ప్రతీకాత్మక చిత్రం
లక్నో: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కామాంధుడిగా మారాడు. విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించాల్సిన గురువు బాధ్యతను మరిచి పైశాచికంగా ప్రవర్తించాడు. పరీక్షల పేరుతో పాఠశాలకు పిలిచి విద్యార్థినులపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఓ కీచకుడు. గౌరవప్రదమైన ప్రధానోపాధ్యాయ వృత్తిలో ఉండి ఆ పదవికే మాయని మచ్చగా తయారయ్యాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మంది విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘోర ఘటన ఉత్తర ప్రదేశ్‌లో నవంబర్ 17న చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగు చూసింది.
చదవండి: పోలీసుల అదుపులో 44 మంది మహిళలు.. కువైట్ వెళ్తుండగా..
ముజఫర్‌నగర్‌లోని పుర్కాజి ప్రాంతంలో ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ పరీక్షల సాకుతో పదో తరగతి చదువుతున్న 17 మంది బాలికలను పాఠశాలకు పిలిపించాడు. మరునాడు సీబీఎస్‌ఈ ప్రాక్టికల్ పరీక్షలు ఉన్నాయని రాత్రంతా అక్కడే ఉండాలని సూచించాడు. విద్యార్థుల కోసం భోజనం తయారు చేసి.. అందులో మత్తు మందు కలిపిన ఆహారాన్ని విద్యార్థినులకు అందించాడు. తరువాత విద్యార్థులు స్పృహ కోల్పోవడంతో ప్రధానోపాద్యాయుడితోపాటు అతని సహచరుడు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం గురించి ఎవరికీ చెప్పవద్దని, చెబితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని, వారి కుటుంబ సభ్యులను చంపేస్తామని బాలికలను బెదిరించారు.
చదవండి: Banjarahills: మహిళ స్నానం చేస్తుండగా వీడియో.. కేబుల్ టెక్నిషియన్ నిర్వాకం
బాలికలు మరుసటి రోజు పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. అయితే బాధిత బాలికలు పేద కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. వీరిలో ఇద్దరు బాధితులు మాత్రం ధైర్యం చేసి జరిగిన దారుణం గురించి వారి తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో తమ పిల్లలకు జరిగిన అన్యాయంపై కేసు నమోదు చేయాలని అనేకసార్లు కోరినప్పటికీ.. పోలీసులు పట్టించుకోలేదు. దీంతో తల్లిదండ్రులు పుర్కాజి ఎమ్మెల్యే ప్రమోద్ ఉత్వాల్‌ను ఆశ్రయించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
చదవండి: టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం.. ప్రయోజకురాలవుతుందనుకుంటే..
ఈ ఘటనపై వెంటనే విచారణ జరపాలని ఎస్పీ అభిషేక్ యాదవ్‌ను ఎమ్మెల్యే కోరారు. ప్రస్తుతం ఇద్దరు వ్యక్తలు ప్రధానోపాధ్యాయుడితోపాటు అతని సహచరుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదవ్వగా ఒకరిని అరెస్టు చేశారు. అంతేగాక ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పుర్కాజి స్టేషన్ హౌస్ ఆఫీసర్ వినోద్ కుమార్ సింగ్‌ను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment