
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ 23 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు దుండగులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజఫర్‌నగర్ నగరంలోని జబేపూర్ గ్రామానికి చెందిన మహిళ(23) ఇంట్లో ఉండగా.. శనివారం గుర్తుతెలియని నలుగురు దుండగులు కిడ్నాప్ చేశారు. కారులో ఆమెను పుర్కాజీ పోలీసు స్టేషన్ సమీపంలో ఉన్న చెరుకు తోటలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బయట చెబితే చంపేస్తామని బెదిరించి మహిళను వదిలేశారు. ఇంటికెళ్లిన మహిళ జరిగిన విషయంలో కుటుంబ సభ్యులకు తెలిపగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని పుర్కాజీ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment