కశ్మీర్ లోయ మళ్లీ భగ్గుమంది. హిజ్బుల్ ముజాహిదీన్ కీలకనేత బుర్హాన్ ముజఫర్ వనీని భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్ చేయటాన్ని నిరసిస్తూ.. కశ్మీరీ యువకులు ఆందోళనకు దిగటంతో లోయ హింసాత్మకంగా మారింది. కశ్మీర్‌లో పలుచోట్ల చెలరేగిన ఘర్షణలో 11 మంది ఆందోళనకారులు మరణించగా.. 126 మందికిపైగా గాయపడ్డారు.