్కూల్ వద్ద అత్యాచారం చేసి పారిపోయాడు. స్కూల్ వద్ద అపస్మారక స్థితిలో ఉన్న బాలికను స్థానికులు ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు తర్వాత నిందితుడు కిరణ్‌పాల్‌ను అరెస్ట్ చేశారు. నిందితునిపై భారత శిక్షా స్మృతిలోని వివిధ సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో శుక్రవారం తుదితీర్పు వెలువడింది. -
షెల్టర్ షేమ్ : నితీష్ రాజీనామాకు రబ్రీ డిమాండ్
పట్నా : ముజఫర్‌పూర్ షెల్టర్ హోంలో చిన్నారులపై అకృత్యాల ఘటనపై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని మాజీ సీఎం రబ్రీ దేవి డిమాండ్ చేశారు. నితీష్ సీఎం పదవిలో కొనసాగినంత కాలం నిష్పాక్షిక విచారణ సాధ్యం కాదని తేల్చిచెప్పారు. సీబీఐ ప్రస్తుతం కేసును విచారిస్తున్నా ఇంతవరకూ పెద్ద తలకాయలు ఎవరూ పట్టుబడలేదని, నితీష్ అధికారంలో ఉంటే కేసులో ప్రమేయం ఉన్న రాజకీయ నేతలు, అధికారుల పేర్లు వెలుగుచూడవని తాము భావిస్తున్నామన్నారు. ముజఫర్‌పూర్ దారుణ ఘటనలో జేడీయూ, బీజేపీ నేతల హస్తం ఉందని నితీష్ అంతరాత్మకు తెలుసని రబ్రీ దేవి ఆరోపించారు. ఈ కేసులో సీబీఐ నిష్పాక్షిక విచారణపై ఆమె సందేహం వ్యక్తం చేశారు. ముజఫర్‌పూర్ ఘటన బిహార్‌తో పాటు నితీష్ ప్రతిష్టను మంటగలిపిందని అన్నారు. మహిళలు, బాలికలకు బిహార్ సురక్షితం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. -
‘ముజఫర్’ కేసులో మంత్రి రాజీనామా
ముజఫర్‌పూర్/పట్నా: బిహార్‌లోని ముజఫర్‌పూర్ వసతిగృహంలో బాలికలపై అత్యాచారాల ఉదంతంలో ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఆ రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి మంజు వర్మ రాజీనామా చేశారు. బుధవారం ఈ మేరకు బిహార్ సీఎంకు తన రాజీనామా లేఖ ఇచ్చారు. ప్రభుత్వ నిధులతో నిడిచే ఓ అనాథ శరణాలయంలో 34 మంది బాలికలపై నిర్వాహకులు లైంగికదాడికి పాల్పడటం తెల్సిందే. మంత్రి మంజు వర్మ భర్త చందేశ్వర్ వర్మ ఆ వసతిగృహానికి తరచూ వచ్చే వారంటూ ఓ నిందితుడి భార్య ఆరోపణలు చేసింది. దీన్ని ఆధారంగా చేసుకుని మంజు వర్మపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు ‘ప్రధాన నిందితుడు బ్రజేశ్ థాకూర్ మొబైల్ ఫోన్‌ను పోలీసులు పరీక్షించగా.. బ్రజేశ్‌తో మంత్రి భర్త 17 సార్లు మాట్లాడినట్లు తేలింది. ‘రాజకీయాలకు సంబంధించిన విషయాలు’ మాత్రమే మాట్లాడుకున్నట్లు బ్రజేశ్ వెల్లడించాడు. ఈ పరిణామాల నేపథ్యంలోనే మంజు రాజీనామా చేసినట్లు సమాచారం.మంత్రి మంజు వర్మతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని ఈ కేసులో ప్రధాన నిందితుడు బ్రజేశ్ థాకూర్ తెలిపాడు. -
పడగనీడలో శరణాలయాలు
దిక్కులేనివారికి నీడనిచ్చి ఆదుకుంటున్నాయని భావించే శరణాలయాలు వారి పాలిట నరక కూపా లుగా మారాయని వెలువడుతున్న కథనాలు హృదయవిదారకంగా ఉంటున్నాయి. అమ్మానాన్నలు లేనివారు, దుర్భర దారిద్య్రంతో సతమతమవుతున్నవారు, ఒంటరిగా ఉంటే సంఘవిద్రోహ శక్తుల నుంచి ముప్పు ఉంటుందని భయపడేవారు...ఇలా అనేకమంది అభాగ్యులు ఆశ్రయం దక్కుతుందని శరణాలయాలకు వెళ్లి అక్కడున్న తోడేళ్ల బారిన పడుతున్నారని, కాళరాత్రులు చవిచూస్తున్నారని ఆ కథనాలు వెల్లడిస్తున్నాయి. గత నెలలో వెలుగులోకొచ్చిన ముజఫర్‌పూర్ శరణాలయం దుర్మార్గాలపై దర్యాప్తు ఇంకా ఒక కొలిక్కి రాకుండానే ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా శరణాలయంలోనూ అలాంటి పరిస్థితులే ఉన్నాయని బయటికొచ్చింది. ఈ దుర్మార్గాల తీరు గమనిస్తే అసలు దేశంలో ప్రభు త్వాలున్నాయా, అవి పనిచేస్తున్నాయా అన్న సందేహం కలుగుతుంది. ముంబైలోని టాటా ఇనిస్టి ట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టిస్) సంస్థ మొన్న ఫిబ్రవరిలో బిహార్ శరణాలయాలపై ఇచ్చిన సమగ్ర నివేదిక మహిళలు, బాలికలు, బాలురు అక్కడ అనునిత్యం ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, వారిపై అడ్డూ ఆపూ లేకుండా సాగుతున్న అఘాయిత్యాల సంగతి బయటపెట్టింది. నిజానికి ఈ మాదిరి ఆడిట్ చేయమని టిస్‌ను కోరింది బిహార్ ప్రభుత్వమే. అందుకు ఆ ప్రభుత్వాన్ని అభి నందించాల్సిందే. కానీ అనంతర చర్యల్లో మాత్రం అక్కడి ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడిగి ఉండి పోయింది. ముజఫర్‌పూర్ శరణాలయంలో 7 నుంచి 18 ఏళ్ల వయసులోపు బాలికలపై అత్యాచారాలు జరిగాయని మార్చిలో జరిగిన దర్యాప్తు నిర్ధారించగా మే నెలలో ప్రధాన నిందితుడు బ్రజేష్ ఠాకూర్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయనగారిని పోలీసులు మరో నెల్లాళ్లకుగానీ అరెస్టు చేయలేకపోయారు. అసలు శరణాలయంలో ఉండాల్సిన 11మంది మహిళలు, నలుగురు పిల్లలు ఏమయ్యారని ఆరా తీయడానికే రెండు నెలలు పట్టింది. టిస్ నివేదిక ఈ ఒక్క శరణాలయం గురించి మాత్రమే మాట్లా డలేదు. ఆ రాష్ట్రంలోని 110 శరణాలయాల్లో కేవలం 7 మాత్రమే సంతృప్తికరంగా పనిచేస్తున్నాయని, మిగిలినవన్నీ అధ్వాన్నంగా అఘోరిస్తున్నాయని తెలిపింది. ముజఫర్‌పూర్‌లో బాలికలపై మాదక ద్రవ్యాలు ప్రయోగించటం, వారు అపస్మారక స్థితిలోకెళ్లాక అత్యాచారాలకు పాల్పడటం రివాజు అని అందులోనివారు చెబుతున్నారు. ఒక బాలిక ఈ అఘాయిత్యానికి కన్నుమూస్తే సంస్థ ఆవరణలోనే ఖననం చేశారట. ఈ స్వచ్ఛంద సంస్థలన్నిటికీ ఏటా క్రమం తప్పకుండా ప్రభుత్వ నిధులు ప్రవ హిస్తున్నాయి. వాటికి నిర్వహణా సామర్ధ్యం ఉందో లేదో... మంజూరవుతున్న నిధుల్ని ఎలా ఖర్చు చేస్తున్నాయో... ఆ శరణాలయాల్లోని అభాగ్యుల స్థితిగతులెలా ఉన్నాయో తెలుసుకోవడం తమ బాధ్యతని ఆ ప్రాంత ఎమ్మెల్యే, మంత్రులు, అధికారులు అనుకోలేదు. సాక్షాత్తూ సాంఘిక సంక్షేమ మంత్రి మంజువర్మ భర్తే ముజఫర్‌పూర్ దురాగతాలకు బాధ్యుడని భావిస్తున్న ఠాకూర్‌తో తరచు మంతనాలు సాగించేవాడని వెల్లడైంది. ఈ కథ బయటకు రావడంతో ఆమె పదవి నుంచి తప్పు కున్నారు. కానీ ఆమె భర్తకూ, ఠాకూర్‌కూ మధ్య ఉన్న లావాదేవీలు బయటపడాల్సి ఉంది. దేవరియా ఉదంతాన్ని ఓ పదేళ్ల చిన్నారి బయటపెట్టేవరకూ అక్కడి ప్రభుత్వ యంత్రాంగం నిద్రలో జోగుతోంది. ఆదివారం నిశిరాతిరి వేళ శరణాలయం నిర్వాహకురాలి కన్నుగప్పి తప్పించు కున్న బాలిక ఒంటరిగా పోలీస్‌స్టేషన్‌కొచ్చి అక్కడి ఘోరాలను పూసగుచ్చినట్టు చెప్పింది. ఆ బాలిక రాత్రి వేళ బయటికొచ్చే సాహసం చేయలేకపోయినా... దారిలో మరో రాక్షసుడి కంటబడినా ఇదంతా ఎప్పటికీ బయటికొచ్చేది కాదు. శరణాలయంలోని పిల్లలతో బండచాకిరీ చేయించడం, యుక్త వయ సొచ్చినవారిని సాయంత్రమయ్యేసరికి కార్లలో ఎటో తరలించడం అక్కడ నిత్యకృత్యమని, సాయం కాలం వెళ్లిన యువతులు పొద్దునే వచ్చి ఏడుస్తుంటారని తెలిపింది. తనకూ, తనతోపాటున్నవారికీ శరణాలయంలో నిత్యం ఎదురవుతున్న అన్యాయాలు పోలీస్‌స్టేషన్‌కెళ్లి చెబితే విరగడవుతాయని ఆ చిన్నారికి ఎందుకనిపించిందోగానీ ఆ చర్య నాగరిక సమాజంలో మర్యాదస్తుల ముసుగేసుకున్న స్వచ్ఛంద సంస్థ నిర్వాకాన్ని బజారుకీడ్చింది. రాత్రికి రాత్రే శరణాలయానికెళ్లిన పోలీసులకు రిజిస్టర్ ప్రకారం ఉండాల్సిన 42మంది బాలికలు, యువతుల్లో 24మంది మాత్రమే లెక్క తేలారు. మిగిలిన 18మంది గురించి అడిగితే నిర్వాహకులు నీళ్లు నమిలారు. అందులో ఒక యువతి మాత్రం ఆ మరు నాడు వృద్ధుల శరణాలయంలో పోలీసులకు తారసపడింది. మారుమూల గ్రామాల్లో చీమ చిటుక్కు మంటే వేగుల నుంచి కబురందే ప్రభుత్వాలకు దేవరియా శరణాలయంలో ఏం జరుగుతున్నదో పదేళ్ల పసిపాప వచ్చి చెప్పేవరకూ తెలియలేదు! నడిరోడ్డుపై ఉన్మాద మూకలు గోరక్షణ పేరుతోనో, మరే ఇతర సాకుతోనో అమాయకులను కొట్టి చంపుతున్నా కదలికలేని ప్రభుత్వాలు నిర్భాగ్యులు కొలువు దీరే శరణాలయాలను పట్టించుకోవాలనుకోవటం అత్యాశే కావొచ్చు. అత్యాచార ఉదంతాలు బయటికొచ్చినప్పుడల్లా ప్రభుత్వాలు ఎక్కడలేని చురుకుదనమూ ప్రద ర్శిస్తాయి. జమ్మూ–కశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై దుండగులు అఘాయిత్యానికి పాల్పడి, ఆమె ఉసురు తీశాక దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. ఆ తర్వాత పన్నెండేళ్లలోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడిన నేరగాళ్లకు ఉరిశిక్ష విధించాలని ప్రతిపాదిస్తూ కేంద్రం బిల్లు తెచ్చింది. శరణాలయాల్లో తనిఖీలు చేయాలంటూ రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఒక్క శరణాలయాలు మాత్రమే కాదు... ప్రభుత్వం నుంచి వెళ్లే ప్రతి పైసా ఏమవుతున్నదో, రకరకాల పేర్లు చెప్పుకుని ప్రభుత్వ నిధులు తీసుకుంటున్న సంస్థల తీరుతెన్నులెలా ఉంటున్నాయో నిరంతరాయంగా తనిఖీలు జరగాలి. ఆ తనిఖీలపై పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలి. అది ప్రభుత్వాల బాధ్యత. ఎవరో చెబితే తప్ప ఏమీ తెలుసుకోలేని అశక్తతలో ప్రభుత్వాలు ఉన్నంతకాలం ఇలాంటి నేరాలూ, ఘోరాలు కొన సాగుతూనే ఉంటాయి. -
బాలికలపై అకృత్యాలు : బిహార్ మంత్రి రాజీనామా
పట్నా : దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన ముజఫర్‌పూర్ షెల్టర్ హోం చిన్నారులపై జరిగిన అకృత్యాల ఘటనకు సంబంధించి బిహార్ మంత్రి మంజూ వర్మ రాజీనామా చేశారు. ఈ కేసులో ఆమె పాత్రపై ఆరోపణలు వచ్చిన క్రమంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో భేటీ అనంతరం మంత్రి పదవి నుంచి వైదొలుగుతున్నట్టు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మంజూ వర్మ వెల్లడించారు. ముజఫర్‌పూర్ షెల్టర్ హోం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, హోం నిర్వాహకుడు బ్రజేష్ ఠాకూర్‌తో మంజూ వర్మ భర్తకు సంబంధాలున్నాయని ఆరోపణలున్నాయి. మంబయికి చెందిన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ చేపట్టిన సామాజిక ఆడిట్లో షెల్టర్ హోంలో మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులను వెలుగులోకి తెచ్చాయి. హోంలో ఆశ్రయం పొందుతున్న 40 మంది బాలికల్లో సగానికి పైగా బాలికలపై లైంగిక దాడులు జరిగినట్టు వైద్య నివేదికల్లో వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించి పది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, షెల్టర్ హోంను బిహార్ ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. బాలికలను ఇతర జిల్లాల్లోని వసతి గృహాలకు తరలించి షెల్టర్ హోంను అధికారులు సీజ్ చేశారు. -
ప్రతి ఆరు నిమిషాలకు ఓ లైంగిక దాడి..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో మహిళలకు భద్రత కరవైందని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్సీఆర్బీ సమాచారం ప్రకారం దేశంలో ప్రతి ఆరు నిమిషాలకు ఓ బాలికపై లైంగిక దాడి జరుగుతోందని, మధ్యప్రదేశ్ ఈ జాబితాలో అగ్రస్ధానంలో ఉండగా, యూపీ రెండో స్ధానంలో ఉందని, అసలు ఈ దేశంలో ఏం జరుగుతోందని సర్వోన్నత న్యాయస్ధానం ప్రశ్నించింది. ముజఫర్‌పూర్ షెల్టర్ హోంలో చిన్నారులపై అకృత్యాల కేసును విచారిస్తూ బిహార్ ప్రభుత్వం ఈ తరహా షెల్టర్ హోంలను ఎలా అనుమతిస్తోందని మండిపడింది. 2004 నుంచి వసతి గృహం నడుపుతున్న ఎన్జీఓకు బిహార్ ప్రభుత్వం నిధులు సమకూరుస్తోందని, అసలు అక్కడ ఏం జరుగుతున్నదే దానిపై ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేకపోవడాన్ని కోర్టు ఆక్షేపించింది. అక్కడి వ్యవహారాలపై విచారణ జరిపించాలనే ఆలోచన ఎందుకు కలగలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేసులో నిందితులను శిక్షించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారని కోర్టు బిహార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. షెల్టర్ హోంలో తనిఖీలను మొక్కుబడిగా చేపట్టారని, చిత్తశుద్ధితో వ్యవహరించలేదని దుయ్యబట్టింది. ముజఫర్‌పూర్ షెల్టర్ హోంలో మైనర్ బాలికలపై లైంగిక దాడుల ఘటనకు సంబంధించి సుప్రీం కోర్టు ఆగస్ట్ 2న బిహార్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
కార్లలో వచ్చి తీసుకెళ్లేవారు!
దేవరియా/లక్నో: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో శరణాలయంలోని బాలికలపై లైంగిక దాడులు జరిగిన ఘటన ఇంకా ప్రకంపనలు రేపుతుండగానే అలాంటి మరో ఘటన ఉత్తరప్రదేశ్(యూపీ)లోనూ వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని దేవరియాలో ఉన్న ఓ శరణాలయంలోనూ బాలికలపై లైంగిక దోపిడీ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అక్కడి నుంచి 24 మంది అమ్మాయిలను పోలీసులు రక్షించారు. మరో 18 మంది బాలికల ఆచూకీ తెలియడం లేదు. ఈ శరణాలయాన్ని నడుపుతున్న భార్యాభర్తలతోపాటు అక్కడ పనిచేస్తున్న ఓ మహిళను అరెస్టు చేశారు. ఏడుస్తూ తిరిగొచ్చేవారు: బాలిక శరణాలయం నుంచి తప్పించుకున్న పదేళ్ల బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘోరం వెలుగుచూసింది. రోజూ సాయంత్రం కొంత మంది కార్లలో వచ్చి బాలికలను తీసుకెళ్లేవారనీ, వారితోపాటు కాంచనలత వెళ్లేదని బాలిక పోలీసులకు చెప్పింది. ‘చాలా కార్లు వచ్చి అమ్మాయిలను తీసుకెళ్లేవి. మళ్లీ పొద్దున వాళ్లు తిరిగొస్తూ అందరూ ఏడ్చేవారు’ అని తెలిపింది. కాగా, ఈ శరణాలయానికి ఏడాది క్రితమే అనుమతులు రద్దు చేశామనీ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని యూపీ మంత్రి రీటా బహుగుణ చెప్పారు. ఈ అంశంపై విపక్షాల నుంచి నిరసనలు వ్యక్తమవుతుండటంతో యూపీ బీజేపీ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది.దేవరియా జిల్లా మేజిస్ట్రేట్ సుజిత్ కుమార్‌ను తక్షణం తొలగిస్తూ సీఎం యోగి ఆదేశాలు ఇచ్చినట్లు యూపీ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి రీటా బహుగుణ జోషి సోమవారం చెప్పారు. దేవరియా ఎస్పీ రోహన్మాట్లాడుతూ ‘మా వింధ్యవాసిని మహిళా ప్రశిక్షణ్ ఎవం సమాజ్ సేవా సంస్థాన్‌లో బాలికలపై లైంగిక దోపిడీ జరుగుతోందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో శరణాలయాన్ని మూసేశాం. దాన్ని నడుపుతున్న గిరిజ, భర్త మోహన్, మహిళా సూపరింటెండెంట్ కాంచనలతను అరెస్టు చేశాం’ అని చెప్పారు. -
షెల్టర్ షేమ్‌పై మేనకా గాంధీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ముజఫర్‌పూర్, డియోరియా షెల్టర్ హోంలలో చిన్నారులపై అకృత్యాల ఘటనలు కలకలం రేపిన నేపథ్యంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలు విచారకరమని పేర్కొన్న ఆమె ఏళ్ల తరబడి పాలకుల నిర్లక్ష్యం కారణంగా షెల్టర్ హోంలలో జరుగుతున్న దారుణ ఘటనలు మరిన్ని వెలుగులోకి రావచ్చన్నారు. సంవత్సరాల తరబడి వీటిని మనం పట్టించుకోకుండా వదిలివేయడంతో ఇలాంటి దారుణ ఉదంతాలు చాలా ఉంటాయని తనకు తెలుసన్నారు. ఎంపీలు తమ నియోజకవర్గాల్లోని షెల్టర్ హోంలను సందర్శించి అక్కడి పరిస్థితులను అంచనా వేయాలని ఆమె కోరారు. వారి నియోజకవర్గాల్లో వసతి గృహాల పరిస్థితిపై తనకు నివేదిక అందిస్తే తక్షణమే చర్యలు చేపడతానన్నారు. వేయి మంది చిన్నారులు, వేయి మంది మహిళలతో కూడిన అతిపెద్ద హోంలను నిర్మించి, మహిళలే సిబ్బంగిగా వీటిని నడపడమే దీర్ఘకాలిక పరిష్కారమని సూచించారు. దీనికి అవసరమైన నిధులను తాను మంజూరు చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. షెల్టర్ హోంలలో చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలు దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. -
మంచి పనులు కనిపించవా..?
ముజఫర్‌పూర్ : ముజఫర్‌పూర్ షెల్టర్ హోంలో మైనర్ బాలికలపై జరిగిన అకృత్యాల నేపథ్యంలో బిహార్ సీఎం రాజీనామా చేయాలన్న విపక్షాల డిమాండ్‌పై ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ స్పందించారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా ఒకేఒక్క ప్రతికూల ఉదంతంపైనే దృష్టిసారిస్తున్నారని విపక్షాలు, మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముజఫర్‌పూర్ బాలికల వసతి గృహంలో జరిగిన దారుణ ఘటనపై నిందితులను ఏఒక్కరినీ విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవడంలో రాజీపడబోమని తేల్చిచెప్పారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపైనా దృష్టిసారించండని హితవు పలికారు. ఒక దురదృష్టకర ఘటననే పదేపదే ప్రస్తావించడం తగదన్నారు. మరోవైపు ముజఫర్‌పూర్ ఘటనకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారనే కారణంతో ఆరుగురు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. -
‘ముజఫర్‌పూర్’ రేప్‌లు సిగ్గుచేటు
న్యూఢిల్లీ: బిహార్‌లోని ముజఫర్‌పూర్ వసతి గృహంలో బాలికలపై అత్యాచారాలు సిగ్గుచేటని విపక్షాలు ఖండించాయి. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద శనివారం ఆర్జేడీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పలు పార్టీల ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి, సీపీఐ నాయకుడు డి.రాజా, లోక్తాంత్రిక్ జనతాదళ్ నాయకుడు శరద్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. బిహార్‌లో అధికార జేడీయూ–బీజేపీ కూటమిపై విమర్శలు గుప్పించారు. ముజఫర్‌పూర్ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత బాలికలకు అండగా ఉంటామని రాహుల్ అన్నారు. ప్రస్తుతం దేశమంతా ఒకవైపు, ఆర్ఎస్సెస్–బీజేపీ భావజాలం ఒకవైపు ఉన్నాయన్నారు. గత నాలుగేళ్లుగా జరుగుతున్న పరిణామాలను దేశం ఇష్టపడటం లేదని, ప్రజలు తలచుకుంటే ఎవరూ వారి ముందు నిలవలేరని అన్నారు. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను లక్ష్యంగా చేసుకున్న తేజస్వి యాదవ్ మాట్లాడుతూ..రేప్ ఘటనలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇలాంటి హేయమైన నేరాల్లో దోషులకు కఠిన శిక్ష విధించడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేయాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అరాచకం రాజ్యమేలుతోందని ఏచూరి మండిపడ్డారు. ‘భేటీ బచావో’ నినాదం ‘సేవ్ భేటీ ఫ్రమ్ బీజేపీ’గా మారిందన్నారు. బాలికలకు బదులుగా బీజేపీ గోవులను కాపాడుతోందని శరద్ యాదవ్ ధ్వజమెత్తారు. -
‘ఓకేసారి 40 నిర్భయ ఘటనలు’
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌లోని ముజఫర్‌పూర్ ఘటనకు నిరసనగా ఆర్జేడీ నేత, ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఈ ధర్నాలో వివిధ పార్టీలకు చెందిన జాతీయ నాయకుల హాజరై సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీపీఐ నేత డీ. రాజా, శరద్‌యాదవ్, మిసా భారతీ, సీపీఐ జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి హజరైయ్యారు. ముజఫర్‌పూర్‌లోని ఓ బాలికల వసతి గృహంలో అధికారులు 40 మంది బాలికలపై అత్యాచారం జరిపిన ఘటన సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. వసతి గృహం నిర్వహకుడు, ఘటనలో ప్రధాన నిందితుడైన బ్రిజేష్ కుమార్‌కు మరణశిక్ష విధించాలని తేజస్వీ డిమాండ్ చేశారు. నితీష్ కుమార్‌కు బ్రిజేష్ అత్యంత సన్నిహితుడని, ప్రభుత్వం అతన్ని కాపాడుతోందని తేజస్వీ ఆరోపించారు. బిహార్‌లో 40 నిర్భయ ఘటనలు చోటుచేసుకున్నాయని, ఈ ఘటన మొత్తం ప్రభుత్వాన్ని కదిలిస్తుందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఘటనపై విచారణ జరిపి నిందితులందరికి మూడు నెలల్లో ఉరిశిక్ష విధించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఈ ఘటనతో నితీష్ కుమార్‌పై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు తీవ్రంగా విమర్శలు చేస్తొన్న విషయం తెలిసిందే. -
ముజఫర్‌పూర్ వసతి గృహంలో దారుణ ఘటన
-
షెల్టర్ షేమ్‌పై స్పందించిన నితీష్ కుమార్
సాక్షి, పట్నా : ముజఫర్‌పూర్ షెల్టర్ హోంలో మైనర్ బాలికలపై లైంగిక దాడి దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన క్రమంలో ఈ దారుణ ఘటనపై బిహార్ సీఎం నితీష్ కుమార్ ఎట్టకేలకు స్పందించారు. ఈ ఘటనపై ప్రభుత్వం సిగ్గుపడుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని నితీష్ వ్యాఖ్యానించారు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నామని, పట్నా హైకోర్టు విచారణను పర్యవేక్షించాలని తాను కోరుకుంటున్నానన్నారు. ముజఫర్‌పూర్ ఘటనపై సుప్రీం కోర్టు బిహార్ ప్రభుత్వానికి నోటీసులు పంపడం, ఈ ఉదంతంపై పార్లమెంట్, బిహార్ అసెంబ్లీల్లో తీవ్ర దుమారం రేగిన క్రమంలో నితీష్ ఈ దారుణ ఘటనపై నోరుమెదపడం గమనార్హం. ముజఫర్‌పూర్‌లోని బాలికల వసతి గృహంలో మైనర్ బాలికలపై నిర్వాహకులు, అధికారులు లైంగిక దాడులు జరిపారని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ చేపట్టిన సామాజిక ఆడిట్లో వెలుగుచూసిన విషయం తెలిసిందే. వసతి గృహంలోని 34 మంది మైనర్ బాలికల్లో 29 మందిపై లైంగిక వేధింపులు జరిగాయని వైద్య నివేదికలు స్పష్టం చేశాయి. ఆరోపణల నేపథ్యంలో బాలికల వసతి గృహాన్ని బిహార్ ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. కాగా షెల్టర్ హోం నిర్వాహకుడు బ్రజేష్ ఠాకూర్ సహా పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఆ అకృత్యాలపై బిహార్‌కు సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌లోని ముజఫర్‌పూర్ బాలికల వసతి గృహంలో మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల ఘటనపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ ఉదంతానికి సంబంధించి బిహార్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్ధానం గురువారం నోటీసులు జారీ చేసింది. మరోవైపు షెల్టర్ హోంలో బాలికలపై అకృత్యాలకు నిరసనగా గురువారం రాష్ట్ర బంద్‌కు లెఫ్ట్ పార్టీలు పిలుపు ఇచ్చాయి. బంద్‌కు ఆర్జేడీ, కాంగ్రెస్ మద్దతు తెలిపాయి. చిన్నారులపై లైంగిక దాడి ఘటనకు బాధ్యత వహిస్తూ బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ముజఫర్‌పూర్‌కు చెందిన ఎన్జీవో సేవా సంకల్ప్ ఇవాం వికాస్ సమితి నిర్వహిస్తున్న వసతి గృహంలో మైనర్ బాలికలపై నిర్వాహకులు, అధికారులు జరిపిన లైంగిక దాడుల ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సంస్థ చేపట్టిన సామాజిక ఆడిట్లో ఈ దారుణం వెలుగుచూసింది. -
బాలికలపై అకృత్యాలు.. బిహార్ బంద్
పట్నా : బిహార్‌లోని ముజఫర్‌పూర్ బాలికల వసతి గృహంలో మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల కేసుకు నిరసనగా గురువారం రాష్ట్ర బంద్‌కు లెఫ్ట్ పార్టీలు పిలుపు ఇచ్చాయి. బంద్‌కు ఆర్జేడీ, కాంగ్రెస్ మద్దతు తెలిపాయి. చిన్నారులపై లైంగిక దాడి ఘటనకు బాధ్యత వహిస్తూ బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ముజఫర్‌పూర్‌కు చెందిన ఎన్జీవో సేవా సంకల్ప్ ఇవాం వికాస్ సమితి నిర్వహిస్తున్న వసతి గృహంలో మైనర్ బాలికలపై నిర్వాహకులు, అధికారులు జరిపిన లైంగిక దాడుల ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సంస్థ చేపట్టిన సామాజిక ఆడిట్లో ఈ దారుణం వెలుగుచూసింది. చిన్నారులకు మత్తుమందు ఇచ్చి వారిపై లైంగిక దాడులకు పాల్పడటం, వారిని తీవ్రంగా హింసించడం వంటి చర్యలతో షెల్టర్ హోంను బిహార్ ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో ఉంచింది. కాగా బిహార్ బంద్‌కు మద్దతు ఇస్తున్నామని, హేయమైన ఈ ఘటనపై సీఎం నితీష్ కుమార్ బాధ్యత వహించాలని కాంగ్రెస్ ప్రతినిధి శక్తిసింహ్ గోహిల్ ట్వీట్ చేశారు. నితీష్ ప్రభుత్వ ఊతంతో చిన్నారి బాలికలపై జరిగిన సామూహిక లైంగిక దాడి అత్యంత హేయమని ఆర్జేడీ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ అన్నారు. -
పసిమొగ్గలపై పైశాచికం
న్యూఢిల్లీ: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ అనాథ శరణాలయంలో 34 మంది మైనర్ బాలికలపై నిర్వాహకులు లైంగికదాడికి పాల్పడిన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ సైన్సెస్(టిస్) చేపట్టిన సోషల్ ఆడిట్‌తో ఈ దారుణం బయటపడింది. ముజఫర్‌పూర్‌కు చెందిన బ్రజేష్ ఠాకూర్‌కు చెందిన సంకల్ప్ ఏవం సమితి అనే ఎన్జీవోకు 2013, అక్టోబర్ 21న ఈ అనాధాశ్రమ నిర్వహణకు సాంఘిక సంక్షేమ శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో నవంబర్ 1న ఇది పనిచేయడం ప్రారంభించింది. గతేడాది బిహార్ అంతటా ఉన్న 115 ప్రభుత్వ అనాధాశ్రమాల(షెల్టర్ హోమ్స్) స్థితిగతులపై టిస్ తనిఖీలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన నివేదికను 2018, ఏప్రిల్‌లో ప్రభుత్వానికి సమర్పించింది. నివేదికలో బ్రజేష్ ఠాకూర్ బాలికలపై లైంగికదాడికి పాల్పడినట్లు తేలడంతో సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ దివేశ్ కుమార్ అతడిపై మే 31న ముజఫర్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన సమయంలో ఈ ఆశ్రమంలో 44 మంది బాలికలు ఉన్నారు. రహస్య మెట్ల దారులు.. అబార్షన్ గది పోలీసులు అనాధాశ్రమంలో తనిఖీలు చేపట్టడంతో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆశ్రమం నుంచి నిర్వాహకుడు బ్రజేష్ ఇంటికి నేరుగా మూడు మెట్ల మార్గాలు ఉండటాన్ని పోలీసులు కనుగొన్నారు. బాలికలపై అత్యాచారానికి పాల్పడేందుకు వచ్చే దుండగులు ఎవ్వరికీ కన్పించకుండా రహస్యంగా వచ్చేందుకు ఈ ఏర్పాటు చేసుంటారని అనుమానిస్తున్నారు. అలాగే ఇక్కడి బేస్మెంట్లో మత్తుమందుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుండుగులు గర్భం దాల్చిన నలుగురు బాలికలకు ఇక్కడే అబార్షన్ చేశారని పోలీస్ ఉన్నతాధాకారి ఒకరు తెలిపారు. వణికిస్తున్న బాధితుల వాంగ్మూలాలు మైనర్ బాలికలు కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. బ్రజేష్, అతని స్నేహితులు భోజనంలో మత్తుమందు కలిపి ఇచ్చి తమపై లైంగికదాడికి పాల్పడేవారని ఓ బాలిక(10) తెలిపింది. ఎదురు తిరిగిన అమ్మాయిల్ని తీవ్రంగా కొట్టి, అన్నం పెట్టకుండా, సిగరెట్లతో కాల్చేవారంది. ప్రతీరోజు తమపై ఈ దారుణం కొనసాగేదని, ఇది తట్టుకోలేని మరో బాలిక గాజు ముక్కతో మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిం దని పేర్కొంది. తమను రోజూ నగ్నంగా పడుకోమని ఒత్తిడి చేసేవారనీ, ఒప్పుకోకుంటే తీవ్రంగా కొట్టేవారని ముందు వాపోయింది. ఈ నీచుల దాడిలో ఓ అమ్మాయి చనిపోతే.. మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా రిక్షాలో తీసుకెళ్లి ఎక్కడో పడేసి వచ్చారని చెప్పింది. మరోవైపు 34 మంది బాలికలపై లైంగికదాడి జరిగిందని పరీక్షలు నిర్వహించిన పట్నా వైద్య కళాశాల డాక్టర్లు ధ్రువీకరించారు. -
బాలికలను మత్తులో ముంచి..
పట్నా : బిహార్‌లోని ముజ్‌ఫర్‌పూర్ జిల్లాలోని షెల్టర్ హోంలో మైనర్ బాలికలపై లైంగిక దాడుల ఆరోపణలకు సంబంధించి సీబీఐ ఆదివారం విచారణను చేపట్టింది. ముజ్ఫర్పూర్లోని బాలికా గృహంలో చిన్నారులపై మానసిక, శారీరక, లైంగిక వేధింపులపై వసతి గృహం అధికారులు, ఉద్యోగులపై సీబీఐ కేసు నమోదు చేసింది. సేవా సంకల్ప్ ఇవాం వికాస్ సమితి నిర్వహించే చిల్డ్రన్ హోం అధికారులు, సిబ్బంది మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయని సీబీఐ ప్రతినిధి వెల్లడించారు. ముంబయికి చెందిన ఓ సంస్థ షెల్టర్ హోంలో చేపట్టిన సోషల్ ఆడిట్ ఆధారంగా బిహార్ సాంఘిక సంక్షేమ శాఖ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది. షెల్టర్ హోంలో బాలికలు తమపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఫిర్యాదు చేయడంతో దీనిపై సిట్‌ను ఏర్పాటు చేసినట్టు ఆడిట్ నివేదిక స్పష్టం చేసింది. దీంతో బాలిక గృహంను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన అధికారులు అక్కడి బాలికలను పట్నా, మధుబని షెల్టర్ హోంకు తరలించారు. మత్తులో ముంచి.. షెల్టర్ హోంలో మైనర్ బాలికలపై అధికారులు, సిబ్బంది సాగించిన అకృత్యాలు వివరిస్తూ బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. తమకు మత్తు మందు ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడేవారని, ఓ బాలిక నిద్ర లేచి చూసే వరకూ వంటిపై దుస్తులు నేలపై పడిఉన్నాయని విలపించారు. కొందరు చిన్నారులు లైంగిక వేధింపులను తప్పించుకునేందుకు తమ కాళ్లు, చేతులపై బ్లేడ్లతో కోసుకున్నామని గుర్తుచేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి షెల్టర్ హోం సిబ్బంది, హోంను నిర్వహించే బ్రజేష్ ఠాకూర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
రాష్ట్రంలో రావణ, దుర్యోధన పాలన
పాట్నా : బిహార్‌లో రావణ-దుర్యోధన పాలన సాగుతోందని ఆర్జేడీ నేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. బిహార్‌లోని ముజాఫర్‌పూర్‌లోని బాలికల వసతి గృహంలో 34 మంది మైనర్ బాలికలపై అక్కడి సిబ్బంది అత్యాచారాలకు పాల్పడిన ఘటన ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నితీష్ ప్రభుత్వంపై తేజస్వీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని, రావణ-దుర్యోధనుడిలా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని శనివారం ట్వీట్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షిణించిపోయాయని, ఆడ పిల్లలు బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారని తేజస్వీ వ్యాఖ్యానించారు. బాలికల వసతి గృహంలో డ్రగ్స్, అబార్షన్ మందులు వంటివి ఉన్నాయిని, దీనికి కారణమైన బ్రిజేష్ కుమార్ అనే వ్యక్తిని ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు. ‘బీహార్‌లో రాక్షస పాలన సాగుతోంది.. సీతమ్మను రావణుడు అపహరించాడు.. దుర్యోధనుడు ద్రౌపది వస్త్రాపహరణం చేయించాడు.. బీహార్‌లోనూ రావణ-దుర్యోధన ద్వయం అక్కచెల్లలను, అమ్మలను బయటకు రావడానికి బయపడేలా చేస్తున్నారు. ఇంకా ఎంత మంది బాలికలు వీరి దాష్టికానికి బలికావాలి’ అని విమర్శించారు. ఈ అంశంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఘటనపై విచారణ జరిపించాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఘటనపై విచారణ చేపట్టాల్సిందిగా సీబీఐని ఆదేశిస్తూ..సీఎం నితీష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కొద్ది నెలల కిందట చేపట్టిన అధ్యయనంలో ఈ కీచకపర్వం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై బీహార్ అసెంబ్లీ అట్టుడికింది. దీనికి బాధ్యులైన 10 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. Several drugs & things related to abortion were being used at the shelter home. Still, the main suspect Brajesh Thakur is being protected by govt. When will he be arrested? Till when minor girls will be raped in the state?: Tejashwi Yadav, RJD, on Muzaffarpur shelter home case pic.twitter.com/YNWcJkjK4T — ANI (@ANI) July 28, 2018 -
ఆరేళ్ల చిన్నారిని ఢీ కొన్న కారు
-
సీసీటీవీలో రికార్డయిన షాకింగ్ వీడియో
ముజఫర్‌నగర్(ఉత్తరప్రదేశ్) : రోడ్డు దాటేటపుడు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి లేదా అనుకోకుండా చేసే చిన్న తప్పిదాలే భారీ ప్రమాదాలకు కారణమవుతాయి. ఆరేళ్లబాలిక మెయిన్ రోడ్డు క్రాస్ చేస్తుండగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముజఫర్ నగర్‌లోని ఓ మెయిన్ రోడ్డును క్రాస్ చేయాలనుకున్న బాలికను ప్రమాదవశాత్తూ కారు ఢీకొట్టింది. మెయిన్ రోడ్డు సగం క్రాస్ చేసిన బాలిక అనంతరం డివైడర్‌ను దాటి రోడ్డు అవతలి వైపు వెళ్లడానికి ప్రయత్నించగా, వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో బాలిక గాల్లో ఎగిరి దూరంలో పడిపోయింది. బాలికకు తీవ్రగాయాలవ్వడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈతతంగం అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. జూలై మూడున చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రమాదానికి కారణమైన కారును గుర్తించామని, డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
‘యాసిడ్ పోస్తా’
యువతిని లైంగికంగా వేధించిన యువకుడు.. ఆపై ఆమెపై బెదిరింపులకు దిగాడు. వివాహం చేసుకోకపోతే యాసిడ్ దాడికి పాల్పడతానని హెచ్చరించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, విషయం వెలుగులోకి వచ్చింది. లక్నో: ముజఫర్‌నగర్‌లోని బ్రహ్మపురికి చెందిన షకీర్ అలీ అనే యువకుడు స్థానికంగా ఉండే ఓ యువతిని లైంగికంగా వేధించాడు. ఈ వ్యవహారంపై యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు అయ్యింది. అయితే ఆ తర్వాత అదే యువకుడు ఆమెను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయసాగాడు. ఆమె అందుకు ఒప్పుకోకపోవటంతో.. శనివారం ఆమెను అటకాయించి యాసిడ్ దాడి చేస్తానంటూ బెదిరించాడు. సదరు యువతి ఈ విషయం తండ్రికి చెప్పటంతో.. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పరారీలో ఉన్న షకీర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇదిలా ఉంటే గతనెలలో ఇదే ప్రాంతంలో ఓ వ్యక్తి.. వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడి ఆపై యాసిడ్ దాడితో ఆమె ప్రాణాలను బలి తీసుకున్నాడు. -
ఈ అభ్యర్థి ఆస్తులు రూ.22,300 కోట్లు!
ఇస్లామాబాద్: త్వరలో జరగనున్న పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో కళ్లు చెదిరే ఆస్తులున్న అభ్యర్థి బరిలోకి దిగాడు. నామినేషన్ వేసిన సందర్భంగా ఎన్నికల కమిషన్‌కు అతడు తెలిపిన తన ఆస్తుల విలువ రూ. 223 బిలియన్లు (రూ. 22,300 కోట్లు). కాగా ఈ ఎన్నికల్లో అతడు స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేయడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. ముజఫర్గడ్ జిల్లాలోని ఎన్ఏ-182, పీపీ-270 నియోజక వర్గాల నుంచి మహ్మద్ హుస్సేన్ షేక్ పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేసిన సందర్భంగా ఎన్నికల అఫిడవిట్ తన ఆస్తుల విలువ దాదాపు 22,300 కోట్ల రూపాయలుగా ఆయన ప్రకటించారు. ఇందులో 40శాతం మేరకు భూమి విలువ(స్థిరాస్తి)గా చూపించారు. మరోవిషయం ఏమిటంటే ముజఫర్‌గడ్‌లోని హుస్సేన్ భూముల వివాదం కేసు గత 88 ఏళ్లుగా సుప్రీం కోర్టులో కొనసాగుతోంది. ఇటీవల పాకిస్తాన్ సుప్రీంకోర్టు హుస్సేన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో ఆయన ఆస్తుల విలువ ఒక్కసారిగా రూ.22,300 కోట్లకు పెరిగింది. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో అత్యంత సంపన్న అభ్యర్థిగా హుస్సేన్ నిలిచారు. మాజీ విదేశాంగ మంత్రి హినా రబ్బానీ ఖర్, ఇతర నేతలు కూడా ఆ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. జులై 25న పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. -
పొమ్మన్నందుకు పోలీసును చావబాదారు..!!
ఉత్తరప్రదేశ్/ముజఫర్‌నగర్ : రాష్ట్రంలో అల్లరి మూకల ఆగడాలకు అడ్డూ, అదుపూ లేకుండా పోతోంది. పోలీసు ఔట్‌పోస్టు వద్ద మద్యం సేవిస్తున్న వారిని అడ్డుకున్నందుకు ఓ కానిస్టేబుల్‌పై మందుబాబులు దాడి చేశారు. దుడ్డు కర్రలతో ఆయన్ని చావ బాదారు. ఈ ఘటన ముజఫర్ నగర్ జిల్లాలోని ఉఖావలి గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ హరిరామ్ యాదవ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉఖావలి పోలీసు ఔట్‌పోస్టు వద్ద దీపక్ కుమార్ అనే కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఔట్‌పోస్టు సమీపంలో మద్యం సేవిస్తున్న కొందరిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని దీపక్ హెచ్చరించారు. మద్యం మత్తులో ఉన్న ఆ గుంపులోని వారంతా కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగారు. దీపక్ ఒంటరిగా ఉండడంతో అతనిపై దుడ్డు కర్రలతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో ప్రమేయమున్న 21 మందిపై కేసు నమోదు చేశామనీ యాదవ్ తెలిపారు. అనిల్‌కుమార్, మోనూ, ముఖేష్, మనోజ్‌కుమార్‌లను అనే నలుగురిని ఇప్పటికే అరెస్టు చేశామని, మిగతా వారి కోసం గాలింపు చేపట్టామని యాదవ్ పేర్కొన్నారు. -
ముజఫర్‌నగర్ కేసుల ఎత్తివేత?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో బీజేపీ నేతలపై ఉన్న కేసులు ఎత్తేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సిద్ధమయ్యారు. కేసుల ఎత్తివేతపై ముజఫర్‌నగర్ జిల్లా మెజిస్ట్రేట్‌తో పాటు ఎస్ఎస్పీ అభిప్రాయాలను కోరుతూ యూపీ ప్రభుత్వం ఈ నెల 5న లేఖ రాసినట్లు తెలిసింది. ముజఫర్‌నగర్ అల్లర్లలో 63 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అల్లర్లకు సంబంధించి ప్రస్తుత యూపీ మంత్రి సురేశ్ రాణా, మాజీ కేంద్ర మంత్రి సంజీవ్ బాల్యన్, ఎంపీ భరతేందు సింగ్, ఎమ్మెల్యే ఉమేశ్ మాలిక్, సాధ్వీ ప్రాచీలపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. -
ముజఫర్‌నగర్ అల్లర్ల కేసు ఎత్తివేత..!
లక్నో, ఉత్తరప్రదేశ్ : ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ముజఫర్‌నగర్ అల్లర్ల కేసును ఎత్తివేయనున్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు 2013లో జరిగిన అల్లర్లపై నమోదైన కేసును ఉపసంహరించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. కేసు స్టేటస్‌పై జిల్లా మేజిస్ట్రేట్‌ను ప్రభుత్వం ఈ మేరకు సమాచారం కోరినట్లు తెలిసింది. అంతేకాకుండా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేసును ఎత్తివేయాలని కోరుతూ ఓ లేఖను మేజిస్ట్రేట్‌కు రాసినట్లు ఓ జాతీయ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. కేవలం ముజఫర్‌నగర్ అల్లర్ల కేసుపై మాత్రమే కాకుండా.. బీజేపీ ఎమ్మెల్యే ఉమేశ్ మాలిక్‌పై ఉన్న మరో ఎనిమిది కేసులపై కూడా మేజిస్ట్రేట్ ఓపినయన్ను ప్రభుత్వం కోరిందని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే మాలిక్‌ను సంప్రదించగా ఆయనకు ఈ కేసుల ఎత్తివేత వ్యవహారంపై ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. తనతో పాటు బీజేపీ ఎంపీ భారతేంద్ర సింగ్, కేంద్ర మంత్రి సంజీవ్ బలియాన్, సాద్వీ ప్రచీలపై కూడా కేసులు ఉన్నాయని వెల్లడించారు. ఆగష్టు 31, 2013న మహాపంచాయత్ వద్ద ప్రచీ చేసిన ప్రసంగం తర్వాత ముజఫర్‌నగర్‌లో అల్లర్లు చెలరేగాయి. వీరితో పాటు బీజేపీ నాయకులు థానా భవన్, షామిలీ, సార్ధానా సంగీత్ సింగ్ సోమ్, ఉత్తరప్రదేశ్ మంత్రి సురేశ్ రానా తదితరులపై కూడా ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులు ఉన్నాయి. -
యూపీలో ‘భీమ్ ఆర్మీ’ సెగలు
ముజఫర్‌నగర్: మహారాష్ట్రలో భీమ్ ఆర్మీ కార్యకర్తలైన దళితులపై జరిగిన హింసాకాండకు నిరసనగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో దళితులు ఆందోళన నిర్వహించారు. కలెక్టరేట్ ముందు గురువారం సాయంత్రం బైఠాయించి మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దళిత నాయకుడు వైభవ్ బావ్రా నాయకత్వంలో భారీ సంఖ్యలో తరలివచ్చిన దళితులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. దళితులను రక్షించడంలో, వారిపై జరుగుతున్న హింసాకాండను నిరోధించడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, అందువల్ల అక్కడి ప్రభుత్వాన్ని తొలగించాలని రాష్ట్రపతిని ఆ వినతిపత్రంలో కోరారు. బ్రిటిషు ప్రభుత్వ సహకారంతో మహారాష్ట్రలోని పీష్వాలతో దళితులకు జరిగిన భీమా-కోరెగాన్ యుద్ధం ద్విశతాబ్ది ఉత్సవాలను ఈనెల 1న జరుపుకుంటున్న దళితులపై అగ్రవర్ణాలవారు దాడిచేసిన సంఘటన విదితమే. -
కూతురును ప్రేమించాడన్న కక్షతో..!
సాక్షి, ముజఫర్ నగర్ : ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్లో మరో దారుణం జరిగింది. ముజఫర్ నగర్ జిల్లాలోని భాపూరా గ్రామంలో నివాసముంటున్న 40 ఏళ్ల మహిళపై నలుగురు వ్యక్తుల సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మాజీ గ్రామ ప్రధాన్, అతని కుటుంబ సభ్యులు ప్రధాన నిందితులుగా ఉన్నారు. పోలీసులు ఇప్పటికే మాజీ గ్రామ ప్రధాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ అజయ్ పాల్ శర్మ చెబుతున్న వివరాలివి. అత్యాచార బాధితురాలి 24 ఏళ్ల కుమారుడు.. మాజీ గ్రామ ప్రధాన్ కుమార్తె (22)ను ప్రేమించాడు. ఇద్దరి మధ్య రెండేళ్లుగా ప్రేమ వ్యవహరం నడుస్తోంది. ఇదిలావున్న నేపథ్యంలో అమ్మాయికి కుటుంబ సభ్యులు పెళ్లి సంబందం కుదిర్చారు. ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని యువతి.. తన ప్రేమికుడితో కలిసి నవంబర్ 20 ఎటో వెళ్లిపోయింది. ఈ ఘటన జరిగినప్పటినుంచీ మాజీ గ్రామ ప్రధాన్ కుటుంబం.. యువకుడి కుటుంబంపై కక్ష పెంచుకుంది. మధ్యలో పలు సందర్భాల్లో యువకుడి కుటుంబంపై భౌతిక దాడులకు గ్రామ ప్రధాన్ కుటుంబం దిగింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 25న రాత్రి సమయంలో.. గ్రామ ప్రధాన్, అతని సోదరుడు, కుమారుడు, అల్లుడితో కలిసి యువకుడి కుటుంబంపై మరోసారి దాడికి దిగారు. ఈ సమయంలో ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామ్ ప్రధాన్, అతని కుటుంబ సభ్యులు యువకుడి తల్లిపై అత్యాచారానికి ఒడిగట్టారు. గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ శర్మ తెలిపారు. -
ఒక్కరోజు.. మూడు అత్యాచారాలు
సాక్షి, లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో మహిళలకు, బాలికలకు ఏ మాత్రం రక్షణ లేదని మరోసారి రుజువైంది. రాష్ట్రంలోని ముజఫరాబాద్, ప్రతాప్‌గఢ్, బండా జిల్లాల్లో మంగళవారం నాడు నలుగురు మైనర్ బాలికలపై గ్యాంగ్‌రేప్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రతాప్ గఢ్ జిల్లాలో కేవలం ఆరేళ్ల బాలికపై మృగాళ్లు అత్యంత కిరాతకంగా అత్యాచారం జరిపారు. తల్లిదండ్రులు పొలం పనులకు బయటకు వెళ్లిన సమయంలో.. ఇద్దరు మృగాళ్లు బాలికపై పడి.. నీచంగా అత్యాచారం జరిపారు. బండా జిల్లాలోని ఐదేళ్ల చిన్నారిపై మామ ఓం ప్రకాశ్ అత్యంత కౄరంగా అత్యాచారం జరిపాడు. నిందితుడిపై బాలిక తల్లిదండ్రులు కేసు పెట్టారు. ఇదిలా ఉండగా.. ఓం ప్రకాశ్.. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కేసును రిజిస్టర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ముజఫర్‌నగర్‌లోని నాగాల బుజరంగ్ గ్రామంలో.. 15 ఏళ్ల యువతిని తుపాకితో బెదిరించి ఇద్దరు యువకులు అత్యాచారం జరిపారు. పోమవారం నాడు ఇద్దరు యువకులు రహస్యంగా ఇంట్లోకి ప్రవేశించి ఎవరూ లేని సమయంలో.. యువతిని భయపెట్టి అత్యాచారం చేసినట్లు బాధితురాలి తండ్రి పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు యువకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ముజఫర్‌నగర్ అల్లర్ల కేసు : బీజేపీ నేతలకు వారెంట్లు
ముజఫర్‌నగర్ : ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ముజఫర్‌నగర్ అల్లర్ల కేసుల్లో అధికార బీజేపీకి చెందిన కీలక సభ్యులకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. వారిలో ఉత్తరప్రదేశ్ కేబినెట్లో మంత్రిగా కొనసాగుతోన్న సురేశ్ రాణా, కేంద్ర మాజీ మంత్రి సంజీవ్ బల్యాన్, ఎమ్మెల్యేలు సంగీత్ సోమ్, ఉమేశ్ మాలిక్ తదితరులున్నారు. 2013 ఆగస్టు-సెప్టెంబర్‌లో జరిగిన ముజఫర్‌నగర్ అల్లర్లలో అధికారిక లెక్కల ప్రకారం 60 మంది ప్రాణాలు కోల్పోగా, 40 వేల మంది నిరాశ్రయిలయ్యారు. రెచ్చగొట్టి.. ఉసిగొలిపారు : పైన పేర్కొన్న బీజేపీ నాయకులు.. ముజఫర్‌నగర్‌లో ఒక వర్గానికి చెందిన యువతను హింసకు పురిగొల్పేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, నిషేధాజ్ఞలు ఉల్లంఘించడమే కాక ప్రభుత్వ సిబ్బంది విధులకు ఆటంకం కల్పించారని అల్లర్లపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆరోపించింది. సిట్ వాదనతో ఏకీభవించిన మెజిస్ట్రేట్ మధు గుప్తా.. నిందితులు జనవరి 19న కోర్టుకు హాజరుకావాలని నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. ప్రజా ప్రతినిధులు కావడంతో : ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నాయకుల్లో అత్యధికులు ప్రస్తుతం చట్టసభ్యులుగా కొనసాగుతున్న దరిమిలా వారిని విచారించేందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసికావడంతో సీఎం యోగి అంగీకరించారు. ప్రభుత్వ అనుమతి లభించిన దరిమిలా సదరు నేతల విచారణ ప్రక్రియ ముమ్మరం కానుంది. నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ అయిన బీజేపీ ప్రముఖుల్లో కొందరు.. -
బ్యాన్ లేదన్న యూపీ సర్కార్.. చిత్ర విడుదలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్‌లో నిషేధం ఎదుర్కుంటున్న చిత్రం ‘ముజఫర్ నగర్’ విడుదలకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ చిత్రంపై ఎలాంటి నిషేధం లేదని.. చిత్రాన్ని ధైర్యంగా విడుదల చేసుకోవాలని నిర్మాతలకు సుప్రీంకోర్టు తెలిపింది. అవసరమైతే పోలీస్ బందోబస్తు కల్పించాలని యూపీ సర్కార్‌ను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ముజఫర్ నగర్ 2013 జరిగిన అల్లర్ల నేపథ్యంలో ముజఫర్ నగర్: ది బర్నింగ్ లవ్ చిత్రం తెరకెక్కింది. ఓ హిందూ కుర్రాడు.. ముస్లిం అమ్మాయిల మధ్య ప్రేమ కథ.. మతోన్మాదులకు వ్యతిరేకంగా యువకుడి పోరాటం తదితరాలతో దర్శకుడు దీనిని రూపొందించాడు. కొందరు ప్రేక్షకులకు ప్రివ్యూ ప్రదర్శించిన సెన్సార్ బోర్డు.. ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవటంతో యూ/ ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. నవంబర్ 17న చిత్రం దేశవ్యాప్తంగా విడుదల కాగా.. యూపీలోని ఆరు జిల్లాల్లో మాత్రం విడుదల కాకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో చిత్రంపై నిషేధం విధించినట్లు ప్రచారం జరిగింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మోర్నా ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ కన్విల్కర్, డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌పై విచారణ చేపట్టింది. అయితే తామేం నిషేధం విధించలేదని యూపీ ప్రభుత్వం స్పష్టం చేయగా.. ఎక్కడా లిఖిత పూర్వక ఆదేశాలు లేకపోవటంతో పిటిషనర్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. చిత్రాన్ని విడుదల చేసుకోవచ్చని నిర్మాతలకు చెబుతూ .. నిర్మాతలు కోరితే రక్షణ కల్పించాలని పోలీస్ శాఖను కోర్టు ఆదేశించింది. అయితే విడుదలలో జాప్యం కలగటంతో భారీ నష్టం వాటిల్లిందని.. కాబట్టి 50 లక్షల నష్టపరిహారం ఇప్పించాలని పిటిషనర్ కోరగా.. కోర్టు మాత్రం తిరస్కరించింది. -
సినిమా హాల్లో గ్యాంగ్‌రేప్
సాక్షి, లక్నో : మొబైల్ ఫోన్లో యువతితో స్నేహం.. అపై వంచన.. అదును చూసి ఆమెపై అకృత్యాలు సహజంగా మారాయి. సినిమా స్టోరీలను తలపించే ఇటువంటి ఘటన తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది. పదహారేళ్ల యువతితో ఇద్దరు వ్యక్తులు సెల్ఫోన్లో స్నేహం చేశారు. దాదాపు రెండు నెలల పాటు మొబైల్లో అందరూ కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపారు. స్నేహం పేరుతో మాట్లాడుకుంటూ.. అప్పుడప్పుడూ యువతిని దుండగులు కలిసేవారు. ఈ నేపథ్యంలో యువతితో మంగళవారం దుండగులు కలిశారు. మవానా పట్టణంలో షాపింగ్ తరువాత సినిమాకు వెళ్లాలని అందరూ నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టే సినిమాకు వెళ్లిన తరువాత.. ఎవరూలేని ప్రదేశంలో ముగ్గురు కూర్చుకున్నారు. సినిమా ప్రారంభమైన తరువాత.. ఇద్దరు యువకులు.. యువతిపై పాశవికంగా, రాక్షసంగా అత్యాచారం చేశారు. యువతి అరవకుండా నోట్లో గుడ్డలు పెట్టి.. చేతులు కట్టేసి మరీ రాక్షసంగా అత్యాచారం జరిపారు. అత్యాచారం చేసిన తరువాత యువతిని ముజఫర్‌నగర్ ప్రాంతంలో వదిలిపెట్టారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్ట చేశారు. అలాగే యువకులు ఉయోగించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
యువతిపై దారుణం
సాక్షి, ముజఫర్ నగర్ : ఉత్తర్ ప్రదేశ్‌లో మహిళలపై అరాచాకాలకు, అకృత్యాలకు అంతేలేకుండా పోయింది. ఒక మహిళపై కుటుంబ సభ్యులే నెలల తరబడి అత్యాచారం చేసిన హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కన్నతండ్రి, సోదరుడు, ఇద్దరు చిన్నాన్న వరసయ్యే వ్యక్తులు మూడు నెలల పాటు యువతి నీచంగా అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటన ముజఫర్‌నగర్‌లోని ధనేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధిత యువతి తండ్రి, సోదరుడు, ఇద్దరు చిన్నాన్నలు మూడు నెలలుగా అత్యాచారం చేశారని ధనేవాడ పోలీస్ అధికారి కుష్పాల్ సింగ్ తెలిపారు. కుటుంబ సభ్యులే అత్యంత రాక్షసకంగా, పాశవికంగా యువతి అత్యాచారం చేస్తున్న సందర్భంలో.. ఆమె ప్రేమించిన వ్యక్తి కాపాడారని ఆయన తెలిపారు. ప్రియుడి సహకారంతొనే ఇంటి నుంచి యువతి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. బాధితురాలి ఫిర్యాదుపై విచారణ జరిపామని..అందులో ఈ దారుణం గురించిన వివరాలు బమటకు వచ్చాని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ కేసును అలహాబాద్ హైకోర్టు విచారణ చేస్తోందని చెప్పారు. తండ్రి, సోదరుడు, చిన్నాన్నలను ఇప్సటికే కస్టడీలోకి తీసుకున్నట్లు కుష్పాల్ సింగ్ తెలిపారు. -
ఉగ్రవాదులున్నారు.. అందుకే..!
ముజఫర్‌నగర్ : బంగ్లాదేశ్, పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకాలాపాలు నిర్వహించే వారికి భారత పాస్‌పోర్టులు ఉన్నట్లు అనుమానాలు రావడంతో.. పాస్‌పోర్టులు పరిశీలనకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా దియోబంద్, ముజఫర్‌నగర్, సహరన్పూర్ జిల్లాల్లోని వేల పాస్‌పోర్టులను ధృవీకరణ చేయాల్సిందిగా ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. బంగ్లాదేశ్ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఇద్దరివద్ద భారత పాస్‌పోర్టులు.. దియోబంద్ అడ్రస్‌తో లభించడంతో.. ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు కేంద్రంగా పనిచేసే ఉగ్రవాదులు.. పదుల సంఖ్యలో దియోబంద్‌లో దాక్కున్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దియోబంద్లోనే.. ప్రముఖ ముస్లిం మత సంస్థ దారుల్ ఉలూమ్ దియోబంద్ ఉండడం గమనార్హం. బంగ్లాదేశీ అనుమానాస్పద ఉగ్రవాదులు అరెస్టయిన నేపథ్యంలో.. అక్రమంగా దియోబంద్‌లో నివసిస్తున్న బంగ్లా జాతీయులపై తక్షణం చర్యలు తీసుకోవాలని యూపీ సర్కార్ జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక బంగ్లాజాతీయులకు తప్పుడు ధృవీకరణ పత్రాలు జారీ చేసిన అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ అనేది.. దియోబంద్ లేదా మరో వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్న అంశం కాదని షమారాన్పూర్ డీఐజీ ఎమ్మాన్యువల్ తెలిపారు. పాస్‌పోర్టులు ఉన్నవారంతా.. దియోబంద్, ముజఫర్‌నగర్, సహారాన్పూర్లలో తప్పకుండా వెరిఫికేషన్ చేయించుకోవాలని స్పష్టం చేశారు. ముజఫర్‌నగర్, సహారాన్పూర్, దియోబంద్ జిల్లాల్లో ఉగ్రవాదులు ఉన్నట్లు స్పష్టమైన సమాచారం ఉండడంతోనే విచారణ చేస్తున్నామని ఆయన చెప్పారు. గతంలోనూ సహారాన్పూర్ ప్రాంతంలో అనుమానాస్పద కదలికలతో ఉన్నవ్యక్తులను గుర్తించినట్లు ఆయన చెప్పారు. అరెస్టయిన బంగ్లాదేశీ ఉగ్రవాదుల వద్దనున్న భారతీయ పాస్‌పోర్టులను చూపించారు. ఇదిలా ఉండగా 20 మంది బంగ్లాదేశ్ జాతీయులు పశ్చిమ యూపీలో అదృశ్యమైన విషయంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. -
యూపీలో ఆగని పరంపర?
-
యూపీలో ఆగని నేరాలు
ముజఫర్‌నగర్/భాగపట్: ఉత్తర్‌ప్రదేశ్‌లో మహిళల మీద లైంగిక దాడులు కొనసాగుతున్నాయి. అత్యాచార అవమానాన్ని తట్టుకోలేని యువతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరోచోట.. ఒంటరిగా మహిళ కనిపిస్తే మృగాళ్లు దాడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని భాగపట్‌లోని 15 ఏళ్ల యువతి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. ఈ యువతిపై నాలుగు నెలల కిందట ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. వారిమీద పోలీస్ కేసు పెట్టగా.. నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన నిందితులు సోను, మను, రోహిత్, సాగర్, పప్పులు తరువాత తప్పించుకుని పారిపోయారు. అప్పటి నుంచి కేస్‌ను వెనక్కి తీసుకోవాలని బాధితురాలిపే ఒత్తిడి తీసుకురావడం మొదలు పెట్టారు. కేసు ఉపసంహరించుకోకపోతే మళ్లీ అత్యాచారం చేస్తామని బెదిరించారు. దీంతో అవమాన భారంతో ఈ యువతి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. ఇక, ముజఫర్‌నగర్‌కు సమీపంలోని పచేంద అనే గ్రామంలో నివసించే ఒక దళిత బాలికపై జాట్ తెగకు చెందిన నలుగురు యువకులు ఆదివారం ఉదయం లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం గ్రామంలోని దళిత మైనర్ బాలిక ఆదివారం ఉదయం ఇంటికి వస్తోంది. అదే సమయంలో అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఆమెపట్ల తొలుత అసభ్యంగా మాట్లాడి అనంతరం లైంగిక దాడికి పాల్పడ్డారు. దళిత యువతిపై లైంగిక దాడి జరగడంతో గ్రామంలో దళితులు, జాట్ల ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
నా బిడ్డకు గన్ పెట్టి నన్ను రేప్ చేశారు..
సాక్షి, ముజఫర్‌నగర్ : మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల జాబితాలో మరొకటి చేరింది. ఉత్తర ప్రదేశ్‌లో ఓ మహిళను కొందరు వ్యక్తులు లాక్కెళ్లి మరీ సామూహిక అత్యాచారం చేశారు. ఆమె భర్త, బిడ్డల ముందే దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ముజఫర్‌నగర్‌లో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. 25 ఏళ్ల మహిళ, తన భర్త, మూడు నెలల బిడ్డతో కలిసి మోటర్ బైక్‌పై వెళ్తున్నారు. ఇంతలో నలుగురు దుండగులు వారిపై దాడి చేశారు. మహిళను సమీపంలోని చెరకు తోటల్లోకి లాక్కెళ్లారు. అక్కడ ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ‘నా బిడ్డకు తుపాకీ గురి పెట్టి చంపుతామని బెదిరించి వాళ్లు నాపై దారుణానికి పాల్పడ్డారు’ అని బాధిత మహిళ మీడియాకు తెలిపారు. తన భర్తను కట్టేసి దుండగులు చితకబాదరని.. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారని ఆమె చెప్పారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ముజఫర్‌నగర్ ఎస్పీ అజయ్ సహదేవ్ బాధిత మహిళను వైద్య పరీక్షల కోసం పంపినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు అజయ్ చెప్పారు. జైపూర్ : రాజస్థాన్ లో మరో దారుణం చోటు చేసుకుంది. సికర్ ప్రాంతంలో ఓ కాలేజీ విద్యార్థినిపై వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె చేత మద్యం తాగించి మరీ రేప్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తెలిపారు. -
మోదీజీ అతడ్ని కఠినంగా శిక్షించండి!
న్యాయం చేయాలంటూ ప్రధానికి విద్యార్థిని లేఖ సాక్షి, లక్నో : బీజేపీ పాలితరాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లోనూ మహిళలపై అరాచకాలు తగ్గడం లేదు. రోజు ఏదో ఓ మూల బాలికలు, మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఓ కాలేజీ విద్యార్థిని తన ఆవేదను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారు. తనను రక్షించాలని కోరుతూ ప్రధానికి ఓ యువతి మోదీకి లేఖ రాశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. ముజఫర్ నగర్‌కు చెందిన ఓ కాలేజీ విద్యార్థినిని గత ఏడాది కాలం నుంచి ఓ ఆకతాయి వేధింపులకు గురిచేస్తున్నాడు. ఎన్నోసార్లు చెప్పి చూసినా యువకుడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో బాధితురాలు ఆందోళన చెందుతున్నారు. తనకు న్యాయం చేయాలని, తనను వేధిస్తోన్న యువకుడిని కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేస్తూ మోదీకి బాధిత విద్యార్థిని ఓ లేఖ రాశారు. ఏడాది నుంచి తనవెంట పడి ఓ యువకుడు వేధిస్తున్నాడని, ఇంటి నుంచి బయటకు రావాలంటే భయమేస్తుందని లేఖలో ఆమె పేర్కొన్నారు. ఎలాగైనా తనను వేధిస్తున్న యువకుడిపై కఠిన చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు. ఈ లేఖపై యూపీ అధికారులు స్పందించాల్సి ఉంది. -
అత్యాచారం.. మత మార్పిడికి వేధింపులు
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో మరో దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గత 10 రోజులుగా 16 ఏళ్ల యువతిపై నలుగురు దుండగులు అత్యాచారం చేయడంతో పాటు.. మతం మార్చుకొమ్మని వేధించిన ఘటన తాజాగా బయటకు వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ముజఫర్ నగర్ జిల్లా భోపా సర్కిల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ రిజ్వాన్ మాట్లాడుతూ.. 16 ఏళ్ల అమ్మాయి తనపై అక్రమ్, అస్లామ్, ఆయూబ్, సలీమ్ అనే నలుగురు కుర్రాళ్లు గ్యాంగ్ రేప్ చేశారని ఫిర్యాదు చేసిందన్నారు. అత్యాచారంతో పాటు బలవంతంగా మాంసం తినమని ఒత్తిడి చేయడంతో పాటే మతం మార్చుకొమ్మని హింసలు పెట్టినట్టు ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. బాధిత యువతి ముజఫర్ నగర్‌కు దగ్గరలోని కుక్రా గ్రామంలో దగ్గరి బంధువులతో కలిసి జీవస్తోంది. ఆమె ఈ నెల 6 ముజఫర్ నగర్ నుంచి ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్‌లో ఉండగా.. దుండగులు లిఫ్ట్ ఇస్తామని చెప్పారు. ముక్కుమొహం తెలియని వాళ్ల వాహనం ఎక్కని కరాఖండీగా చెప్పడంతో నలుగురు బలవంతంగా బాలికను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. వరుసగా 10 రోజులపాటు బాధితురాలిని నిర్భంధించి.. అత్యాచారం చేయడంతో పాటు అమానవీయంగా ప్రవర్తించారని సీఐ పేర్కొన్నారు. నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు, పోస్కో(ప్రొటక్షన్ ఆఫ్ చిల్ట్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్) చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు సీఐ మహమ్మద్ రిజ్వాన్ చెప్పారు. -
ఘోర రైలు ప్రమాదం : 23 మంది మృతి
-
పట్టాలు తప్పిన ఉత్కళ్
- యూపీలో ఘోర రైలు ప్రమాదం - 23 మంది మృతి.. 60 మందికి పైగా గాయాలు ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లో శనివారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. ముజఫర్‌నగర్ జిల్లా ఖతౌలి వద్ద పూరీ–హరిద్వార్ ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 23 మంది మృతిచెందగా.. 60 మందికి పైగా గాయపడ్డారు. రైల్లోని 14 బోగీలు పట్టాలు తప్పడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ఉత్తరప్రదేశ్ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఏటీఎస్ బలగాలు, వైద్య బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. భారీ క్రేన్లు, గ్యాస్ కట్టర్లతో బోగీల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. ప్రమాదతీవ్రతతో ఒక బోగీ ట్రాక్ పక్కనున్న ఇంట్లోకి దూసుకుపోగా.. రెండు బోగీలు ఒకదానిపైకి మరకొటి ఎక్కాయి. సహాయక చర్యల్లో స్థానికులు కూడా బలగాలకు సాయం చేస్తున్నారు. ఘటనాస్థలంలో పరిస్థితి భీతావహంగా మారింది. అంబులెన్సుల ద్వారా బాధితులను సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. శనివారం సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు మీరట్ జోన్ రైల్వే మెడికల్ అధికారి పీఎస్ మిశ్రా స్పష్టం చేశారు. ఎస్1 నుంచి ఎస్ 10 వరకు స్లీపర్ కోచ్‌లు, థర్ట్ ఏసీ బీ1, సెకండ్ ఏసీ ఏ1, ప్యాంట్రీ బోగీలు పట్టాలు తప్పాయన్నారు. ప్రమాదానికి కారణమేంటి? దుర్ఘటన విషయం తెలియగానే మొదట దీన్ని ఉగ్రవాద ఘటనగానే రైల్వే శాఖ, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం భావించాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, వైద్య బృందాలతోపాటుగా ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్)ను కూడా యూపీ సర్కారు రంగంలోకి దించింది. అయితే.. దుర్ఘటన జరిగిన ప్రాంతం నుంచి సేకరించిన ఆధారాలతో.. మానవ తప్పిదమే ఈ ఘటనకు కారణమని యూపీ సర్కారు స్పష్టం చేసింది. ఏటీఎస్ కూడా దీన్ని ధ్రువీకరించింది. మీరట్–సహరాన్పూర్ డివిజన్లో పలుచోట్ల రైల్వే ట్రాక్‌కు మరమ్మతులు చేపడుతున్నారు. ఈ విషయంపై ఆ మార్గంలో ప్రయాణించే రైలు డ్రైవర్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా రైలు వేగాన్ని డ్రైవర్ నియంత్రణలో ఉంచుకుంటారు. అయితే రిపేర్లు జరుగుతున్న విషయాన్ని డ్రైవర్‌కు సూచించకపోవటం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నార్తర్న్ రైల్వేలో చాలా రద్దీగా ఉండే ఈ లైన్ ద్వారా వెళ్లే రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు ముజఫర్‌నగర్ అధికారులు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేశారు. 0131–2436918, 0131–2436103, 0131–2436564 నంబర్ల ద్వారా వివరాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రధాని, యూపీ సీఎం దిగ్భ్రాంతి ఈ ఘటనపై ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన బాధాకరమన్న మోదీ.. బాధితులను ఆదుకునేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ, యూపీ ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. ‘ముజఫర్‌నగర్ వద్ద రైలు పట్టాలు తప్పిన దుర్ఘటన బాధాకరం. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని మోదీ ట్వీటర్ ద్వారా విచారం వ్యక్తం చేశారు. రైలు ప్రమాద ఘటన తమను కలచివేసిందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ఘటనపై రైల్వే మంత్రి సురేశ్ ప్రభు విచారణకు ఆదేశించారు. తనే స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ దుర్ఘటన కారకులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సహాయకచర్యలను వేగవంతం చేసేందుకు యూపీ సర్కారుతో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.3.5లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50వేలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25వేల పరిహారం ఇవ్వనున్నట్లు సురేశ్ ప్రభు వెల్లడించారు. యూపీ సీఎం యోగి కూడా మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా, ఇద్దరు యూపీ మంత్రులు ఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రైల్వే బోర్డు చైర్మన్, ట్రాఫిక్ బోర్డు సభ్యులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. చీకటి కారణంగా సహాయకచర్యలకు ఆటంకం కలగకుండా.. విద్యుత్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఒడిశా బాధితులకు రూ.5లక్షలు ప్రమాద ఘటనపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఒడిశా ప్రయాణికుల కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50వేలు పరిహారంగా ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. సహాయక చర్యలను పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని పట్నాయక్ ఆదేశించారు. కాగా, ప్రమాదానికి గురైన 14 బోగీల్లో కలిపి 80 మంది స్లీపర్ క్లాసులో, ఆరుగురు ఏసీ కోచ్‌లో పూరీలో ఎక్కినట్లు అధికారులు తెలిపారు. బాధితుల వివరాల కోసం ఈస్ట్ కోస్ట్ రైల్వే 1072 టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించింది. పట్టాలెక్కని కకోద్కర్ సిఫార్సులు ముజఫర్‌నగర్ దుర్ఘటన భారత రైల్వే భద్రతలోని డొల్లతనాన్ని మరోసారి స్పష్టం చేసింది. రైల్వే భద్రతా అంశాలను అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేయాలని కోరుతూ 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అనిల్ కకోద్కర్ అధ్యక్షతన ఓ కమిటీని నియమించింది. ఐదేళ్లు గడిచినా కమిటీ చేసిన సూచనల్లో చాలా మటుకు ఇంకా అమలుకు నోచుకోలేదు. అందులో... ఐదేళ్ల కాలానికి ప్రయాణికుల భద్రత కోసం లక్ష కోట్లు వెచ్చించడంతో పాటు, రైల్వే భద్రతా ప్రాధికార సంస్థ ఏర్పాటు లాంటివి ఉన్నాయి. రైల్వే బోర్డుపై పని ఒత్తిడి పెరిగినా, భద్రతా ప్రాధికార సంస్థపై ఎలాంటి పురోగతి జరగలేదు. కమిటీ చేసిన మరికొన్ని సిఫార్సులు ► రైల్వే కార్యకలాపాల పర్యవేక్షణకు సంస్థ ఏర్పాటు ► ఐదేళ్లలో అన్ని లెవల్ క్రాసింగ్‌ల ఎత్తివేత ► లెవల్ క్రాసింగ్లను తొలగించడానికి అయ్యే ఖర్చు రూ.50 వేల కోట్లు. నిర్వహణ ఖర్చు తగ్గించుకోవడం ద్వారా ఈ మొత్తాన్ని 8 ఏళ్లలో తిరిగి రాబట్టుకోవచ్చు. ► అన్ని బ్రిడ్జిల వద్ద నీటి మట్టాలు, నీటి ప్రవాహ వేగాలను తరచూ పర్యవేక్షించాలి. ► రైలు లోకోపైలట్‌కు సూచించేలా ప్రమాదకరంగా ఉన్న బ్రిడ్జిల వద్ద నీటి మట్టాలను కొలిచే పరికరాలు, టర్బైన్ ఫ్లో మీటర్లను బిగించాలి. ► రూ. 20 వేల కోట్ల వ్యయంతో యూరప్ దేశాల మాదిరిగా అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలి. భారీ రైలు ప్రమాదాలు ► డిసెంబర్ 28, 2016: యూపీలోని కాన్పూర్ దేహత్ జిల్లాలో షెల్దా–అజ్మీర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 62 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ► నవంబర్ 20, 2016: యూపీలోని ఫతేపూర్ సమీపంలో కల్కా మెయిల్‌కు చెందిన 15 బోగీలు పట్టాలు తప్పడంతో దాదాపు 70 మంది మరణించగా.. వందల మంది గాయపడ్డారు. ► మే 28, 2010: పశ్చిమబెంగాల్లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో మావోయిస్టులు పట్టాలు తొలగించడంతో జ్ఞానేశ్వర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి 148 మంది మృతిచెందారు. ► సెప్టెంబర్ 9, 2002: హౌరా–ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ బిహార్ రాష్ట్రం ఔరంగాబాద్ జిల్లాలోని దవే నదిలో పడడంతో 100 మంది మరణించగా.. 150 మంది గాయపడ్డారు. ► ఆగస్టు 2, 1999: 2,500 మందితో వెళ్తున్న రెండు రైళ్లు అస్సాంలోని గైసల్ సమీపంలో ఢీకొనడంతో 290 మంది మరణించారు. ► నవంబర్ 26, 1998: పంజాబ్‌లోని ఖాన్నా సమీపంలో పట్టాలు తప్పిన ఫ్రాంటియర్ మెయిల్‌ను జమ్ముతావి–షెల్దా ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో 212 మంది ప్రాణాలు కోల్పోయారు. ► సెప్టెంబర్ 14, 1997: అహ్మదాబాద్–హౌరా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 5 బోగీలు మధ్యప్రదేశ్ రాష్ట్రం బిలాస్పూర్ జిల్లాలోని నదిలో పడడంతో 81 మంది దుర్మరణం చెందారు. ► ఆగస్టు 20, 1995: యూపీలోని ఫిరోజాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆగిఉన్న కలింది ఎక్స్‌ప్రెస్‌ను పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడంతో 400 మంది మరణించారు. ► ఏప్రిల్ 18, 1988: యూపీలోని లలిత్పూర్ సమీపంలో కర్ణాటక ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 75 మంది ప్రాణాలు కోల్పోయారు. ► జూలై 8, 1988: కేరళలోని అష్టముది సరస్సులో ఐలాండ్ ఎక్స్‌ప్రెస్ పడడంతో 107 మంది మరణించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యూపీలో ఘోర రైలు ప్రమాదం
-
యూపీలో ఘోర రైలు ప్రమాదం
సాక్షి, లక్నో : ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ ఖతౌలి వద్ద కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో ఇప్పటివరకూ 23 మంది మరణించారు. పెద్దసంఖ్యలో ప్రయాణీకులకు గాయాలయ్యాయి. ప్రమాదంపై రైల్వే మంత్రి సురేష్ ప్రభు విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన లోపాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు. శనివారం సాయంత్రం 5.50 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనా స్థలానికి మెడికల్ వ్యాన్స్, వైద్య సిబ్బంది చేరుకున్నాయని చెప్పారు. I am personally monitoring situation.Hv instructed senior officers to reach site immediately and ensure speedy rescue and relief operations https://t.co/OCpgUGhg5y — Suresh Prabhu (@sureshpprabhu) 19 August 2017 సహాయ కార్యక్రమాలపై తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, సహాయ చర్యలను వేగవంతం చేయాలని రైల్వే బోర్డు ఛైర్మన్‌ను ఆదేశించామన్నారు. ఘటనా స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటివరకూ 50 మంది ప్రయాణీకులను కాపాడినట్టు అధికారులు తెలిపారు. ఒడిశాలోని పూరి నుంచి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు ట్రైన్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, మృతుల కుటుంబాలకు రూ.3.5 లక్షలు, తీవ్రగాయాలైన వారికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియాగా రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రకటించారు. -
యూపీలో ఘోర రైలు ప్రమాదం..
-
వృద్ధురాలిపై అత్యాచారం..హత్య
ముజుఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లో దారుణం వెలుగు చూసింది. ఓ 55 ఏళ్ల వృద్ధురాలిపై గుర్తు తెలియని దుండగలు అత్యాచారం జరిపి ఉరివేశారు. ఈ ఘటన ముజుఫర్ నగర్ జిల్లా పరిధిలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించి విచారణ చేపట్టారు. మృతురాలి వివరాలు తెలియరాలేదు. ఇక ఇదే జిల్లాలో మరో హత్య కూడా వెలుగు చూసింది.ముత్బార్ గ్రామంలో ఓ 20 ఏళ్ల యువకుడిని అగంతకులు తుపాకీతో కాల్చి చంపారు.మూడు బుల్లెట్ గాయాలైన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న బూత్కాల్ పోలీసులు విచారణ చేపట్టారు. -
బంగ్లాదేశ్ ఉగ్రవాది అరెస్టు
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం (యూపీ ఏటీఎస్) ఆదివారం ఓ విదేశీ ఉగ్రవాదిని అరెస్టు చేసింది. దేశంలో అక్రమంగా ప్రవేశించిన బంగ్లాదేశీ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకుంది. యూపీలో ముజఫర్‌నగర్‌లో తిష్టవేసిన అతను.. పలువురు విదేశీయులు దేశంలోకి ప్రవేశించేందుకు వీలుగా నకిలీ గుర్తింపు కార్డులను సమకూరుస్తున్నట్టు గుర్తించింది. బంగ్లాదేశ్‌కు చెందిన అన్సారుల్లా బంగ్లా గ్రూప్‌కు చెందిన ఉగ్రవాదిగా అతన్ని గుర్తించారు. అతని వివరాలు తెలియాల్సి ఉంది. యూపీ ఏటీఎస్ ఫొటోను మీడియాకు విడుదల చేసింది.