
ముజఫర్‌నగర్ : పెళ్లైన తొలి రాత్రే బావతో కలిసి కట్టుకున్న భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గపు భర్త. మద్యం మత్తులో మృగంలా ప్రవర్తిస్తూ నవవధువుకి నరకం చూపించాడు. ఈ ఘోరమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మజఫర్‌నగర్ నగరంలో మార్చి 6 చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ 26 ఏళ్ల యువతికి ఇటీవల అదే నగరానికి చెందిన యువకునితో మర్చి 6న వివాహం జరిగింది. అదే రోజు రాత్రి నవ వధువు(26)పై బావతో కలిసి ఆమె భర్త అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతిని తప్పించుకోవడానికి ప్రయత్నించగా తీవ్రంగా కొట్టి లైంగిక దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనపై బాధితురాలి సోదరుడు మాట్లాడుతూ.. పెళ్లి రోజు కట్నం కోసం వరుడు, అతని కుటుంబ సభ్యులు గొడవ చేశారని తెలిపాడు.సోదరి పెళ్లి కోసం అప్పటికే తాము రూ.7లక్షలు కట్నం ఇచ్చామన్నారు. పెళ్లి రోజు రాత్రి వరుడు, అతని బావ కలిసి మద్యం సేవించారని, అదే మత్తులో తన సోదరిపై అత్యాచారానికి తెగబడ్డారని వెల్లడించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసికొని విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం యువతి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment