Scuffle
-
సంజయ్‌ని నేనేం రాళ్లతో కొట్టలేదు: కౌశిక్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: కరీంనగర్ డీఆర్సీ మీటింగ్‌లో బట్టలు విప్పుతా అని ఎమ్మెల్యే సంజయ్ నన్ను రెచ్చగోట్టేలా మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తెలిపారు. బుధవారం(జనవరి15) కౌశిక్‌రెడ్డి తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు.‘మొదట సంజయ్ నాపై దాడి చేశారు. శ్రీధర్ బాబు నన్ను వేలు చూపుతూ బెదిరించారు. కాంగ్రెస్ నేతల ఆదేశాలతో పోలీసులు రౌడీలుగా తయారయ్యారు. రైతు భరోసా కోసం ప్రశ్నించా. రైతు రుణ మాఫీ 50 శాతం అయ్యింది పూర్తి చేయండని రైతుల పక్షాన అడిగాను అందులో తప్పేముంది. సంజయ్ ఏ పార్టీ నుంచి ఏ గుర్తుతో గెలిచిండు. సంజయ్ వార్డు మెంబర్‌గా కూడా గెలవలేడు. కేసీఆర్ బొమ్మతో సంజయ్ గెలిచిండు. డబ్బులకు అమ్ముడుపోయిన సంజయ్ సిగ్గు లేకుండా స్పీకర్ నాపై ఫిర్యాదు చేసాడు. స్పీకర్‌కు సంజయ్ పై ఫిర్యాదు చేస్తా. మంత్రుల సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన సంజయ్ డిస్ క్వాలిఫై చేయాలి. రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టిస్తా అని రేవంత్ రెడ్డే అన్నారు. నేను రాళ్లతో కొట్టలేదు కదా..ప్రశ్నిస్తే నా పై కేసులా’అని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. ఇదీ చదవండి: మోకాళ్లపై కూర్చొని మంత్రి పొన్నం నిరసన -
ప్రత్యర్థితో మేనకాగాంధీ వాగ్వాదం
లక్నో: కేంద్ర మంత్రి, సుల్తాన్పూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మేనకాగాంధీ, తన ప్రత్యర్థి సోనూ సింగ్‌ల మద్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం పిలీభీత్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మేనకాగాంధీ ఈ ఎన్నికల్లో సుల్తాన్పూర్ నుంచి బరిలో నిలిచిన సంగతి తెలసిందే. అయితే ఆ స్థానం నుంచి ఎస్పీ, బీఎస్పీ కూటమి తరఫున సోనూ సింగ్ బరిలో ఉన్నారు. కాగా, ఆరో విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఆదివారం ఉదయం పోలింగ్ ప్రారంభం అయింది. నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూతులను పరిశీలిస్తున్న మేనకాగాంధీ.. ఎస్పీ, బీఎస్పీ నాయకులు ఓటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ‘మీ రౌడీయిజం ఇక్కడ పని చేయదని’ సోనూ సింగ్‌ను ఉద్దేశించి మేనకాగాంధీ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను ఖండించిన సోనూ సింగ్ తాను ఏ తప్పు చేశానో చెప్పాలంటూ మేనకాగాంధీని ప్రశ్నించారు. ఈ సమయంలో సోనూ సింగ్ అనుచరులు ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇరువురు నేతలు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగింది. ‘నేను నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌ల పరిశీలనలో భాగంగా ఇక్కడికి వచ్చాను. పోలింగ్ సక్రమంగా జరుగుతుందో లేదో తెలసుకోవడం ఎలాంటి నేరం కాదు. సోనూ సింగ్‌తో ఉన్నవారిలో ఒక వ్యక్తి జైలు నుంచి పారిపోయి పరారీలో ఉన్నాడు. అలాంటి వ్యక్తులు ఓటు వేసే ముందు ఓటర్లను భయపెడుతున్నారు. ఇది సరియైన పద్ధతి కాదు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో ఓటు వేసే హక్కు ఉంద’ని మేనకా గాంధీ తెలిపారు. #WATCH: Minor argument between Union Minister and BJP's candidate from Sultanpur Maneka Gandhi and Mahagathbandhan candidate Sonu Singh after Gandhi alleged that Singh's supporters were threatening voters. #LokSabhaElections #Phase6 pic.twitter.com/l2Pn1yCRVO — ANI UP (@ANINewsUP) 12 May 2019 -
బెంగాల్లో తృణమూల్, బీజేపీ బాహాబాహీ..
సాక్షి, కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నపూర్ జిల్లాలో బీజేపీ, తృణమూల్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఇరు వర్గాలు ఎదురుపడటంతో జరిగిన ఘర్షణలో బీజేపీ బెంగాల్ చీఫ్ దిలీఫ్ ఘోష్ కారును తృణమూల్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. మిడ్నపూర్ జిల్లాలోని కాంటై ప్రాంతంలో బీజేపీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు దిలీష్ ఘోష్, సహా పలువురు బీజేపీ నేతలు హాజరవుతుండగా, అదే ప్రాంతంలో తృణమూల్ కార్యాలయం ఉండటంతో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేతల వాహనాలకు తృణమూల్ కార్యకర్తలు నల్లజెండాలు చూపడం, పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ప్రతిగా బీజేపీ కార్యకర్తలు ప్రతి నినాదాలతో హోరెత్తించారు. ఇరు వర్గాలు బాహాబాహీకి దిగడంతో 15 కార్లు ధ్వంసమయ్యాయి. ఇరు పార్టీలకు చెందిన ఐదుగురు గాయపడగా, వీరిలో ముగ్గురి పరిస్ధితి ఆందోళనకరంగా ఉందన్నారు. తృణమూల్ దాడిలో తాను తృటిలో తప్పించుకున్నానని, ప్రజాస్వామ్యయుతంగా తమను ఎదుర్కోలేని తృణమూల్ తమపై గూండాలు, పోలీసులను ప్రయోగిస్తోందని బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీఫ్ ఘోష్ ఆరోపించారు. -
ఆలయం ముందు మహిళలపై వీరంగం
ఉజ్జయినీ : ఆలయం ముందు పూల వ్యాపారుల మధ్య నడిరోడ్డు మీద గొడవ జరిగింది. ఆలయం ముందు అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి మహిళలపై దారుణంగా దాడి చేశాడు. ప్రత్యర్థి వ్యక్తిని కిందపడేసి కొట్టడమే కాదు.. అతనికి అండగా వచ్చిన మహిళలపైనా విచక్షణారహితంగా దాడి చేశాడు. మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక నగరం ఉజ్జయినిలోని ‘మహంకాళి’ ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూల వ్యాపారుల మధ్య గొడవ ఎందుకు జరిగింది? వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఆలయం ముందు జరిగిన ఈ కొట్లాటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అర్ధనగ్నంగా ఉన్న ఓ యువకుడు వీరంగం వేశాడు. ప్రత్యర్థి యువకుడిని కిందపడేసి చితకబాదడమే కాదు.. మహిళలని చూడకుండా కిరాతకంగా దాడి చేశాడు. మహిళలను కర్రతో చితకబాదడమే కాకుండా.. వారిపై ఎగిరిదూకి సినిమా తరహాలో స్టంట్లు చూశాడు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రభావం ఆ యువకుడిపై కనిపిస్తోందని, మహిళలను కిరాతకంగా కొడుతున్నా.. చుట్టూ ఉన్నవారు వినోదం చూస్తున్నారే తప్ప.. ఎవరూ ఎందుకు స్పందించలేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
మహిళలపై దారుణంగా దాడి చేశారు
-
బీజేపీ, బీఎస్పీ కౌన్సిలర్ల బాహాబాహీ
-
బీజేపీ, బీఎస్పీ కౌన్సిలర్ల బాహాబాహీ
సాక్షి, మీరట్ : యూపీలోని మీరట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజా ప్రతినిధుల బాహాబాహీకి వేదికైంది. బీజేపీ, బీఎస్పీ ఎమ్మెల్యేలు ఒకరిని ఒకరు తోసుకుంటూ పరస్పర దాడులకు పాల్పడ్డ వీడియో కలకలం రేపింది. మంగళవారం కౌన్సిల్ భేటీ సందర్భంగా ఇరు పార్టీల సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొని ఘర్షణకు దారితీసింది. సభ్యులు ఒకరిపై ఒకరు దాడులకు తెగబడటంతో పరిస్థితి అదుపుతప్పింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని గాడినపెట్టాల్సి వచ్చింది. మీరట్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ, బీఎస్పీ సభ్యుల మధ్య రగడ ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది జనవరిలో వందే మాతరం గీతాలాపన విషయంలోనూ ఇరు పార్టీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ప్రజా ప్రతినిధులు కార్పొరేషన్లో అమర్యాదకరంగా వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
హర్యానాలో టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి
-
టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి
హర్యానా : టోల్ ప్లాజా సిబ్బందిపై బస్సు డ్రైవర్, కండక్టర్ లు దాడికి దిగారు. గురుగ్రామ్-ఫరీదాబాద్ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న సిబ్బందిపై హర్యానా రోడ్ వేస్‌కు చెందిన డ్రైవర్, కండక్టర్లు దాడి చేసిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇద్దరూ కలిసి టోల్‌ప్లాజా సిబ్బందిని చితకబాదారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పార్లమెంటులో కొట్టుకున్నారు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ పార్లమెంట్ గురువారం రణరంగాన్ని తలపించింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరినొకరు కొట్టుకుంటూ తోసుకున్నారు. ప్రధాని నవాజ్ షరీఫ్‌కు వ్యతిరేకంగా సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు జారీచేయాలని ఐదుగురు ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ అయాజ్ సాదిక్‌ను కోరడమే ఇందుకు కారణమని డాన్ న్యూస్ తెలిపింది. ఈ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) నాయకుడు షా మహమూద్ ఖురేషి సభలో మాట్లాడుతుండగా ఆయన పార్టీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సమయంలో అధికార పీఎంఎల్ఎన్ సభ్యుడు షాహిద్ ఖాన్ అబ్బాసి.. ఖురేషి వద్దకు వెళ్లి తమ పార్టీ సభ్యులను అదుపుచేయమని విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. తమ అధినేత ఇమ్రాన్ ఖాన్‌పై అబ్బాసి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పీటీఐ సభ్యులు ఆరోపించారు. ఆ తరువాత ఇరు వర్గాల మధ్య బాహాబాహీ చోటుచేసుకున్నట్లు డాన్ న్యూస్ పేర్కొంది. సభ్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. -
ఆంధ్రాబ్యాంకు అద్దాలు ధ్వంసం..
మేడికొండూరు: నోట్ల మార్పిడి కోసం దేశవ్యాప్తంగా జనాలు బ్యాంకుల వద్ద బారులు తీరారు. కొన్నిచోట్ల భారీగా ఉన్న క్యూలైన్లలో నానాపాట్లు పడుతూ కౌంటర్ వద్దకు చేరేలోపు కౌంటర్లలో నో క్యాష్ బోర్డులు వెక్కిరిస్తున్నాయి. గుంటూరు జిల్లా మేడికొండూరు ఆంధ్రాబ్యాంకులో నోట్ల మార్పిడి కోసం క్యూలో నిల్చున్న ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. చాలా సమయం లైన్లో నుల్చున్న ఖాతాదారుడు తీరా కౌంటర్ వద్దకు చేరేసరికి బ్యాంకు క్యాషియర్ డబ్బులు అయిపోయాయని సమాధానం చెప్పాడు. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన ఆ ఖాతాదారుడు బ్యాంకు అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ సంఘటనతో బ్యాంకు అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఖాతాదారుడికి సర్దిచెప్పారు. -
పెట్రోల్ బంక్‌లో ఘర్షణ, గాయాలు
ముజఫర్‌నగర్: పెద్దనోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. పెట్రోల్ బంక్‌లు, ఇతర అత్యవసర సేవల కోసం పాత నోట్లు వాడుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలిచ్చినప్పటికీ ఆచరణలో మాత్రం ఇది జరగడం లేదు. దీంతో పలుచోట్ల ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్లో ఇదే అంశంలో తలెత్తిన వివాదం తన్నుకునేదాకా వెళ్లింది. ఢిల్లీ, సహరాన్పూర్ జాతీయ రహదారిలో ఉన్న పెట్రోల్ బంక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బంక్‌లో పెట్రోల్ పోయించుకున్న అనంతరం వాహనదారులు పాత 500, 1000 నోట్లు ఇవ్వడంతో.. అవి చెల్లవంటూ బంకు సిబ్బంది వాటిని తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో సిబ్బంది, వాహనదారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం దాడులు చేసుకోవడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో పెట్రోల్ బంక్ సిబ్బందిపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
మిస్త్రీ సెక్యూరిటీ, మీడియా ఘర్షణ
-
మిస్త్రీ సెక్యూరిటీ, మీడియా ఘర్షణ
ముంబై: రచ్చకెక్కిన టాటా-మిస్త్రీ బోర్డ్ రూం వ్యవహారంలో రోజుకో కొత్త పరిణామం చోటు చేసుకుంటూ ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో మిస్త్రీ సెక్యూరిటీకి, మీడియాకు మధ్య చిన్నపాటి స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ బోర్డ్ మీటింగ్ సందర్భంగా శుక్రవారం టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ సెక్యూరిటీకి మీడియాకు మధ్య ఘర్షణలో ఇరువర్గాలు గాయపడ్డాయి. ఐహెచ్‌సీఎల్ చైర్మన్ కూడా అయిన మిస్త్రీ కంపెనీ త్రైమాసిక ఆర్థిక సమీక్షా సమావేశానికి టాటా ప్రధాన కార్యాలయానికి చేరుకోగానే ఫోటోగ్రాఫర్లు ఎగబడ్డారు. ఇంతలో ఆయన సెక్యూరిటీ సిబ్బంది మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో పరిస్థితి అదుపుతప్పడంతో పలు జాతీయ మీడియాకు చెందిన కెమెరాలు దెబ్బతిన్నాయి. సెక్యూరిటీ సిబ్బంది, ఫోటో గ్రాఫర్లకు గాయాలయ్యాయి. చివరికి మాతా రమాబాయి పోలీస్ స్టేషన్ పోలీసులు కల్పించుకొని పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం గాయపడిన సెక్యూరిటీ సిబ్బందిని, ముగ్గురు ఫోటో గ్రాఫర్లను వైద్యపరీక్షల నిమిత్తం తరలించారు. కాగా టాటా సన్స్ ఛైర్మన్ గా తొలగించినప్పటికీ, టాటా గ్రూపు సంస్థలకు మిస్త్రీ ఛైర్మన్ గాకొనసాగుతారని మిస్త్రీ సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. ముఖ్యంగా టాటా స్టీల్ , టాటా మోటార్స్ లాంటి టాటా గ్రూప్ అన్ని పదవులకూ చట్టానికి లోబడి తన విశ్వసనీయ బాధ్యతను నిర్వర్తిస్తారని చెప్పారు. -
రూపా గంగూలీపై ఎఫ్ఐఆర్
కోల్‌కతా: బీజేపీ నేత రూపా గంగూలీ దురుసుగా ప్రవర్తించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో వాదులాడటమే కాకుండా ఆ పార్టీకి చెందిన ఓ కార్యకర్తను తోసివేశారు. అది కూడా పోలింగ్ బూత్ వద్ద ఈ ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. హౌరా నియోజక వర్గం నుంచి రాజకీయ నాయకురాలిగా మారిన ఒకప్పటి నటి రూపా గంగూలీ బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సోమవారం ఇక్కడ నాలుగో దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ బూత్ వద్దకు వచ్చిన ఆమెకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ వాగ్వాదంలో ఆమె కాస్త దురుసుగా మాట్లాడటమే కాకుండా అక్కడ టీఎంసీ కార్యకర్తలపై చేయిచేసుకుంటూ వారిని తోసి వేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి పోలింగ్ బూత్ వద్ద ఘర్షణకు కారణమైన రూపా గంగూలీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. -
'ఐపీఎల్లో ఇలాంటివి మామూలే'
కోల్‌కతా: ఐపీఎల్-8 మ్యాచ్ సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు సర్ఫరాజ్‌తో గొడవ పడిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ రాబిన్ ఊతప్పను కోల్‌కతా కెప్టెన్ గంభీర్ వెనకేసుకొచ్చాడు. ఐపీఎల్ వంటి ఉత్కంఠభరిత టోర్నీలో ఇలాంటి సంఘటనలు మామూలేనంటూ గంభీర్ తేలికపరిచే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనలో తప్పేమీలేదని అన్నాడు. శనివారం కోల్‌కతా, (బెంగళూరు)ల మధ్య మ్యాచ్ ముగిశాక ఉతప్ప.. సర్ఫరాజ్ కాలర్ పట్టుకుని తిట్టినట్లు వచ్చిన వార్తలపై గౌతీ స్పందించాడు. ఇలాంటి ఘటనలకు ప్రాధాన్యత ఇవ్వరాదంటూ గౌతీ మీడియాని కోరాడు. ఇదిలావుండగా, సర్ఫరాజ్‌తో ఊతప్ప గొడవ పడిన విషయం తన దృష్టికి రాలేదని మ్యాచ్ రెఫెరీ, మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ చెప్పాడు. కోల్‌కతా జట్టు అధికారులు కూడా ఈ వార్తలను ఖండించారు. -
ఉతప్ప-సర్ఫరాజ్‌ల ఘర్షణ?
కోల్‌కతా: ఈడెన్‌గార్డెన్స్‌లో శనివారం మ్యాచ్ తర్వాత ఉతప్ప (కోల్‌కతా), సర్ఫరాజ్ (బెంగళూరు)ల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకున్నట్లు సమాచారం. మ్యాచ్ ముగిశాక సైట్ స్క్రీన్ వెనక... ఉతప్ప 17 ఏళ్ల సర్ఫరాజ్‌ను కాలర్ పట్టుకుని తిట్టినట్లు సమాచారం. ఇది గమనించిన బెంగళూరు క్రికెటర్లు డివిలియర్స్, దిండా పరిగెడుతూ వెళ్లి విడిపించారట. గొడవ ఎందుకు జరిగిందనే వివరాలు మాత్రం బయటకు రాలేదు. అయితే ఈ విషయం తన దృష్టికి రాలేదని ఆ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన శ్రీనాథ్ చెప్పారు. ‘రెండు జట్ల నుంచి నాకు ఎలాంటి ఫిర్యాదూ రాలేదు’ అని శ్రీనాథ్ చెప్పారు.