Practical exam
-
ప్రాక్టికల్స్ పేరుతో.. 17 మంది బాలికలపై ప్రిన్సిపల్ అత్యాచారం
లక్నో: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కామాంధుడిగా మారాడు. విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించాల్సిన గురువు బాధ్యతను మరిచి పైశాచికంగా ప్రవర్తించాడు. పరీక్షల పేరుతో పాఠశాలకు పిలిచి విద్యార్థినులపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఓ కీచకుడు. గౌరవప్రదమైన ప్రధానోపాధ్యాయ వృత్తిలో ఉండి ఆ పదవికే మాయని మచ్చగా తయారయ్యాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మంది విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘోర ఘటన ఉత్తర ప్రదేశ్‌లో నవంబర్ 17న చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగు చూసింది. చదవండి: పోలీసుల అదుపులో 44 మంది మహిళలు.. కువైట్ వెళ్తుండగా.. ముజఫర్‌నగర్‌లోని పుర్కాజి ప్రాంతంలో ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ పరీక్షల సాకుతో పదో తరగతి చదువుతున్న 17 మంది బాలికలను పాఠశాలకు పిలిపించాడు. మరునాడు సీబీఎస్ఈ ప్రాక్టికల్ పరీక్షలు ఉన్నాయని రాత్రంతా అక్కడే ఉండాలని సూచించాడు. విద్యార్థుల కోసం భోజనం తయారు చేసి.. అందులో మత్తు మందు కలిపిన ఆహారాన్ని విద్యార్థినులకు అందించాడు. తరువాత విద్యార్థులు స్పృహ కోల్పోవడంతో ప్రధానోపాద్యాయుడితోపాటు అతని సహచరుడు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం గురించి ఎవరికీ చెప్పవద్దని, చెబితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని, వారి కుటుంబ సభ్యులను చంపేస్తామని బాలికలను బెదిరించారు. చదవండి: Banjarahills: మహిళ స్నానం చేస్తుండగా వీడియో.. కేబుల్ టెక్నిషియన్ నిర్వాకం బాలికలు మరుసటి రోజు పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. అయితే బాధిత బాలికలు పేద కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. వీరిలో ఇద్దరు బాధితులు మాత్రం ధైర్యం చేసి జరిగిన దారుణం గురించి వారి తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో తమ పిల్లలకు జరిగిన అన్యాయంపై కేసు నమోదు చేయాలని అనేకసార్లు కోరినప్పటికీ.. పోలీసులు పట్టించుకోలేదు. దీంతో తల్లిదండ్రులు పుర్కాజి ఎమ్మెల్యే ప్రమోద్ ఉత్వాల్‌ను ఆశ్రయించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చదవండి: టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం.. ప్రయోజకురాలవుతుందనుకుంటే.. ఈ ఘటనపై వెంటనే విచారణ జరపాలని ఎస్పీ అభిషేక్ యాదవ్‌ను ఎమ్మెల్యే కోరారు. ప్రస్తుతం ఇద్దరు వ్యక్తలు ప్రధానోపాధ్యాయుడితోపాటు అతని సహచరుడిపై ఎఫ్ఐఆర్ నమోదవ్వగా ఒకరిని అరెస్టు చేశారు. అంతేగాక ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పుర్కాజి స్టేషన్ హౌస్ ఆఫీసర్ వినోద్ కుమార్ సింగ్‌ను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. -
కార్పొ‘రేటు’
కర్నూలు(జిల్లా పరిషత్): ఇంటర్ మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల్లో వసూళ్ల దందా కొనసాగుతోంది. ప్రాక్టికల్స్‌లో మార్కులేయిస్తామని విద్యార్థుల నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు. మరోవైపు ప్రాక్టికల్ పరీక్షల విధులకు హాజరయ్యే అయ్యవార్లకూ భారీగా నజరానాలు ముట్టజెబుతున్నారు. నాన్ జంబ్లింగ్ విదానంలో కొన్నేళ్లుగా ఈ దందా నడుస్తున్నా అడిగే నాథుడు కరువయ్యారు. ఎంసెట్‌లో ఇంటర్ మీడియట్ మార్కులే కొలమానం. ఇంటర్ మీడియట్ వార్షిక పరీక్షల్లో థియరీతో పాటు ప్రాక్టికల్ పరీక్ష ల్లోనూ విద్యార్థులు ప్రతిభ చూపాల్సి ఉంటుంది. ఎంసెట్‌లో ర్యాంకులే పరమావధిగా ఉన్న కార్పొరేట్ కాలేజీలు కొన్ని పరీక్షల్లో మార్కుల కోసం అడ్డదార్లు తొక్కుతున్నాయి. విద్యార్థికి కోరిన మేరకు ఫుల్‌గా మార్కులు వేస్తే నజరానాలు, కఠినంగా వ్యవహరిస్తే మాత్రం ఫిర్యాదులు చేసి విధుల నుంచి తీయించేందుకు సైతం వెనుకాడటం లేదు. జిల్లాలో ఈ నెల 12 నుంచి మార్చి 4వ తేదీ వరకు 4 విడతల్లో ఇంటర్ మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను 38 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. జిల్లాలో 41 ప్రభుత్వ, 71 ఎయిడెడ్, 2 కో ఆపరేటివ్ కాలేజిలు, 30 ఆదర్శ పాఠశాలలు, 12 ఏపీఎస్డబ్ల్యుఆర్జెసి కాలేజిలు, 3 ఏపీటీడబ్ల్యుఆర్‌జేసీ కాలేజిలు, 4 ఇన్సెంటింగ్ కాలేజీలు, 8 వృత్తి విద్యా కళాశాలలు, 99 ప్రైవేటు కాలేజీలు కలిపి మొత్తం 212 కాలేజీలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో జనరల్ విద్యార్థులు 25,850, వొకేషనల్ విద్యార్థులు 3,900 మంది హాజరవుతున్నారు. మొదటి విడత పరీక్షలు 12 నుంచి 16 వరకు, రెండో విడత 18 నుంచి 22 వరకు, మూడో విడత 23 నుంచి 27 వరకు, నాల్గవ విడత 28 నుంచి మార్చి 4వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు గాను జిల్లా వ్యాప్తంగా ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక డీవో, ఒక సీఎస్‌ను నియమిస్తారు. దీంతో పాటు పరీక్ష జరిగే సమయంలో ఒక్కో కాలేజికి నలుగురు ప్రాక్టికల్ ఎగ్జామినర్లను నియమిస్తారు. పరీక్షల పర్యవేక్షణకు గాను డీవీఈవో, ఆర్‌ఐవోతో పాటు ఒక హెచ్‌బీసీ మెంబర్, ముగ్గురు డీఈసీ మెంబర్లు, ఇద్దరు సభ్యులుండే రెండు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు పనిచేస్తాయి. ప్రాక్టికల్స్ డ్యూటీలకు పైరవీలు ప్రాక్టికల్స్ ఎగ్జామినర్ల డ్యూటీలు వేయించడంలో కొన్ని కార్పొరేట్ కాలేజీలు భారీగా పైరవీలు చేస్తాయన్న విమర్శ ఉంది. వారికి కావాల్సిన రెగ్యులర్, కాంట్రాక్టు లెక్చరర్ల జాబితాను సేకరించి, ఇంటర్ మీడియట్ బోర్డులో పైరవీలు చేసి, వారినే తమ కాలేజీలో డ్యూటీలు వేయించుకుంటున్నారు. విధులకు హాజరైన ఎగ్జామినర్లకు మంచి బోజనం, స్నాక్స్, టీ, కాఫీలు, కూల్‌డ్రింక్‌లు ఇస్తూ సకల మర్యాదలు చేస్తారు. నాలుగు రోజుల విధులు ముగిసిన తర్వాత ముందుగా చేసుకున్న ఒప్పందం మేరకు రూ.10 వేల నుంచి రూ.15 వేల దాకా ముట్టజెబుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో సబ్జక్టును బట్టి ఈ రేటు మారుతోంది. ఒక్కో విద్యార్థి నుంచి రూ.2 వేలు వసూలు..! ఎగ్జామినర్ల నియామకానికి, వారితో విద్యార్థులకు మంచి మార్కులు వేయించడానికి కార్పొరేట్ కాలేజీలు భారీగా డబ్బు ఖర్చు పెడుతున్నాయి. ఇలా ఖర్చు పెట్టిన డబ్బును కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి రాబడుతున్నాయి. ప్రాక్టికల్ పరీక్షల పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.2 వేల వరకు అనధికారికంగా వసూలు చేస్తున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు ప్రాక్టికల్స్ పూర్తిస్థాయి మార్కులు వస్తాయన్న ఉద్దేశంతో కాలేజీ యాజమాన్యాలు అడిగిన మేర డబ్బును కాదనకుండా ఇస్తున్నారు. వాస్తవానికి ఇంటర్ మీడియట్ విద్య అంటేనే థియరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. కాలేజీ అడ్మిషన్ సమయంలో ఒక్కో విద్యార్థి నుంచి రూ.35 వేల నుంచి రూ.60 వేల వరకు ఫీజులు వసూలు చేసే కాలేజీలు ప్రాక్టికల్ మార్కులకు మళ్లీ డబ్బులు వసూలు చేయడం విమర్శలకు దారి తీస్తోంది. చోద్యం చూస్తున్న అధికారులు ఇంటర్ ప్రాక్టికల్స్‌లో అక్రమాలు జరుగుతున్నా వాటిని అరికట్టడంలో బోర్డు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చూడ్డానికి పర్యవేక్షణ కమిటిలతో హడలెత్తిస్తున్నా ఏ ఒక్క కాలేజీపై చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. థియరీపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించి నామమాత్రంగా ప్రాక్టికల్స్ చేయించే కాలేజీల్లో విద్యార్థులకు పూర్తిస్థాయి మార్కులు ఎలా వస్తాయన్న కనీస పరిజ్ఞానం అధికారులకు ఉండటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రాక్టికల్స్ అంతా ప్రశాంతంగా జరిగాయని ప్రకటనలు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారు. -
ప్రయోగం మిథ్య
‘సైన్స్ ప్రగతికి మూలం.... మానవ జాతికి విజ్ఞానశాస్త్ర ఆవిష్కరణలే ప్రధానం...విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేలా ప్రయోగపూర్వక బోధనలు కావాలి... ‘సామాన్యు’డిని సైతం అత్యున్నత స్థానాలకు చేర్చగలిగే సత్తా సైన్స్కుంది’. ఇలా ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, వక్తలు తరచు సైన్స్ఫేర్లు, ఎగ్జిబిషన్లు, ఇతర వేదికల్లో ప్రయోగ విద్య ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రసంగిస్తుంటారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రయోగం ‘కళ’యే గానీ ప్రయోగాల బోధన ‘కల’గా మిగిలిపోతున్నది. జూనియర్ కాలేజీల్లో కరువైన ల్యాబ్‌లు * విద్యార్థులకు అందని ప్రయోగ విజ్ఞానం * మార్కుల స్కోరింగ్‌కే ఉపయోగపడుతున్న ప్రాక్టికల్స్ * ప్రైవేటు కాలేజీల్లో ప్రాక్టికల్ పరీక్షలకు అదనపు వసూళ్లు నల్లగొండ అర్బన్ : పెరుగుతున్న సాంకేతికత సైన్స్ వినియోగాన్ని విస్తృతం చేసింది. దీనివల్ల ప్రయోగ పరిజ్ఞానం ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా మారుతోంది. ప్రయోగాలపై అవగాహన కలిగించాలన్నా, శాస్త్రీయంగా బోధించాలన్నా ఆయా విద్యాసంస్థల్లో ప్రయోగశాలలుండాలి. కానీ జిల్లాలో చాలా జూనియర్ కాలేజీల్లో ల్యాబ్‌ల వసతి కరువైంది. దీంతో ప్రాక్టికల్స్ (ప్రయోగాల) బోధన కలగా మిగిలిపోతున్నది. చాలా కాలేజీల్లో సైన్స్ విద్యార్థులకు, ఆర్ట్స్ వారికి తేడా లేకుండా పోతోంది. వారైనా, వీరైనా థియరీ చదువులకే పరిమితమైపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయోగపాఠాలు మ్యాథ్స్, సైన్స్ విద్యార్థులు ఇంటర్ మార్కుల్లో బాగా స్కోర్ చేసేందుకు ఉపయోగపడడం తప్ప వారిలో ప్రయోగ పరిజ్ఞానాన్ని పెంపొందిస్తున్నది శూన్యమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చాలావరకు ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో పరీక్షలకు కొన్ని రోజుల ముందు తాత్కాలికంగా ప్రయోగశాలలు ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా ఒకటి రెండు ప్రయోగాలు చేయించి చేతులు దులిపేసుకుంటున్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు వచ్చే చీఫ్ (సీఎస్)లు డిపార్ట్మెంటల్ అధికారులను మచ్చిక చేసుకుంటే సరి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా అధికారులు అసలు పట్టించుకోవడం లేదు. ప్రాక్టికల్ పరీక్షలు ఏటా ఓ తంతుగా ముగించేస్తున్నారు. ‘ఇన్స్పైర్’ కానట్లే... విజ్ఞానశాస్త్రంలో నూతన ఆవిష్కరణల వైపు ప్రోత్సహించాలనే ఆశయంతో సైన్స్‌పై ఆసక్తిని పెంచి బాల్యం నుంచే సృజనాత్మకతను వెలికితీసే ప్రయోగాల వైపు ఆకర్శించేందుకు హైస్కూల్ స్థాయిలో ప్రవేశపెట్టిన ‘‘ఇన్స్పైర్’’ అక్కడి వరకే పరిమితమైపోతున్నది. ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ కోసం ప్రతి ఆప్షనల్ సబ్జెక్టులో 40 తరగతులుంటాయి. ప్రథమ సంవత్సరంలో 20, ద్వితీయ సంవత్సరంలో 20 ప్రయోగాల చొప్పున చేయించాలి. థియరీతోపాటు ప్రాక్టికల్ తరగతులను ప్రత్యేకంగా నిర్వహిం చాలి. కానీ జిల్లాలోని ఎక్కువ శాతం ప్రైవేటు కాలేజీల్లో వీటి ఊసే ఉండట్లేదు. పరీక్షల సమయంలో కొద్ది రొజుల ముందు మొక్కుబడిగా ‘సెలక్టెడ్’ అంశాలపై ప్రాక్టికల్స్ తరగతులను నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి జిల్లాలో 246 జూనియర్ కాలేజీల్లో... జిల్లా వ్యాప్తంగా 299 జూనియర్ కాలేజీల నిర్వహణకు అనుమతి ఉంది. కానీ అడ్మిషన్లు లేకపోవడం, తదితర కారణాలతో 53 కాలేజీలు మూతపడ్డాయి. మిగతా 246 కాలేజీలే నడుస్తున్నాయి. వాటిల్లో 30 ప్రభుత్వ, 4 ఎయిడెడ్, 13 రెసిడెన్షియల్ కాలేజీలు, 33 మోడల్ స్కూళ్లతోపాటు 166 ప్రైవేటు అన్ ఎయిడెడ్ కాలేజీల్లో ఇంటర్ విద్యనందిస్తున్నారు. ల్యాబ్‌లు ఇతర అన్ని సౌకర్యాలుంటేనే కాలేజీ నిర్వహణకు అనుమతి ఇవ్వాలి. కానీ 75 శాతానికిపైగా ప్రైవేటు కాలేజీల్లో ప్రయోగశాలలకు సరైన వసతిలేదు. నిబంధనల ప్రకారం సౌకర్యాలు లేవు, అయినా ఆయా కాలేజీలకు ప్రాక్టికల్ సెంటర్లు కేటాయిస్తున్నారు. పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. బ్రహ్మాండమైన మార్కులుపడుతూనే ఉన్నాయి. విశేషమేమంటే ల్యాబ్‌ల వసతి ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మెరిట్ మార్కులతో సీట్లు పొందిన విద్యార్థులకంటే, 10వ తరగతిలో అంతంత మాత్రం గ్రేడ్ పాయింట్లతో పాసై ప్రైవేటు కాలేజీల్లో చేరిన వారికి ల్యాబ్‌లు లేకున్నా బైకిబై (నూరుశాతం) ప్రాక్టికల్ మార్కులొస్తున్నాయి. నల్లగొండలోని ఓ జాతీయ బ్యాంక్ భవనంపై ఉన్న జూనియర్ కాలేజీలో రెండేళ్ల క్రితం ల్యాబ్‌ల వసతి లేకున్నా ప్రాక్టికల్ సెంటర్ కేటాయించారని ఫిర్యాదులొచ్చాయి. పరీక్షలెలా నిర్వహిస్తున్నారని తనిఖీకి వెళ్లినవారు గేటుకు తాళం వేసి ఉండటంతో ఖాళీగా వెనుదిగాల్సి వచ్చింది. ఈ యేడు ప్రాక్టికల్స్‌కు 29588 మంది విద్యార్థులు... ఈ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలను 2015 ఫిబ్రవరి 12వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు నిర్వహించబోతున్నారు. ఇందుకు 128 కాలేజీల్లో సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. 8564 మందిపై బైపీసీ విద్యార్థులు కాగా 21024 మంది ఎంపీసీ విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకానున్నారు. చాలా ప్రైవేటు కాలేజీల్లో పూర్తిస్థాయి సామగ్రి, ల్యాబ్‌లు లేకున్నా సెంటర్లు కేటాయించే జాబితాలో ఉంచి ఇంటర్ బోర్డుకు ప్రతిపాదనలు పంపించినట్లు సమాచారం. ప్రయోగశాలలు కాదు కనీసం ప్రయోగాలకు అవసరమయ్యే టేబుళ్లు, ఇతర పరికరాలు కూడా లేనట్లు తెలిసింది. పరీక్షల సమయంలో సినిమా సెట్టింగుల మాదిరిగా అప్పటికప్పుడు తరగతి గదిని ప్రయోగ గదిగా మార్చి టేబుళ్లు వేసి రెడీమేడ్‌గా లభించే కెమికల్స్, ఇతర ఎగ్జిబిట్లు, చార్ట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ర్యాంకుల తారుమారు... ఇప్పటివరకు ఇంటర్ మార్కులకు ఎంసెట్‌లో వెయిటేజీ కల్పిస్తుండటంతో ప్రాక్టికల్ మార్కులు కీలకంగా మారాయి. పలువురి విషయంలో ఈ మార్కులతో ర్యాంకులు తారుమారైన ఉదంతాలున్నాయి. రాత పరీక్షల్లో 60 శాతం మార్కులు పొందలేక పోయిన వారు కూడా ప్రాక్టికల్స్‌లో 100 శాతం మార్కులు పొందగలుగుతున్నారు. దీంతో ఎంసెట్ ర్యాంకులపై ప్రభావం పడుతున్నది. ప్రాక్టికల్స్ మార్కులకున్న మార్కుల ప్రాధాన్యతనుబట్టి పలు ప్రైవేటు కాలేజీల వారు తమకు అనుకూలమైన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించుకునేందుకు ‘అన్ని’ విధాలా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాక్టికల్స్ కోసం విద్యార్థుల నుంచి రూ.100 ఫీజు వసూలు చేయాల్సి ఉండగా ఈ ఏడాది కొన్ని కాలేజీల్లో రూ.1000 నుంచి రూ.4 వేల దాకా వసూళ్లు చేస్తున్నట్లు తెలిసింది. వీటితో కార్యాలయం వారిని మేనేజ్ చేయడంత పాటు సీఎస్, డీఓలకు నజరానాలిచ్చి పిల్లలకు కావాల్సిన మార్కులు వేయిస్తున్నారని ఆరోపణలున్నాయి. ప్రాక్టికల్‌కు ప్రాధాన్యమివ్వాలి : నెమ్మాది ప్రకాశ్‌బాబు, ఆర్ఐఓ నల్లగొండ అన్ని కాలేజీల్లో ప్రాక్టికల్ తరగతులకు ప్రాధాన్యమివ్వాలి. ఒక విద్యా సంవత్సరంలో కనీసం 30 నుంచి 40 క్లాసులకు బ్యాచ్‌ల వారీగా వారానికో క్లాస్ తీసుకోవాలి. ఫస్టియర్‌లో కూడా ప్రాక్టికల్స్ చేయించాలి. కాకపోతే ప్రాక్టికల్ పరీక్షలు ద్వితీయ సంవత్సరంలోనే ఉంటాయి. మొక్కుబడిగా నిర్వహించే కాలేజీలను తనిఖీ చేస్తాం. కొన్ని కాలేజీల్లో పరీక్షలకు ముందు ల్యాబ్‌ల తలుపులు తెరుస్తారనేది మా దృష్టిలో కూడా ఉంది. పరీక్షలకు ఫీజును ఎక్కువ వసూలు చేయరాదు. తల్లిదండ్రులు మా దృష్టికి తేవాలి.