పెట్రోల్ బంక్లో ఘర్షణ, గాయాలు
ముజఫర్నగర్: పెద్దనోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. పెట్రోల్ బంక్లు, ఇతర అత్యవసర సేవల కోసం పాత నోట్లు వాడుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలిచ్చినప్పటికీ ఆచరణలో మాత్రం ఇది జరగడం లేదు. దీంతో పలుచోట్ల ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్లో ఇదే అంశంలో తలెత్తిన వివాదం తన్నుకునేదాకా వెళ్లింది.
ఢిల్లీ, సహరాన్పూర్ జాతీయ రహదారిలో ఉన్న పెట్రోల్ బంక్లో ఈ ఘటన చోటుచేసుకుంది. బంక్లో పెట్రోల్ పోయించుకున్న అనంతరం వాహనదారులు పాత 500, 1000 నోట్లు ఇవ్వడంతో.. అవి చెల్లవంటూ బంకు సిబ్బంది వాటిని తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో సిబ్బంది, వాహనదారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం దాడులు చేసుకోవడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో పెట్రోల్ బంక్ సిబ్బందిపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు వెల్లడించారు.