మళ్లీ రేప్ చేస్తానని బెదిరించాడు
ఒకసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. దిక్కుతోచని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దుండగుడు మళ్లీ వచ్చాడు. కేసు వాపస్ తీసుకోకుంటే మళ్లీ రేప్ చేస్తానని బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ కీచకుడ్ని ఎలాగైనాసరే పట్టుకోవాలని గస్తీ పెంచారు.
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లా కుర్వావాలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఆగస్టు 21న అంకుర్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిపై అత్యాచారం జరిపాడు. ఘటన జరిగిన తర్వాత కుటుంబ సభ్యుల సహాయంతో పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడికోసం గాలింపు చేపట్టారు.
ఇంతలోనే సోమవారం మరోసారి పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితురాలు మరోసారి ఆదే నిందితుడిపై ఫిర్యాదుచేసింది. మొన్నరాత్రి బాధితురాలిని ఒంటరిగా దొరకబుచ్చుకున్న అంకుర్.. తనపై పెట్టిన కేసును వెనక్కితీసుకోకుంటే మళ్లీ రేప్ చేస్తానని బెదిరించాడు. కేసు తీవ్రత దృష్ట్యా నిందితుడి గాలింపునకు అదనపు సిబ్బందిని కేటాయించినట్లు పుగానా సీఐ తెలిపారు.