ఆంధ్రాబ్యాంకు అద్దాలు ధ్వంసం..
మేడికొండూరు: నోట్ల మార్పిడి కోసం దేశవ్యాప్తంగా జనాలు బ్యాంకుల వద్ద బారులు తీరారు. కొన్నిచోట్ల భారీగా ఉన్న క్యూలైన్లలో నానాపాట్లు పడుతూ కౌంటర్ వద్దకు చేరేలోపు కౌంటర్లలో నో క్యాష్ బోర్డులు వెక్కిరిస్తున్నాయి. గుంటూరు జిల్లా మేడికొండూరు ఆంధ్రాబ్యాంకులో నోట్ల మార్పిడి కోసం క్యూలో నిల్చున్న ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది.
చాలా సమయం లైన్లో నుల్చున్న ఖాతాదారుడు తీరా కౌంటర్ వద్దకు చేరేసరికి బ్యాంకు క్యాషియర్ డబ్బులు అయిపోయాయని సమాధానం చెప్పాడు. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన ఆ ఖాతాదారుడు బ్యాంకు అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ సంఘటనతో బ్యాంకు అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఖాతాదారుడికి సర్దిచెప్పారు.