Medikonduru
-
Guntur Road Accident: అమ్మా లెగమ్మా.. చెల్లీ మాట్లాడు
సాక్షి, గుంటూరు(మేడికొండూరు): పొట్టకూటి కోసం వలస వచ్చి కూలీనాలీ చేసుకుని జీవిస్తూ ఇద్దరు బిడ్డల బంగారు భవిష్యత్తు గురించి కలలుగంటున్న పేద దంపతుల ఆశలను రోడ్డు ప్రమాదం చిదిమేసింది. శుభకార్యానికి వెళ్లి ఆనందంగా తిరిగి వస్తున్న ఆ చిన్న కుటుంబం సంతోషాలను అంతలోనే ఆవిరి చేసింది. టిప్పర్ రూపంలో వచ్చిన మృత్యువు తల్లీకూతుళ్లను బలితీసుకుంది. స్వల్పగాయాలతో బయట పడిన తండ్రీకూతుళ్లను శోక సముద్రంలో ముంచింది. ఈ హృదయ విదారక ఘటన మేడికొండూరు మండలం పేరేచర్ల నరసరావుపేటలోని బ్రిడ్జి దిగువన రైల్వే ట్రాక్ సమీపంలో సోమవారం జరిగింది. ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన వేల్పుల వెంకటేశ్వర్లు, లక్ష్మి(35) దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు తేజశ్విని, నాగమల్లేశ్వరి(5) ఉన్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని పేద కుటుంబం. స్వగ్రామంలో పనులు లేకపోవడంతో కొద్దినెలల క్రితం గుంటూరు చుట్టుగుంట సమీపంలోని కొత్త కాలనీకి వలస వచ్చారు. మిర్చియార్డులో భార్యాభర్తలిద్దరూ కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. పిల్లలను చదివించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా, కారంపూడి మండలం, ఒప్పిచర్ల గ్రామంలోని బంధువుల ఇంట జరిగిన శుభకార్యానికి ఆదివారం కుటుంబమంతా ద్విచక్రవాహనంపై వెళ్లింది. సోమవారం వారు గుంటూరుకు తిరుగుపయనమయ్యారు. కొద్దిసేపట్లో ఇంటికి చేరుకుంటామనగా.. పేరేచర్ల నరసరావుపేటరోడ్డులోని బ్రిడ్జి కింద వెనుకగా వస్తున్న టిప్పర్ బలంగా ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో లక్ష్మితోపాటు ఆమె చిన్నకూతురు నాగమల్లేశ్వరి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వెంటేశ్వర్లు, పెద్ద కుమార్తె తేజశ్విని స్వల్పగాయాలతో బయటపడ్డారు. తల్లడిల్లిన బాలిక తల్లి, చెల్లి దుర్మరణంతో ఎనిమిదేళ్ల తేజశ్విని తల్లడిల్లిపోయింది. అమ్మా.. అమ్మా.. లెగమ్మా.. చెల్లీ మాట్లాడు చెల్లీ.. అంటూ గుండెలవిసేలా విలపించింది. ఆ బాలికను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. మృతదేహాలపై పడి బాలిక రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. క్లీనర్ లేకపోవడం వల్లేనా..! టిప్పర్‌లో క్లీనర్ లేకపోవడం వల్ల రోడ్డుపై ఎడమవైపు ఉన్న వాహనాలను డ్రైవర్ గుర్తించలేకపోయాడని, అందువల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. దుర్ఘటనపై మేడికొండూరు సీఐ ఎండీ ఎ.ఆల్తాఫ్ హుస్సేన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. -
గ్యాంగ్ రేప్ నిందితుల కోసం ముమ్మర గాలింపు
మేడికొండూరు: గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు రోడ్డులో బుధవారం రాత్రి జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను అటకాయించి.. భర్తను చెట్టుకు కట్టేసి అతని కళ్లెదుటే భార్యపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నిందితుల కోసం పోలీస్ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. సత్తెనపల్లి, మేడికొండూరు, గుంటూరు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. మేడికొండూరు పోలీసులు పాతనేరస్తులెవరినీ విడిచిపెట్టకుండా విచారణ చేస్తున్నారు. పాలడుగు అడ్డరోడ్డు ప్రాంతంలో కొత్తగా నిర్మిస్తున్న కోల్డ్‌స్టోరేజీలో పని చేసున్న 70 మంది కార్మికులను ఇప్పటికే విచారణ చేశారు. పలు నేరాల్లో నిందితులుగా ఉన్న వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి ప్రశ్నిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న 8 మందిని మూడు రోజులుగా విచారణ చేస్తున్నారు. వారి నుంచి ఎటువంటి సమాచారం లభ్యం కాలేదని తెలుస్తోంది. ఘటనా స్థలంలో కొత్తగా తిరుగుతున్న అనుమానితులనూ గుర్తించి వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఏ చిన్న అనుమానం వచ్చినా ఎవరినీ విడిచి పెట్టకుండా దర్యాప్తు సాగిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఆ మార్గంలోని సీసీ ఫుటేజ్‌లను నిశితంగా పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. -
బిడ్డలకు బరువైంది.. కానీ భర్తకు కాదు..
కార్యేషు యోగీ, కరణేషు దక్షః రూపేచ కృష్ణః క్షమయాతు రామః భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం షట్కర్మ యుక్తఃఖలు ధర్మనాథః పనులు చెయ్యడంలో ఒక యోగిలా ప్రతిఫలం ఆశించకూడదు. కుటుంబాన్ని నడపడం, కార్యాలను నిర్వహించడంలో నేర్పు, సంయమనంతో వ్యవహరించాలి. రూపంలో కృష్ణుడిలా, ఓర్పు లో రాముడిలా ఉండాలి. భార్య వండినదాన్ని సంతృప్తిగా భుజించాలి. సుఖదుఃఖాల్లో కుటుంబానికి మిత్రునిలా అండగా ఉండాలి. మంచి చెడ్డల్లో పాలు పంచుకోవాలి. ఇవి ఆచరించేవాడే ఉత్తమ భర్తని పై శ్లోకం సారాశం. మేడికొండూరు మండలం జంగంగుంటపాలేనికి చెందిన కత్తి గురవమ్మ, ఏసు భార్యాభర్తలు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెకు పెళ్లి చేశారు. ఉన్న ఇంటినీ సంతానానికే ఇచ్చేశారు. రోజులు గడిచే కొద్దీ బిడ్డలకు తల్లిదండ్రులు బరువయ్యారు. నరాల బలహీనతతో గురవమ్మకు చూపు పోయింది. మోకాలి చిప్పలు అరిగిపోయి కాళ్లూ నడవలేని స్థితికి చేరుకున్నాయి. మూడు చక్రాల బండే దిక్కయింది. ఏసుకు కూడా ఓ ప్రమాదంలో కాలు దెబ్బతినడంతో ఆపరేషన్ జరిగింది. ఇద్దరికీ ఆకలి పోరాటం తప్పలేదు. నడవలేని భార్యకు ఏసు అన్నీ తానై ముందుండి నడిపిస్తున్నాడు. నలుగురినీ యాచించుకుంటూ, బస్ షెల్టర్లలో బసచేస్తూ జీవనం సాగిస్తున్నారు ఈ దంపతులు. ఆదివారం ప్రత్తిపాడు – పెదనందిపాడు మార్గంలో ఈ దంపతులు ‘సాక్షి’కి కనిపించారు. –ప్రత్తిపాడు -
ఎదురు ప్రశ్నిస్తే.. మరింత చితకబాదుతున్నాడు..!
సాక్షి, మేడికొండూరు (గుంటూరు): సినిమాల్లో హీరో ఎస్సై వేషం వేసి రౌడీలను ఎక్కడ పడితే అక్కడ చితకబాదినట్లు ఉంది ఎస్సై వినోద్‌కుమార్ తీరు. యువకులు, వృద్ధులు, మందుబాబులను ఎక్కడ పడితే అక్కడ లాఠీలతో విచక్షణా రహితంగా కొట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సై కొట్టిన తరువాత ఆయన దాడిలో గాయపడిన వారు బయటకి చెప్పుకోలేక మిన్నుకుండి పోతున్నారు. ఇటీవల మేడికొండూరు ఈద్గా సమీపంలో ఇద్దరు రైతులను పొలంలో కొట్టడం చర్చనీయాంశమైంది. పేరేచర్ల కూడలిలో మంగళవారం రాత్రి కేసులు రాస్తున్న నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు తమ ద్విచక్రవాహంపై వస్తుండగా వారి వాహనాన్ని ఎస్సై ఆపారు. వారు తమకు తెలిసిన వారికి ఫోన్ చేస్తామని చెప్పటం, కేసు రాసుకోమని అనటంతో చిర్రెత్తిన ఎస్సై ఒక యువకుడి చెంప చెళ్లు మనిపించాడు. రెండు సార్లు యువకుడిని కొట్టాడు. ఏదైనా ఉంటే చెప్పాలి లేక కేసులు రాయాలని బాధితులు అంటున్నారు. అంతేకానీ ఇష్టానుసారం దాడి చేయడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మద్యం దుకాణాల వద్దకు వెళ్లి పది గంటలు కాక మునుపే మందుబాబులపై తన ప్రతాపం చూపిస్తూ ఎక్కడ పడితే అక్కడ లాఠీతో దాడి చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే వారిని మరింత చితకబాదుతున్నారు. వీరికి తగలరాని చోట తగిలి ఎదైనా ప్రాణానికి ముప్పు వాటిల్లితే పరిíస్థ్ధితి ఏమిటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై అర్బన్ సౌత్ డీఎస్పీ కమలాకర్‌ను వివరణ కోరగా ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని తెలిపారు. ఇంతకమునుపు మేడికొండూరు ఠాణాలో పనిచేసిన ఎవరూ ఇలాంటి క్రూరత్వం ప్రదర్శించలేదని చెబుతున్నారు. చదవండి: వివాదాస్పదంగా తాడికొండ ఎస్ఐ వైఖరి -
అధినేతకు అధికారం.. కార్యకర్తలకు హత్యలు..
సాక్షి, గుంటూరు: టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఆ పార్టీ నాయకులు రాజకీయ హత్యలకు తెగబడుతున్నారు. 1995 నుంచి 2004 వరకు తొమ్మిదేళ్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫ్యాక్షన్‌తో పల్నాడు ప్రాంత గ్రామాలు అట్టుడికిపోయాయి. 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి పదేళ్లపాటు ఆ గ్రామాలు ఫ్యాక్షన్‌కు దూరంగా ప్రశాంతంగా ఉన్నాయి. పదేళ్ల తరువాత 2014లో అధికారంలోకి వచ్చామనే గర్వంతో అడ్డగోలుగా దాడులు చేస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేసి ప్రతిపక్షమే లేకుండా చేయాలనే కుయుక్తులు పన్నుతున్నారు. జిల్లాలో టీడీపీ హత్యాకాండ ఇలా.. - 1999లో ఎన్నికల సందర్భంగా నరసరావుపేటలో కోడెల శివప్రసాదరావు ఇంట్లో పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన బాంబులు పేలడంతో ఆయన అనుచరులు నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించడంతోపాటు, నరసరావుపేట ఎన్నిక సైతం వాయిదా పడింది. దీనిపై సీబీఐ విచారణ జరగకుండా అప్పట్లో కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలను పట్టుకుని బయటపడగలిగారు. - 2001 మార్చి 9వ తేదీన మాచర్ల నుంచి దుర్గి పోలీసు స్టేషన్‌కు బైండోవర్ సంతకాలు చేసేం దుకు వెళ్తున్న కాంగ్రెస్ వర్గీయులను టీడీపీ నాయకులు పక్కా పథకం ప్రకారం దుర్గి మండలం ఆత్మకూరు బోడు వద్ద బాంబులు, వేట కొడవళ్లతో దాడిచేసి ఏడుగురిని ఒకేసారి నరికి చంపారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచల నం కలిగించింది. పోలీసుల సాయంతో ఈ హత్యకు పథక రచన చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. - 2014 సెప్టెంబర్ 22న వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం మేళ్లవాగు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద నాగిరెడ్డి, చిన నాగిరెడ్డిని అధికారపార్టీ నాయకులు హత్యచేశారు. - నీలగంగవరం గ్రామంలో రావులపల్లి పెదమునయ్యపై టీడీపీ వర్గీయులు దాడి చేసి గాయపరచడంతో అతను మృతి చెందాడు. తిరిగి వైఎస్సార్ సీపీకి చెందిన ముగ్గురు వ్యక్తులపై హత్యాయత్నం కేసు నమోదు చేయించారు. హత్య కేసుకు కౌంటర్ కేసు ఉంటే రాజీకి వస్తారన్న టీడీపీ నేతల దుర్మార్గపు ఆలోచనకు పోలీసులు వంతపాడారు. - 2014 సెప్టెంబర్ 11వ తేదీన మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం చినగార్లపాడు గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకుడు వేంపాటి గోవిందరెడ్డి(45)ఇంటిపై టీడీపీ రౌడీలు మూకుమ్మడిగా దాడిచేశారు. గోవిందరెడ్డి పారిపోతుండగా వెంటాడి నడిరోడ్డు పొడిచి చంపారు. అడ్డు వచ్చిన ఆయన భార్య కోటేశ్వరమ్మను సైతం హతమార్చేందకు ప్రయత్నించారు. గోవిందరెడ్డిని హత్యచేస్తున్న సమయంలో పొలం నుంచి ఇంటికి వస్తున్న చింతలచెర్వు కోటిరెడ్డినీ హత్య చేసేందుకు యత్నిం చారు. కత్తి, బరిసె పోట్లకు గురైన ఆయన ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. - 2014 డిసెంబర్ 19న మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం జంగమహేశ్వరపాడుకు చెందిన వైఎస్సార్ సీపీ నేత గుడిపాటి వెంకట్రామయ్య కోర్టు వాయిదాకు వెళ్లి వస్తుండగా టీడీపీ వర్గీయులు గొడ్డళ్లు, కర్రలతో దాడి చేసి కిరాతకంగా చంపారు. - 2013 సంవత్సరంలో కారంపూడి మండలం నరమాలపాడుకు చెందిన వైఎస్సార్ సీపీ నేత పెద వెంకటేశ్వర్లు(బ్రహ్మం)ను టీడీపీ వర్గీయులు నరికి చంపారు. - 2017 డిసెంబర్లో మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గంగలకుంటకు చెందిన వైఎ స్సార్ సీపీ నేత కంచర్ల సాంబయ్యను టీడీపీ వర్గీయులు వేట కొడవళ్లతో నరికి చంపారు. - వేమూరు నియోజకవర్గం పెరవలిపాలెంలో సర్పంచ్‌గా పోటీ చేసి ఓటమి చెందిన ఎస్.ప్రభాకరరావుపై టీడీపీకి చెందిన సర్పంచ్ సాంబశివరావు వర్గీయులు 30 మంది దాడి చేసి కొట్టడంతో ఆయన మృతిచెందాడు. -
ఆంధ్రాబ్యాంకు అద్దాలు ధ్వంసం..
మేడికొండూరు: నోట్ల మార్పిడి కోసం దేశవ్యాప్తంగా జనాలు బ్యాంకుల వద్ద బారులు తీరారు. కొన్నిచోట్ల భారీగా ఉన్న క్యూలైన్లలో నానాపాట్లు పడుతూ కౌంటర్ వద్దకు చేరేలోపు కౌంటర్లలో నో క్యాష్ బోర్డులు వెక్కిరిస్తున్నాయి. గుంటూరు జిల్లా మేడికొండూరు ఆంధ్రాబ్యాంకులో నోట్ల మార్పిడి కోసం క్యూలో నిల్చున్న ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. చాలా సమయం లైన్లో నుల్చున్న ఖాతాదారుడు తీరా కౌంటర్ వద్దకు చేరేసరికి బ్యాంకు క్యాషియర్ డబ్బులు అయిపోయాయని సమాధానం చెప్పాడు. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన ఆ ఖాతాదారుడు బ్యాంకు అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ సంఘటనతో బ్యాంకు అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఖాతాదారుడికి సర్దిచెప్పారు. -
'రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది'
హైదరాబాద్: మేడికొండూరు ఘటనపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వి.రాముడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యకర్తలు తమపై దాడి చేసిన విధానాన్ని డీజీపీకి వివరించారు. ముప్పాళ్ల ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా టీడీపీ నేతల దౌర్జన్యాన్ని డీజీపీకి వివరించినట్టు వైఎస్ఆర్ సీపీ నేతలు తెలిపారు. ఇప్పటిదాకా స్థానిక పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదని ఆరోపించారు. పోలీసులపై అధికార పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తున్నట్టు అనుమానించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు. ఈ నెల 13న మేడికొండూరు వద్ద వైఎస్ఆర్ సీపీ నేతలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికకు వెళ్తున్న ఎంపీటీసీలను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. -
'ఎమ్మెల్యేపై దాడి సీఎం కార్యాలయమే ప్రోత్సహిస్తోంది'
గుంటూరు నగర తూర్పు ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముస్తాఫాపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేపై దాడి వ్యవహరంలో జోక్యం చేసుకోవాలని ధర్మాన ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం శ్రీకాకుళంలో ధర్మాన మాట్లాడుతూ... స్థానిక ఎన్నికల్లో అక్రమాలు, దౌర్జన్యాలు వ్యూహత్మక నేరమని ఆయన ఆభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ సీఎం కార్యాలయం ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. ముప్పాళ్ల ఎంపీపీ అధ్యక్షుడి ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ సీపీ నాయకుడు అంబటి రాంబాబు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా ఎంపీటీసీ సభ్యులతో కలసి వాహనాలలో బయలుదేరారు. ఆ వాహనాలు మేడికొండూరు సమీపంలోనికి రాగానే వారిపై దాదాపు 200 మంది టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడికి చేశారు. అనంతరం వైఎస్ఆర్ సీపీ నాయకుల వాహనాలలో ఉన్న ముగ్గురు ఎంపీటీసీ సభ్యులను కిడ్నాప్ చేశారు. టీడీపీ కార్యకర్తల దాడిలో వైఎస్ఆర్ సీపీ నాయకుల వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యే ముస్తాఫాకు స్వల్పంగా గాయపడ్డారు. -
మేడికొండూరు ఘటనపై వైఎస్ జగన్ ఆరా
హైదరాబాద్: మేడికొండూరు ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. పార్టీ నాయకుడు అంబటి రాంబాబుకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫాకు ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసాయిచ్చారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల ఎంపీపీ అధ్యక్షుడి ఎన్నిక నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. ఏడుగురు ఎంపీటీసీ సభ్యులతో వెళుతున్న వైఎస్ఆర్ సీపీ నాయకుల వాహనాలపై దాడి చేశారు. నలుగురు ఎంపీసీలను కిడ్నాప్ చేశారు. దీనిపై వైఎస్ఆర్ సీపీ నాయకులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దాడికి గురైన నాయకులు సంఘటనా స్థలంలోనే ధర్నా చేపట్టారు. కిడ్నాప్ చేసిన నలుగురు ఎంపీటీసీలను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. -
'ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నిక వాయిదా వేయండి'
-
'ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నిక వాయిదా వేయండి'
హైదరాబాద్: మార్కాపురం జడ్పీటీసీ జవ్వాది రంగారెడ్డి అక్రమ అరెస్ట్ వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సెక్రటరీ నవీన్‌మిట్టల్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక అధికారాలు ఉపయోగించి జవ్వాది రంగారెడ్డిని జడ్పీ ఎన్నికల్లో పాల్గొనేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు ఆయనను హాజరుపర్చే వరకు ప్రకాశం జడ్పీ ఎన్నికను వాయిదా వేయాలని కోరారు. ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో నలుగురు వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీలను టీడీపీ కార్యకర్తలు కిడ్నాప్ చేసిన వ్యవహారాన్ని కూడా నవీన్‌మిట్టల్ దృష్టికి తీసుకెళ్లారు. ముప్పాళ్ల ఎంపీపీ అధ్యక్ష ఎన్నికను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. నవీన్‌మిట్టల్ ను కలిసిన వారిలో ఎంవీ మైసూరారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పీఎన్వీ ప్రసాద్ ఉన్నారు. -
కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే
-
అంబటి రాంబాబు కారుపై దాడి దృశ్యాలు
-
కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే
గుంటూరు: ఇలాంటి దారుణం తానెప్పుడూ చూడలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా కన్నీళ్లు పెట్టుకున్నారు. మేడికొండూరు వద్ద టీడీపీ కార్యకర్తలు తమపై దాడి చేసి నలుగురు మహిళా ఎంపీటీసీలను కిడ్నాప్ చేసిన ఘటనపై ఆయన చలించిపోయారు. ఎమ్మెల్యే అయిన తనపైనే దాడి చేశారంటే సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలు తనను విచక్షణారహితంగా కొట్టారని వాపోయారు. మహిళా ఎంపీటీసీలను దౌర్జన్యంగా లాక్కెళ్లారని తెలిపారు. కన్నీళ్లు పెట్టుకున్నా, ఫ్యామిలీ ఉందని చెప్పినా వినిపించుకోలేదన్నారు. చిన్నపిల్లలు ఉన్నారు వదలమని చెప్పినా పట్టించుకోలేదని చెప్పారు. ఇలా చేయడం చాలా తప్పు, చాలా దారుణమని పేర్కొన్నారు. సినిమాల్లో తప్ప బయట ఇలాంటి దౌర్జన్యాలు చూడలేదంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. దాడిపై తాము సమాచారం అందించినా పోలీసులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
రోడ్డుపై బైఠాయించిన వైఎస్ఆర్ సీపీ నేతలు
గుంటూరు: టీడీపీ కార్యకర్తలు కిడ్నాప్ చేసిన నలుగురు ఎంపీటీసీ సభ్యులను విడుదల చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. తమపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. ముప్పాళ్ల ఎపీపీ అధ్యక్ష ఎన్నిక నేపథ్యంలో మేడికొండూరు వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై వాహనాలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. నలుగురు మహిళా ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారు. దీంతో సంఘటనా స్థలంలో రోడ్డుపై వైఎస్ఆర్ సీపీ నాయకులు బైఠాయించారు. టీడీపీ దమనకాండకు నిరసనగా అంబటి రాంబాబు, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే ముస్తాఫా ధర్నా చేపట్టారు. వీరికి మద్దతుగా వందలాదిమంది వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఇక్కడకు చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తల దౌర్జన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
'టీడీపీ మూల్యం చెల్లించక తప్పదు'
-
అంబటి రాంబాబు కారుపై దాడి
-
'టీడీపీ మూల్యం చెల్లించక తప్పదు'
హైదరాబాద్: ప్రజాస్వామ్య విలువలకు టీడీపీ తిలోదకాలిచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. గంటూరు జిల్లాలో అంబటి రాంబాబుపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య విలువలను పెడచెవిన పెడుతూ లెక్కలేనట్టుగా టీడీపీ వ్యవహరిస్తొందని ఆమె ధ్వజమెత్తారు. ఈ రకమైన ధోరణి సరికాదని, దీన్ని అందరూ ఖండించాలన్నారు. అసలు ప్రతిపక్షం ఉండకూడదన్న ఉద్దేశంతో అధికార టీడీపీ వ్యవహరిస్తోందన్నారు. ఏవిధమైన విలువలను ఖతారు చేయకుండా దాడుల సంస్కృతి కొనసాగిస్తోందన్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించకతప్పదని ఆమె హెచ్చరించారు. స్థానిక సంస్థలను ఎన్నికలను కూడా స్వేచ్ఛాయుతంగా జరిపించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ దాడులను చంద్రబాబు ఎందుకు ఖండించలేకపోతున్నారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రపతి పాలన తప్ప శరణ్యం లేదనే పరిస్థితిని కల్పించారన్నారు. అంబటిపై దాడి దుర్మార్గ చర్య అని, ప్రజాస్వామ్యవాదులందరూ దీన్ని ఖండించాలని వాసిరెడ్డి పద్మ కోరారు. -
కావాలనే దౌర్జన్యం చేశారు: అంబటి
గంటూరు: ముప్పాళ్ల ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. తమపై దాడి చేసి తమ పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులను టీడీపీ కార్యకర్తలు కిడ్నాప్ చేశారని ఆయన తెలిపారు. కావాలనే తమపై దౌర్జన్యం చేశారని చెప్పారు. రెండు కార్లు ధ్వంసం చేశారని తెలిపారు. ఎంపీపీ అధ్యక్ష ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యానికి పాల్పడే అవకాశముందని డీజీపీకి విన్నవించుకున్నా రక్షణ కల్పించలేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈవిధంగా జరగడం దారుణమన్నారు. అంతకుముందు కావాలనే ఎంపీపీ ఎన్నికను వాయిదా వేశారని ఆరోపించారు. పరిస్థితులు చక్కబడేవరకు ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక వాయిదా వేయాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. తమపై దాడి చేసిన వారిపై చర్య తీసుకోవాలన్నారు. -
అంబటి రాంబాబు కారుపై దాడి
గుంటూరు: అధికార టీడీపీ కార్యకర్తలు గుంటూరు జిల్లాలో రెచ్చిపోయారు. ముప్పాళ్ల ఎంపీపీ అధ్యక్షుడి ఎన్నిక నేపథ్యంలో స్వైర విహారం చేశారు. ఎంపీటీసీ సభ్యులతో వెళుతున్న వైఎస్ఆర్ సీపీ నాయకుడు అంబటి రాంబాబు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా వాహనాలను మేడికొండూరు వద్ద అడ్డుకుని దాడులకు పాల్పడ్డారు. ఈ ఉదయం నుంచి కాపుకాసిన దాదాపు 200 మంది టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ముగ్గురు ఎంపీటీసీ సభ్యులను కిడ్నాప్ చేశారు. టీడీపీ కార్యకర్తల దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎమ్మల్యే ముస్తాఫాకు స్వల్ప గాయాలయ్యాయి. -
రెండు వాహనాల ఢీ: ఇద్దరి మృతి
మేడికొండూరు, న్యూస్‌లైన్: ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనం ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన బుధవారం డోకిపర్రు అడ్డరోడ్డు సమీపంలో చోటుచేసుకుంది. నరసరావుపేట రూరల్ మండలం, జొన్నలగడ్డ గ్రామానికి చెందిన చిన్నపరెడ్డి శ్రీనివాసరెడ్డి (35), రంగారెడ్డిపాలేనికి చెందిన నాగిరెడ్డి(38)లు ద్విచక్రవాహనంపై విజయవాడ వెళ్లి తిరిగి వస్తుండగా డోకిపర్రు అడ్డరోడ్డు సమీపంలో ఫిరంగిపురం నుంచి ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. రెండు వాహనాలు వేగంగా వస్తుండడంతో ద్విచక్ర వాహనంపై వున్న శ్రీనివాసరెడ్డి, నాగిరెడ్డిలు ఎగిరి మార్జిన పక్క పడిపోయి అక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరూ సమీప బంధువులు. టాటా ఏస్ వాహనాన్ని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి మేడికొండూరు ఎస్ఐ జె. అనూరాధ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.