‘యాసిడ్‌ పోస్తా’ | Acid Attack Threat For Girl Refusing Marriage Proposal in Muzaffarnagar | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 25 2018 1:59 PM | Last Updated on Tue, Aug 28 2018 7:22 PM

Acid Attack Threat For Girl Refusing Marriage Proposal in Muzaffarnagar - Sakshi

యువతిని లైంగికంగా వేధించిన యువకుడు.. ఆపై ఆమెపై బెదిరింపులకు దిగాడు. వివాహం చేసుకోకపోతే యాసిడ్‌ దాడికి పాల్పడతానని హెచ్చరించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, విషయం వెలుగులోకి వచ్చింది.

లక్నో: ముజఫర్‌నగర్‌లోని బ్రహ్మపురికి చెందిన షకీర్‌ అలీ అనే యువకుడు స్థానికంగా ఉండే ఓ యువతిని లైంగికంగా వేధించాడు. ఈ వ్యవహారంపై యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు అయ్యింది. అయితే ఆ తర్వాత అదే యువకుడు ఆమెను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయసాగాడు. ఆమె అందుకు ఒప్పుకోకపోవటంతో.. శనివారం ఆమెను అటకాయించి యాసిడ్‌ దాడి చేస్తానంటూ బెదిరించాడు. సదరు యువతి ఈ విషయం తండ్రికి చెప్పటంతో.. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పరారీలో ఉన్న షకీర్‌ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇదిలా ఉంటే గతనెలలో ఇదే ప్రాంతంలో ఓ వ్యక్తి.. వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడి ఆపై యాసిడ్‌ దాడితో ఆమె ప్రాణాలను బలి తీసుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement